Monday, November 15, 2010

నేటి పాట: ఎన్నెన్ని వంపులు ఎన్నెన్ని సొంపులు (బాబు)

చిత్రం: బాబు (1975)
రచన: ఆత్రేయ
సంగీతం: చక్రవర్తి
గానం: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల

ఆమె: ఏయ్ బాబూ నిన్నే బాగుందా?
అతడు: అబ్బ - ఎంత బాగుంది -
ఆమె: ఎంత..?
అతడు:ఎంతో..
ఆమె: ఎంతో అంటే..?
అతడు: ఊ - యింత -

అతడు: ఎన్నెన్ని వంపులు ఎన్నెన్ని సొంపులు - నా
కున్నవేమో రెండే కన్నులు - ఎలా చూపేదీ - ఏది చూసేదీ
ఆమె: చాలకుంటే కావాలంటే - నావికూడా తీసుకో - నీ
తనివితీరా చూసుకో -
అతడు: యీ ఎరుపు బాగుందా - తెలుపు కుదిరిందా?
ఎరుపులో నీ వయసుంది - తెలుపులో నీ మనసుంది
ఆమె: ఎరుపు తెలుపులు నన్ను నిలువున
నలుపుతున్నాయి - అమ్మమ్మో - ఎదలో సలుపుతున్నాయి
అతడు: పంతులమ్మ - పంతులమ్మ -కొత్తచదువు నేర్పుతావా
ఆమె: దర్జీదొరా -దర్జీదొరా - వలపు కొలత తీస్తావా?
అతడు: నింగి నేల నిండు మనసు - నీకూ నాకూ వలపు కొలత
ఆమె: కొలతలన్ని చెరిపివేసే - చెలిమిలోనే కొత్తచదువు   ||ఎన్నెన్ని||

అతడు: నీ చిలిపి కన్నుల్లో - చిగురు పెదవుల్లో
నువ్వు నువ్వై నిలవాలి - నువ్వు నేనై కలవాలి
కనులు పెదవులు కలిసి మెలిసి కౌగిలించాలి -
అమ్మమ్మో కరిగిపోవాలి -    ||ఎన్నెన్ని||

No comments: