Showing posts with label krishna vamsi. Show all posts
Showing posts with label krishna vamsi. Show all posts
Thursday, January 22, 2015
Tuesday, September 30, 2014
Friday, September 26, 2014
Wednesday, June 18, 2014
Cinema: Ram Gopal Varma.. The Experimental Technician
ప్రయోగాలకు వెరవని టెక్నీషియన్
ట్రెండ్‌సెట్టర్లకే ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచి నాగార్జున, జగపతిబాబు, జె.డి. చక్రవర్తి వంటి నటులకు స్టార్‌డం కల్పించిన దర్శకుడు రాంగోపాల్‌వర్మ ఇవాళ హిందీ చిత్రసీమకే అంకితమవడం విచారకరం. ఆరు పాటలు, ఐదు ఫైట్లు, వెగటు పుట్టించే ముతక హాస్య సన్నివేశాలు, ద్వంద్వార్థాల సంభాషణలు - ఇవే తెలుగు సినిమా అంటే.. అనే స్థితి నుంచి ఒక్కసారిగా సాంకేతిక అంశాలవైపు దృష్టి మరలింపజేసి తెలుగు ప్రేక్షకులకు కొత్తదనాన్ని చూపించినవాడు వర్మ. కథ కంటే కథనానికే ఎక్కువ ప్రాధాన్యాన్నిచ్చి సూటిగా ప్రేక్షకుల హృదయాల్ని తాకేట్లుగా సన్నివేశాల్ని మలచడంలో వర్మ నిష్ణాతుడు. ఇందుకు మంచి ఉదాహరణ - 'క్షణ క్షణం'. కథగా చెప్పుకోడానికి ఏమీలేని ఈ సినిమాని కేవలం కథనంతో, సహజమని భ్రమింపజేసే సన్నివేశాలతో ఆద్యంతం ఆసక్తికరంగా రూపొందించాడు. పాటల చిత్రీకరణలో కూడా వర్మ ప్రత్యేకత కనిపిస్తుంది. పాటల్లో నేపథ్యం (బ్యాక్‌గ్రౌండ్) ఎలా ఉండాలో కూడా ఈ సినిమాలో చూపించాడు వర్మ.ఒక్క 'శివ' చిత్రంతోటే వర్మ అగ్రశ్రేణి దర్శకుల జాబితాలో చేరిపోయాడు. పైగా అది మొదటి చిత్రం కూడా. ఆ సినిమా నాగార్జునకు స్టార్‌డం కల్పించి చిరంజీవి తర్వాత రెండో స్థానాన్ని సాధించిపెట్టింది. యువతలో 'శివ' సృస్టించిన అలజడి అంతా ఇంతా కాదు. ఆ సినిమా వల్ల యువత చెడిపోతున్నదని అప్పుడంతా గోలపెట్టినవాళ్లే. కాలేజీ కేంపస్‌లలో 'శివ' తరహాలో జరిగిన అల్లర్లు దీనికి మద్దతుగా నిలిచాయి. మొత్తానికి ఆ సినిమాతో వర్మ, నాగార్జున - ఇద్దరూ పరస్పర ప్రయోజనం పొందారు. ఐనా వర్మ సంతృప్తి చెందలేదు. అతడిలోని టెక్నీషియన్ నిరంతర శోధనలోనే ఉండేవాడు. 'క్షణ క్షణం' ఆ టెక్నీషియన్‌కు మరింత పదునుపెట్టింది. కాగా ఆ సినిమాలోని కొన్ని సన్నివేశాలకు స్ఫూర్తి రాజ్‌కపూర్ 'చోరీ చోరీ' అనిపిస్తుంది.
ప్రయోగాత్మక చిత్రాలకు ఎప్పుడో కానీ ఆదరణ చూపని తెలుగు ప్రేక్షకులను ఒప్పించే లక్ష్యంతో వర్మ 'రాత్రి', 'దెయ్యం' సినిమాలను తీశాడు. మనిషిలో అంతర్లీనంగా ఉండే భయాందోళనలు ఆ మనిషిని ఎలా కల్లోలపరుస్తాయో ఆ రెండు చిత్రాల్లో చూపించేందుకు ప్రయత్నించాడు వర్మ. 'దెయ్యం' విడుదలకు ముందు ప్రకటనల విషయంలోనూ కొత్త పుంతలు తొక్కాడు. ఐతే ఇవి రెండూ బాక్సాఫీస్ వద్ద నిలదొక్కుకోలేక పోయాయి.
అంతకు ముందు జగపతిబాబు హీరోగా 'గాయం' చిత్రాన్ని తీసి సక్సెస్ సాధించాడు వర్మ. సరైన సక్సెస్ లేక డౌన్ స్టేజ్‌కి చేరువవుతున్న సమయంలో జగపతిబాబుకు 'గాయం' ఊరటనివ్వడమే కాకుండా చిత్రసీమలో మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. రాంగోపాల్‌వర్మ డైరెక్షన్‌లో ఇది ఊర్మిళకు రెండో సినిమా. తొలి సినిమా 'అంతం' ఘోరంగా ఫ్లాపైంది. మచ్చుకైనా తెలుగుతనం కనిపించకపోవడం, హాలీవుడ్ స్టయిల్లో రూపొందించాలనే తాపత్రయంతో కథని పూర్తిగా నిర్లక్ష్యం చేసి, కథనాన్ని సైతం చికాకు పరిచేలా తయారుచేయడం 'అంతం' బాక్సులన్నీ తిరుగుటపా కట్టడానికి కారణం. అయినా వర్మ పరాజయానికి కుంగిపోయే రకం కాదు. 'ప్రయోగాలకు స్వస్తిచెప్పి సాధారణ స్థాయిలో సినిమాలు తీసుకుందాం' అనుకొనే సాధారణ దర్శకుడు కాదు. అందుకనే తెలుగువాళ్లకే కాదు, దేశంలోని కోట్లాది ప్రజానీకానికి ఇలవేల్పు అయిన వెంకటేశ్వరస్వామి మీదే ప్రయోగం చేయాలనుకొని 'గోవిందా గోవిందా'ని తలపెట్టాడు. చిత్రం నిర్మాణంలో ఉన్నప్పుడే విమర్శలు వచ్చాయి. అయినా వెరవక చిత్రాన్ని పూర్తిచేశాడు. జయాపజయాల మాటెలా ఉన్నా చిత్రంలోని సన్నివేశాలు, పాటల చిత్రీకరణ వర్మలోని దర్శకత్వ ప్రతిభను చాటిచెప్పాయి. సెన్సార్ వాళ్లు ఈ సినిమాకు చేసిన 'కట్స్' వల్ల వర్మకి తెలుగు సెన్సార్ బోర్డు మీద కోపం వచ్చి "ఇక తెలుగు సినిమాలు చేయను" అని స్టేట్‌మెంట్ ఇచ్చాడు. అయితే తర్వాత జె.డి. చక్రవర్తి, ఊర్మిళ జంటగా 'అనగనగా ఒక రోజు' అనే సినిమా మొదలుపెట్టాడు. "తెలుగు సినిమాలను తీయనన్నారుగా" అనడిగితే "ఆ స్టేట్‌మెంట్ ఇవ్వకముందే ఈ సినిమా మొదలైపోయింది" అన్నాడు. 'అనగనగా ఒక రోజు'తో బ్రహ్మానందం ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు. సినిమా కూడా జనానికి నచ్చింది. అదే ఆఖరు - తెలుగు సినిమాకు వర్మ దర్శకత్వం వహించడం.
ముంబైకి వెళ్లి తీసిన తొలి సినిమా పెద్ద సంచలనం రేపింది. అది 'రంగీలా'. సినిమా రంగానికి వెళ్లిన ఓ సాధారణ యువతి స్టార్ అయినా కూడా సామాన్యుడైన తన పూర్వ స్నేహితుణ్ణే పెళ్లాడాలని నిర్ణయించుకోవడం ఈ సినిమా ఇతివృత్తం. 'రంగీలా ఆయిరే' పాట అప్పట్లో యువతని ఓ ఊపు ఊపింది. ఊర్మిళతోనే ఎక్కువగా సినిమాలు తీస్తుంటే ఇద్దరిమీదా గాసిప్స్ మొదలయ్యాయి. ఇలాంటివేమీ పట్టించుకొనే ఘటం కాదు కాబట్టి ఆ తర్వాత కూడా ఊర్మిళతో సినిమాలు తీస్తూనే వచ్చాడు వర్మ. 'కౌన్', 'సత్య', 'మస్త్', ఇప్పుడు 'జంగిల్' - వీటన్నింటిలోనూ ఊర్మిళనే హీరోయిన్. రెండే పాత్రలతో తీసిన మరో ప్రయోగాత్మక చిత్రం 'కౌన్' సక్సెస్ కాలేదు. దీంట్లో నటించిన మజోన్ బాజ్‌పేయి అంతకుముందు 'సత్య'తో వెలుగులోకి వచ్చాడు. మనోజ్ హీరోగా ఓ చిత్రాన్ని తీస్తానని చెప్పిన వర్మ చెప్పినట్లుగానే 'శూల్' తీశాడు. అయితే తాను నిర్మాతగా మాత్రమే ఉండి శిష్యుడైన నివాస్‌కు దర్శకత్వం అప్పజెప్పాడు. సినీ జగత్తు నేపథ్యంతోనే వర్మ తీసిన 'మస్త్' కూడా ఫ్లాపయింది. త్వరలో 'జంగిల్' సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. ఇందులో ఫిరోజ్‌ఖాన్ కొడుకు ఫర్దీన్‌ఖాన్‌ని హీరోగా పరిచయం చేస్తున్నాడు. వర్మ స్థాయిలోనే టెక్నికల్ వాల్యూస్‌తో ఈ చిత్రం వస్తుందని అందరూ భావిస్తున్నారు.
తన సినిమాలతో కొంతమందికి స్టార్‌డంనీ, మరికొంతమంది కొత్తవాళ్లకి గుర్తింపునీ తీసుకువచ్చిన వర్మ చిత్రంలో నటించడానికి ఆరాటపడని వాళ్లుండరు. జె.డి. చక్రవర్తి, మనోజ్ బాజ్‌పేయి, అఫ్తాబ్ శివ్‌దాసాని, ఫర్దీన్‌ఖాన్ వంటి వాళ్లని తెరకి పరిచయం చేసినా కొంతమంది మంచి టెక్నీషియన్స్‌ని కూడా చిత్రసీమకు అందించాడు. అతడి శిష్యుడైన కృష్ణవంశీ ఇవాళ అగ్రశ్రేణి దర్శకుల్లో ఒకడు. ఏమైనా హిందీ చిత్రసీమకే పూర్తిగా అంకితమైపోకుండా మాతృసీమ అయిన తెలుగు చిత్రసీమకూ సేవ అందించాలనీ, వర్మ తెలుగు చిత్రాలు తీస్తే బాగుండుననీ కొంతమందైనా అనుకుంటున్నారు.
- ఆంధ్రభూమి 'వెన్నెల', 26 మే, 2000
Wednesday, May 28, 2014
Tuesday, May 13, 2014
Sindhooram (1997) Movie Review
సినిమా సమీక్ష: సిందూరం
తారాగణం: బ్రహ్మాజీ, రవితేజ, సంఘవి, పరుచూరి వెంకటేశ్వరరావు, భానుచందర్, అన్నపూర్ణ
బేనర్: ఆంధ్రా టాకీస్
దర్శకత్వం: కృష్ణవంశీ
రొటీన్ సినిమాలకి భిన్నంగా అప్పుడప్పుడు కొన్ని దర్శకుడి సినిమాలు వస్తుంటాయి. నటీనటులెవరనే దానికంటే దర్శకుని పేరునిబట్టే ప్రేక్షకులు ఆ సినిమాల్ని చూసేందుకు ఆసక్తి చూపుతుంటారు. ఆ కోవకి చెందిందే 'సిందూరం'. దానికి దర్శకుడు కృష్ణవంశీ కావడమే జనం ఆసక్తికి కారణం. ఒక ప్రేమ కథాచిత్రం, ఒక కుటుంబ కథాచిత్రం తర్వాత కృష్ణవంశీ తన దృష్టిని ఈ వ్యవస్థ మీదికి మళ్లించాడు. ఒక గంభీరమైన ఇత్రివృత్తాన్ని తనదైన టేకింగ్‌తో ఆద్యంతం పట్టుసడలని రీతిలో తెరకెక్కించాడు. ఐతే అడుగడుగునా సెన్సార్ తన కత్తెరకి పదునుపెట్టిన ఛాయలు కనిపించడం ఇబ్బందికరం.
గొప్ప పోలీసాఫీసర్ కావాలనే లక్ష్యంతో బుల్లిరాజు పోలీస్ ట్రైనింగ్‌కి వెళ్తాడు. ట్రైనింగ్ పూర్తయి తన గ్రామానికి వచ్చిన బుల్లిరాజుకి బంధువులు, స్నేహితులు ఘన స్వాగతం పలుకుతారు. అయితే గ్రామంలో జరుగుతున్న అరాచకాల్నీ, దౌర్జన్యాల్నీ చూసి అతను కలత చెందుతాడు. అక్కడి ఎస్ఐ దురాగతాల్ని చూసి సహించలేక ఎదురు తిరగడానికి యత్నిస్తాడు. మరోపక్క నక్సలైట్లు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని మందుపాతర్లతో పోలీసుల్ని చంపుతుంటారు. చిన్న రైతుల్ని హింసిస్తున్న భూస్వామిని చావబాదుతుంటారు. నక్సలైట్లని అసహ్యించుకుంటాడు బుల్లిరాజు. అతడి మేనకోడలు బేబి తన మావయ్య అయిన బుల్లిరాజునే పెళ్లి చేసుకోవాలని కలలు కంటూ ఉంటుంది. చదువు సంధ్యలు లేకుండా అల్లరి చిల్లరిగా జల్సారాయుడిగా తిరిగే చంటి ఆమెని అల్లరి పెడుతుంటాడు. లక్ష్మి అనే యువతిని అల్లరి చేస్తున్న ముగ్గురు పోకిరీ రాయుళ్లని చంటి ఎదుర్కోవడం చూసి బుల్లిరాజు అతడికి సాయం వెళ్లి వాళ్లని చితగ్గొట్తాడు. చిత్రంగా ఎస్ఐ పోకిరీ రాయుళ్ల కొమ్ముకాయడం చూసి సహించలేక తిరగబట్తాడు. అతడి స్నేహితుడు బైరాగి అతణ్ని శాంతపరచి ఎస్ఐని బతిమాలుతాడు.
మారువేషంలో స్టేషన్‌లోనే ఉండి ఇదంతా గమనిస్తుంటాడు తీవ్రవాద నాయకుడు. బుల్లిరాజు వాళ్లు వెళ్లిపోయాక పోలీస్‌స్టేషన్‌ని పేల్చివేస్తారు తీవ్రవాదులు. ఐతే ఎస్ఐ తప్పించుకుంటాడు. పగబట్టిన ఎస్ఐ తీవ్రవాదులతో సంబంధం ఉన్న బుల్లిరాజు మిత్రుడు సత్తిపండుని బలవంతంగా తీసుకుపోతుంటే బోగిపండగ సంబరాల్లో ఉన్న బుల్లిరాజు అడ్డుకోబోతాడు. అతన్ని కూడా లాక్కుపోతారు పోలీసులు. బుల్లిరాజు కళ్ళముందే సత్తిపండుని కాల్చి చంపుతాడు ఎస్ఐ. తట్టుకోలేకపోయిన బుల్లిరాజు ఎస్ఐతో కలపడతాడు. పెనుగులాటలో ఎస్ఐ చేతిలోని రివాల్వర్ పేలి అతనే చనిపోతాడు. పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోతాడు బుల్లిరాజు. తీవ్రవాదులు అతనికి ఆశ్రయమిస్తారు. అక్కడ బైరాగిని చూసి ఆశ్చర్యపోతాడు. మరుసటిరోజు తనకి తీవ్రవాదం అంటే నచ్చదని అందుకని వెళ్లిపోతున్నానని బయలుదేరుతుంటే తీవ్రవాదుల నాయకుడు అతనికి ఒక దినపత్రికనిస్తాడు. 'ఎస్ఐ కాల్చివేత - పోలీసు ముసుగులో టెర్రరిస్టు ఘాతుకం' అనే శీర్షికతో బుల్లిరాజు ఫొటోతో పెద్ద వార్త అచ్చయి ఉంటుంది. షాకవుతాడు బుల్లిరాజు. భవిష్యత్తు అగమ్యగోచరంగా తోస్తుంది. బేబి విషయంలో అనుక్షణం బుల్లిరాజుతో గొడవపడుతూ చివరికి మారిపోయిన చంటి అతన్ని వెతుక్కుంటూ వచ్చినవాళ్లతో కలుస్తాడు. గతంలో చంటి, బుల్లిరాజు చేతుల్లో తన్నులుతిన్న ముగ్గురు పోకిరీరాయుళ్లు లక్ష్మిపై అత్యాచారం చేస్తారు. ఉద్రేకం కట్టలు తెంచుకున్న బుల్లిరాజు వాళ్ల ముగ్గిర్నీ జనం మధ్య పట్టుకొని లక్ష్మిచేత చావగొట్టిస్తాడు. ఆ పోకిరీలని తీవ్రవాదులు చంపేస్తారు. ఎస్ఐ చావుని సీరియస్‌గా తీసుకున్న పోలీస్ అధికారులు ఆ విషయమై బుల్లిరాజుని పట్టుకునేందుకు, తీవ్రవాదుల్ని అణచివేసేందుకు స్పెషల్ ఆఫీసర్‌ని నియమిస్తారు. అతను పోలీస్ అకాడమీలో బుల్లిరాజుకి శిక్షణనిచ్చిన పోలీసాఫీసరే. స్పెషల్ ఆఫీసర్ తీవ్రవాదుల కోసం, బుల్లిరాజు కోసం వేట మొదలుపెడతాడు.
పోలీసులతో జరిగిన ఘర్షణలో తీవ్రవాద నాయకుడు మరణిస్తాడు. బైరాగి పోలీసుల చేతికి చిక్కి, చిత్రహింసలకి గురవుతాడు. మావయ్యని వెతుక్కుంటూ వస్తుంది బేబి. ఆమెని తండ్రి కుదిర్చిన సంబంధం చేసుకొమ్మని, తనని మరిచిపొమ్మని చెబుతాడు బుల్లిరాజు. విషంతాగి పెళ్లి మండపంలోనే చనిపోతుంది బేబి. బైరాగిని విడిపించుకునే క్రమంలో రాష్ట్ర మంత్రి చలపతిరావుని బుల్లిరాజు కిడ్నాప్ చేస్తాడు. తీవ్రవాదుల ఒత్తిడికి లొంగమని ప్రభుత్వం స్పష్టం చేస్తుంది. పోలీసులతో ఘర్షణల్లో ఒక్కొక్క అనుచరుడే మరణిస్తుంటే బుల్లిరాజు వ్యధ చెందుతాడు. లక్ష్మిని కూడా పోలీసులు కాల్చివేస్తారు. ఇది సహించలేని చంటి బాంబు విసిరి ఓ పోలీస్ వ్యాన్‌ని ధ్వంసం చేస్తాడు. పోలీసుల నుంచి చంటిని రక్షించాలనే ఆదుర్దాలో పోలీసు తుపాకీ గుళ్లకి బలవుతాడు బుల్లిరాజు. ఇదిచూసి మిగతా అనుచరులు రాష్ట్ర మంత్రితో అడవుల్లోకి పారిపోతారు. స్పెషలాఫీసర్ నిస్సహాయంగా చూస్తుండిపోతాడు. ఆఖరున ఈ మారణహోమానికి అంతం ఎక్కడ? ఎప్పుడు? అని దర్శకుడు ప్రశ్నిస్తాడు. అవును. దానికి అంతం లేదు. ఈ వ్యవస్థ ఇప్పుడున్న మాదిరిగానే ఉంటే మారణహోమం కొనసాగుతూనే ఉంటుంది.
ఈ సినిమా ద్వారా దర్శకుడు చెప్పాలనుకున్నది స్పష్టం. వ్యవస్థ మీద కోపంతో తీవ్రవాదులుగా మారిన యువకుల జీవితాలు ఎలా పరిసమాప్తి అవుతున్నాయో, వ్యవస్థ మీద కసితో పొట్టకోసం ఉద్యోగం చేస్తున్న సాధారణ పోలీసుల్ని ఎట్లా చంపివేస్తున్నారో, పోలీసులు రాజకీయ నాయకులకి, డబ్బున్న వాళ్లకి ఎట్లా తొత్తులుగా మారుతున్నారో, రాజకీయ నాయకులు పోలీసుల్ని తమ స్వార్థం కోసం ఎట్లా వాడుకుంటున్నారో, వాళ్ల ప్రాణాలతో ఎలా చెలగాటమాడుతున్నారో కళ్లకి కట్టించాడు దర్శకుడు. అడుగడుక్కీ ఈ వ్యవస్థ మీద సంధించిన బాణాల్లాంటి సంభాషణలు అగుపిస్తాయి. ఐతే అనేక సన్నివేశాల్లో కొన్ని డైలాగులకి సెన్సార్ కత్తెర వేసి, తానున్నది కత్తిరించడానికే అని రుజువు చేసుకుంది. ప్రేక్షకుడికి మాత్రం ఇది కాస్త విసుగు తెప్పిస్తుంది. కొన్ని కొన్ని చోట్ల ఒక సన్నివేశం పూర్తికాకముందే మరో సన్నివేశం రావడం తికమక కలిగిస్తుంది.
బుల్లిరాజుగా బ్రహ్మాజీ చాలా బాగా చేశాడు. ఇంతదాకా చిన్న చిన్న పాత్రలకే పరిమితమవుతూ వచ్చిన బ్రహ్మాజీకి ఈ సినిమా మంచి బ్రేక్‌నిస్తుంది. ఉద్రేకం, ఉద్వేగం ప్రదర్శించే సన్నివేశాల్లో అతను సరిగ్గా అతికిపోయాడు. చంటిగా రవితేజ చాలా ఈజ్‌తో చేశాడు. నృత్యాలు చలాకీగా చేశాడు. అతనికి మంచి భవిష్యత్ ఉంటుందని చెప్పవచ్చు. బేబి పాత్రలో సంఘవి అమాయకంగా, చురుగ్గా, అందంగా కనిపించింది. పాటల్లో శృంగారం ఒలికించింది. ఆమె పాత్ర పరిధి మరింత పెంచితే బాగుండేదనిపించింది. బైరాగిగా పరుచూరి వెంకటేశ్వరరావు ఆ పాత్రని పండించాడు. స్పెషల్ ఆఫీసర్‌గా ప్రత్యేక పాత్రలో భానుచందర్, బ్రహ్మాజీకి తల్లిగా అన్నపూర్ణ నటించారు. చిత్రంలో చెప్పతగ్గవి సంభాషణలు, దర్శకుడి ప్రతిభా. కె.ఎన్.వై. పతంజలి సంభాషణలు ఆలోచింపజేస్తాయి. పాటల చిత్రీకరణ గురించి పెద్దగా చెప్పుకోవాల్సింది లేదు. శ్రీనివాస చక్రవర్తి సంగీతం పాటలకంటే బ్యాక్‌గ్రౌండ్‌కి వినిపించిందే బాగుంది. భూపతి సినిమాటోగ్రఫీ సినిమాకి ఎస్సెట్. కృష్ణవంశీ టేస్ట్‌కి తగిన పనితనం అతని కెమెరాలో కనిపించింది. సినిమా విజయం సాధించినా, కాకపోయినా 'సిందూరం'ని ఒక సృజనాత్మక దర్శకుడి నుంచి వచ్చిన మంచి చిత్రంగానే చెప్పుకోవాలి.

- ఆంధ్రభూమి 'వెన్నెల', 19 సెప్టెంబర్ 1997
Thursday, December 19, 2013
Tuesday, December 3, 2013
Saturday, June 2, 2012
'యథార్థ ప్రేమకథ'తో ఎన్ని ఇబ్బందులు పడ్డానో
"ఈ సినిమాని ఎలా పూర్తి చేయగలిగానో, దీని కోసం ఏమేం ఇబ్బందులు పడ్డానో నాకు తెలుసు. ఆర్థిక వనరులు సరిపోక, మధ్యలోనే ఈ సినిమాని ఆపేద్దామనుకున్నా'' అని చెప్పారు చరణ్‌రాజ్. 'ప్రతిఘటన'తో నటునిగా పరిచయమై, తొలి చిత్రంతోటే ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందిన చరణ్‌రాజ్ ఇప్పుడు దర్శకునిగా మారి 'యథార్థ ప్రేమకథ'ను రూపొందించారు. సి.ఆర్. క్రియేషన్స్ పతాకంపై ఆయనే స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇటీవల విడుదలైన ఆ సినిమా గురించి చరణ్‌రాజ్ చెప్పిన సంగతులు ఆయన మాటల్లోనే...
టీవీలో 'అనితా ఓ అనితా' పాట చూసి, నాగరాజు కథ విని ఎమోషనల్ అయిపోయి ఆ కథపై సినిమా తీస్తానని అప్పటికప్పుడు ప్రకటించా. చెప్పినట్లుగానే తీశా. నాగరాజు పాత్రలో అమర్‌నీ, అనిత పాత్రలో చిరినీ పరిచయం చేస్తున్నాం. ఇద్దరూ చక్కగా చేశారు. వాళ్లిద్దరి ప్రేమనూ సఫలం చేయాలని ప్రయత్నించే పాత్రను నేను చేశా. ఈ నెల 25 మా చిన్నబ్బాయి దేవేందర్‌రాజ్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. ఈ సినిమాని సొంతంగానైనా రిలీజ్ చేస్తున్నానంటే మల్టీడైమన్షన్ వాసు సహకారం వల్లే. వాళ్లకి ఎంత థాంక్స్ చెప్పినా తక్కువే.
ఆ సంగతి తెలుసుకున్నా
నాని హీరోగా కృష్ణవంశీ డైరెక్ట్ చేస్తున్న సినిమాలో ఓ మంచి పాత్ర చేస్తున్నా. అలాగే 'జెంటిల్‌మన్ పోలీస్' అనే సినిమాని త్వరలో డైరెక్ట్ చేయబోతున్నా. ఇందులో పోలీసాఫీసర్‌గా టైటిల్ రోల్ నేనే చేస్తున్నా. ఈ సినిమాని మంత్రాలయం పోలీసులకు అంకితమిస్తాను. కథ నాదే. ఎంవీఎస్ హరనాథరావు రచయిత.
టీవీలో 'అనితా ఓ అనితా' పాట చూసి, నాగరాజు కథ విని ఎమోషనల్ అయిపోయి ఆ కథపై సినిమా తీస్తానని అప్పటికప్పుడు ప్రకటించా. చెప్పినట్లుగానే తీశా. నాగరాజు పాత్రలో అమర్‌నీ, అనిత పాత్రలో చిరినీ పరిచయం చేస్తున్నాం. ఇద్దరూ చక్కగా చేశారు. వాళ్లిద్దరి ప్రేమనూ సఫలం చేయాలని ప్రయత్నించే పాత్రను నేను చేశా. ఈ నెల 25 మా చిన్నబ్బాయి దేవేందర్‌రాజ్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. ఈ సినిమాని సొంతంగానైనా రిలీజ్ చేస్తున్నానంటే మల్టీడైమన్షన్ వాసు సహకారం వల్లే. వాళ్లకి ఎంత థాంక్స్ చెప్పినా తక్కువే.
సినిమా అంతా హైలైటే
నా దృష్టిలో కథే మొదటి హీరో. ఈ కథ మీద నాకు బాగా నమ్మకం. ప్రేమ అంటే సెక్స్ కాదు, గొడవలు పడ్డం కాదు, అదో పవిత్ర భావన అని ఈ సినిమా ద్వారా చెబుతున్నా. ఇందులో ఫలానాది హైలైట్ అని చెప్పలేను. సినిమా మొత్తంగా హైలైటే. ఫస్టాఫ్ బాగుంటుంది. సెకండాఫ్ ఇంకా బాగుంటుంది. బిగువైన స్క్రీన్‌ప్లేతో సినిమాని నడిపించాం. ఎంవీఎస్ హరనాథరావు దేవుడిలా నాకు దొరికారు. ఈ సినిమా స్క్రిప్టు విషయంలో ఆయన చేసిన సహాయం మరచిపోలేనిది. డైలాగ్స్ అద్భుతంగా రాశారు. ఈ సినిమా కథ కానీ, సన్నివేశాలు కానీ ప్రేక్షకుల హృదయాల్ని స్పృశిస్తాయి. తప్పకుండా వారు ఈ సినిమాని ఆదరిస్తారని గట్టిగా నమ్ముతున్నా. ఈ సినిమా విడుదల సందర్భంగా పది ప్రేమ జంటలకి పెళ్లి చేస్తామని ప్రకటించా. ఇటీవలే ఆర్యసమాజ్‌లో కులం, మతంతో సంబంధం లేకుండా ఆ పెళ్లిళ్లు జరిపించాం. ఇది మనసుకి ఎంతో సంతృప్తినిచ్చింది.
ఆ సంగతి తెలుసుకున్నా
నటుడిగా ఎంత అనుభవం ఉన్నా నిర్మాతగా ఇదే తొలి అనుభవం. దీని వల్ల ఇండస్ట్రీ అంటే ఏమిటో తెలుసుకున్నా. నటుడిగా 20 సినిమాల ఆఫర్లను పక్కనపెట్టి దీన్ని చేశా. ఈ సినిమాని ఎలా పూర్తి చేయగలిగానో, దీని కోసం ఏమేం ఇబ్బందులు పడ్డానో నాకు తెలుసు. ఆర్థిక వనరులు సరిపోక, మధ్యలోనే ఈ సినిమాని ఆపేద్దామనుకున్నా. కానీ మనసు ఒప్పుకుంటేగా. వడ్డీ ఎంతనేది చూసుకోకుండా అప్పులు చేసి, ఈ సినిమా పూర్తిచేశా. ఎవర్నీ గుడ్డిగా నమ్మకూడదనే సంగతి తెలిసింది. కొంతమంది నన్ను మోసం చేశారు. నటుడిగా అవకాశాలు వదలుకొని ఎందుకు ఈ సినిమా చెయ్యాలి అని ఎన్నోసార్లు అనిపించింది. తామున్నామని ధైర్యం చెప్పినవాళ్లు తర్వాత ఏమయ్యారో తెలీలేదు. 400 సినిమాల్లో నటించిన నాకే ఇలాంటి స్థితి ఉందంటే కొత్తగా వచ్చే నిర్మాతలకి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాల్సిందే. తొలి కాపీ చూసుకున్న రోజు నేను పడ్డ కష్టాన్నంతా మరిచిపోయా.
కృష్ణవంశీ సినిమా చేస్తున్నానాని హీరోగా కృష్ణవంశీ డైరెక్ట్ చేస్తున్న సినిమాలో ఓ మంచి పాత్ర చేస్తున్నా. అలాగే 'జెంటిల్‌మన్ పోలీస్' అనే సినిమాని త్వరలో డైరెక్ట్ చేయబోతున్నా. ఇందులో పోలీసాఫీసర్‌గా టైటిల్ రోల్ నేనే చేస్తున్నా. ఈ సినిమాని మంత్రాలయం పోలీసులకు అంకితమిస్తాను. కథ నాదే. ఎంవీఎస్ హరనాథరావు రచయిత.
Tuesday, November 15, 2011
రివ్యూ: మొగుడు
తెలుగు ప్రేక్షకులు ఇంకా 1980ల కాలంలో లేరు. కొంతైనా ఎదిగారు. వాళ్లని తక్కువగా అంచనా వేస్తే ఏమవుతుందో నిన్నటి గుణశేఖర్ 'వరుడు' నిరూపిస్తే, నేటి కృష్ణవంశీ 'మొగుడు' బలపరిచింది. 'నిన్నే పెళ్లాడతా' నుంచీ కృష్ణవంశీ తీసిన వాటిలో ఎక్కువ సినిమాలు పెళ్లిచుట్టూనే పరిభ్రమిస్తూ వస్తున్నాయి. ఆయన 'పెళ్లి ఉచ్చు'లో చిక్కుకుని బయటపడలేక పోతున్నాడు. ఇండివిడ్యువల్‌గా ఏ పాత్రకి ఆ పాత్రని 'అతి'గా చూపించే ఆయన అలవాటు 'మొగుడు'లోనూ కొనసాగింది. 'చక్రం' చిత్రం నుంచీ ఆయన పాత్రల్లో ఈ ఓవర్ డ్రమటైజేషన్ మనకి కనిపిస్తూ వస్తోంది. బయట ప్రపంచంలో ఏ తండ్రీ కొడుకులూ, అక్కా తమ్ముళ్లూ, బావా మరుదుళ్లూ ప్రవర్తించని విధంగా ఆయన పాత్రలు 'ఓవర్'గా ప్రవర్తిస్తుంటాయి. 'మొగుడు'లో ఏ పాత్రనైనా తీసుకోండి. మీకు ఇది నిఖార్సయిన నిజమని తెలుస్తుంది.
'మొగుడు'లో ఫస్టాఫ్‌లో పాత్రల ఓవరాక్షన్‌తో మతిపోయిన మనకి సెకండాఫ్ కాస్త రిలీఫ్‌నిస్తుంది. అదీ పూర్తిగా కాదు. కథకి సరిపోయే ముగింపునివ్వడంలోనూ కృష్ణవంశీ ఫెయిలయ్యాడు. 'మొగుడు' అనేది ఆంజనేయప్రసాద్ (రాజేంద్రప్రసాద్) కుటుంబం చుట్టూ అల్లిన కథ. ముగ్గురు ఆడపిల్లలు, చివర ఓ మగ పిల్లాడినీ కని భార్య చనిపోతే నలుగురు పిల్లలకీ తనే తల్లీతండ్రీ అయి పెంచాడు. అందర్నీ మంచి చదువులు చదివించాడు. అనాథల్ని చేరదీసి, తనే వాళ్లకి చదువులు చెప్పించి, అల్లుళ్లని చేసుకున్నాడు. ఇక కొడుకు రాంప్రసాద్ (గోపీచంద్) పెళ్లి చేయడమే తరువాయి. మెర్సిడెజ్ బెంజ్ కార్ల డీలర్ అయిన రాంప్రసాద్‌కి తండ్రి తెచ్చిన ఏ సంబంధమూ నచ్చదు. ఓసారి రాజరాజేశ్వరి (తాప్సీ) అనే అందాలరాశిని చూసి మనసు పారేసుకుంటాడు. ఇద్దరికీ పరిచయమవుతుంది. అంతలో తండ్రి మరో సంబంధం తెస్తాడు ప్రసాద్‌కి. తనకి కావలసింది ఆ పిల్ల కాదనీ, రాజేశ్వరి అనీ అర్థమై, ఆమెకి పెళ్లి ప్రపోజల్ చేస్తాడు. అప్పటికే అతడి పట్ల ఇష్టం ఏర్పరచుకున్న ఆమె సరేనంటుంది. రాజేశ్వరి పేరుపొందిన రాజకీయ నాయకురాలు చాముండేశ్వరి (రోజా) కూతురు. ఆమె భర్త (నరేశ్), అంజనేయప్రసాద్ బాల్య స్నేహితులనే సంగతి అప్పుడే బయటపడుతుంది. బాల్యమిత్రులిద్దరూ 'లిప్ టు లిప్ కిస్' పెట్టుకొని మనల్ని బిత్తరపోయేలా చేస్తారు. పెళ్లికి అంతా ఓకేనంటారు. పెళ్లవుతుంది. కానీ ఓ చిన్న కారణంవల్ల అప్పగింతల సమయంలో రెండు కుటుంబాలకీ గొడవవుతుంది. రాజేశ్వరితో పాటు గౌరీమాత విగ్రహాన్నీ తీసుకురమ్మంటాడు ఆంజనేయప్రసాద్. గౌరీమాత పుట్టింటే వుండాలని రాజేశ్వరి అమ్మమ్మ తేల్చిచెప్పడంతో మాటా మాటా పెరుగుతుంది. అంతలో ఆంజనేయప్రసాద్ చిన్నల్లుడు గౌరీ విగ్రహాన్ని తెస్తాడు. దాంతో అతణ్ణి చెంపమీద కొడుతుంది చాముండేశ్వరి. నా అల్లుణ్ణి కొడతావా, నువ్వసలు ఆడదానివేనా? అని ఆమె చెంప చెళ్లుమనిపిస్తాడు ఆంజనేయప్రసాద్. నన్నే కొడతావా? అంటూ అతణ్ణి చెప్పుతో కొడుతుంది చాముండేశ్వరి. మా నాన్నని చెప్పుతో కొడతావా? అంటూ అత్త గూబ గుయ్యిమనిపిస్తాడు రాంప్రసాద్. మా అమ్మనే కొడతావా? అని మొగుడి చెంప చెళ్లుమనిపిస్తుంది రాజేశ్వరి. ఆగ్రహంతో ఊగిపోతూ ఆమె మీద చెయ్యెత్తి ఆగిపోతాడు రాంప్రసాద్. నాకు ఈ పెళ్లొద్దు, ఈ మొగుడూ వద్దు - అని పుటుక్కున తాళి తెంచేసి మొగుడిమీదకు విసిరేస్తుంది రాజేశ్వరి. ఈ చెంపలు చెళ్లుమనిపించే కార్యక్రమం చకచకా సాగి మన మైండ్ బ్లాంకవుతుండగా తెరమీద 'సగం అయ్యింది' అనే ఇంటర్వెల్ కార్డ్ పడటంతో ఊపిరి తీసుకోడానికి పరుగున బయటకు వస్తాం.
రాంప్రసాద్, రాజేశ్వరికి విడాకులు మంజూరు చేయించే కార్యక్రమాన్ని చాముండేశ్వరి షురూ చేశాక మన హీరో హీరోయిన్లు మారిషస్‌కి వెళ్లి మళ్లీ ఎలా దగ్గరయ్యారు, పెద్దల్ని ఒప్పించి మళ్లీ మొగుడూ పెళ్లాలు ఎలా అయ్యారనేది మిగతా కథ. ఈ ప్రాసెస్‌లో హీరో హీరోయిన్లకి శ్రద్ధాదాస్ బాగా సాయపడుతుంది. రాజేశ్వరితో పెళ్లి ఒకవేళ జరగకపోతే నేను ఉండానని గుర్తుపెట్టుకో అని మొదట్లోనే తన సమక్షంలోనే రాంప్రసాద్‌కి చెప్పిన శ్రద్ధ మారిషస్‌లో రాంప్రసాద్‌తో రాసుకు పూసుకు తిరగడాన్ని సహించలేకపోతుంది రాజేశ్వరి. అతడిపట్ల తనలో ఎంత ప్రేముందో తెలిసి, షార్క్ చేపల్ని చంపడానికిచ్చే విషం తాగుతుంది. ఆమెని కాపాడుకోవడమే కాక, చివరకు అత్త చాముండేశ్వరిలో పరివర్తన కలిగిస్తాడు రాంప్రసాద్.
పెళ్లయ్యాక మగాడనేవాడు 'మొగుడు' అనికూడా అనిపించుకోవాలని ఈ సినిమాతో చెప్పానని కృష్ణవంశీ సినిమా విడుదలకి ముందు పదేపదే చెప్పాడు. 'మొగుడు' సినిమాలో పెళ్లయ్యాక రాంప్రసాద్ చేసిన పని చాలా సినిమాల్లో ఇప్పటికే మనం చూశాం. మరి ఇందులో కృష్ణవంశీ కొత్తగా ఏం చెప్పినట్లు? నథింగ్. పాత కథనే మరోసారి తనదైన 'ఓవర్ డోస్'తో చెప్పాడంతే. పెళ్లయి పసుపూ పారాణి ఆరకముందే ఆ మొగుడూ పెళ్లాలు విడిపోవాల్సి రావడం మంచి ఇంటర్వెల్ బ్యాంగ్. కానీ చెంపదెబ్బల ప్రహసనంతో ఆ ఫీల్ ఏమాత్రమూ మిగలదు. నిజానికి ఫస్టాఫ్‌లో హృదయాన్ని హత్తుకునే సన్నివేశాలేవీ దాదాపుగా లేవు. సెకండాఫ్‌లో రాజేశ్వరి విషం తాగినప్పుడు మాత్రం ఆమెపట్ల సానుభూతి కలుగుతుంది. ఆ తర్వాత ప్రీ క్లైమాక్స్‌లో రాజేశ్వరిని వాళ్లింట్లో వదిలేసిరమ్మని రాంప్రసాద్‌ని తండ్రి అన్నప్పుడూ, మేము కావాలో, రాజేశ్వరి కావాలో తేల్చుకొమ్మని ముగ్గురక్కలూ అతడిని అడకత్తెరలో పోకచెక్క చేసినప్పుడూ జాలి పడతాం. అంతకుమించి 'మొగుడు'లో మనం సహానుభూతి చెందే సన్నివేశాలు కనిపించవు. గోపీచంద్, శ్రద్ధాదాస్ మీద తీసిన బీచ్ సాంగ్, గోపీచంద్, తాప్సీ మీద సింహం పిల్లలు, చిరుత మధ్య తీసిన డ్యూయెట్ మాత్రం యువతని ఆకట్టుకుంటాయి.
కన్నతండ్రే (ఆంజనేయప్రసాద్) కన్నకొడుక్కి (రాంప్రసాద్) మగతనం ఉందో, లేదో తెలుసుకొమ్మని తన డాక్టరల్లుణ్ణే పురమాయించడం 'మొగుడు' లాంటి కృష్ణవంశీ సినిమాల్లోనే మనం చూడగలం. ఆ సంగతి అర్థమయ్యాక రాంప్రసాద్ కిందపడి దొర్లడం, ఆ ఓవరాక్షన్ చెయ్యలేక గోపీచంద్ ఇబ్బందిపడటం, అది చూడలేక మనం ఇబ్బందిపడటం... ఎందుకొచ్చిన ఇబ్బంది?
గంపగుత్తగా ఒకే సినిమాలో అందరు యాక్టర్ల ఓవరాక్షన్ చూసే అవకాశం మనకి అరుదుగా దొరుకుతుంది. ఆ ఓవరాక్షన్, ఓవర్ డ్రమటైజేషన్ ఎలా ఉంటుందో అనుభవించాలంటే 'మొగుడు' చూసి తీరాల్సిందే. సినిమాలో చెప్పుకోతగ్గది శ్రీకాంత్ నరోజ్ సినిమాటోగ్రఫీ. బాబూశంకర్ సంగీత బాణీలకన్నా పాటల చిత్రీకరణే బాగుంది. 'మొగుడు' ఫీడ్‌బాక్ తర్వాతైనా పాత్రల, సన్నివేశాల కల్పనలో కృష్ణవంశీలో మార్పు వస్తుందని ఆశించడం అత్యాశే. ఎందుకంటే ఆయన అక్కడే ఫిక్సయిపోయాడు.
Wednesday, October 19, 2011
చివరి పాట చిత్రీకరణలో 'మొగుడు'
గోపీచంద్, తాప్సీ జంటగా కృష్ణవంశీ రూపొందిస్తున్న 'మొగుడు' సినిమా షూటింగ్ ఓ పాట మినహా పూర్తయింది. లక్ష్మీనరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) నిర్మిస్తున్న ఈ చిత్రానికి బేబి భవ్య సమర్పకురాలు. సంగీత దర్శకుడిగా బాబూశంకర్ పరిచయమవుతున్నారు. సీతారామశాస్త్రి, సుద్దాల అశోక్‌తేజ, రామజోగయ్యశాస్త్రి పాటలు రాశారు.
ఇటీవల ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్లో విడుదలైన పాటలకి అనూహ్యమైన స్పందన వచ్చిందని నిర్మాత బుజ్జి తెలిపారు. "మిగిలి ఉన్న పాటను బుధవారం (అక్టోబర్ 19) నుంచి చిత్రీకరిస్తున్నాం. దీంతో షూటింగ్ మొత్తం పూర్తయినట్లే. కృష్ణవంశీ సినిమా అంటే అలకలు, అల్లర్లు, అందాలు, బంధాలు, భావాలు, భావోద్వేగాలు, సరసాలు, సంప్రదాయాలు కలగలసి ఉంటాయి. అలాంటి కోవలోనే వస్తున్న సినిమా 'మొగుడు'. ఇదొక అందమైన కుటుంబ కథ. అలాగని ఫ్యామిలీ ఆడియెన్స్‌కి మాత్రమే నచ్చే సినిమా కాదిది. క్లాస్, మాస్ తేడా లేకుండా అందరికీ నచ్చుతుంది. నటునిగా గోపీచంద్‌లోని కొత్తకోణాన్ని ఇందులో చూస్తారు. ఆయన కెరీర్‌లో ఈ సినిమా మైలురాయి అవుతుంది. రాజేంద్రప్రసాద్ చేసిన కీలక పాత్ర సినిమాకే హైలైట్. నటిగా తాప్సీని ఉన్నత స్థాయిలో నిలిపే సినిమా ఇది. శ్రద్ధాదాస్ మరో నాయికగా నటించింది. నరేశ్, రోజా భార్యాభర్తల పాత్రల్లో ఆకట్టుకుంటారు. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం'' అని చెప్పారు.
ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: శ్రీకాంత్, కూర్పు: గౌతంరాజు.

Thursday, October 13, 2011
ప్రివ్యూ: మొగుడు
కృష్ణవంశీ, గోపీచంద్ తొలి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా 'మొగుడు'. ఈ సినిమా ప్రోమోస్ అన్నీ ఆమధ్య గుణశేఖర్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వచ్చి ఫ్లాపైన 'వరుడు'ను గుర్తు చేస్తున్నాయి. 'వరుడు' ఫ్లాపవడం వల్లే పెళ్లి అనే కాన్సెప్టుతో హిట్ సినిమా చేయాలనే పట్టుదలతో 'మొగుడు'ని కృష్ణవంశీ తీసినట్లు అనిపిస్తుంది. 'మొగుళ్లందరూ మగాళ్లే కానీ, మగాళ్లందరూ మొగుళ్లు కారు. చాలామంది మొగుళ్లు మొగుళ్లలా కాకుండా మగాళ్లలా మిగిలిపోతున్నారు. అలా ఉండొద్దు' అనే కథాంశంతో ఈ సినిమాని కృష్ణవంశీ రూపొందించాడు. 'శశిరేఖా పరిణయం', 'మహాత్మ' వంటి ప్రేక్షకులు సరిగా ఆదరించని రెండు సినిమాల తర్వాత కృష్ణవంశీ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తే, 'వాంటెడ్' వంటి డిజాస్టర్ తర్వాత గోపీచంద్ ఈ సినిమా చేశాడు. అందాల తార తాప్సీ ఇందులో పర్ఫార్మెన్స్‌కి ప్రాధాన్యం ఉన్న పాత్ర చేసింది. తన పాత్రకు ఆమె స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. కాలం కలిసొస్తే ఈ పాత్రకి ఆమె అవార్డులు సాధించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. మరో నాయికగా శ్రద్ధాదాస్ నటించింది. గోపీచంద్ తండ్రిగా రాజేంద్రప్రసాద్ నటించడంతో ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ వచ్చింది. తాప్సీ తల్లిదండ్రులుగా రోజా, నరేశ్ కనిపిస్తారు.
లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ బేనర్‌పై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా మ్యూజిక్ డైరెక్టర్‌గా బాబూశంకర్, సినిమాటోగ్రాఫర్‌గా శ్రీకాంత్ నర్రోజు, డైలాగ్ రైటర్‌గా భీం శ్రీను పరిచయమవుతున్నారు. మలయాళీ అయిన బాబూశంకర్ ఇప్పటివరకు 400 వరకు యాడ్ ఫిలింస్ తీయడం గమనార్హం. సీతారామశాస్త్రి నాలుగు పాటలు, సుద్దాల అశోక్‌తేజ, రామజోగయ్యశాస్త్రి తలో పాట రాసిన ఈ సినిమా దీపావళికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Wednesday, October 12, 2011
న్యూస్: 'మొగుడు'ని 'రాఖీ' అంత కావాలన్న ఎన్టీఆర్
'మొగుడు' సినిమా తన 'రాఖీ' అంత గొప్ప సినిమా కావాలని ఆకాక్షించాడు ఎన్టీఆర్. దీంతో విన్నవాళ్ల చెవులూ, చూసినవాళ్ల కళ్లూ తరించిపోయాయి. "కృష్ణవంశీ తీసిన 'రాఖీ'లో గొప్ప పాత్ర చేశా. ఇప్పటిదాకా ఎన్ని పాత్రలు చేసినా, ఇకముందు ఎన్ని పాత్రలు చేసినా 'రాఖీ' పాత్రని మర్చిపోలేను. కథచెప్పి నన్ను ఏడిపించిన ఏకైక దర్శకుడు వంశీనే. నాకు 'రాఖీ' మాదిరిగానే నా మిత్రుడైన గోపీకి ఇది బ్రహ్మాండమైన సినిమా అవుతుంది" అని చెప్పాడు ఎన్టీఆర్. వాస్తవమేమంటే 'రాఖీ' సినిమా కమర్షియల్‌గా చెప్పుకోదగ్గ రీతిలో ఆడలేదు. అత్తింటి ఆరళ్లకు బలైపోయిన తన చెల్లెలి మాదిరిగా మరే చెల్లెలూ అన్యాయానికి గురి కాకూడదని ఆడపిల్లల్ని ఆదుకునే అన్నగా ఆ సినిమాలో ఎన్టీఆర్ నటించాడు. ఎప్పటిలాగే ప్రతి పాత్రనీ 'ఓవర్ బోర్డ్'కు తీసుకెళ్లే అలవాటున్న కృష్ణవంశీ 'రాఖీ' పాత్రనీ ఓవర్‌గానే మలిస్తే, తన ఓవరాక్టింగ్‌తో ఆ కేరక్టర్‌కి న్యాయం చేశాడు ఎన్టీఆర్. ఆ సినిమా తెలుగుదేశంలోని ప్రతి చెల్లినీ కదిలిస్తుందని వాళ్లు ఆశించారు. కానీ జరిగింది అందుకు విరుద్ధం. ప్రేక్షకులతో పాటు విమర్శకుల్నీ ఆ సినిమా మెప్పించలేకపోయింది. అలాంటి సినిమాని పట్టుకుని గోపీచంద్‌కి 'మొగుడు' తన 'రాఖీ' అంత సినిమా కావాలని ఎన్టీఆర్ కోరుకోవడం చూసి, "ఆ సినిమాలాగానే 'మొగుడు' కూడా ఫట్టవ్వాలని ఎన్టీఆర్ కోరుకుకుంటున్నాడా?" అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. చివరికి గోపీచంద్‌కి కూడా ఎన్టీఆర్ మాటలు రుచించలేదని అప్పుడు అతని మొహమే చెప్పింది.
Wednesday, September 14, 2011
న్యూస్: 'మొగుడు' మీద ఆశలెన్నో!
కె. రాఘవేంద్రరావు డైరెక్ట్ చేసిన 'ఝుమ్మంది నాదం' రిలీజయినప్పుడు తాప్సీ రూపంలో టాలీవుడ్‌కి మరో ఇలియానా పరిచయమయ్యిందనే టాక్ వచ్చింది. 'దేవదాసు', 'పోకిరి' సినిమాలతో ఇలియానా హాటెస్ట్ హీరోయిన్ అయిన విధంగానే తాప్సీ కూడా అమిత క్రేజ్ సంపాదించుకుంటుందని అనుకున్నారు. చిత్రంగా నాలుగు సినిమాలు రిలీజైనా ఆమెకి తెలుగులో అనుకున్నంత క్రేజ్ రాలేదు. 'పోకిరి' తరహా హిట్ ఆమెకి రాకపోవడమే దీనికి కారణమని చెప్పాలి. అందచందాల విషయంలో ఏమాత్రం వంకపెట్టలేని రీతిలో ఉండే ఈ పంజాబీ ముద్దుగుమ్మ 'ఝుమ్మంది నాదం' తర్వాత 'వస్తాడు నా రాజు', 'మిస్టర్ పర్ఫెక్ట్', 'వీర' సినిమాల్లో చేసింది. వీటిలో 'మిస్టర్ పర్ఫెక్ట్' ఒక్కటే హిట్టు. అందులోనూ ఆమె చేసింది సెకండ్ హీరోయిన్ కేరక్టరే. ఫలితంగా అనుకున్నంతగా ఆమె కెరీర్ ఊపందుకోలేదు. టాప్ హీరోల సరసన ఆఫర్లు రావడం లేదు. ప్రస్తుతం ఆమె తెలుగులో ఒకే సినిమా చేస్తోంది. ఆ సినిమా 'మొగుడు'. కృష్ణవంశీ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో ఆమె గోపీచంద్ సరసన నటిస్తోంది. నల్లమలుపు బుజ్జి నిర్మిస్తున్న ఈ సినిమాపై తాప్సీ ఎన్నో ఆశలు పెట్టుకుంది. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో గోపీచంద్, తాప్సీ మధ్య రొమాంటిక్ సీన్లు ఆడియెన్స్ మతులు పోగొడతాయని ఆ సినిమా యూనిట్ మెంబర్స్ అంటున్నారు. రొమాంటిక్ సీన్లు తీయడంలో కృష్ణవంశీది అందె వేసిన చెయ్యి కావడంతో తాప్సీ అందాలు ఈ సినిమాలో కనువిందు చేస్తాయని ఊహించవచ్చు. బాలీవుడ్‌లో 'చష్మే బద్దూర్' అనే సినిమాని సిద్ధార్థ్‌తో చేయబోతున్న తాప్సీకి 'మొగుడు' ఎలాంటి కానుకనిస్తాడో చూడాల్సిందే.
Sunday, August 28, 2011
న్యూస్: రెండు ఫ్లాపుల తర్వాత వస్తున్న కృష్ణవంశీ 'మొగుడు'
'చందమామ' వంటి హిట్ సినిమా తర్వాత డైరెక్ట్ చేసిన 'శశిరేఖా పరిణయం', 'మహాత్మ' సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తా పడటంతో ఇప్పుడు మరింత కసిగా 'మొగుడు'ని తీర్చిదిద్దుతున్నాడు కృష్ణవంశీ. ఈ సినిమాలో టైటిల్ రోల్‌ని గోపీచంద్ చేస్తున్నాడు. "మగ పుట్టుక పుట్టిన ప్రతి ఒక్కడూ మగాడు కాదు. అలాగే తాళి కట్టిన ప్రతివాడూ మొగుడు కాడు. బాధ్యతనెరిగినవాడు మగాడు అవుతాడు. మనసెరిగినవాడు మొగుడు అవుతాడు. 'మొగుడు' కథాంశం వెనుకవున్న విషయం ఇదే" అని చెప్పాడు కృష్ణవంశీ. గోపీచంద్‌తో ఇది ఆయనకి తొలి చిత్రం. గోపి నటన ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ అవుతుందని ఆయన చెబుతున్నాడు. ఈ సినిమాలో నాయికలుగా ఇద్దరు నటిస్తున్నారు. ఒకరు తాప్సీ అయితే, మరొకరు శ్రద్ధా దాస్. వీరిలో ప్రధాన నాయిక తాప్సీ కాబట్టి గోపీచంద్ ఆమెకే 'మొగుడు' అని అర్థమైపోతుంది. ఈ సినిమాలో మరో ఆకర్షణ రాజేంద్రప్రసాద్ ఓ కీలక పాత్ర చేస్తుండటం. ఈ సినిమాని నల్లమలుపు బుజ్జి నిర్మిస్తున్నారు. పూరి జగన్నాథ్, రానా కాంబినేషన్‌లో ఎంతో నమ్మకంతో నిర్మించిన 'నేను నా రాక్షసి' సినిమా ఆడకపోవడంతో 'మొగుడు' బాక్సాఫీసు ఫలితం మీద ఆయన ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తీసిన ప్రతి సినిమాకీ ఆధ్యాత్మిక కోణాన్ని జోడిస్తూ వస్తున్న కృష్ణవంశీ ఈ సినిమాకీ ఆ కోణాన్ని జోడించి ఉంటాడని నమ్మొచ్చు. సెప్టెంబరులోనే రిలీజవుతున్న ఈ సినిమాకి ప్రేక్షకుల తీర్పు ఎలా ఉంటుందో... కృష్ణవంశీ, గోపీచంద్ తొలి కాంబినేషన్ ఏమేరకు వర్కవుట్ అవుతుందో... వెయిట్ అండ్ సీ.
Wednesday, August 10, 2011
న్యూస్: యముడైనా గట్టెక్కిస్తాడా?
కెరీర్‌లో ఒక్క హిట్టూలేని హీరో సాయిరాం శంకర్. టాప్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తమ్ముడైన సాయిరాం '143' సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. జగన్నాథ్ స్వయంగా డైరెక్ట్ చేసిన ఈ సినిమా బాక్సాఫీసుని గెలవలేకపోయింది. ఆ తర్వాత సాయిరాం 'హలో ప్రేమిస్తారా', 'వాడే కావాలి', 'డేంజర్', 'బంపర్ ఆఫర్' సినిమాల్లో హీరోగా నటించాడు. వీటిలో 'బంపర్ ఆఫర్' హిట్టవుతున్నట్లే కనిపించి, ఫ్లాప్‌గా తేలింది. 'డేంజర్'కి కృష్ణవంశీ డైరెక్టర్ అయినా ప్రయోజనం లేకపోయింది. వీటితో పాటు రవితేజ సినిమా 'నేనింతే'లో హీరో అభిమానిగా సాయి నటించాడు. ఇవేవీ అతని కెరీర్‌కు దోహదం చేయలేదు. కాగా అతను హీరోగా మరో సినిమా తెరకెక్కుతోంది. దాని పేరు 'యమహో యమహ'. 'ఇన్ అమెరికా' అనేది ట్యాగ్‌లైన్. ఇది సోషియో ఫాంటసీ కావడం గమనార్హం. ఇందులో యమధర్మరాజు పాత్రని శ్రీహరి చేస్తుండటం విశేషం. ఆయన ఆ పాత్రని పోషించడం ఇదే ప్రథమం. ఈ సినిమాకి సంబంధించిన మరో ఆసక్తికర అంశం సాయి సరసన పార్వతీ మెల్టన్ నటిస్తుండటం. పవన్ కల్యాణ్ సినిమా 'జల్సా' తర్వాత ఆమె మళ్లీ తెలుగు సినిమాలో నటించడం ఇదే. 'వేడుక' ఫేం జితేందర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ 20 నుంచి అమెరికాలో జరగనున్నది. యమధర్మరాజు ఉంటే ఆ సినిమా హిట్టే అనే సెంటిమెంట్‌ని సినీ జనం గట్టిగా నమ్ముతున్నారు కాబట్టి ఈ సినిమా అయినా విజయం సాధించి సాయి కెరీర్‌కి ప్రయోజనం చేకూరుస్తుందేమో చూడాలి.
Tuesday, July 26, 2011
న్యూస్: తాప్సీ ఆ సినిమా చేస్తుందా?
ఇలియానా తరహాలోనే సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని చాలామంది భావించిన పంజాబీ బ్యూటీ తాప్సీ పన్ను నాలుగు సినిమాల తర్వాత కూడా అలాంటి క్రేజ్‌ని సృష్టించలేక పోయింది. తొలి సినిమా 'ఝుమ్మంది నాదం'లో ఆమెని రాఘవేంద్రరావు చూపించిన తీరు చూసి మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ ఇన్ టాలీవుడ్ అంటూ తీర్మానించేసింది చిత్రసీమ. అయితే 'మిస్టర్ పర్ఫెక్ట్' మినహా ఆమె ఖాతాలో ఇంతదాకా మరో హిట్టు లేదు. ఆ సినిమాలోనూ ఆమెది సెకండ్ హీరోయిన్ రోలే. 'ఝుమ్మంది నాదం'తో పాటు 'వస్తాడు నా రాజు', 'వీర' ఫ్లాపయ్యాయి. ఇలియానా మాదిరిగా తొలి రెండు సినిమాలు 'దేవదాసు', 'పోకిరి' వంటివి తాప్సీకి తగిలుంటే ఆమె కూడా ఈపాటికే యువతరం కలల రాణిగా ఆవిర్భవించి ఉండేదని విశ్లేషకుల అభిప్రాయం. ప్రస్తుతం కృష్ణవంశీ డైరెక్ట్ చేస్తున్న 'మొగుడు'లో గోపీచంద్ సరసన నటిస్తున్న ఆమె తాజాగా సునీల్ సరసన నటించేందుకు అంగీకరించి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. మాధవన్, కంగనా రనౌత్ జంటగా బాలీవుడ్‌లో వచ్చి సూపర్‌హిట్టయిన 'తను వెడ్స్ మను'కి ఇది రీమేక్. మెగా సూపర్‌గుడ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవీప్రసాద్ డైరెక్టర్. అయితే ఈ సినిమాలో తాప్సీ నటించడం లేదనే ప్రచారం కూడా జరుగుతోంది. కమెడియన్ అయిన సునీల్ సరసన నటిస్తే టాప్ హీరోల సినిమాల్లో అవకాశాలు రావని, ఇందుకు 'మర్యాద రామన్న'లో నటించిన సలోని మంచి ఉదాహరణంటూ ఆమె హితులు హెచ్చరించారనీ, అందుకే ఆమె ఆ సినిమా చెయ్యట్లేదనీ వినిపిస్తోంది. తాప్సీ నుంచి మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటనా రాలేదు. నిజానికి తాప్సీ కంటే ముందు ఇద్దరు ముగ్గురు నేటి క్రేజీ హీరోయిన్లని నిర్మాతలు సంప్రదించారు కానీ వారు సునీల్‌తో చేయడానికి విముఖత చూపించారు. ఈ పరిస్థితుల్లో సునీల్ జోడీ తాప్సీనా లేక మరొకరు ఆ స్థానంలోకి వస్తారా?
Tuesday, July 19, 2011
న్యూస్: నితిన్ ప్రేక్షకుల 'ఇష్క్' పొందుతాడా?
నితిన్‌కి హిట్టొచ్చి ఎంత కాలమైందో జ్ఞాపకముందా? ఏడేళ్లు! అవును. అతని చివరి హిట్ మూవీ 'సై'. అది కూడా నిర్మాతకి డబ్బులు తీసుకు రాలేదు. కొన్నవాళ్లే లాభపడ్డారు. అంతకు ముందు 'జయం', 'దిల్' సినిమాలతో రెండు వరుస హిట్లిచ్చిన అతను నాలుగో సినిమా 'సై'తో మరో సక్సెస్ సాధించాననుకున్నాడు. ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వ ప్రతిభతో రగ్బీ నేపథ్యంలో నడిచే ఆ సినిమా చాలామందిని ఆకట్టుకుంది. దాని తర్వాత నితిన్ 13 సినిమాల్లో నటించాడు. వాటిలో ఏ ఒక్కటీ అతనికి సంతోషాన్ని ఇవ్వలేకపోయింది. ఆ సినిమాల్లో రాంగోపాల్‌వర్మ డైరెక్షన్‌లో చేసిన హిందీ సినిమా 'అగ్యాత్' కూడా ఉంది. అంటే నితిన్ బాలీవుడ్ ఎంట్రీ సైతం నిరాశనే కలిగించింది. కృష్ణవంశీ (శ్రీ ఆంజనేయం), కె. రాఘవేంద్రరావు (అల్లరి బుల్లోడు), తేజ (ధైర్యం), ఎన్. శంకర్ (రాం) వంటి దర్శకులు కూడా తర్వాతి కాలంలో అతనికి సక్సెస్సులు ఇవ్వలేకపోయారు. ప్రియమణి అందాల కనువిందు చేసిన 'ద్రోణ' కానీ, మోస్ట్ గ్లామరస్ గర్ల్ ఇలియానాతో చేసిన 'రెచ్చిపో' కానీ, క్యూట్ గర్ల హన్సికతో నటించిన 'సీతారాముల కల్యాణం.. లంకలో' కానీ అతడికి విజయాన్ని చేకూర్చలేక పోయాయి. అతని కెరీర్ కోసం తండ్రి ఎన్. సుధాకర్‌రెడ్డి చేయని ప్రయత్నమంటూ లేదు. అయినా కూడా నితిన్ ఎందుకనో ప్రేక్షకుల్ని అలరించలేక పోతున్నాడు. ప్రస్తుతం అతను 'ఇష్క్' అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో 'అలా మొదలైంది'తో ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్న నిత్య మీనన్ హీరోయిన్. విక్రం కుమార్ అనే కొత్త డైరెక్టర్ రూపొందిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన ఓ విశేషం ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ పి.సి. శ్రీరాం దీనికి పని చేస్తుండటం. ఈ సినిమాతోనైనా నితిన్ తన పరాజయ పరంపరకి అడ్డుకట్ట కట్టుకోగలడా? వెయిట్ అండ్ సీ.
Monday, July 11, 2011
న్యూస్: హిట్టు కోసం తొమ్మిదేళ్లుగా నిరీక్షణ!
త్రివిక్రం దర్శకుడిగా పరిచయమైన 'నువ్వే నువ్వే' (2002) తర్వాత హీరో తరుణ్‌కి ఇంతవరకు చెప్పుకోదగ్గ మరో హిట్ దక్కకపోవడం ట్రాజెడీ. తప్పకుండా హిట్టవుతాయనకున్న 'నవ వసంతం', 'భలే దొంగలు', 'శశిరేఖా పరిణయం' సినిమాలు కూడా అతనికి హేండిచ్చాయి. వీటిలో మొదటి దాన్ని ఆర్.బి. చౌదరి నిర్మిస్తే, రెండోది బాలీవుడ్ సూపర్ హిట్ 'బంటీ ఔర్ బబ్లీ'కి రీమేక్. ఇక మూడోదాన్ని డైరెక్ట్ చేసింది కృష్ణవంశీ. 'శశిరేఖా పరిణయం' వచ్చి రెండేళ్లయినా ఇంతవరకు తరుణ్ సినిమా ఏదీ రిలీజ్ కాలేదు. విమలా రామన్ జతగా అతను నటించిన 'చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి' చిత్రం 2010లోనే విడుదల కావాల్సి ఉండగా ఇప్పటికీ జనం మధ్యకు రాలేకపోయింది. 2011లోనూ రెండుసార్లు విడుదల తేదీ ప్రకటించినా ఆ పని చేయలేకపోయారు నిర్మాతలు. ఈ సినిమాకి ఇద్దరు నిర్మాతలు, వారిలో ఒకరు సుప్రీం మ్యూజిక్ అధినేత రాజు హర్వాణీ కాగా, మరొకరు సినీ జర్నలిస్టు అయిన గోగినేని శ్రీనివాస్. ఆరంభంలో ఈ సినిమా షూటింగ్ సవ్యంగా నడవలేదు. మొదట డైరెక్టర్‌గా పెట్టుకున్న వి.ఎన్. ఆదిత్య నిర్మాతలతో పొసగక ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు. దాంతో తమిళుడైన కన్మణితో ఈ సినిమాని పూర్తి చేశారు నిర్మాతలు. చివరిగా మే 27న ఈ సినిమాని విడుదల చేస్తున్నట్లు వారు ప్రకటించారు. కానీ ఆ రోజున ఈ సినిమా రిలీజ్ కాలేదు. తిరిగి ఇప్పటివరకు ఈ సినిమా పరిస్థితి ఏంటో తెలీదు. ఇందులో తరుణ్, విమల హాట్ హాట్ బాత్ రూం సీన్‌లో నటించినట్లు నిర్మాతలు విడుదల చేసిన స్టిల్స్ వల్ల తెలుస్తోంది. తెరమీద ఆ సీన్లని తిలకించే అవకాశం ప్రేక్షకులకి ఎప్పుడొస్తుందో మరి. ఈ సినిమా సంగతి అలా ఉంచితే ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్నాడు తరుణ్. వాటిలో ఒకటి శ్రీకాంత్ కాంబినేషన్‌తో చేస్తున్న 'అనుచరుడు' కాగా, మరోటి శ్రీహరి కాంబినేషన్‌తో చేస్తున్న 'యుద్ధం'. ఈ సినిమాలైనా సకాలంలో విడుదలై, తరుణ్‌కి మంచి కెరీర్‌ని ఇస్తాయో, లేదో చూడాలి.
Monday, July 4, 2011
న్యూస్: శ్రీకాంత్‌కి మళ్లీ నిరాశే
శ్రీకాంత్ ఆశలు మరోసారి వమ్మయ్యాయి. తప్పకుండా విజయం సాధించడంతో పాటు నటుడిగా తనకి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తుందని భావించిన 'విరోధి' సినిమాకి ప్రేక్షకులు కరువవడం అతణ్ణే కాదు సినీ వర్గాల్నే ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. ఎందుకటే ఆ సినిమాకి డైరెక్టర్ ప్రతిభావంతుడిగా పేరుపొందిన నీలకంఠ. కమర్షియల్‌గా పెద్ద హిట్టు కాకపోయినా క్లాస్ ఆడియెన్స్‌నీ, విమర్శకుల్నీ మెప్పిస్తుందని చాలామంది అనుకున్నారు. అయితే మేకా మీడియా బేనర్‌పై శ్రీకాంత్ తమ్ముడు అనిల్ నిర్మించిన ఈ సినిమా రెంటికీ చెడ్డ రేవడిలా తయారయ్యిందని చెప్పాలి. సగటు ప్రేక్షకుడినే కాక మల్టీప్లెక్స్ ఆడియెన్స్‌నీ ఈ సినిమా మెప్పించలేకపోతోంది. దాంతో దీనికి పెట్టిన పెట్టుబడి అంతా బూడిదలో పోసినట్లే. అంతే కాదు జర్నలిస్టుగా నటించిన శ్రీకాంత్ కంటే నక్సలైటుగా నటించిన అజయ్‌కే ఎక్కువ పేరొచ్చింది. కరెక్టుగా చెప్పాలంటే ఇది శ్రీకాంత్ సినిమా అని కాకుండా అజయ్ సినిమా అనే అంటున్నారు. ప్రధాన స్రవంతి సినిమా విధానంలో గాక కొత్త ధోరణిలో నీలకంఠ చేసిన ప్రయోగం ఎక్కువమందిని ఆకట్టుకోలేక పోతోంది. నక్సలిజం దారి తప్పిపోయిందని 'విరోధి'తో చెప్పాలని ఆయన యత్నించాడు. దానికి ఆయన ఎంచుకున్న స్క్రీన్‌ప్లే బోర్ కొట్టించింది. అందుకే ఈ సినిమా పట్ల ఎక్కువమంది ఆసక్తి కనపర్చడం లేదు.
2007లో 'ఆపరేషన్ దుర్యోధన', 'యమగోల.. మళ్లీ మొదలైంది' తర్వాత శ్రీకాంత్‌కి ఇంతవరకు మరో హిట్టు దక్కలేదు. 'మైఖేల్ మదన కామరాజు' నుంచి మొదలుకుని 'విరోధి' దాకా వరుసగా ఎనిమిది సినిమాలు అటకెక్కాయి. వీటిలో కృష్ణవంశీ డైరెక్షన్‌లో నటించిన 100వ సినిమా 'మహాత్మా' కూడా ఉంది. 'విరోధి' ఫ్లాపవడంతో శ్రీకాంత్ తన పాత్రల విషయంలో పునరాలోచించుకుంటే మంచిదని విశ్లేషకులు సూచిస్తున్నారు. శ్రీహరి తరహాలో ఓ వైపు హీరో పాత్రలు చేస్తూనే మరోవైపు నటనకు అవకాశమున్న ఇతర పాత్రల్ని చేసుకుంటే బెటర్ అనేది వారి అభిప్రాయం.

Subscribe to:
Posts (Atom)