Showing posts with label charmi. Show all posts
Showing posts with label charmi. Show all posts
Saturday, June 13, 2015
Saturday, October 18, 2014
Wednesday, July 10, 2013
Monday, August 15, 2011
న్యూస్: పరుచూరి మురళికి 'మహదేవనాయుడు'తో కలిసి వస్తుందా?
ఇదివరకు నితిన్, ఇలియానా జంటగా రూపొందించిన 'రెచ్చిపో' సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావడంతో డైరెక్టర్ పరుచూరి మురళి ఆశలన్నీ 'మహదేవనాయుడు' సినిమాపైనే ఉన్నాయి. ఇందులో బాలకృష్ణ హీరో కావడంతో చాలా జాగ్రత్తగా సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నట్లు యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. 'సింహా' వంటి ఇటు అవార్డులూ, రివార్డులూ పొందిన సినిమా తర్వాత బాలయ్య చేసిన 'పరమవీరచక్ర' అట్టర్‌ఫ్లాపైన సంగతి తెలిసిందే. అందుకే 'మహదేవనాయుడు' సినిమా హిట్టవ్వాల్సిన అవసరం హీరో, దర్శకుల ఇద్దరికీ ఉంది. కీర్తి క్రియేషన్స్ బేనర్‌పై ఎం.ఎల్. కుమార్‌చౌదరి నిర్మిస్తున్న ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇదివరకు ఇదే బేనర్‌లో జగపతిబాబుతో 'పెదబాబు', గోపీచంద్‌తో 'ఆంధ్రుడు' సినిమాలు చేశాడు మురళి. ఆ రెండూ బాగానే ఆడాయి. కలిసి వచ్చిన బేనర్‌లో మురళి ఇప్పుడు ఎలాగైనా హిట్టు కొట్టాలనే తపనతో ఆచితూచి పనిచేస్తున్నాడు. అందుకే మొదట దసరాకి రిలీజవుతుందనుకున్న ఈ సినిమా తాజాగా సంక్రాంతికి పోస్ట్‌పోన్ అయినట్లు సమాచారం. ఇందులో బాలయ్య త్రిపాత్రాభినయం చేస్తుండగా, ఆయనతో ముగ్గురు తారలు జతకడుతున్నారు. వారిలో లక్ష్మీరాయ్, సలోని ఆయనతో తొలిసారి నటిస్తున్నారు. మరో హీరోయిన్ ఛార్మికి బాలయ్యతో ఇది రెండో సినిమా. ఇదివరకు ఆమె 'అల్లరి పిడుగు' సినిమాలో నటించింది. ఈ సినిమాతో బాలకృష్ణ-మురళి కాంబినేషన్ ఎలా వర్కవుట్ అవుతుందో చూడాలి.
Friday, July 22, 2011
న్యూస్: ఛార్మి 'మంత్రం' పారడం లేదు!
లేడీ ఓరియంటెడ్ మూవీ 'మంత్ర' తర్వాత ఛార్మి హీరోయిన్‌గా నటించిన ఏ తెలుగు సినిమాని ప్రేక్షకులు ఆదరించారు? ప్చ్.. ఏమీ లాభం లేదు. 'మంత్ర' (2007) తర్వాత ఛార్మి వైభవం మసకబారుతూ వచ్చింది. ఈ మధ్యలో ఆమె బాపు దర్శకత్వంలో 'సుందరకాండ', వి. ఈశ్వరరెడ్ది దర్శకత్వంలో 'మనోరమ', కొత్తవాడైన రమణ దర్శకత్వంలో 'సై ఆట', 'మంత్ర' ఫేం తులసీరాం దర్శకత్వంలో 'మంగళ', ప్రేంరాజ్ డైరెక్ట్ చేసిన 'నగరం నిద్రపోతున్న వేళ' వంటి లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసింది. కానీ వీటిలో ఏ ఒక్కటీ ఆమెకి కమర్షియల్ సక్సెస్‌ని అందించలేదు. కొద్ది రోజుల తేడాతో ఇటీవల వచ్చిన 'నగరం నిద్రపోతున్న వేళ', 'మాయగాడు' సినిమాలు రెండూ ప్రేక్షకుల నుంచి కనీసపు స్పందన కరువవడంతో డిజాస్టర్ అయ్యాయి. గుడ్డిలో మెల్ల ఏమంటే పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో అమితాబ్‌తో కలిసి నటించిన హిందీ సినిమా 'బుడ్డా.. హోగా తేరా బాప్' ఆమెకి బాలీవుడ్‌లో కాస్త గుర్తింపును తెచ్చింది. ఈ సినిమా సూపర్ హిట్టయ్యిందంటూ మీడియా మొదట్లో తెగ హడావుడి చేసినా, వారాంతం తర్వాత చూసుకుంటే కలెక్షన్లు బాగా డౌనయ్యాయి. ఏదేమైనా దానికి పెట్టిన పెట్టుబడి మాత్రం వచ్చేసింది. ప్రస్తుతం ఛార్మి శ్రీకాంత్ సరసన 'సేవకుడు' చిత్రంలో నటిస్తోంది. దీనికి వి. సముద్ర దర్శకుడు. ఈ సినిమా కూడా ఆడకపోతే ఛార్మిని పట్టించుకునేవాళ్లు కరువైపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
Monday, July 18, 2011
న్యూస్: తెలుగు సినిమాలకు థియేటర్లు కావలెను!
ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ డబ్బింగ్ సినిమాల హవా నడుస్తున్నదనే దానికి ఇంకో మంచి ఉదాహరణ ఈ శుక్రవారం (జూలై 15) విడుదలైన మూడు డబ్బింగ్ సినిమాలు. వాటిలో రెండు తమిళం నుంచి తెలుగుకు వచ్చిన 'నాన్న', 'కాంచన' కాగా, మరోటి హాలీవుడ్ నుంచి తెలుగులోకి వచ్చిన 'హారీపోట్టర్ 7' (పార్ట్ 2). వీటి మధ్య 16న రెండు తెలుగు సినిమాలు 'మాయగాడు', 'కీ' విడుదలయ్యాయి. డబ్బింగ్ సినిమాలు మూడు కలిసి హైదరాబాద్ ఏరియాలో 65 థియేటర్లకు పైగా విడుదలైతే, రెండు తెలుగు సినిమాలు కలిసి కేవలం 14 థియేటర్లలో రిలీజయ్యాయి. విక్రం, అనుష్క జంటగా నటించిన డబ్బింగ్ సినిమా 'నాన్న' సిటీ ఏరియాలో 25 థియేటర్లలో, రాఘవ లారెన్స్ సినిమా 'కాంచన' 33 థియేటర్లలో, 'హారీపోట్టర్ 7' 7 థియేటర్లలో విడుదలయ్యాయి. మన తెలుగు సినిమాల్లో వేణు, ఛార్మి సినిమా 'మాయగాడు' 10 థియేటర్లలో విడుదలైతే, జగపతిబాబు హీరోగా నటించిన 'కీ' కేవలం అత్యల్పంగా 4 థియేటర్లలోనే రిలీజవడం గమనార్హం. అంటే తెలుగు సినిమాల కంటే పర భాషల నుంచి వస్తున్న డబ్బింగ్ సినిమాలకే ఎక్కువ బిజినెస్ జరుగుతున్నదన్న మాట. ఈ నేపథ్యంలోనే స్ట్రెయిట్ తెలుగు సినిమాలకు డబ్బింగ్ సినిమాల కారణంగా థియేటర్లే దొరకని స్థితి నెలకొంది. ఇప్పటికే తమిళం నుంచి మరో రెండు డబ్బింగ్ సినిమాలు 'రంగం', 'వాడు వీడు' హైదరాబాద్ థియేటర్లలో హల్‌చల్ చేస్తున్నాయి. ఆరోవారంలో ఉన్న అల్లు అర్జున్ భారీ బడ్జెట్ సినిమా కేవలం 5 థియేటర్లలోనే సిటీలో నడుస్తుండగా, ఆర్.బి. చౌదరి కుమారుడు జీవా నటించిన 'రంగం' డబ్బింగ్ సినిమా పదో వారంలో 11 థియేటర్లలో ఆడుతుండటం విశేషం. దీన్ని బట్టి స్ట్రెయిట్ తెలుగు సినిమాలకు డబ్బింగ్ సినిమాల బెడద ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే దబ్బింగ్ సినిమాలకు 50% టాక్స్ విధించాలనే డిమాండ్ ఊపందుకుంటోంది.
Saturday, July 16, 2011
న్యూస్: 'బెజవాడ రౌడీలు' సంచలనం సృష్టిస్తారా?
రవితేజ, ఛార్మి, సునీల్ కాంబినేషన్‌లో తీసిన 'దొంగల ముఠా' తర్వాత రాంగోపాల్‌వర్మ తెలుగులో 'బెజవాడ రౌడీలు' సినిమాని తీస్తున్నాడు. అయితే ఈ సినిమాకి ఆయన కేవలం నిర్మాతే. దర్శకుడు వివేక్‌కృష్ణ. అతనికిదే తొలి సినిమా. 20 యేళ్ల క్రితం బెజవాడలో ఉండే వాతావరణం నేపథ్యంలో తీస్తున్న ఈ సినిమాలో నాగచైతన్య హీరోగా నటిస్తుండగా, అతని సరసన ప్రతీక రావు నటిస్తోంది. ఆమె ఎవరో కాదు, 'అతిథి' ఫేం అమృతారావు చెల్లెలు. వాతావరణం 20 యేళ్ల క్రితంది అయినా అప్పటి వ్యక్తుల గురించి కానీ, అప్పటి సంఘటనల గురించి కానీ లేకుండా, పక్కా యాక్షన్ కమర్షియల్ సినిమాగా దీన్ని తీస్తున్నామని వర్మతో పాటు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న కిరణ్‌కుమార్ కోనేరు చెబుతున్నారు. అయితే ఇది ఒకప్పుడు విజయవాడని తమ గుప్పెట్లో పెట్టుకునేందుకు గ్యాంగ్ వార్ నడిపిన వంగవీటి, దేవినేని కుటుంబాలే ఈ సినిమా కథకి ప్రేరణ అని ఇప్పటికే జనానికి తెలిసిపోయింది. వంగవీటి రంగాని పోలిన పాత్రని నాగచైతన్య పోషిస్తుండగా, దేవినేని రమణ అలియాస్ గాంధీ పాత్రని అభిమన్యుసింగ్ చేస్తున్నాడు. ఈ సినిమా టైటిల్ మీద వివాదం చెలరేగి రెండు నెల్ల క్రితం విజయవాడలో షూటింగ్ ఆగిపోయింది. అయితే ఇప్పుడు పోలీసుల సహకారంతో అక్కడే షూటింగ్ నిర్వహిస్తున్నారు నిర్మాతలు. దీపావళికి ఈ సినిమాని విడుదల చేయాలనేది వారి ఆలోచన. 'రక్త చరిత్ర' తరహాలో ఉసూరుమనకుండా 'బెజవాడ రౌడీలు' సంచలనం సృష్టిస్తుందని ఆ సినిమా యూనిట్ వర్గాలు గట్టి నమ్మకంతో ఉన్నాయి.
Friday, July 15, 2011
న్యూస్: ఛార్మితో పోటీపడ్డ 'మాయగాడు'
హీరో వేణులో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఒకప్పుడు సక్సెస్సుల మీదున్నప్పుడు చాలా కేర్‌లేస్‌గా కనిపిస్తూ వచ్చిన అతను ఇప్పుడు జర్నలిస్టులతో మాట్లాడేప్పుడు చాలా నమ్రతగా, వినయంగా మాట్లాడుతున్నాడు. 'మాయగాడు' విడుదలలో జాప్యం జరిగినా సినిమా తప్పకుండా ఆడుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ప్రధానంగా సినిమాలో హీరోయిన్ ఛార్మితో తన జోడీ చాలా అందంగా కనిపిస్తుందని చెబుతున్నాడు. "సినిమాలో మొత్తం ఆరు పాటలుండగా, వాటిలో నాలుగు డ్యూయెట్లు. స్వతహాగా ఛార్మి మంచి డాన్సర్. ఈ పాటల్లో ఆమెతో డాన్సుల్లో నేను పోటీపడ్డా. నా డాన్సులు చూసి అందరూ ఆశ్చర్యపోతారు. ఇప్పటివరకు నేను చేసిన సినిమాలన్నింటిలో ఇలా ఆరు పాటలూ బ్రహ్మాండంగా వచ్చినవి లేవు. ఈ పాటలతో పాటు ఎంటర్‌టైన్‌మెంట్ ఈ సినిమాకి ప్రధాన బలం" అని చెప్పాడు వేణు. ఈ సినిమాలో అతను కష్టపడకుండా మాయ మాటలతో బతికేద్దామనుకునే లీలాకృష్ణ అనే పల్లెటూరి యువకుడి పాత్రని చేశాడు. అతను సిటీకి వచ్చి, ఓ అమ్మాయి ప్రేమలో పడ్డాక ఆమె వల్ల ఎలా ప్రయోజకుడిగా మారాడన్నది కథ. పర భాషా నటులు సైతం తెలుగులో తమ పాత్రలకి తమే డబ్బింగ్ చెప్పుకుంటుంటే తెలుగు వాడయ్యుండీ అతను మాత్రం ఇంకా తెరమీద సొంత గొంతు పలికించలేదు. "తమిళనాడులోనే పెరగడం వల్ల డబ్బింగ్ చెప్పాలంటే ఏదో సంకోచం నన్నాపుతోంది. ఎవరైనా పక్కనుండి ముందుకు తోస్తే నా పాత్రకి నేనే వాయిస్‌నిస్తా. సొంత గొంతు కాకపోవడం వల్లే 'గోపి గోపిక గోదావరి' వంటి హిట్ సినిమాని కూడా ఇంతదాకా నేను చూడలేదు. ఆ లోపాన్ని సరిచేసుకోవాలి" అని చెప్పాడు వేణు. 16న విడుదలవుతున్న 'మాయగాడు' అతడి ఆశల్ని నిలబెడుతుందో, లేదో చూడాలి.
Monday, June 6, 2011
Saturday, November 20, 2010
ఫోకస్: నిలిచే తార ఎవరు? (తొలి భాగం)
కొత్త తారల్లో నిలిచే తార ఎవరు? అసలు ఎవరైనా ఉన్నారా? చాలామందిని తొలుస్తున్న ప్రశ్నలివి. ఇప్పుడు ఏ తారని చూసినా ఇలా వచ్చి అలా వెళ్లిపోయేవాళ్లే. కేవలం గ్లామర్‌ని నమ్ముకొని వస్తున్నందునే వాళ్లు ఎక్కువ కాలం వెండితెర మీద వెలగలేక పోతున్నారు. అందం ఏ కాస్త చెదిరినా వాళ్లకి మరో అవకాశమే ఉండటం లేదు. అంటే 'ఎస్టాబ్లిష్డ్ హీరోయిన్' అనే మాట ఇక తెలుగు సినిసీమలో వినిపించే అవకాశాలు కూడా తక్కువే. తెలుగు సినిమాకి సంబంధించినంత వరకు చివరి ఎస్టాబ్లిష్డ్ హీరోయిన్ ఎవరంటే ఠక్కున స్ఫురించే పేరు సౌందర్య. అవును. సౌందర్యతోటే తెలుగు సినిమా అసలు సిసలైన నాయిక కూడా మాయమైపోయింది.
అన్ని రంగాల్లో మాదిరిగానే సినిమా పరిశ్రమలోనూ మేల్ డామినేషన్ చాలా చాలా ఎక్కువ. నిర్మాతలు, సాంకేతిక నిపుణుల్లో ఆడవాళ్లని వేళ్లమీద లెక్కించవచ్చు. సినిమా అన్నాక హీరోయిన్‌తో పాటు అక్క, చెల్లి, వదిన, అమ్మ, అత్త, బామ్మ వంటి పాత్రలు వుంటాయి కాబట్టి, వాటిని మగాళ్లతో చేయించడం బాగోదు కాబట్టి, ఆ పాత్రల్లో ఆడవాళ్లని చూస్తున్నాం. ఇతర పాత్రల సంగతలా వుంచితే హీరోయిన్ పాత్రల్లో చాలా కాలం నుంచి రాణిస్తున్న నటి ఎవరు? అని భూతద్దం పెట్టి వెతికినా ఒక్కరూ అగుపించరు. దానికితోడు పేరుపొందిన హీరోలంతా ఎప్పటికప్పుడు కొత్త రుచులు కావాలన్నట్లు కొత్త తారల్నే కోరుకుంటున్నారు. ఫలితం.. రెండు మూడేళ్లలో ఆరేడు సినిమాల్లో కనిపించిన తారలంతా 'ఫేడవుట్' అయిపోతున్నారు.
ప్రస్తుత హీరోయిన్ల సంగతే చూసుకుంటే శ్రియ, త్రిష, జెనీలియా, ఛార్మి, ప్రియమణి, నయనతార, అనుష్క, కాజల్ అగర్వాల్, ఇలియానా వంటి తారల్లో ఏ ఒక్కర్నీ ఎస్టాబ్లిష్డ్ హీరోయిన్ అనలేం. ఛార్మి, అనుష్క లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో రాణించినా అది ఒకట్రెండు సినిమాలకే పరిమితమయ్యింది. 'అనుకోకుండా ఒకరోజు', 'మంత్ర' సినిమాల్లో రాణించిన ఛార్మికి ఆ తర్వాత అన్నీ పరాజయాలే ఎదురవుతూ వస్తున్నాయి. అందుకు 'సై ఆట' పెద్ద ఉదాహరణ. 'అరుంధతి'తో సూపర్ హీరోయిన్ అయ్యిందనుకున్న అనుష్క సైతం ఆ తర్వాత చెప్పుకోదగ్గ రీతిలో రాణించలేకపోతోంది. 'పంచాక్షరి' ఫ్లాపవడం దీనికి నిదర్శనం. 'ఖలేజా'లో అయితే మహేశ్‌కి ఆమె సరైన జోడీ కాలేకపోయిందనే విమర్శలే ఎక్కువ. 'బొమ్మరిల్లు' సినిమాని తన భుజాలమీద లాక్కెళ్లిన జెనీలియా అంతకుముందు, ఆ తర్వాత కూడా అలాంటి ఫీట్ ప్రదర్శించలేకపోయింది. (ఇంకావుంది)
అన్ని రంగాల్లో మాదిరిగానే సినిమా పరిశ్రమలోనూ మేల్ డామినేషన్ చాలా చాలా ఎక్కువ. నిర్మాతలు, సాంకేతిక నిపుణుల్లో ఆడవాళ్లని వేళ్లమీద లెక్కించవచ్చు. సినిమా అన్నాక హీరోయిన్‌తో పాటు అక్క, చెల్లి, వదిన, అమ్మ, అత్త, బామ్మ వంటి పాత్రలు వుంటాయి కాబట్టి, వాటిని మగాళ్లతో చేయించడం బాగోదు కాబట్టి, ఆ పాత్రల్లో ఆడవాళ్లని చూస్తున్నాం. ఇతర పాత్రల సంగతలా వుంచితే హీరోయిన్ పాత్రల్లో చాలా కాలం నుంచి రాణిస్తున్న నటి ఎవరు? అని భూతద్దం పెట్టి వెతికినా ఒక్కరూ అగుపించరు. దానికితోడు పేరుపొందిన హీరోలంతా ఎప్పటికప్పుడు కొత్త రుచులు కావాలన్నట్లు కొత్త తారల్నే కోరుకుంటున్నారు. ఫలితం.. రెండు మూడేళ్లలో ఆరేడు సినిమాల్లో కనిపించిన తారలంతా 'ఫేడవుట్' అయిపోతున్నారు.
ప్రస్తుత హీరోయిన్ల సంగతే చూసుకుంటే శ్రియ, త్రిష, జెనీలియా, ఛార్మి, ప్రియమణి, నయనతార, అనుష్క, కాజల్ అగర్వాల్, ఇలియానా వంటి తారల్లో ఏ ఒక్కర్నీ ఎస్టాబ్లిష్డ్ హీరోయిన్ అనలేం. ఛార్మి, అనుష్క లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో రాణించినా అది ఒకట్రెండు సినిమాలకే పరిమితమయ్యింది. 'అనుకోకుండా ఒకరోజు', 'మంత్ర' సినిమాల్లో రాణించిన ఛార్మికి ఆ తర్వాత అన్నీ పరాజయాలే ఎదురవుతూ వస్తున్నాయి. అందుకు 'సై ఆట' పెద్ద ఉదాహరణ. 'అరుంధతి'తో సూపర్ హీరోయిన్ అయ్యిందనుకున్న అనుష్క సైతం ఆ తర్వాత చెప్పుకోదగ్గ రీతిలో రాణించలేకపోతోంది. 'పంచాక్షరి' ఫ్లాపవడం దీనికి నిదర్శనం. 'ఖలేజా'లో అయితే మహేశ్‌కి ఆమె సరైన జోడీ కాలేకపోయిందనే విమర్శలే ఎక్కువ. 'బొమ్మరిల్లు' సినిమాని తన భుజాలమీద లాక్కెళ్లిన జెనీలియా అంతకుముందు, ఆ తర్వాత కూడా అలాంటి ఫీట్ ప్రదర్శించలేకపోయింది. (ఇంకావుంది)
Tuesday, September 14, 2010
Wednesday, September 8, 2010
Wednesday, September 1, 2010
Movies: Charmi now in 'B' grade

ఛార్మి నటించిన లేటెస్ట్ ఫ్లాప్ ఫిల్మ్ 'సై ఆట'. ఇప్పుడు ఆమెకి ఎలాంటి సినిమాల్లో నటించాలో తెలిసినట్లు లేదు. అర్థం పర్థంలేని, నేలబారు సినిమాల్లో హీరోయిన్ ఓరియంటెడ్ అన్న లేబుల్ కి ఎగిరి గంతేసి నటించేస్తోంది. ఫలితంగా 'బి' గ్రేడ్ నటి స్థాయికి దిగిపోయింది. ఇప్పుడామెకి 'ఎ' గ్రేడ్ సినిమా అవకాశాలు వచ్చే పరిస్థితి లేదు. ఏ కాస్త పేరున్న హీరో కూడా ఆమెతో నటించేందుకు ముందుకు రావడం లేదు. హీరోయిన్ లేకుండా హీరో సినిమా వుండదు. కానీ ఛార్మి తనకు స్పెషల్ ఇమేజ్ వచ్చిందన్న ధీమాతో హీరో అక్కరలేని సినిమాల్లో నటిస్తూ వచ్చింది వరుసగా. ఎంత తన వ్యూహాన్ని సరిదిద్దుకున్నా లాభించేలా లేదు. అంతా స్వయంకృతాపరాధం! రేపు వచ్చే 'మంగళ' అయినా ఆమె కెరీరుకి మంగళకరం అవుతుందో, లేదో?
Monday, August 23, 2010
Sunday, August 8, 2010
Subscribe to:
Posts (Atom)




























