చిత్రం: స్నేహబంధం (1973)
రచన: ఆత్రేయ
సంగీతం: సత్యం
గానం: పి. సుశీల, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఆనంద్
స్నేహబంధము - ఎంత మధురము
చెరిగిపోదు తరిగిపోదు - జీవితాంతము ||స్నేహ||
ఆమె: ఓకే ఆత్మ వుంటుంది రెండు శరీరాలలో
ఒకే పాట పలుకుతుంది వేరువేరు గుండెల్లో
అతను: ఒక్కటే దొరుకుతుంది జీవితంలో - అది
ఆమె: ఓడిపోదు - వాడిపోదు కష్టసుఖాల్లో ||స్నేహ||
అతను: మల్లెపూవు నల్లగా మాయవచ్చును
మంచుకూడ వేడిసెగలు ఎగయవచ్చును
ఆమె: పువ్వుబట్టి తేనె రుచి మారవచ్చును
చెక్కుచెదరంది స్నేహమని నమ్మవచ్చును ||స్నేహ||
తల్లి కడుపు పేగైనా తెంచుకొని వస్తాము
పెళ్లినాటి ప్రమాణాలు సన్యసించి వెళ్తాము
చితిలో అన్నిటిని వదులుకొందుము - కడకు
మట్టిలోన మట్టి చేరునదే స్నేహము ||స్నేహ||
No comments:
Post a Comment