Showing posts with label ramya krishna. Show all posts
Showing posts with label ramya krishna. Show all posts
Thursday, January 14, 2016
Tuesday, June 23, 2015
Sunday, December 8, 2013
Tuesday, June 12, 2012
బాలయ్య కోసం ఇరవై ఏళ్లయినా వెయిట్ చేస్తా
"బాలకృష్ణకు రెండేళ్ల క్రితం 'నరసింహస్వామి' అనే కథ చెప్పా. ఓకే అయ్యింది. ఆ సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని ఎదురుచూస్తున్నా. బాలయ్య కోసం ఇరవై ఏళ్లయినా వెయిట్ చేస్తా'' అని చెప్పారు దర్శకుడిగా మారిన నటుడు జీవీ సుధాకరనాయుడు. ఆయన రాబోయే రోజుల్లో తన ప్రణాళికల గురించి పత్రికల వారికి తెలియజేశారు. "త్వరలో బాలీవుడ్‌లో అడుగుపెట్టి అనిల్‌కపూర్, నానాపటేకర్, రేఖ కాంబినేషన్‌లో 'శత్రు' అనే సినిమాని డైరెక్ట్ చేయబోతున్నా'' అని ఆయన చెప్పారు. ఇప్పటివరకు బయటి బేనర్లలో 'హీరో', 'రంగ ది దొంగ' సినిమాల్ని డైరెక్ట్ చేసిన ఆయన ఇప్పుడు సొంతంగా జీవీ మూవీస్ అనే బేనర్‌ను నెలకొల్పారు.
"ఈ బేనర్‌పై తొలిసారిగా 'రెడ్డిగారి మనవడు' అనే సినిమాని నిర్మించబోతున్నా. 'ద ప్రిన్స్ ఆఫ్ రాయలసీమ!' అనేది ఉప శీర్షిక. దీనికి నేను నిర్మాతను మాత్రమే. ఓ సీనియర్ డైరెక్టర్ దీన్ని రూపొందిస్తారు. కథ నాదే. టైటిల్ ప్రకారం రాయలసీమకు చెందిన ఓ పవర్‌ఫుల్ రెడ్డిగారు, ఆయన మనవడి చుట్టూ నడిచే కథ. రెడ్డిగారు ఏ రోజున పుట్టారో అదే రోజు మనవడు కూడా పుడతాడు. తాత ఎంత నీచుడో మనవడు అంతకంటే నీచుడు. 'దండంపెట్టి ఓటడిగేవాడు అన్నం పెడతానంటేనే ఓటెయ్' అని జనానికి చెబుతుంటాడు హీరో. రాయలసీమ ఫ్యాక్షన్, దాని ద్వారా వచ్చే అధికారం, దాన్ని ఉపయోగించుకుని సంపాదించే డబ్బు... వీటి చుట్టూ అల్లిన కథ. ఇందులో ఫెంటాస్టిక్ లవ్ స్టోరీ కూడా ఉంది. రెడ్డిగారికి ప్రత్యర్థి అయిన చౌదరి కూతురు, హీరో ప్రేమించుకోవడం, వారి ప్రేమకూ, రాజకీయాలకూ లంకె ఉండటం ఇందులోని ఇంటరెస్టింగ్ పాయింట్. రాజకీయం వ్యాపార స్థాయికి ఎలా ఎదిగిందో ఈ కథలో చెబుతున్నా. వచ్చే ఉప ఎన్నికల ఫలితాల్ని బట్టి ఈ కథకు క్లైమాక్స్ రాస్తా. అప్పుడే హీరోకి పేరు పెడతా. రెడ్డిగారి పాత్రకు కోట శ్రీనివాసరావును అనుకుంటున్నాం. హీరో ఛాయిస్‌ను డైరెక్టర్‌కి వదిలేస్తున్నా. ఇందులో ప్రకాశ్‌రాజ్, శరత్‌కుమార్, బ్రహ్మానందం, జయసుధ, రమ్యకృష్ణ, ముమైత్‌ఖాన్ తదితరులు నటిస్తున్నారు. చక్రి సంగీతం సమకూర్చబోతున్నారు'' అని తెలిపారు జీవీ. ఈ సినిమా వివాదాల్ని రేకెత్తించే అవకాశాలున్నాయి కదా అనడిగితే "తప్పకుండా కాంట్రవర్సీ అవుతుంది. అవనీయండి. అవ్వాలనే కోరుకుంటున్నా'' అని ఆయన చెప్పారు.
Wednesday, November 9, 2011
'ఓ మై ఫ్రెండ్' మరో 'వసంతం'?
సిద్ధార్థ్, శ్రుతిహాసన్ సినిమా 'ఓ మై ఫ్రెండ్' కథ గురించి ప్రస్తుతం ఫిలింనగర్‌లో ఆసక్తికరమైన కథనాలు వెలువడుతున్నాయి. వేణు శ్రీరాంను డైరెక్టర్‌గా పరిచయం చేస్తూ దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా నవంబర్ 11న రిలీజ్‌కు సిద్ధమవుతోంది. కాగా ఈ సినిమా ఇదివరకు చిరంజీవి హీరోగా వచ్చిన 'ఇద్దరు మిత్రులు', వెంకటేశ్ హీరోగా వచ్చిన 'వసంతం' సినిమాల తరహాలో ఉంటుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. 'ఇద్దరు మిత్రులు'లో చిరంజీవి, సాక్షి శివానంద్ మిత్రులుగా నటిస్తే, చిరంజీవి సరసన నాయికగా రమ్యకృష్ణ నటించింది. సాక్షికి జోడీగా సురేశ్ కనిపించాడు. అలాగే 'వసంతం' చిత్రంలో వెంకటేశ్, కల్యాణి స్నేహితులుగా నటిస్తే, వెంకటేశ్ సరసన ఆర్తీ అగర్వాల్ హీరోయిన్‌గా నటించింది. కల్యాణికి జోడీగా ఆకాశ్ కనిపించాడు. ఇప్పుడు 'ఓ మై ఫ్రెండ్' సినిమాలో సిద్ధార్థ్, శ్రుతి జంటగా గాక, స్నేహితులుగా నటించారని గట్టిగా వినిపిస్తోంది. అంటే సిద్ధార్థ్‌కి జోడీగా హన్సిక, శ్రుతికి జోడీగా నవదీప్ కనిపించనున్నారనేది ప్రచార సారాంశం. ఇదే నిజమైతే ఇప్పటికే 'ఇద్దరు మిత్రులు', 'వసంతం' సినిమాల్ని చూసిన జనం 'ఓ మై ఫ్రెండ్'ని బాగా రిసీవ్ చేసుకుంటారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పైగా 'ఇద్దరు మిత్రులు' సినిమా ఆశించిన రీతిలో ఆడలేదు కూడా. ఏదేమైనా కొద్ది రోజుల్లోనే 'ఓ మై ఫ్రెండ్' కథ గురించి జరుగుతున్న ప్రచారం నిజమో, కాదో తేలిపోనున్నది.
Wednesday, November 10, 2010
ఇంటర్వ్యూ: అనుష్క
నాగార్జునకి జోడీగా 'రగడ'లో నటిస్తూ, వెంకటేశ్ ప్రధాన పాత్ర చేస్తోన్న 'నాగవల్లి'లో టైటిల్ రోల్ చేస్తోన్న బెంగళూరు భామ అనుష్క చెప్పిన సంగతులు..
'రగడ'లో మూడోసారి నాగ్‌తో కలిసి నటిస్తున్నందుకు హ్యాపీ. ఈ సినిమాలో నా క్యారెక్టర్‌ని డైరెక్టర్ వీరు పోట్ల బాగా మలిచాడు. నాగ్, నేనూ ప్రేక్షకుల్ని అలరిస్తామనే గట్టి నమ్మకం నాకుంది. నాది గ్లామర్‌తో పాటు నటనకు కూడా అవకాశం వున్న పాత్ర. 'నాగవల్లి'లో టైటిల్ రోల్ చేయడం ఇంకా హ్యాపీ. ఇప్పటికే నా మాతృభాష కన్నడలో పెద్ద హిట్టయిన సినిమా ఇది. 'అరుంధతి', 'వేదం' సినిమాల తర్వాత అంత పేరు తెచ్చే సినిమా.
దేవుణ్ని నమ్ముతా
నేను దేవుణ్ని నమ్ముతా. దేవత పాత్రల్లో రమ్యకృష్ణలో కనిపించే తేజస్సు నాకు చాలా ఇష్టం. ఆమె ఆ పాత్రలు చేసినప్పుడు డైనమిజం కనిపిస్తుంది. నాకు మాత్రం ఎప్పుడో ఒక రోజు దేవుణ్ని నిజంగా చూడాలని వుంది. 'పంచాక్షరి' షూటింగ్ జరుగుతున్నప్పుడు చూడ్డానికి వచ్చిన ఓ మహిళని అమ్మవారు పూనింది. ఇలాంటివన్నీ చూసినప్పుడు నమ్మకం కలుగుతుంది. ఈ చిత్రానికి డబ్బింగ్ చెప్పాలని ప్రయత్నించా. కానీ అన్నీ బాగా ఉన్న సినిమా నేను డబ్బింగ్ చెప్పడంవల్ల ఇబ్బందుల్లో పడటం నాకిష్టం లేదు. 'వేదం'లో సరోజ పాత్రకి కూడా రెండు రోజులు డబ్బింగ్ చెప్పా. కానీ రాజమండ్రి యాస నాకు రాలేదు. అందుకే మానుకున్నా. భవిష్యత్తులో మాత్రం తప్పకుండా ప్రయత్నిస్తా.
జనాలు నవ్వుతారు
సాంకేతికపరంగా ప్రజల్లో అవగాహన పెరిగింది. మనం పాత్ర గురించి మాత్రం మాట్లాడుతుంటాం. కానీ ప్రేక్షకులు గ్రాఫిక్స్ బాగాలేవనీ, కెమెరా యాంగిల్ కరెక్ట్ కాదనీ అంటున్నారు. అంత ముందంజలో వున్నారు వాళ్లు. మంచి స్క్రిప్టు లేకుండా నేను పైట్లు, యాక్షన్ చేస్తే చూసి నవ్వుతారు. మంచి కథ కుదిరితే నేను విజయశాంతిలా ఫైట్లు చేయడానికి సిద్దమే. కాకపోతే ప్రతిదానికీ శిక్షణ అవసరం. ప్రతి చిత్రంలోనూ నేను చేసే తప్పుల్ని గుర్తుంచుకుంటా. తదుపరి చిత్రంలో ఆ తప్పును సవరించుకుంటా.
ఎత్తుపల్లాలు తప్పవు
'విక్రమార్కుడు' విజయం సాధించేవరకు నన్ను ఏదో అభద్రతాభావం వెంటాడేది. కానీ ఇప్పుడు దాన్నుంచి బయటపడ్డా. నా సినీ ప్రయాణాన్ని ఇప్పుడే ప్రారంభించినట్లు భావిస్తున్నా. ఈ పరిశ్రమలో ఎత్తుపల్లాలు తప్పవు. ఆ విషయాన్ని గుర్తుంచుకొని జాగ్రత్తగా అడుగులు వేస్తున్నా. బాలీవుడ్ నుంచి ఒకరిద్దరు కథలు వినిపించారు. అవి లేడీ ఓరిఎంటెడ్ స్టోరీలు. ఓపిగ్గా విన్నా కానీ నాకు పెద్దగా నచ్చలేదు. నచ్చిన కథ దొరికే వరకు హిందీకి వెళ్లను. నాకు తెలుగులో బాగానే ఉంది.
ప్రణాళిక తెలీదు
ఫలానా విధంగా వుండాలని నేనెప్పుడూ ప్రణాళిక వేసుకోలేదు. వచ్చినదాన్ని వచ్చినట్లు స్వీకరిస్తున్నా. గత ఐదేళ్లలో ఎప్పుడూ ఖాళీగా లేను. వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్నా. ఏది జరిగినా మన మంచికే అనుకుంటా. కారణం లేకుండా ఏదీ జరగదన్నది నేను నమ్మిన సిద్ధాంతం.

Subscribe to:
Posts (Atom)