Showing posts with label swathi. Show all posts
Showing posts with label swathi. Show all posts

Thursday, October 23, 2014

Saturday, July 30, 2011

న్యూస్: ఇండస్ట్రీలో సౌందర్యలు ఎంతమంది?

టాలీవుడ్‌లో సావిత్రులు, సౌందర్యలు ఎంతమందున్నారో లెక్క తేలడం లేదు. అవును మరి. ప్రతి హీరోయిన్నీ ఎవరో ఒకరు సౌందర్యతోటో, సావిత్రితోటో, లేదంటే జయసుధతోటో పోల్చడం పరిపాటైపోయింది. ఇటీవల 'తెలుగమ్మాయి' ఆడియో ఫంక్షన్‌లో ఆ సినిమా హీరోయిన్ సలోనిని సొందర్య అంతటి నటంటూ ఆకాశానికెత్తేశాడు సీనియర్ డైరెక్టర్ కోడి రామకృష్ణ. ఆయన పోలికని అదే ఫంక్షన్‌లో పాల్గొన్న ఆయన గురువు దాసరి నారాయణరావు సున్నితంగా తోసిపుచ్చడం గమనార్హం. "రామకృష్ణా అప్పుడే ఎందుకు తొందర. సౌందర్యకి ఎవరూ పోలిక కారు" అని ఆయన సున్నితంగా శిష్యుణ్ణి మందలించారు. కోడి రామకృష్ణ ఏ సినిమా ఫంక్షన్‌లో పాల్గొన్నా ఆ సినిమాకి సంబంధించిన వాళ్లని ఊహాతీతంగా పొగడ్తల వర్షంలో ముంచెత్తడం అలవాటే. ఆయన సంగతి అలా పక్కన పెడదాం.
సొందర్య ప్రమాదవశాత్తూ మృతి చెందాక మొదట స్నేహని ఆమెతో పోల్చడంతో ఈ పోలికల గొడవ ఎక్కువవుతూ వచ్చింది. 'అన్నమయ్య', 'రాధా గోపాలం' సినిమాలు చేసిన ఆమెని సౌందర్య అంతటి నటిగా కొంతమంది ప్రశంసల్లో ముంచెత్తారు. కానీ ఆమె ఆ సినిమాల తర్వాత సరిగా రాణించలేక పోయింది. తెలుగులో ఆమె కెరీర్ ఎదగలేదు. ఆమధ్య 'కలవరమాయే మదిలో' సినిమా చేసిన స్వాతిని ఆ చిత్ర నిర్మాత మోహన్ వడ్లపట్ల "సావిత్రి తర్వాత అంతటి నటి స్వాతే" అని తీర్మానించేశారు. అంటే వాణిశ్రీ, జయసుధ, సుహాసిని, విజయశంతి, సౌందర్య కూడా స్వాతి ముందు దిగదుడుపే అని ఆయన పరోక్షంగా చెప్పాడన్న మాట. ఆ సినిమానే కాదు, ఆ తర్వాత కూడా స్వాతి చెప్పుకోదగ్గ రీతిలో తెలుగులో రాణించలేదు. భూమిక, ఛార్మి, అనుష్క వంటి వాళ్లని కూడా సౌందర్యతో మనవాళ్లు పోల్చిన సందర్భాలున్నాయి. కొద్ది రోజుల క్రితం 'అలా మొదలైంది' నాయిక నిత్యమీనన్‌ని కూడా కొంతమంది సౌందర్యతోటీ, జయసుధతోటీ పోల్చారు. నో డౌట్. ఆ సినిమాలో నిత్య నటించలేదు, బిహేవ్ చేసింది. అయినా ఆమెని సౌందర్యతో పోల్చలేం. ఇలా చాలామంది సౌందర్యలను మనవాళ్లు తమ మాటల ద్వారా సృష్టించారు. కానీ ప్రేక్షకుల హృదయాల్లో ఇప్పటికీ మరో సౌందర్య రాలేదన్నది నిఖార్సయిన నిజం. సినిమావాళ్లు ఊరికే సౌందర్యతో ఇతర తారల్ని పోల్చడం మానితే బెటర్.

Monday, August 23, 2010

Movies: Colors Swathi pairing with Sunil


సునీల్ కథానాయకుడిగా రాంగోపాల్ వర్మ డైరెక్ట్ చేస్తున్న 'కథ, స్క్రీన్-ప్లే, దర్శకత్వం: అప్పల్రాజు' సినిమా షూటింగ్ ఈ నెల 27న ప్రారంభం కానున్నది. ఆ రోజు ఉదయం అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగే ఈ ప్రోగ్రాముకి నిన్నటి తరం టాలీవుడ్, బాలీవుడ్ అగ్రతార శ్రీదేవి చీఫ్ గెస్టుగా హాజరు కానుండటం విశేషం. ఇదివరకు 'హోమం', 'సిద్ధం' సినిమాల్ని నిర్మించిన శ్రేయా ప్రొడక్షన్స్ అధినేత కోనేరు కిరణ్ కుమార్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇందులో ఇద్దరు హీరోయిన్లు. ఒక హీరోయినుగా 'కలర్స్' స్వాతి నటించనుండగా, మరో నాయిక పాత్రను ఒక ముంబై తార పోషించనున్నట్లు కిరణ్ కుమార్ తెలిపారు. సుమన్ వర్మ సహ నిర్మాతగా వ్యవహరించే ఈ సినిమాకి కథ, స్క్రీన్-ప్లేను రాంగోపాల్ వర్మ సమకూరుస్తున్నారు. చాలా కాలం విరామంతో ఆయన దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడం, తాజాగా 'మర్యాదరామన్న'గా ప్రేక్షకుల ఆదరాన్ని పొందిన సునీల్ హీరోగా నటిస్తుండటం వల్ల ఈ సినిమా ప్రారంభానికి ముందే అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది.