Showing posts with label bezawada. Show all posts
Showing posts with label bezawada. Show all posts
Thursday, September 17, 2015
Saturday, October 29, 2011
కీలక దశలో నాగచైతన్య కెరీర్
అక్కినేని నాగచైతన్య కెరీర్ కీలక దశలో ప్రవేశించింది. ఇప్పటివరకు నాలుగు సినిమాలు చేసిన అతను రెండు ఫ్లాపులు, రెండు హిట్లతో బేలన్స్‌గా ఉన్నాడు. తొలి సినిమా 'జోష్', నాలుగో సినిమా 'దడ' ఫ్లాపవగా; రెండు, మూడు సినిమాలైన 'ఏమాయ చేసావె', '100% లవ్' సినిమాలు హిట్టయ్యాయి. అయితే మాస్ హీరోగా ఎస్టాబ్లిష్ అవుదామని అతడు చేసిన 'దడ' సినిమా డిజాస్టర్ కావడం అతడికి కొంత నిరుత్సాహాన్ని కలిగించింది. టాప్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గ్లామర్ కానీ, కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి విదేశాల్లో రిచ్‌గా చిత్రీకరించిన ఫైట్లు గానీ, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ గానీ సినిమాని రక్షించలేకపోయాయి. అంతకు మించి నాగచైతన్య కేరక్టర్ ప్రేక్షకుల్ని మెప్పించలేక పోయింది. ఫలితంగా కామాక్షి మూవీస్ అధినేత డి. శివప్రసాద్‌రెడ్డి ఖాతాలో మరో ఫ్లాప్ జతకూడింది. ఈ నేపథ్యంలో నాగచైతన్య రెండు ఆసక్తికర సినిమాలు చేస్తున్నాడు. వాటిలో ఒకటి రాంగోపాల్‌వర్మ నిర్మిస్తున్న 'బెజవాడ' కాగా మరొకటి దేవా కట్టా డైరెక్ట్ చేస్తున్న 'ఆటోనగర్ సూర్య'. వీటిలో 'బెజవాడ' సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని నవంబర్ ఫస్ట్ వీక్‌లో రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ సినిమా మొదలు పెట్టినప్పట్నించే వార్తల్లో ఉండటం వల్ల అందరి దృష్టీ దీనిపైన ఉంది. ఇక 'ఆటోనగర్ సూర్య' ఇప్పుడే మొదలైంది. ఇందులో చైతన్య, సమంత జంటగా రెండోసారి నటిస్తున్నారు. దేవా కట్టా ప్రతిభావంతుడైన దర్శకునిగా ఇప్పటికే రుజువు చేసుకున్నందున ఈ సినిమా మీద కూడా అంచనాలు బాగానే ఉన్నాయి. ఈ సినిమాల్లో ఒక్కటైనా హిట్టయితేనే స్టార్ హీరోగా నాగచైతన్య రూపుదాల్చే అవకాశాలుంటాయి.
Monday, September 26, 2011
న్యూస్: 'బెజవాడ'తో టాలీవుడ్‌పై అమల కన్ను
ప్రభు సాల్మన్ డైరెక్ట్ చేసిన తమిళ సినిమా 'మైనా' (తెలుగులో ఇది 'ప్రేమఖైదీ'గా వచ్చింది)తో పరిచయమై, టైటిల్ పాత్రలో తన నటనతో ఆకట్టుకున్న కేరళ కుట్టి అమలా పాల్ టాలీవుడ్‌లో తొలి సినిమాతోటే అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఆ సినిమా 'బెజవాడ'. రాంగోపాల్‌వర్మ నిర్మాణంలో తయారవుతున్న ఈ సినిమాలో నాగచైతన్య జోడీగా నటిస్తోంది అమల. నాగచైతన్య సవతితల్లి పేరు అమల కావడం ఇక్కడ యాదృచ్ఛికం. కాగా 'బెజవాడ' సినిమా ఒకప్పుడు బెజవాడని తమ ఆధిపత్య పోరాటంలో భాగంగా చేసిన వంగవీటి, దేవినేని కుటుంబాల కథగా ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో వంగవీటి రంగా, రత్నకుమారి ప్రేమ కోణం కూడా ఉంది. అంటే ఇప్పుడు నాగచైతన్య, అమల చేస్తున్న పాత్రలు రంగా, రత్నకుమారి పాత్రల్ని పోలి ఉంటాయని చెప్పుకుంటున్నారు. వారి మధ్య రెండు డ్యూయెట్లని కూడా తీస్తున్నారు. అది కూడా స్విట్జర్లాండ్, ఇటలీ, ఒమన్ వంటి విదేశీ లొకేషన్లలో. సెప్టెంబర్ 15 నుంచి తీస్తున్న ఈ పాటల్ని 25కి పూర్తిచేస్తారు. వివేక్‌కృష్ణ డైరెక్టర్‌గా పరిచయమవుతున్న ఈ సినిమాని దీపావళికి రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా హిట్టయితే అమల తమిళంతో పాటు తెలుగులోనూ బిజీ హీరోయిన్ అయ్యే అవకాశాలున్నాయి.
Saturday, September 3, 2011
న్యూస్: 'బెజవాడ' గొడవ రాముకే తెలుసు!
మొత్తానికి 'బెజవాడ రౌడీలు' టైటిల్ పేరు కుదించుకుపోయి 'బెజవాడ'గా మారిపోయింది. 'బెజవాడ రౌడీలు' అనే టైటిల్ ప్రకటన వచ్చినప్పట్నించీ విజయవాడకు చెందిన వివిధ పార్టీల రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తలు ఆ టైటిల్ పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. అయితే ఆ సినిమా నిర్మాత రాంగోపాల్‌వర్మ మాత్రం ఆరునూరైనా టైటిల్ మార్చేదిలేదని ఇప్పటిదాకా భీష్మించారు. నాగచైతన్య, అమలా పాల్ ('ప్రేమఖైదీ' ఫేం) జంటగా నటిస్తున్న ఈ సినిమా ద్వారా వివేక్‌కృష్ణ డైరెక్టర్‌గా పరిచయమవుతున్నాడు. ఈ సినిమాలో "ఈ బెజవాడ నాదిరా" అనే డైలాగ్ అదిరిపోతుందని రాము చెబుతున్నాడు. వివేక్‌కృష్ణ "రాముగారు 'బెజవాడ' సినిమాని ఎంతో ఇష్టపడి తీస్తున్నారు. దుర్గమ్మ-కృష్ణమ్మ ఉన్న బెజవాడ ప్రశాంతంగా ఉన్నప్పుడు ఎంత అందంగా కనిపిస్తుందో, కోపంగా ఉన్నప్పుడు అంత రౌద్రంగా ఉంటూ ప్రళయం సృష్టిస్తుంది. అది బెజవాడలో ఉన్న ఎమోషన్. బెజవాడని ఓ కేరక్టర్‌గా తీసుకుని చేస్తున్న సినిమా ఇది. నాగచైతన్య హీరోయిజాన్ని పూర్తిగా చూపించే సినిమా 'బెజవాడ'. నాలా ఫస్ట్ టైం డైరెక్టర్‌కి నాగచైతన్య బెస్ట్ చాయిస్" అని చెప్పాడు. అక్టోబర్ చివరి వారంలో అంటే దీపావళికి ఈ సినిమాని రిలీజ్ చెయ్యాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
అయితే ఇప్పుడు హఠాత్తుగా టైటిల్‌ని 'బెజవాడ'గా ఎందుకు మార్చినట్లు? "అనేకానేక కారణల వల్ల 'బెజవాడ రౌడీలు' పేరును 'బెజవాడ'గా మార్చడం జరిగింది. ఆ కారణాలు ఏమిటని ఎవరెవరు ఏమేమి ఊహాగానాలు చేసుకున్నా అసలు కారణం నా ఒక్కడికే తెలుసు. కానీ ఆ కారణం ఏమిటన్నది నేను ఎప్పటికీ చెప్పను" అని చెప్పుకొచ్చారు రాము. ఆ కారణం ఆయన ఎప్పటికీ చెప్పకపోయినా జనానికి తెలుసు. "అసలు కారణం నా ఒక్కడికే తెలుసు" అని ఆయన ఎంత చెప్పినా సినిమా పేరు మార్చకపోతే దాన్ని విడుదల కానివ్వమని విజయవాడ జనం ప్రతిన పట్టడంతోనే ఆయన దిగివచ్చి టైటిల్ మార్చారని అంతా నమ్ముతున్నారు. దీనికోసం వాళ్లేమీ ఊహాగానాలు చేయాల్సిన పనిలేదు. కానీ ఆ సంగతి ఒప్పుకుంటే రాంగోపాల్‌వర్మ ఎందుకవుతాడు? అందుకనే టైటిల్ మార్చడానికి గల కారణం తనకొక్కడికే తెలుసని సర్దిచెప్పుకుంటున్నాడు. అంతే!
అయితే ఇప్పుడు హఠాత్తుగా టైటిల్‌ని 'బెజవాడ'గా ఎందుకు మార్చినట్లు? "అనేకానేక కారణల వల్ల 'బెజవాడ రౌడీలు' పేరును 'బెజవాడ'గా మార్చడం జరిగింది. ఆ కారణాలు ఏమిటని ఎవరెవరు ఏమేమి ఊహాగానాలు చేసుకున్నా అసలు కారణం నా ఒక్కడికే తెలుసు. కానీ ఆ కారణం ఏమిటన్నది నేను ఎప్పటికీ చెప్పను" అని చెప్పుకొచ్చారు రాము. ఆ కారణం ఆయన ఎప్పటికీ చెప్పకపోయినా జనానికి తెలుసు. "అసలు కారణం నా ఒక్కడికే తెలుసు" అని ఆయన ఎంత చెప్పినా సినిమా పేరు మార్చకపోతే దాన్ని విడుదల కానివ్వమని విజయవాడ జనం ప్రతిన పట్టడంతోనే ఆయన దిగివచ్చి టైటిల్ మార్చారని అంతా నమ్ముతున్నారు. దీనికోసం వాళ్లేమీ ఊహాగానాలు చేయాల్సిన పనిలేదు. కానీ ఆ సంగతి ఒప్పుకుంటే రాంగోపాల్‌వర్మ ఎందుకవుతాడు? అందుకనే టైటిల్ మార్చడానికి గల కారణం తనకొక్కడికే తెలుసని సర్దిచెప్పుకుంటున్నాడు. అంతే!
Subscribe to:
Posts (Atom)



