Showing posts with label ramcharan. Show all posts

Thursday, October 23, 2014
Tuesday, September 30, 2014
Friday, September 26, 2014
Saturday, July 19, 2014
Wednesday, June 18, 2014
Saturday, December 14, 2013
Monday, December 9, 2013
Tuesday, December 3, 2013
Thursday, July 11, 2013
Wednesday, July 10, 2013
బాలీవుడ్‌లో రీమేకులు, సీక్వెళ్లు
రానున్న రోజుల్లో బాలీవుడ్‌లో రాబోతున్న కొన్ని రీమేక్స్, సీక్వెల్స్ సినీ ప్రేమికుల్లో అమితాసక్తి రేకెత్తిస్తునాయి. వాటిపై ఓ లుక్కేస్తే...
జంజీర్: 1974లో విడుదలైన 'జంజీర్' సినిమాలో ఇన్‌స్పెక్టర్ విజయ్‌గా యాంగ్రీ యంగ్‌మేన్ పాత్ర చేసిన అమితాబ్ బచ్చన్ రాత్రికి రాత్రి స్టార్ హీరోగా అవతరించారు. విజయ్ పాత్రను కొత్తగా రూపొందించిన అపూర్వ లఖియా 'జంజీర్' 2013 సెప్టెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాతో రాంచరణ్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
దిల్ హై కి మాన్తా నహీ: హాలీవుడ్ క్లాసిక్ ఫిల్మ్ 'ఇట్ హ్యాపెండ్ వన్ నైట్' ఆధారంగా రూపొందిన 'దిల్ హై కీ మాన్తా నహీ' సినిమాలో అమీర్‌ఖాన్, పూజాభట్ జంటగా అలరించారు. ఇప్పుడు ఆ సినిమా రీమేక్‌కి పూజాభట్ డైరెక్టర్ కావడం విశేషం. ఆమె చెల్లెలు అలియాభట్, ఇమ్రాన్ హష్మి జంటగా నటించబోతున్నారు.
మాసూం: ఎరిక్ సీగల్ పుస్తకం 'మేన్, వుమన్ అండ్ చైల్డ్' ఆధారంగా నసీరుద్దీన్‌షాతో శేఖర్ కపూర్ రూపొందించిన 'మాసూం' క్లాసిక్ ఫిలింగా పేరుపొందింది. గత ఏడాది 'చిట్టగాంగ్' సినిమాతో జాతీయ అవార్డు పొందిన వేదవ్రత పైన్ ఈ సినిమాకి రీమేక్ చేయాలని ప్లాన్ చేస్టున్నారు. నవాజుద్దీన్ సిద్దిఖి ప్రధాన పాత్ర చేయనున్నాడు.
సాజన్: మాధురీ దీక్షిత్, సంజయ్‌దత్, సల్మాన్‌ఖాన్ నటించిన సూపర్‌హిట్ ముక్కోణ ప్రేమకథ చిత్రం 'సాజన్'ను నేటి తరం తారలతో సీక్వెల్ చేయనున్నట్లు ఆ సినిమా దర్శకుడు లారెన్స్ డి'సౌజా తెలిపాడు.
బోర్డర్: 1997లో వచ్చిన జె.పి. దత్తా సినిమా 'బోర్డర్' ప్రేక్షకుల, విమర్శకుల ఆదరణ పొందింది. ఇప్పుడు వివిధ యుద్ధ వీరుల జీవితాలతో 'బోర్డర్'కు మూడు సీక్వెల్స్ తీస్తానని ఆయన ప్రకటించారు.
ప్యార్ కే సైడ్ ఎఫెక్ట్స్: రాహుల్ బోస్, మల్లికా షెరావత్ వంటి ఆసక్తికర జంటతో రూపొందిన 'ప్యార్ కే సైడ్ ఎఫెక్ట్స్' చెప్పుకోదగ్గ రీతిలో విజయం సాధించింది. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా తయారవుతున్న 'షాదీ కే సైడ్ ఎఫెక్ట్స్'లో విద్యా బాలన్, ఫరాన్ అఖ్తర్ జంటగా నటిస్తున్నారు.
ఇష్కియా: కొత్త దర్శకుడు అభిషేక్ చౌబీ రూపొందించిన 'ఇష్కియా' అంత పెద్ద విజయం సాధిస్తుందని ఎవరూ వూహించలేదు. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా తయారవుతున్న 'దేద్ ఇష్కియా'లో మాధురీ దీక్షిత్, హుమా ఖురేషి, అర్షద్ వార్సి, నసీరుద్దీన్‌షా నటిస్తున్నారు.
ధూం: యష్‌రాజ్ ఫిలిమ్స్ నిర్మించగా ఒకదాన్ని మించి ఒకటి సూపర్‌హిట్టయిన్ 'ధూల్' సీరిస్‌లో మూడోదైన 'ధూల్ 3' కోసం ఈ యేడాది ప్రేక్షకులు అమితాసక్తితో ఎదురు చూస్తున్నారు. అమీర్‌ఖాన్ విలన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో కట్రీనా కైఫ్, అభిషేక్ బచ్చన్, ఉదయ్‌చోప్రా నటిస్తున్నారు.
విశ్వరూప్: కమల్‌హాసన్ రూపొందించగా 2012లో విడుదలైన 'విశ్వరూప్' ఎంతటి వివాదాన్ని సృష్టించిందో మనకు తెలుసు. ఇప్పుడు దేశాంతర ఉగ్రవాదంపై కమల్ రూపొందిస్తున్న 'విశ్వరూప్ 2' వేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది.
క్రిష్: హృతిక్ రోషన్‌ను సూపర్ హీరోగా చూపిస్తూ రాకేశ్ రోషన్ రూపొందిస్తున్న సినిమా 'క్రిష్ 3'. నవంబర్‌లో రానున్న ఈ సినిమాలో వివేక్ ఓబరాయ్, కంగనా రనౌత్ నెగటివ్ రోల్స్ చేస్తున్నారు.

Friday, May 31, 2013
Friday, May 25, 2012
షాహిద్ ప్రేయసి!
తెలుగులో రాంచరణ్ సరసన 'చిరుత'లోనూ, వరుణ్‌సందేశ్ జోడీగా 'కుర్రాడు'లోనూ కనిపించినప్పటికీ ప్రేక్షకుల్ని అలరించినలేకపోయిన నేహా శర్మ బాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. మొదట ఇమ్రాన్ హష్మి సరసన 'క్రూక్'లో కనిపించిన ఈ అందాల తార ఇప్పుడు 'తేరీ మేరీ కహాని'లో హీరో షాహిద్ కపూర్ ప్రేయసి పాత్రలో దర్శనమివ్వబోతోంది. "కునాల్ కోహ్లి డైరెక్ట్ చేస్తున్న 'తేరీ మేరీ కహాని'లో ఓ అతిథి పాత్ర చేస్తున్నా. ఆ సినిమా మూడు తరాల కథతో తయారవుతోంది. నేను షాహిద్ సరసన 2012 తరానికి చెందిన అమ్మాయిగా నటించా. కథానుసారం ఇద్దరమూ లండన్ యూనివర్శిటీలో చదువుకుంటాం. అక్కడ ఒకరిపట్ల ఒకరం ఆకర్షనలో పడతాం. అయితే ఆ తర్వాత ఎవరికి వాళ్లం వేరేవాళ్లతో ప్రేమలో పడతాం'' అని తెలిపింది నేహ. 2011 సెప్టెంబర్‌లో ఆమె పాల్గొన్న సన్నివేశాల్ని చిత్రీకరించారు. జూన్ 22న విడుదల కానున్న ఈ చిత్రంలో షాహిద్ సరసన ప్రధాన నాయికగా ప్రియాంకా చోప్రా నటించింది.
Saturday, December 10, 2011
రాంచరణ్ 'ఎవడు'
రాంచరణ్ కథానాయకుడిగా 'ఎవడు' అనే చిత్రం షూటింగ్ లాంఛనంగా ప్రారంభమైంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకుడు. సమంత ఓ హీరోయిన్ కాగా, మరో హీరోయిన్ ఎంపిక జరుగుతోంది. అల్లు అర్జున్ అతిథి పాత్ర చేయబోతున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. ప్రసాద్ ల్యాబ్స్‌లో డిసెంబర్ 9న జరిగిన కార్యక్రమంలో రాంచరణ్‌పై చిత్రీకరించిన తొలి సన్నివేశానికి చిరంజీవి క్లాప్‌నివ్వగా, సీనియర్ నిర్మాత అల్లు అరవింద్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. దీనికి మరో నిర్మాత శ్యాంప్రసాద్‌రెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ "దర్శకుడు వంశీ చెప్పిన పాయింట్ ఎగ్జయిట్ చేసింది. ఆ కథవిని చిరంజీవి గారు, రాంచరణ్ కూడా అంతే ఎగ్జయిట్ అయ్యారు. కమర్షియల్ సినిమాల్లో కొత్త యాంగిల్ ఉన్న చిత్రం. జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుతాం. తెలుగుతో పాటు తమిళంలోనూ ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం. ఇది అన్ని రకాల ఎమోషన్స్ ఉన్న యాక్షన్ ఎంటర్‌టైనర్'' అన్నారు.
సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ "చరణ్‌తో, వంశీ పైడిపల్లితో ఇది నాకు తొలి చిత్రం. స్క్రిప్టు చాలా బాగా వచ్చింది. మంచి ఆడియో ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నా'' అని చెప్పారు. దర్శకుడు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ "కథ విన్న రోజే చిరంజీవిగారు, చరణ్ ఓకే చేశారు. ఇది నాకు మూడో చిత్రం. అన్నీ దిల్ రాజు బేనర్‌లో చేసినవే. దేవిశ్రీ మంచి బాణీలిచ్చాడు. మంచి టీమ్ కుదిరింది'' అన్నారు. ఇది కమర్షియల్ యాంగిల్‌లో కచ్చితంగా కొత్త సినిమా అని కథా రచయిత వక్కంతం వంశీ చెప్పారు.
రాంచరణ్ మాట్లాడుతూ "దిల్ రాజు ఏమిటనేది ఆయన సినిమాలే మాట్లాడతాయి. ముఖ్యమైన అతిథి పాత్ర చేయడానికి బన్నీ చేయడానికి ఒప్పుకోవడం వల్లే ఈ సినిమా త్వరగా మొదలైంది. 'ప్రస్థానం' చూసి సాయికుమార్ అభిమానినైపోయా. ఆయనతో కలిసి పనిచేస్తున్నందుకు సంతోషంగా ఉంది'' అన్నారు. సాయికుమార్ మాట్లాడుతూ "ఈ సినిమా విషయంలో ఎంతో ఉత్సుకతతో ఉన్నా. 2012లో నాకు ఈ సినిమా పెద్ద బ్రేక్‌నిస్తుంది'' అని చెప్పారు.
అబ్బూరి రవి మాటలు రాస్తున్న ఈ చిత్రానికి కథా సహకారం: హరి, ఛాయాగ్రహణం: చోటా కె. నాయుడు, కళ: ఆనంద్‌సాయి, సహ నిర్మాతలు: శిరీశ్, లక్ష్మణ్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వంశీ పైడిపల్లి.

Wednesday, November 16, 2011
ఆ యువ నటుడు ఎవరు?
ఇటీవల 'శ్రీరామరాజ్యం' ఆడియో అభినందన సభలో హీరో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే. ఆయన ఆ మాటల్ని రాంచరణ్‌ని ఉద్దేశించి అన్నాడంటూ ఓ టీవీ చానల్ చేసిన హంగామా వివాదాన్ని సృష్టించింది. దాంతో తాను ఆ మాటల్ని రాంచరణ్‌ని ఉద్దేశించి అనలేదనీ, ఎవర్ని ఉద్దేశించి ఆ మాటలు అన్నానో చిరంజీవి, మోహన్‌బాబుకు తెలుసనీ వివరణ ఇచ్చుకున్నారు బాలకృష్ణ. ఇంతకీ 'శ్రీరామరాజ్యం' సభలో ఆయన ఏమన్నారు? "ఈమధ్య ఓ యువ నటుడు మన తెలుగు సినిమాల గురించీ, దర్శకుల గురించీ అవమానకరంగా మాట్లాడాడు. టాలీవుడ్ దర్శకులు తెలుగు సినిమాల్లో ప్రయోగాలు చేయరని అన్నాడు. చరిత్ర తెలియకుండా మాట్లాడవద్దనీ, బాపు వంటి గొప్ప దర్శకులు మనకు ఉన్నారని నేను అన్నాను. వారు ఎన్నో క్లాసిక్ సినిమాల్ని తీశారనీ, నేను కూడా 'ఆదిత్య 369', 'భైరవద్వీపం' వంటి ప్రయోగాత్మక చిత్రాల్లో నటించాననీ చెప్పాను. ఇంకా ఎక్కువగా మాట్లాడితే పళ్లూడగొడతానని హెచ్చరించా" అని ఆయన చెప్పారు. అంటే ఏమిటి? ఆ యువ నటుడు బాలకృష్ణ సమక్షంలోనే తెలుగు దర్శకుల్ని తూలనాడితే, బాలకృష్ణ అతణ్ణి హెచ్చరించాడని ఇట్టే అర్థమైపోతోంది. కానీ వివాదం సృష్టించిన చానల్ దీన్ని గమనించకుండా కొద్ది రోజుల క్రితం దాసరి నారాయణరావుని ఉద్దేశించి రాంచరణ్ చేసిన వ్యాఖ్యలకి ఇప్పుడు బాలకృష్ణ కౌంటర్ ఇచ్చినట్లుగా ఊహించుకొని స్టోరీ అల్లేసింది. అందుకే బాలకృష్ణ "ఏదో ఫంక్షన్‌లో షాట్స్ చూపించి నేను చరణ్‌ను ఉద్దేశించి అన్నట్లు చిత్రీకరిస్తున్నారు. నేను అన్నది చరణ్‌ని ఉద్దేశించి కాదని సవినయంగా మనవి చేస్తున్నా. నేను ఆ మాటలు ఆ వ్యక్తితో నేరుగానే అన్నాను. కానీ చరణ్‌ను నేను కలిసి నాలుగైదు నెలలు అయింది. చిరంజీవి పిల్లలకు నేనంటే ఎంతో వాత్సల్యం. అలాగే వారన్నా నాకు ఎంతో వాత్సల్యం" అని తేల్చిచెప్పారు. బాలకృష్ణ ఇచ్చిన ఈ వివరణని సైతం సదరు చానల్ మరోరకంగా వాడుకొంది. అదలా ఉంచితే బాలకృష్ణ చేత పళ్లూడగొడతాననని అనిపించుకున్న ఆ యువ నటుడు ఎవరన్న చర్చ మొదలైంది చిత్రసీమలో. కొంతమంది ఈ మధ్య కాలంలో ఇలా మాట్లాడుతున్నది హీరో నాని అనీ, అతడితోటే బాలయ్య ఆ మాటలు అని ఉంటారని ఊహిస్తున్నారు. తను ఎవర్ని ఉద్దేశించి ఆ మాటలన్నదీ చిరంజీవి, మోహన్‌బబుకు తెలుసని బాలకృష్ణ అనడాన్ని బట్టి మరికొంతమందికీ ఈ సంగతి తెలిసే ఉంటుంది. ఎవరో ఆ యువ నటుడు?
Tuesday, November 8, 2011
బిగ్ స్టోరీ: చుక్కల్లో హీరో.. చిక్కుల్లో సినిమా!
తెలుగు సినిమా బడ్జెట్ రూ. 40 కోట్లకు చేరుకోవడంతో హీరోల, డైరెక్టర్ల రెమ్యూనరేషన్ అంశం మరోసారి తెరమీదకు వచ్చింది. ఎక్కువ బడ్జెట్ సినిమాల్ని మరింత ఎక్కువ రేటుకు కొనుగోలు చేసి, ఆ సినిమాలు ఫ్లాపయ్యాక విలవిల్లాడటం బయ్యర్లకు పరిపాటి వ్యవహారం. అయితే ప్రస్తుతం వాళ్లు సైతం రియలైజయి, భారీ రేట్లకు సినిమాలు కొనేందుకు వెనుకాడుతున్నారు. దీనికి మంచి ఉదాహరణ ఇండస్ట్రీ హిట్టయిన 'దూకుడు' రూ. 5 కోట్ల డెఫిసిట్‌తో రిలీజవడమే. 30 నుంచి 40 కోట్ల రూపాయలు వెచ్చించి పెద్ద హీరోతో సినిమా తీసే నిర్మాత, ఆ స్థాయిలో బిజినెస్ కాకపోతే కొన్ని ప్రాంతాల్లో అయినా సొంతంగానే విడుదల చేసుకోక తప్పని స్థితి నెలకొని ఉంది. మహేశ్, పవన్ కల్యాణ్, ఎన్టీఆర్, రాంచరణ్, ప్రభాస్, అల్లు అర్జున్ వంటి టాప్ హీరోల సినిమాలు ఫెయిలైనా కనీసం సగటున రూ. 20 కోట్లయినా (తాజా అంచనాల ప్రకారం) వసూలు చేస్తాయి. అంటే వారి సినిమాల్ని 20 కోట్లు పెట్టి కొనే బయ్యర్లు 'నో గెయిన్ - నో లాస్' పద్ధతిన బతికిపోతారు. అదే 40 కోట్లకు కొన్నప్పుడు, ఆ సినిమా సూపర్ హిట్టయితేనే వాళ్లకు ఓ రూపాయి మిగులుతుంది. లేదంటే సగం డబ్బు నష్టపోతారు. వాళ్లు బతికి బట్ట కట్టడం కష్టం.
2011లో బాలకృష్ణ 'పరమవీరచక్ర', ఎన్టీఆర్ 'శక్తి', అల్లు అర్జున్ 'బద్రినాథ్', నాగచైతన్య 'దడ' సినిమాల బయ్యర్ల పరిస్థితే ఇందుకు నిదర్శనం. ఈ సినిమాలన్నీ బాక్సాఫీసు వద్ద డిజాస్టర్లుగా నిలవడంతో బయ్యర్ల గుండెలు పగలడమొక్కటే తక్కువ. సమస్యకు మూలం భారీ బడ్జెట్లే. సినిమా బడ్జెట్‌లో అత్యధిక భాగం హీరోకూ, ఆ తర్వాత డైరెక్టర్‌కూ పోతోంది. స్టార్ హీరోలెవరికీ ఇవాళ ఆరు కోట్ల కంటే తక్కువ పారితోషికం లేదు (ఆ డబ్బుతో మూడు చిన్న సినిమాలు తీసేయొచ్చు). స్టార్ డైరెక్టర్లు సైతం మూడు నుంచి ఐదు కోట్ల దాకా వసూలు చేస్తుండటం సమస్యను మరింత జటిలం చేస్తోంది.
నిర్మాతల్లో ఏకాభిప్రాయమేదీ?
ఓ స్టార్ హీరో, మరో స్టార్ డైరెక్టర్, ఇంకో స్టార్ హీరోయిన్ కాంబినేషన్‌లో సినిమా తీయాలనుకునే నిర్మాత 30 కోట్ల రూపాయల దాకా (కొండొకచో 40 కోట్ల దాకా) వెచ్చించాల్సి వస్తోంది. ఇంత డబ్బుపెట్టి సినిమా తీశాక, ఆ సినిమా ఆడకపోతే హీరో, డైరెక్టర్ బాగానే ఉంటున్నారు కానీ బయ్యర్లు, నిర్మాత మాత్రమే మళ్లీ కోలుకోలేని విధంగా దెబ్బతినిపోతున్నారు. అలాంటప్పుడు 'పెద్ద హీరోతో సినిమా తీయడం దేనికి? చిన్న సినిమా తీయొచ్చు కదా?' అనే సందేహం ఎవరికైనా రావచ్చు. అయితే చిన్న సినిమా పరిస్థితి మరింత అధ్వాన్నం. 'రిస్క్' వ్యవహారం. ఎందుకంటే - చిన్న సినిమాకు ఇవాళ మార్కెట్ లేదు. విలువలు వదిలేసి యువత బలహీనతల్ని సొమ్ముచేసుకునే కథలతో తీసిన సినిమాలకు మాత్రమే మనుగడ. అందువల్లే ఇవాళ రెండొందలకు మించిన సంఖ్యలో చిన్న సినిమాలు విడుదలకు నోచుకోక ల్యాబుల్లో బూజుపట్టిపోతున్నాయి. బయ్యర్ లేకపోయినా సొంతంగా సినిమాను విడుదల చేసుకోగల శక్తి ఉన్నవాళ్లు చిన్న సినిమాల్ని నిర్మిస్తున్నా, 'సేలబిలిటీ' లేకపోవడంతో అవి కలెక్షన్లు తేలేకపోతున్నాయి. అందువల్లే ఏ నిర్మాతైనా పెద్ద హీరోతో సినిమా తీయడానికే ఉత్సాహం చూపుతున్నాడు. ఫలితంగానే పారితోషికాలు కొండెక్కి కూర్చుంటున్నాయి. ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే ప్రాథమికంగా పారితోషికాలు తగ్గాలనే డిమాండ్ సినీ పరిశ్రమలో తరచూ వినిపిస్తోంది. ఇంతకుముందు వరకు పబ్లిసిటీ వ్యయాన్ని అదుపు చేయడం వరకే నిర్మాతలు ఐక్యంగా వ్యవహరిస్తూ వచ్చారు. ఇటీవల యాక్టర్లకు ఇస్తున్న సౌకర్యాల్లో కోత విధించారు. అయితే ఇప్పుడు వాటిని కొంతమంది నిర్మాతలు ఉల్లంఘిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు హీరోలు, టెక్నీషియన్లు తమ రెమ్యూనరేషన్‌లో కనీసం 20 శాతమైనా తగ్గించుకుంటే బాగుంటుందని నిర్మాతలు కోరుతున్నారు. అయితే అసలైన మెలిక ఇక్కడే ఉంది. హీరోల, దర్శకుల పారితోషికాలు స్థిరంగా ఉండవు. ఓ సినిమా హిట్టయ్యిందంటే ఆ వెంటనే వాళ్ల రెమ్యూనరేషన్ పెరగటం సర్వసాధారణం. ఈ పారితోషికం పెంచే ట్రెండే సినీ పరిశ్రమను నాశనం చేస్తున్నదని దాసరి నారాయణరావు తరచూ చెబుతుంటారు.
కావాలని హీరోలు, డైరెక్టర్లు తమ రేటుని పెంచకపోయినా, వాళ్లతో సినిమా తీయాలని ఉబలాటపడే నిర్మాతలే వాళా రేటు పెంచేస్తున్నారు. ఎవరు ఎక్కువ పారితోషికం ఇస్తారో ఆ నిర్మాతకే హీరో, డైరెక్టర్ కమిట్ కావడాన్ని తప్పు పట్టలేం. ఎవరైనా పేరు, డబ్బు కోసమే యత్నిస్తారు. అంటే వేళ్లు తిరిగి నిర్మాతల వైపుకే మళ్లుతున్నాయి. నిర్మాతలు గట్టిగా ఓ కట్టుబాటుతో ఉండి, రెమ్యూనరేషన్లని విపరీతంగా పెంచకుండా ఉంటే సమస్య ఉప్పుడున్న స్థాయికి చేరుకునేది కాదు.

Wednesday, November 2, 2011
'బద్రినాథ్' బాధ నుంచి తేరుకున్న దర్శకుడు
అల్లు అర్జున్ కెరీర్‌లోనే నెంబర్‌వన్ సినిమా అవుతుందని ఎంతగానో ఆశించిన 'బద్రినాథ్' బాక్సాఫీస్ వద్ద ఫెయిలవడంతో మానసికంగా కలతచెందిన ఏస్ డైరెక్టర్ వి.వి. వినాయక్ ఇప్పుడు ఆ బాధనుంచి కోలుకుని తదుపరి సినిమా కోసం కసరత్తులు చేస్తున్నాడు. ఈసారి ఎలాగైనా బాక్సాఫీసులు బద్దలుకొట్టే సినిమా తీయాలనే పట్టుదలతో ఉన్నాడు. అతను చెప్పిన కథకి ఇప్పటికే రాంచరణ్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశాడు. 'మగధీర'లో ప్రేమికులుగా ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్న రాంచరణ్, కాజల్ అగర్వాల్ మరోసారి ఈ సినిమాలో జంటగా నటించనున్నారనే వార్తలు రావడంతో అందరి దృష్టీ ఈ ప్రాజెక్టు పైకి మళ్లింది. కొంత కాలంగా వినాయక్ వద్దే పనిచేస్తున్న ఆకుల శివ ఈ సినిమాకి కథని అందిస్తుండగా, కోన వెంకట్ సంభాషణలు రాస్తున్నాడు. 'బద్రినాథ్' చేదు అనుభవాన్ని ఈ సినిమాతో చెరిపివేయాలనే పట్టుదలతో ఉన్న వినాయక్ దీని యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దాలని భావిస్తున్నాడు. 'మగధీర'లో ఎమోషనల్, లవ్ సీన్లలో రాంచరణ్ కనపర్చిన ప్రతిభావంతమైన అభినయాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ స్క్రిప్టులో ఇటు లవ్‌నీ, అటు ఎమోషన్స్‌నీ సమపాళ్లలో మేళవిస్తున్నట్లు సమాచారం.
Monday, October 10, 2011
స్పెషల్ స్టోరీ: రాజమౌళి విజయ దరహాసం!
దర్శకత్వం వహించిన ఎనిమిది సినిమాల్లో ఏడు విజయాలు సాధించిన దర్శకుడిగా యస్.యస్. రాజమౌళి తెలుగు చలనచిత్ర చరిత్రలో తనకంటూ ఓ శాశ్వత పేజీని సంపాదించుకున్నారు. ఇదివరలో దాసరి నారాయణరావు తొలి సినిమా 'తాత మనవడు' నుంచి పదకొండో సినిమా 'మనుషులంతా ఒక్కటే' వరకు వరుసగా పదకొండు విజయవంతమైన చిత్రాలకు (ఈ మధ్యలో వచ్చిన 'రాధమ్మ పెళ్లి' బాక్సాఫీసు ఫలితం విషయంలో భిన్నాభిప్రాయాలున్నా) దర్శకత్వం వహించడం ఒక చరిత్ర అయితే, ఉండకూడనన్ని ప్రతికూల పరిస్థితులున్న నేటి కాలంలో ఎనిమిదింటిలో ఒకటి మినహా ఏడు హిట్లను అందించిన రాజమౌళిది ఇంకో చరిత్ర.
'స్టూడెంట్ నెం.1' (2002) నుంచి మొదలైన ఆయన విజయ విహారం మూడో సినిమా 'సై' మినహా 'మర్యాదరామన్న' (2010) దాకా అప్రతిహతంగా కొనసాగుతూ వచ్చింది. 'సై' సైతం ప్రేక్షకుల్ని అలరించినా, పెట్టుబడి ఎక్కువ కావడంతో లాభాలు సాధించలేకపోయింది. ప్రస్తుతం 'ఈగ' పేరుతో ఆయన తన తొమ్మిదో చిత్రాన్ని తెరకెక్కించే పనిలో నిమగ్నమయ్యారు. ఎన్టీఆర్‌ని 'స్టూడెంట్ నెం.1'తో మాస్‌కి చేరువ చేసిన ఆయన 'సింహాద్రి'తో టాప్ స్టార్‌ని చేశారు. ఆ సినిమా ప్రభావం ప్రేక్షకుల మీద ఎంతగా పడిందంటే, తర్వాత వచ్చిన ఎన్టీఆర్ సినిమాల్ని వారు 'సింహాద్రి'తో పోల్చుకుంటూ అసంతృప్తి చెందుతూ వచ్చారు. అలాంటి నేపథ్యంలో మరోసారి 'యమదొంగ'తో ఎన్టీఆర్‌కి విజయానందాన్ని చేకూర్చారు రాజమౌళి. అలా రాజమౌళి-ఎన్టీఆర్ కాంబినేషన్‌కు తిరుగనేదే లేకుండా పోయింది. ఒక్క ఎన్టీఆర్‌తోనే కాకుండా మిగతా హీరోలకూ వాళ్ల కెరీర్‌లో చెప్పుకోదగ్గ చిత్రాల్ని అందించారు రాజమౌళి. ప్రభాస్‌కు 'ఛత్రపతి', రవితేజకు 'విక్రమార్కుడు', రాంచరణ్‌కు 'మగధీర', సునీల్‌కు 'మర్యాదరామన్న' వంటి హిట్లనిచ్చారు. వీటిలో 'మగధీర' చిత్రం మునుపటి తెలుగు చలనచిత్ర వసూళ్ల రికార్డుల్ని తిరగరాసిన సంగతి ప్రస్తావనార్హం. మిగతా హీరోలతో ఆయన తీసిన చిత్రాలన్నీ అప్పటివరకు వాళ్ల కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లని సాధించిన చిత్రాలు కావడం విశేషం.
ఇప్పుడు ఆయన తీస్తున్న 'ఈగ' పట్ల కూడా చిత్రసీమ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఎక్కువగా గ్రాఫిక్స్ మీద ఆధారపడ్డ ఈ చిత్రం టైటిల్‌కు తగ్గట్లే ఓ 'ఈగ' ప్రధాన పాత్రధారిగా రూపొందుతోంది. విలన్ చేతిలో చనిపోయిన హీరో మరుజన్మలో ఈగగా పుట్టి ఆ విలన్ మీద ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడనేది ఇందులోని ప్రధానాంశం. హీరోగా నాని, విలన్‌గా కన్నడ నటుడు సుదీప్ నటిస్తున్న ఈ చిత్రంలో సమంత నాయిక. ఇటీవలే (సెప్టెంబర్ 27తో) పదేళ్ల కెరీర్‌ను పూర్తి చేసుకున్న అగ్ర దర్శకుడు రాజమౌళి మునుముందు తెలుగు సినిమా స్థాయి పెరగడంలో ప్రధాన పాత్ర పోషిస్తారని ఆశించవచ్చు.
(అక్టోబర్ 10 రాజమౌళి పుట్టినరోజు సందర్భంగా)

Subscribe to:
Posts (Atom)