Showing posts with label satyam. Show all posts
Showing posts with label satyam. Show all posts

Sunday, April 28, 2013

బంగారు మనసులు (1973)- రివ్యూ


విధి వక్రిస్తే, అంతవరకు అనుకూలించినవి కూడా అవరోధాలుగా మారి లేనిపోని అనర్థాలకూ, అవమానాలకూ దారితీస్తాయనీ, ఎదురీదడానికి ఎంత యత్నించినా, ఫలితం శూన్యమనీ, నీతికీ, నిజాయితీకీ కట్టుబడి కష్టాల్ని ఓర్పుతో స్వీకరిస్తే ఒకనాటికి మంచి జరుగుతుందనీ తెలిపే సినిమా 'బంగారు మనసులు'.
చిక్కటి సంఘటనలు నిండిన చక్కటి కథ రాసిన కృష్ణమోహన్ సంభాషణల్నీ ప్రతిభావంతంగా రాశారు. 'కొరడా రాణి' దర్శకుడూ, 'బంగారు మనసులు' దర్శకుడూ ఒక్కరే అంటే నమ్మబుద్ధి కాదు. కథను సాఫీగా నడిపించి, తికమకలు లేకుండా చిత్రాన్ని రూపొందించారు కె.ఎస్. రెడ్డి. సత్యం సంగీతం, కన్నప్ప ఛాయ ఆకట్టుకుంటాయి.
కథానాయకిగా జమున ఆద్యంతం డామినేట్ చేసింది. పరికిణీ పిల్లగా ఆమె చాలా అందంగా కనిపించింది. ఉత్తమ పాత్రపోషణ కూడా ఆమెదే. కృష్ణకుమారి గెస్టుగా నటించింది. అంతవరకు విలన్, క్యారెక్టర్ రోల్స్ వేస్తూ వచ్చిన సత్యనారాయణ సానుభూతి పొందే కథానాయకుడి పాత్రని కూడా చక్కగా చేయగలడని ఈ సినిమాతో నిరూపించుకున్నాడు. సహాయ భూమికలు చేసిన వారంతా పరిధుల మేరకు రాణించారు.

Friday, November 5, 2010

నేటి పాట: స్నేహబంధము ఎంత మధురము (స్నేహబంధం)

చిత్రం: స్నేహబంధం (1973)
రచన: ఆత్రేయ
సంగీతం: సత్యం
గానం: పి. సుశీల, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఆనంద్

స్నేహబంధము - ఎంత మధురము
చెరిగిపోదు తరిగిపోదు - జీవితాంతము   ||స్నేహ||

ఆమె: ఓకే ఆత్మ వుంటుంది రెండు శరీరాలలో
ఒకే పాట పలుకుతుంది వేరువేరు గుండెల్లో                          
అతను: ఒక్కటే దొరుకుతుంది జీవితంలో - అది
ఆమె: ఓడిపోదు - వాడిపోదు కష్టసుఖాల్లో   ||స్నేహ||

అతను: మల్లెపూవు నల్లగా మాయవచ్చును
మంచుకూడ వేడిసెగలు ఎగయవచ్చును
ఆమె: పువ్వుబట్టి తేనె రుచి మారవచ్చును
చెక్కుచెదరంది స్నేహమని నమ్మవచ్చును   ||స్నేహ||

తల్లి కడుపు పేగైనా తెంచుకొని వస్తాము
పెళ్లినాటి ప్రమాణాలు సన్యసించి వెళ్తాము
చితిలో అన్నిటిని వదులుకొందుము - కడకు
మట్టిలోన మట్టి చేరునదే స్నేహము   ||స్నేహ||

Sunday, October 10, 2010

నేటి పాట: అమ్మా చూడాలి (పాపం పసివాడు)

చిత్రం: పాపం పసివాడు (1972)
రచన: ఆత్రేయ
సంగీతం: సత్యం
గానం: పి. సుశీల

పల్లవి:
అమ్మా చూడాలి
నిన్నూ నాన్నను చూడాలి
నాన్నకు ముద్దు ఇవ్వాలి -
ఒడిలో నిద్దుర పోవాలి    ||అమ్మా||
                          
చరణం 1:
ఇల్లుచేరే దారే లేదమ్మా
నిన్ను చూసే ఆశే లేదమ్మా
నడవాలంటే ఓపిక లేదు
ఆకలి వేస్తూంది    ||అమ్మా||

చరణం 2:
పలికేందుకు మనిషే లేడు
నిలిచేందుకు నీడే లేదు
బాధగ వుంది భయమేస్తూంది
ప్రాణం లాగేస్తూంది..    ||అమ్మా||