Showing posts with label boyapati srinu. Show all posts
Showing posts with label boyapati srinu. Show all posts
Tuesday, December 23, 2014
Wednesday, June 18, 2014
Sunday, December 29, 2013
Wednesday, August 24, 2011
న్యూస్: ఎన్టీఆర్, శ్రీను వైట్ల కాంబినేషన్!
పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో 2012 ఏప్రిల్ నుంచి ఓ సినిమా చేయనున్న ఎన్టీఆర్ అంతకంటే ముందు శ్రీను వైట్ల డైరెక్షన్‌లో నటించేందుకు సిద్ధమవుతున్నాడు. ఆ ఇద్దరి కాంబినేషన్ కలవడం ఇదే తొలిసారి. ఎన్టీఅర్, పూరి కాంబినేషన్ సినిమాని నిర్మించే పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత బండ్ల గణేశ్ ఈ సినిమానీ నిర్మించబోతున్నాడు.
ఎన్టీఆర్ ప్రస్తుతం సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో 'ఊసరవెల్లి'తో పాటు బోయపాటి శ్రీను దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు. "బోయపాటి డైరెక్షన్లో క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత కె.ఎస్. రామారావు నిర్మిస్తున్న సినిమా తర్వాత నేను చేసేది శ్రీను వైట్ల దర్శకత్వంలోనే. అతను చెప్పిన కథ ఇన్‌స్పైరింగ్‌గా ఉంది. మా ఫస్ట్ కాంబినేషన్ ద బెస్ట్ అనిపించుకునేలా మంచి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తయారవుతుంది" అని ఎన్టీఆర్ తెలిపాడు.
మరోవైపు మహేశ్ హీరోగా తను రూపొందిస్తున్న 'దూకుడు' తర్వాత తను డైరెక్ట్ చేసేంది ఎన్టీఆర్‌నేనని శ్రీను వైట్ల తెలిపాడు. 'అతడు', 'దూకుడు' సినిమాలకి సినిమాటోగ్రఫీ అందించిన గుహన్ ఈ సినిమాకీ పని చేయబోతున్నాడు. మొత్తానికి మంచి మంచి కాంబినేషన్స్ పట్టుకుంటూ నిర్మాత బండ్ల గణేశ్ వార్తల్లో వ్యక్తిగా మారాడు.
ఎన్టీఆర్ ప్రస్తుతం సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో 'ఊసరవెల్లి'తో పాటు బోయపాటి శ్రీను దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు. "బోయపాటి డైరెక్షన్లో క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత కె.ఎస్. రామారావు నిర్మిస్తున్న సినిమా తర్వాత నేను చేసేది శ్రీను వైట్ల దర్శకత్వంలోనే. అతను చెప్పిన కథ ఇన్‌స్పైరింగ్‌గా ఉంది. మా ఫస్ట్ కాంబినేషన్ ద బెస్ట్ అనిపించుకునేలా మంచి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తయారవుతుంది" అని ఎన్టీఆర్ తెలిపాడు.
మరోవైపు మహేశ్ హీరోగా తను రూపొందిస్తున్న 'దూకుడు' తర్వాత తను డైరెక్ట్ చేసేంది ఎన్టీఆర్‌నేనని శ్రీను వైట్ల తెలిపాడు. 'అతడు', 'దూకుడు' సినిమాలకి సినిమాటోగ్రఫీ అందించిన గుహన్ ఈ సినిమాకీ పని చేయబోతున్నాడు. మొత్తానికి మంచి మంచి కాంబినేషన్స్ పట్టుకుంటూ నిర్మాత బండ్ల గణేశ్ వార్తల్లో వ్యక్తిగా మారాడు.
Wednesday, August 17, 2011
న్యూస్: 'కందిరీగ' హిట్ కొట్టాడు!
మూడేళ్ల విరామంతో, మూడు సినిమాల ఫ్లాప్ షో తర్వాత హిట్ కొట్టాడు రాం. చిత్రమేమంటే అతని కేరీర్‌లో ఇది మూడో హిట్ కావడం. 'కందిరీగ'తో అతనికి విజయాన్ని కూర్చిన దర్శకుడు సంతోష్ శ్రీన్‌వాస్. పెద్దగా మేధావితనం కనిపించని సినిమాటోగ్రాఫర్ శ్రీన్‌వాస్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన సంగతి తెలిసిందే. అయితే బోయపాటి శ్రీను తరహాలో జడ్జిమెంట్ చేయగల సామర్థ్యం అతనిలో ఉండటమే 'కందిరీగ' విజయానికి కారణమని చెప్పాలి. ఒకరోజు ముందుగా మరో కొత్త దర్శకుడు, బాగా చదువుకున్న విద్యాధికుడు అజయ్ భుయాన్ 'దడ'తో నిరాశపరిస్తే, ప్రేక్షకుల నాడినే నమ్ముకుని అన్ని కమర్షియల్ అంశాలూ సమపాళ్లలో మేళవించి సినిమా తీసి ఆకట్టుకున్నాడు శ్రీన్‌వాస్. శీను పాత్రలో రాం మరోసారి మంచి ఎనర్జీతో ఆకట్టుకున్నాడు. యాక్షన్ సీన్లలో అదరగొట్టిన అతను, మాసీ డైలాగ్స్‌ని బాగా చెప్పి మెప్పించాడు. హన్సిక కాస్త ఒళ్లు చేసినా అందంతో ఆకట్టుకుంది. తెలంగాణ యాసతో అక్ష రోల్ అందర్నీ ఆశ్చర్యపరచింది. ఆమె కూడా ఆ పాత్రకి న్యాయం చేకూర్చింది. ఈ సినిమా విజయంతో నిర్మాత బెల్లంకొండ మోస్ట్ సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్‌గా టాప్ పొజిషన్‌లో నిల్చున్నాడు. ఆయనకి ఇది వరుసగా రెండో విజయం. నిన్నటికి నిన్న లారెన్స్ 'కాంచన' బంపర్ హిట్ కొట్టి ఆయనకి బాగా డబ్బులు సంపాదించిపెట్టింది. అదివరకు పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో తీసిన 'గోలీమార్' సైతం ఆయనకి డబ్బులు మిగిల్చింది. ఇలా వరుస విజయాలతో అతను దూసుకెళ్తుంటే రాంకి వ్యక్తిగతంగా 'కందిరీగ' విజయం ఎంతో మేలు చేసింది. యువ హీరోల్లో అతనిప్పుడు తనదైన మార్కెట్‌ని పొందినట్లే. దీంతో అతని తదుపరి సినిమా 'ఎందుకంటే ప్రేమంట'కి క్రేజ్ వచ్చినట్లయింది. ఇందులో అతని సరసన మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తుండటం దానికి మరింత ఆకర్షణని తెస్తోంది.
Saturday, August 13, 2011
న్యూస్: చిరంజీవికి 'ఠాగూర్', మరి రాంచరణ్‌కి?
'బద్రినాథ్' తర్వాత రాంచరణ్‌ని డైరెక్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడు వి.వి. వినాయక్. సూపర్ హిట్ సినిమా 'కృష్ణ' తర్వాత అతను డైరెక్ట్ చేసిన 'అదుర్స్', 'బద్రినాథ్' సినిమాలు రెండూ ఆశించిన ఫలితాన్ని ఇవ్వక పోవడంతో రాంచరణ్‌తో చేసే సినిమాతో ఎలాగైనా పెద్ద హిట్టు కొట్టాలని అతను తపిస్తున్నాడు. ఈ కాంబినేషన్‌తో సినిమా వుంటుందని రెండు నెల్ల క్రితమే నిర్మాత డి.వి.వి దానయ్య ప్రకటించారు. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన పక్కా స్క్రిప్టు సిద్ధమైంది. వినాయక్ తీసిన 'లక్ష్మీ', 'కృష్ణ'తో పాటు బోయపాటి శ్రీను రూపొందించిన 'తులసి'కీ రచయితగా పనిచేసిన ఆకుల శివ ఈ సినిమాకి మంచి కథతో పాటు డైలాగ్ వెర్షన్‌నీ సిద్ధం చేశాడు. రాంచరణ్ ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న 'రచ్చ'లో నటిస్తున్నాడు. తమన్నా హీరోయిన్‌గా చేస్తున్న ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్‌లో పూర్తి కానున్నది. ఈలోగా ఈ ఆగస్టులోనే రాంచరణ్, వినాయక్ కాంబినేషన్ సినిమా లాంఛనంగా ప్రారంభం కానున్నది. రెగ్యులర్ షూటింగ్ మాత్రం 'రచ్చ' షూటింగ్ పూర్తయ్యాకే జరుగుతుంది. 'ఆరెంజ్' వంటి డిజాస్టర్ తర్వాత ప్రస్తుతం ప్రయోగాలకి కామాపెట్టి, మాస్ ఎంటర్‌టైనర్స్‌తో అభిమానుల్ని అలరింపజేయాలని చరణ్ నిర్ణయించుకున్నట్లు సన్నిహిత వర్గాల మాట. చిరంజీవికి 'ఠాగూర్' వంటి హిట్టిచ్చిన వినాయక్, ఇప్పుడు చరణ్‌కి అంతకంటే పెద్ద హిట్టునిస్తాడని అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. చూద్దాం.. వినాయక్ ఏం చేస్తాడో...
Friday, July 8, 2011
న్యూస్: ఆ రెండింటితో ఎన్టీఆర్ టాప్ హీరో అయ్యేనా?
కొడాలి నాని తెలంగాణ వ్యతిరేక వ్యాఖ్యల కారణంగా 'అదుర్స్' సినిమా నైజాంలో నష్టపోవడం, దిల్ రాజు చెప్పిన రేంజిలో 'బృందావనం' హిట్టు కాకపోవడం, ఇక ఈ యేడాది విడుదలైన 'శక్తి' డిజాస్టర్ కావడంతో చిన్న ఎన్‌టీఆర్ మాంచి కసి మీదున్నాడు. ఎలాగైనా ఈసారి భారీ హిట్ కొట్టాలని తపిస్తున్నాడు. ప్రస్తుతం అతను రెండు సినిమాలు చేస్తున్నాడు. వాటిలో ఒకటి సురేందర్‌రెడ్డి డైరెక్షన్‌లో చేస్తున్న 'ఊసరవెళ్లి' కాగా, మరోటి బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో చేస్తున్న పేరుపెట్టని చిత్రం. 'ఊసరవెళ్లి' షూటింగ్ యమ స్పీడుగా జరుగుతోంది. ఎలాగైనా దసరా సెలవులకి, అంటే సెప్టేంబర్ చివరకి 'ఊసరవెల్లి'ని ప్రేక్షకుల మధ్యకి తీసుకు రావాలని నిర్మాతలు కృషి చేస్తున్నారు. ఇందులో ఎన్‌టీఆర్ జోడీగా నేటి క్రేజీ హీరోయిన్ తమన్నా నటిస్తోంది. 'కిక్' వంటి హిట్ తర్వాత సురేందర్‌రెడ్డి తీస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక ఇంతకంటే ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువ ఉన్న సినిమా క్రియేటివ్ కమర్షియల్స్ నిర్మిస్తున్న సినిమా. కారణం వరుసగా మూడు హిట్ సినిమాల్ని (భద్ర, తులసి, సింహా) డైరెక్ట్ చేసిన బోయపాటి శ్రీను దీనికి దర్శకుడు కావడం. పైగా ఇందులో హీరోయిన్ శృతీహాసన్. ఈ రెండు క్రేజీ ప్రాజెక్టులతో తను టాప్ లీగ్‌లోకి మళ్లీ వస్తాననే నమ్మకం ఎన్‌టీఆర్‌లో నిండుగా కనిపిస్తోంది.
Thursday, September 2, 2010
Movies: Can 'Parama Veera Chakra' repeat the magic?

బోయపాటి శ్రీను డైరెక్షనులో వచ్చిన 'సింహా' సూపర్ హిట్టవడంతో ఆ సినిమా హీరో బాలకృష్ణకు దాదాపు గత వైభవం వచ్చినంత పనయ్యింది. 'నరసింహనాయుడు' తర్వాత మరో పెద్ద హిట్ లేదని బాధపడుతున్న ఆయన అభిమానులకు ఎంతో కొంత ఊరట కలిగించింది 'సింహా'. ఏమైతేనేం ఆ సినిమా విడుదల తర్వాత ఆయనతో సినిమాలు చెయ్యాలని డైరెక్టర్లు ఉబలాట పడుతున్నారు. ఫార్ములా కథలతో సినిమాలు చెయ్యాలనుకునే డైరెక్టర్లు ఆయనను దృష్టిలో పెట్టుకుని కథలు వండటానికి తమ రచయితల్ని పురమాయిస్తున్నారు. దర్శకరత్న అని అభిమానులు పిలుచుకునే దిగ్దర్శకుడు దాసరి నారాయణరావు సైతం తన 150వ సినిమాకి హీరో బాలకృష్ణ అయితేనే గౌరవమని భావించారంటే 'సింహా' పవర్ అర్థమవుతుంది. ఆ ఇద్దరి తొలి కాంబినేషనులో రూపుదిద్దుకుంటున్న 'పరమవీరచక్ర' ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందోననే అంచనాలు వేసుకోవడంలో మునిగిపోయారు బాలయ్య అభిమానులు. ఇదివరలో ఎన్టీ రామారావు, దాసరి కాంబినేషనులో వచ్చిన 'మనుషులంతా ఒక్కటే', 'సర్దార్ పాపారాయుడు', 'బొబ్బిలిపులి' సినిమాలు ఒకదాన్ని మించి మరొకటి ఘనవిజయం సాధించాయి. అదే మ్యాజిక్ ఇప్పుడు బాలకృష్ణ, దాసరి కలయిక సాధిస్తుందనేది వాళ్ల నమ్మకం. అందుకు తగ్గట్లే దాసరి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని 'పరమవీరచక్ర'ని తీర్చిదిద్దుతున్నారు. ఆయన మునుపటి సినిమా 'యంగ్ ఇండియా' ఫ్లాపవడంతో ఆ కసి కూడా ఆయనలో కనిపిస్తోంది. ఆయన ఓ సూపర్ హిట్ సినిమా తీసి ఎన్నో ఏళ్లయిపోయింది. ఈ నేపథ్యంలో 'పరమవీరచక్ర'ని ఆయన ఎలా తీస్తున్నారనే క్యూరియాసిటీ చాలామందిలో ఏర్పడింది. ఇది దేశభక్తి సినిమా కాలం కాకపోయినా ఆయన బాలకృష్ణతో అలాంటి సినిమా తీసి మెప్పించగలరా? వెయిట్ అండ్ సీ..
Subscribe to:
Posts (Atom)






