Monday, November 15, 2010

సినిమా: బ్రహ్మానందం కొడుకు 'వారెవా' అనిపిస్తాడా?

బ్రహ్మానందం కొడుకు గౌతం జ్ఞాపకమున్నాడా? 2004లో క్రితం వచ్చిన 'పల్లకిలో పెళ్లికూతురు' సినిమాలో అతనే హీరో. కొరియోగ్రాఫర్ సుచిత్రా చంద్రబోస్ డైరెక్టరుగా పరిచయమైన ఆ సినిమా ఫ్లాపవడంతో వెంటనే గౌతంకి మరో అవకాశం రాలేదు. ఆరేళ్ల తర్వాత ఇప్పుడు 'వారెవా' అనే సినిమాతో మరోసారి పరీక్షకి సిద్ధమవుతున్నాడు. లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తయారైన ఈ సినిమా షూటింగ్ పూర్తయి ఇప్పటికే ఆర్నెల్లు గడిచాయి. నవంబర్ 24న సినిమాని విడుదల చేయనున్నట్లు తాజాగా నిర్మాతలు ప్రకటించారు. బిజినెస్ కాకపోవడమే ఈ జాప్యానికి కారణం. మహేశ్ శంకర్ సంగీతం సమకూర్చిన ఈ సినిమాకి మహి డైరెక్టర్. తెరంగేట్రం చేసిన చాలా కాలానికి రెండో సినిమా చేసిన గౌతం ఇప్పుడైనా 'వారెవా' అనిపించుకుంటాడా, లేదా అనేది ఆసక్తికరం. ఇప్పటిదాకా తెలుగులో ఏ కమెడియన్ కొడుకు కూడా హీరోగా సక్సెస్ కాలేదు (ఉదా|| ఎమ్మెస్ నారాయణ, బాబూమోహన్ కొడుకులు). ఈ నేపథ్యంలో గౌతం దాన్ని బ్రేక్ చేస్తాడా?

No comments: