Tuesday, November 2, 2010

నేటి పాట: ఏమంటున్నది యీ గాలీ (మేమూ మనుషులమే!)

చిత్రం: మేమూ మనుషులమే! (1973)
రచన: ఆత్రేయ
సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్
గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల

పల్లవి:
ఆమె: ఏమంటున్నది యీ గాలీ
అతడు: ఎగిరే పైటను అడగాలీ
ఆమె: ఎగిరే పైటను ఏం చెయ్యాలి
అతడు: ఇంకో కొంగును ముడివెయ్యాలి   ||ఏమంటున్నది||

చరణం 1:
అతడు: పైటకు తెలుసు చాటున పొంగే ప్రాయం రెపరెపలూ
ఆమె: గాలికి తెలుసూ విరిసీ విరియని పూవుల ఘుమఘుమలూ
అతడు: ఊగే నడుమూ సాగే జడతో వేసెను పంతాలూ
ఆమె: నీలో వుడుకూ నాలో దుడుకూ చేసెను నేస్తాలూ   ||ఏమంటున్నది||

చరణం 2:
అతడు: మబ్బు మబ్బుతో ఏకమైనది - సాయం సమయంలో
ఆమె: మనసు మనసుతో లీనమైనది - మమతల మైకంలో
అతడు: అల్లరి కళ్లూ వెన్నెల నవ్వూ పెట్టెను గిలిగింతలూ
ఆమె: వెచ్చని వొడిలో ఇచ్చిన చోటున ఇమిడెను జగమంతా   ||ఏమంటున్నది||                                                    

No comments: