Showing posts with label sri sri. Show all posts
Showing posts with label sri sri. Show all posts
Thursday, November 5, 2015
Friday, April 10, 2015
Saturday, November 17, 2012
ఆకలి రాజ్యం (1981) - సమీక్ష
దేశంలో నిరుద్యోగం తాండవిస్తున్న కాలంలో కె. బాలచందర్ రూపొందించిన గొప్ప చిత్రం 'ఆకలి రాజ్యం'. ఆనాటి యువతరం ఈ సినిమాని తమ సొంతం చేసుకుంది. కథలోకి వస్తే - రంగా తన కాళ్ల మీద తను నిల్చోవాలనుకునే ఆదర్శ యువకుడు. ఆత్మాభిమాని. ఆవేశపరుడు. అందుకే ఉద్యోగం కోసం ఎక్కడకు వెళ్లినా నిరాశే ఎదురవుతుంది. ఆ నిరాశ ఆవేశంగా మారి శ్రీశ్రీ మాటల్ని ఉటంకిస్తుంటాడు. అతడికి నాటకాలు వేసే దేవి పరిచయమవుతుంది. క్లైమాక్స్‌లో రంగా క్షౌరశాలలో పనిచేస్తుండగా అతడి తండ్రి గడ్డం గీయించుకోడానికి వస్తాడు. తనని చూసి దిగ్భ్రాంతికి గురైన తండ్రికి ఆత్మ గౌరవంతో చేసే ఏ పనయినా మంచిదేననీ, దేశంలో నిరుద్యోగం పోవాలంటే అదొక్కటే మార్గమనీ చెబుతాడు రంగా. ఈ సన్నివేశం హృదయాల్ని కదిల్చి వేస్తుంది. ఈ కథను దర్శకుడు చెప్పిన తీరు, మధ్య మధ్య రంగా బృందం చేష్టలు, రంగా, దేవి మధ్య డ్యూయెట్లు ప్రేక్షకుల్ని సమ్మోహితుల్ని చేస్తాయి. 'హ్యాట్స్ ఆఫ్ టు బాలచందర్' అనిపిస్తాయి. రంగా పాత్రలో కమల్ జీవించాడు. దేవిగా శ్రీదేవి ఉత్తమ నటన ప్రదర్శించింది. గణేశ్ పాత్రో సంభాషణలు సినిమాకి ఆయువుపట్టు. అవి అడుగడుగునా ఆలోచింపజేస్తాయి. ఎమ్మెస్ విశ్వనాథన్ బాణీలు వినసొంపుగా ఉండి, పాటల్ని మళ్లీ మళ్లీ వినాలనిపించేట్లు చేస్తాయి. ఆత్రేయ, శ్రీశ్రీ అందించిన సాహిత్యానికి అందులో ప్రధాన భాగముంది. లోకనాథన్ సినిమాటోగ్రఫీ దర్శకుడి అంతరంగాన్ని అర్థం చేసుకుని పనిచేసింది.
Tuesday, August 9, 2011
మన చరిత్ర: అందరిదారీ అ.ర.సం. వైపే!
1943 వేసవిలో బొంబాయిలో అఖిలభారత అభ్యుదయ రచయితల సభలూ, ప్రజా నాట్యమండలి సభలూ జరిగాయి. అక్కడున్న కొయాజీ జహంగీర్ హాలులో జరిగిన ఈ సభలకు తెలుగు నాట నుండి పెద్ద ప్రతినిథి వర్గమే వెళ్లింది. సెట్టి ఈశ్వరరావు, కె.ఎస్. ప్రకాశరవు, చదలవాడ పిచ్చయ్య, కొడవటిగంటి కుటుంబరావు, తుమ్మల వెంకటరామయ్య తదితరులెందరో ఆ ప్రతినిథివర్గంలో ఉన్నారు. అఖిలభారతంగా ఉండే ప్రముఖ రచయితలందరూ వచ్చారు.
అప్పటినుండీ క్రమంగా అభ్యుదయ రచయితల ఉద్యమం ఆంధ్రలో బాగా వేళ్లూనింది. 1944 రెండవ మహసభల్లో చిలకమర్తి లక్ష్మీనరసింహం స్వీయ చరిత్రను ప్రకటించి వారికి బహూకరించింది. తెలికచర్ల వెంకటరత్నం, అడివి బాపిరాజు వంటి వాళ్లతో సహా మొత్తం నవ్య సాహిత్య పరిషత్తు అంతా ఇందులో కలవడంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రతిపత్తి పెరిగింది. 'తెలుగు తల్లి' పత్రికను తీసికొని నడిపారు. 1946లో పెదపూడి (తూ.గో. జిల్లా)లో సాహిత్య పాఠశాల నిర్వహించారు. దాన్ని 'ప్రజా విశ్వవిద్యాలయం'గా నాడు రచయితలు ప్రశంసించారు. సాహితీరంగంలో ప్రసిద్ధులందరూ పాల్గొన్నారు.
1946లో దేవలపల్లి కృష్ణశాస్త్రి అధ్యక్షతన, శ్రీశ్రీ ప్రారంభకులుగా రాజమండ్రిలో మూడవ మహాసభలు జరిగాయి. జలసూత్రం రుక్మిణీనాథశాస్త్రి వంటి వ్యక్తులు ఖాకీ నిక్కరు తొడుక్కుని వలంటీర్లుగా ఆ సభల్లో పనిచేశారు. 1946 నుండే సంఘం 'అభ్యుదయ' పత్రికను నిర్వహించడం మొదులుపెట్టింది. 1947లో నాలుగో మహాసభలు మద్రాసులో జరిగాయి. రాజమన్నారులాంటి వ్యక్తులు ఉద్యమంలోకి వచ్చారు. పల్లెకోన (గుంటూరు జిల్లా)లో 1947లోనే సాహిత్య పాఠశాల జరిగింది.
1955లో సంఘం ఐదవ మహాసభలు విజయవాడలో జూలై 30, 31 తేదీల్లో జరిగాయి. ఉప్పల లక్ష్మణరావు ఆహ్వాన సంఘాధ్యక్షులు. సభలకు శ్రీశ్రీ అధ్యక్షత వహించారు. తెలుగుదేశంలో రచయితలూ, కవులూ, కళాకారులందరూ వచ్చారు. ఈ సభలు చేసిన అనేక తీర్మానాల్లో వ్యావహారిక భాషావ్యాప్తికి ఓ సంఘాన్ని వేసి విశ్వవిద్యాలయాల్లో దానికోసం పోరాడాలన్నది ఓ తీర్మానం. ఆ ఉపసంఘలో తాపీ ధర్మారావు, గిడుగు సీతాపతి, తెలికచర్ల వెంకటరత్నం, కొడవటిగండి సభ్యులు. శ్రీశ్రీ కన్వీనర్.

Saturday, August 6, 2011
మన చరిత్ర: అఖిల భారత అభ్యుదయ రచయితల సంఘం
రెండో ప్రపంచ యుద్ధానికి ముందు ప్రపంచంలో, అందులోనూ సామ్రాజ్యవాద దేశాల్లో ఆర్థికంగా చాలా వత్తిడులూ, కుదుపులూ కలిగాయి. వాటి దుష్పరిణామాలు, ప్రభావాలు సాహిత్య కళారంగాల మీద కూడా ప్రసరించాయి. పలాయన వాదం, ఫాసిజాలు, శుద్ధకళావాదాలు, నైరూప్య సిద్ధాంతాలూ ప్రచారంలో ఉండేవి. ఇవి ప్రజల మానసిక ఆరోగ్యానికి చాలా ప్రమాదకరాలుగా గుర్తించిన రచయితలు, కళాకారులు వీటినుండి విముక్తి కావడానికి ప్రయత్నించారు. అందుకు ఓ ఉద్యమం అవసరమన్న అంశాన్ని గుర్తించారు.
సరిగ్గా ఇదే కాలంలో, అంటే 1935లో 'సంస్కృతీ రంగంలో కమ్యూనిస్టుల పోరాటం' అనే వ్యాసం బయటకు వచ్చింది. దీని రచయిత జార్జ్ డిమిట్రోవ్. బ్రిటీషు కార్మిక వర్గం ఆర్థిక సంక్షోభ వ్యతిరేక పోరాటాల్లో పాల్గొంటూనే దాన్ని ఫాసిస్టు వ్యతిరేక ఉద్యమంగా మార్చి ఐక్య సంఘటనగా ముందుకెళ్లాలని భావించింది. ఇవే భావాలు ప్రపంచంలో వలస రాజ్యాల్లోని, సామ్రాజ్యవాద దేశాల్లోని అభ్యుదయ కాముకుల్లో ఉండేవి. అలాంటి సాహితీవేత్తల సమావేశం 1935లో లండన్‌లోని ఓ చైనా వారి హోటల్లో జరిగింది. ఆ సమావేశంలో రాల్ఫ్ ఫాక్స్ లాంటి ప్రముఖ రచయితలతో పాటు భారతీయ రచయితలు సజ్జాద్ జహీర్, ముల్క్‌రాజ్ ఆనంద్, ఫైజ్ అహ్మద్ ఫైజ్ కూడా హాజరయ్యారు. వీళ్లంతా ఆ సంవత్సరం ఓ చిన్న ప్రణాళికను తయారు చేశారు. ఇంగ్లీషులో దాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు.
సమాజ పరిస్థుతుల్ని నిరాకరించే పలాయనవాద సాహిత్యానికీ, సామ్రాజ్యవాదానికీ, ఫాసిజానికీ వ్యతిరేకంగా నిల్చునే సాహిత్య సృష్టి చేయడం, భారతదేశంలో సామ్రాజ్యవాద పాలనకు వ్యతిరేకంగా రచయితల్ని సమీకరించడం, సాహిత్యంలో వాస్తవికతకు పునాదులు వెయ్యడం ఈ ప్రణాళిక లక్ష్యాలు.
ఈ లక్ష్యాల్ని చర్చించి ఓ సంఘానికి నిర్మాణ రూపం ఇచ్చేందుకు 1936లో ఫ్రాన్సులో సమావేశమవుతున్న రచయితల సభలకు వెళ్లాలనుకున్న ముల్క్‌రాజ్ ఆనంద్, సజ్జాద్ జహీర్‌లకు ప్రభుత్వం అనుమతి నిరాకరించి పి.ఇ.ఎన్. (పొయెట్స్, ఎస్సేయిస్ట్స్ అండ్ నావలిస్ట్స్) సభ్యులకు మాత్రమే అనుమతి ఇచ్చింది. ఈ సంఘంలో సభ్యులు ఓరకంగా మితవాదులు.
ఈ పరిస్థితుల్లో లక్నోలో 1936లో మున్షీ ప్రేంచంద్ అధ్యక్షతన అఖిల భారత అభ్యుదయ రచయితల సంఘం ఏర్పడింది. సామ్రాజ్యవాద వ్యతిరేక వైఖరీ, నాజీ-ఫాసిస్టు వ్యతిరేక వైఖరీ ఉంటూ దేశ స్వాతంత్ర్య పోరాట భావాలతో జనాన్ని కదిలించాలి అనే భావాలున్న అనేకమంది రచయితలు ఆ సభలకెళ్లారు. ఆంధ్ర ప్రాంతం నుండి అబ్బూరి రామకృష్ణారావు, సోమంచి యజ్ఞన్నశాస్త్రి ఆ సభల్లో పాల్గొని వచ్చారు.
రిఫరెన్స్: ఏ.బి.కె. ప్రసాద్ వ్యాసం, శ్రీశ్రీ షష్ఠిపూర్తి సన్మాన సంచిక - విశాఖపట్నం, 1970.

Saturday, October 9, 2010
సినిమా: నెరవేరని శ్రీశ్రీ సంకల్పం
మహాకవి శ్రీ శ్రీ యుగకర్త వీరేశలింగం జీవిత చిత్రాన్ని నిర్మించాలని 1960లో సంకల్పించారు. దానికోసం ఆయన ఉదయశ్రీ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థని నెలకొల్పారు. 'మహాపురుషుడు కందుకూరి' అనే టైటిలుతో ఆ సినిమా తీయాలనుకున్నారు. కథ, మాటలు, పాటలు సమకూరుస్తూ తనే ఆ సినిమాకి దర్శకత్వం వహించాలని తలపోశారు. అయితే ఎన్నో కారణాల వల్ల ఆయన సంకల్పం నెరవేరలేదు. అంతకుముందు పన్నెండేళ్ల క్రితం ఆయనలాగే డైరెక్టర్ తాతినేని ప్రకాశరావు కూడా వీరేశలింగం సామాజిక వీర చరితను వెండితెరకి ఎక్కించాలనుకున్నారు. శ్రేయోభిలాషులు వారించారు. రాజమండ్రి నుంచి సరైన సహకారం లభించలేదు. దాంతో ఆయన ఆ ప్రాజెక్టుని విరమించారు. ఇంతవరకు కందుకూరి జీవితం వెండితెర మీద ఆవిష్కృతం కాకుండానే ఉండిపోయింది.
Wednesday, September 22, 2010
నేటి పాట: ఎవ్వరికోసం ఈ మందహాసం (నర్తనశాల)

చిత్రం: నర్తనశాల (1963)
రచన: శ్రీ శ్రీ
సంగీతం: పి. దక్షిణామూర్తి
గానం: ఘంటసాల, పి. సుశీల
పల్లవి:
ఎవ్వరికోసం - ఈ మందహాసం
ఒకపరి వివరించవే - సొగసరీ
ఒకపరి వివరించవే!
అనుపల్లవి:
చెలిమి కోసం - చెలి మందహాసం!
ఏమని వివరింతునో - గడసరీ
ఏమని వివరింతునో
వలపులు చిలికే - వగలాడి చూపు!
పిలువక పిలిచే - విరహాల రేపు!!
చరణం 1:
ఎదలో మెదలే చెలికాని రూపు!
ఏవో తెలియని - భావాల రేపు!
ఈ నయగారం - ప్రేమసరాగం!
అందించు - అందరాని సంబరాలే ||ఎవ్వరికోసం||
చరణం 2:
పరుగులు తీసే - జవరాలి వయసు!
మెరుపై మెరసి - మరపించు మనసు!
ప్రణయము చిందే - సరసాల చందం!
ఇరువురినొకటిగ - పెనవేయు బంధం!
ఈ వయ్యారం - ఈ సింగారం!
చిందించు - చిన్ని చిన్ని వన్నెలెన్నో ||ఎవ్వరికోసం||
Saturday, September 11, 2010
నేటి పాట: తొలి వలపే పదే పదే (దేవత)
చిత్రం: దేవత (1964)
రచన: శ్రీశ్రీ
సంగీతం: ఎస్.పి. కోదండపాణి
గానం: ఘంటసాల, పి. సుశీల
పల్లవి:
తొలి వలపే - పదే పదే మదిలో మల్లెలు విరిసే
యేమో అది యేమో - నీ పెదవుల విరిసే నవ్వుల అందాలు
అనుపల్లవి:
ఆ అందం - అనుబంధం - నీకై దాచిన
పూచిన కానుకలు!
నీ కన్నుల వెలిగే దీపాలు!
చరణం 1:
అవి నీ ప్రేమకు - ప్రతిరూపాలు! మన
అనురాగానికి హారతులు తొలి
సని, నినిగ - ఆ.. ఆ.. ఆ - మగనిగమ - ఆ.. ఆ.. ఆ..
గమ, గమ, గనీ, నీ పాద - ఆ.. ఆ.. ఆ..
చరణం 2:
యేలా ఈ వేళ - కడువింతగా!
తోచే తీయగా - మాయగా - ఈ జగమూ
యవ్వనము - అనుభవము - జతకూడిన వేళా!
కలిగిన వలపుల
ఈ రేయి పలికెనే స్వగతమూ
ఈనాడే - బ్రతుకున - శుభదినమూ!
ఈ తనువే - మనకిక చెరి సగము ||తొలివలపే||
Thursday, July 29, 2010
Youth: Lessons from First Love

There is nothing either good or bad but thinking makes it so.
స్నేహానికి హద్దు అవసరమా? యువతీ యువకుల మధ్య స్నేహానికి మాత్రం హద్దు అవసరమేననేది అత్యధికుల అభిప్రాయం. మనిషి జీవితంలో బాల్యం తర్వాత వచ్చే యవ్వన దశ ఎంత సంక్లిష్టంగా వుంటుందో యవ్వనాన్ని ఇప్పటికే అనుభవించిన వాళ్లందరికీ తెలుసు. మరి ఈ రాతలు ఎవరికోసమంటే యవ్వనంలో వున్న వాళ్ల కోసమే. యవ్వనంలో వున్న వాళ్లలో బాల్య చేష్టలూ పూర్తిగా ప్రతిఫలించవు, ప్రౌఢ దశలోలా పరిపక్వతా కనిపించదు. ఓ విధమైన ద్వైదీభావంతో వాళ్లు కొట్టుమిట్టాడుతూ వుంటారు. ఈ దశ యువకులకి కచ్చితంగా పరీక్షా సమయం లాంటిదే. వాళ్లలో కలిగే ఆశలూ, ఊహలూ నియంత్రణని కోల్పోతాయి. వాళ్ల ప్రవర్తన మూలంగా తల్లిదండ్రులతో, టీచర్లతో, స్నేహితులతో విభేదిస్తుంటారు.
యువకులలో కలిగే భావానుభూతులు వాళ్లని చలింప జేస్తుంటాయి. భావ సంఘర్షణలు, అస్పష్టమైన దృక్పథాలు వంటివి వాళ్లని అనేక పరీక్షలకు లోను చేస్తాయి. ఏదో ఓ కొత్త మార్గాన్ని అన్వేషించాలనీ, గుర్తింపు పొందడం కోసం ఎంతటి క్లిష్టమైన పనైనా చేయాలనీ యువకులు తలపోస్తూ వుంటారు. తన కుటుంబం, చదువు, స్నేహితులు - వాళ్లతో సంబంధాలు, వాళ్ల ప్రవర్తన యువకుల్ని మరో గమ్యం వైపుకు లాగుతుంటాయి. అందులో భాగంగానే యువతులతో స్నేహాన్ని వాళ్లు వాంఛిస్తుంటారు.
యవ్వనమంటే 'తొలిప్రేమ' నుంచి తప్పించుకోలేని దశగా కవులు వర్ణిస్తుంటారు. మనో వైజ్ఞానికులు కూడా దీన్ని రూఢిపరుస్తారు. పదహారేళ్ల అమ్మాయికీ, పదిహేడేళ్ల అబ్బాయికీ 'తొలిప్రేమ' బారి నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదు. తమ ప్రేమని బయటకి వ్యక్తం చేయకపోయినా తప్పనిసరిగా వాళ్లు 'తొలిప్రేమ' అనుభవాన్ని పొందే వుంటారు. దాన్ని సహజమైన విషయంగానే గుర్తించాలి. తప్పించుకోలేని ఊహా జగత్తులోకి తొలిప్రేమ టీనేజర్లని తీసుకుపోతుంది. దాని ప్రభావం కూడా వారి హృదయాలపై ప్రసరిస్తుంది. ఆ స్థితిలో - ఇంద్రధనస్సులాంటి అందమైన ఆలోచనలు, తియ్యని పగటి కలలు, ప్రియురాలి ఓ చిరునవ్వు, ఆమె నుంచి చిన్న ఒప్పుకోలు, ఒక ప్రేమమాట, ఒక భాష్యం టీనేజర్ని ప్రేమజ్వరంతో కాగిపోయేట్టు చేస్తాయి. ఎట్లా జరగాలని అతడు కోరుకుంటాడో అందుకు అనుగుణమైన ఆలోచనలే అతనిలో కలుగుతుంటాయి. అతడిలో పూర్తి తాదాత్మ్య స్థితి కలుగుటుంది. ఒక కవిగా మారిపోయి ప్రేమ కవిత్వం చెబుతాడు. రచయితగా మారిపోయి తన భావాలను ప్రేమలేఖల రూపంలో వ్యక్తం చేస్తాడు. ఇవాళ సెల్ ఫోన్లతో ఎస్సెమ్మెస్సుల ద్వారా తన ప్రేమని ప్రదర్శిస్తున్నాడు. తన ప్రేమ ఎంతో స్వచ్ఛమైనది కూడా అని అతడు తన కవిత్వం ద్వారా, తన రచన ద్వారా తెలియజేస్తాడు. శ్రీశ్రీ 15 సంవత్సరాల వయసులోనే 'పరిణయ రహస్యము' అనే నవల రాశాడంటే అది తొలిప్రేమ ప్రభావమేమో అనిపిస్తుంది.
తొలిప్రేమలో చిక్కుకున్న వాళ్లు తమ భావానుభూతుల్ని లేఖల ద్వారా మాత్రమే కాదు. డైరీల్లో నిక్షిప్తం చేసుకోవడం ద్వారా కూడా వ్యక్తం చేస్తుంటారు. వస్త్రధారణ విషయంలో కూడా వీరు అమిత శ్రద్ధ కనపరుస్తారు. ప్రేమలో పడిన యువతయితే ఆధునిక శైలిలో ఎదుటివాళ్లని ఆకట్టుకునే లాగా వస్త్రధారణ చేసుకుంటుంది. ఎంత సమయాన్నైనా దీనికోసం వెచ్చిస్తుంది. ఫ్యాషన్ దుస్తులు, హైహీల్స్, బాబ్డ్ హెయిర్, ధగధగలాడే ఇయర్ రింగ్స్ - ధరిస్తుంది. ఇక యువకుడైతే జీన్స్, కొత్త కొత్త మోడళ్ల దుస్తులు, కళ్లకి రేబాన్ గ్లాసెస్ ధరిస్తుంటాడు. మోటార్ సైకిల్ మీద ఝామ్మని పోతుంటాడు. అలాగే తాను అమితంగా అభిమానించే సచిన్ లేదా ధోనీ లాంటి క్రికెట్ స్టారునో, మహేశ్ లేదా రాంచరణ్ లాంటి సినీ హీరోనో అనుకరిస్తూ వారిలా ప్రవర్తించడానికి ప్రయత్నిస్తుంటాడు. అయితే ఇవన్నీ చాలా త్వరగానే మరుగునపడి పోతుంటాయి. ఇలా జరగడం కూడా సహజమే. వాస్తవం తెలిశాక ఇవేవీ నిజమైన ప్రేమ భావాలకు ప్రతీకలు కాదన్న స్థితికి వాళ్లు వస్తారు. ఇది కూడా అసహజం కాదు. ఎందుకంటే యవ్వనమనేది మానసిక పరిపక్వతలేని, తన గురించి తనకే అవగాహనలేని, ఏదో గుర్తింపు కావాలని కోరుకునే దశ. తొలిప్రేమ భావాలు వాళ్లని చదువు నుంచీ, బాధ్యతల నుంచీ దూరం చేస్తాయి. ఆశ్చర్యంగా ఇవే అనుభూతులు వాళ్లకి చదువులో ఆధిక్యతనీ, గుర్తింపునీ త్వరలోనే కలిగిస్తాయి.
తొలి ప్రేమానుభూతులకి కారణం ఏమిటంటే ఎవరూ చెప్పలేరు. ఆ అనుభూతులు తప్పా, ఒప్పా కూడా చెప్పలేరు. కానీ తొలిప్రేమ సహజం. అది తప్పించుకోలేని అనుభూతి. వింతేమిటంటే తప్పొప్పులని గ్రహించడానికీ, మానసిక పరిపక్వతకీ తొలిప్రేమ బీజం వేస్తుంది.
పాశ్చాత్య దేశాల్లో యువతీ యువకుల మధ్య 'డేటింగ్' అనేది ఒక సహజమైన అంశం. మన సమాజంలో ఈ 'డేటింగ్' అనుసరించదగినదేనా? అనే ప్రశ్న టీనేజర్లలో వుంటుంది. ఈ విషయంలో మాత్రం ఏకాభిప్రాయం వ్యక్తం కావడం లేదు. ఆచారాలకీ, సంప్రదాయాలకీ విలువ ఇచ్చే పెద్దవాళ్లు మన సమాజం దృష్ట్యా 'డేటింగ్' మంచిది కాదనీ, భారతీయతకు సరిపడనిదనీ అంటారు. అయితే పాశ్చాత్య నాగరికతకు సన్నిహితమవుతున్న మనం - ముఖ్యంగా యువత దీన్నేమీ ఖాతరు చేయడం లేదు. ఇవాళ మన నగరాల్లో డేటింగ్ ఓ సాధారణ అంశం. హైదరాబాదులో ట్యాంకుబండ్ వద్దా, ఇందిరా పార్కు, ప్రసాద్ ఐమాక్స్ వద్దా పెళ్లికాని అమ్మాయిలూ అబ్బాయిలూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుండడం మనకు ప్రత్యక్షంగా కనిపిస్తుంది. పబ్బుల సంస్కృతి వచ్చాక ఏ పబ్బులో చూసినా ఇలాంటివాళ్లు కొల్లలుగా కనిపిస్తున్నారు.
ఫారిన్లో తమ పిల్లలకు తగిన జోడీని వెతకడం తల్లిదండ్రులకు చాలా కష్ట సాధ్యం. కాబట్టి తమకు నచ్చిన భాగస్వామిని వెతుక్కోవడానికి డేటింగ్ వారికి ఉపకరిస్తుంది. అదే మనదేశంలో తమ పిల్లలకు తామే జీవిత భాగస్వామిని ఎంపిక చేసే సంస్కృతి కొనసాగుతోంది. అందుచేత మన సమాజంలో డేటింగ్ ఆచరణీయం కాదని అంటారు. అయితే ఇంతకు ముందు నగరాలకు మాత్రమే పరిమితమైన డేటింగ్ ఇప్పుడు చిన్న పట్టణాలకు సైతం వ్యాపించింది. క్రమేణా ఇది పెరుగుతూ వస్తోంది. డేటింగ్ కోరుకునే యువతికి ఇదో థ్రిల్లింగుగా తోస్తుంది. ఒక్కోసారి అది సరిదిద్దుకోలేని విపత్కర పరిస్థితికి దారితీసే ప్రమాదం వుంటుందని అప్పుడామె గ్రహించకపోవచ్చు. ఆరాధనకన్నా మోహమే ఇందులో అధికంగా కనిపిస్తుంది.
సహజంగా ఒకే వయసు వున్న యువతీ యువకుల్లో ముందుగా యువతే వివాహానికి సిద్ధపడుతుంది. యువకుడికైతే చదువు పూర్తి కావాలి, ఉద్యోగం రావాలి, ఏదో ఓ ఉపాధి చూసుకోవాలి. జీవితంలో నిలదొక్కుకోవాలి. అందుకని అతడికి డేటింగ్ వివాహానికి సహకరించే సాధనంగా అనిపించదు. ఈ కారణంవల్ల డేటింగ్ మూలంగా నష్టపోయేదిఎక్కువగా ఆడవాళ్లే. ఒక యువతితో డేటింగ్ చేస్తున్నప్పటికీ తల్లిదండ్రుల వత్తిడి వల్ల ఇంకో యువతిని పెళ్లి చేసుకుంటాడు పురుషుడు. అలా కాకపోయినా మానసిక పరిపక్వతలేని వాళ్లు వివాహం చేసుకున్నా ప్రపంచానుభూతులకు ఎట్లా స్పందించాలో తెలీక తీవ్రమైన భావ సంఘర్షణకి లోనవుతారు.
కేవలం ఇద్దరు యువతీయువకుల మధ్య డేటింగ్ అనేదాన్ని ప్రోత్సహించడం కాకుండా సామూహికంగా స్కూళ్లలో, కాలేజీలలో స్త్రీ, పురుష సంబంధాలను, వాళ్ల సమస్యలను చర్చా గోష్ఠులుగా నిర్వహిస్తే యువతీ యువకుల మధ్య సరైన అవగాహన పెంపొందడానికి అవకాశం వుంది. సమభావంతో ఆటలలో కలిసి పాల్గొనడం ద్వారా వాళ్లు ఒకరి పట్ల మరొకరు ఆసక్తినీ, అవగాహననీ కలిగించుకోవచ్చు. పిక్నిక్కులు, ఎక్సుకర్షన్లు వంటివి కూడా వాళ్ల మధ్య మంచి అవగాహన ఏర్పడటానికి తోడ్పడతాయి. ఆనందాన్ని మాత్రమే కాక అవి వాళ్లలో నాయకత్వ లక్షణాల్ని కూడా ప్రేరేపిస్తాయి. ఈ సందర్భాల్లో వాళ్లు ఆడే ఆటలు, పాడే పాటలు ఉల్లాసాన్ని కలిగిస్తాయి. హృదయాన్ని గిలిగింతలు పెడతాయి.
ఎప్పుడైతే సామూహికంగా యువతీ యువకులు కలసి వుంటారో, ఒకరికొకరు సహకరించుకుంటారో అప్పుడు మనం భయపడేదేమీ జరగదు. జంటలు జంటలుగా విడిపోయి వున్నప్పుడు మాత్రమే మనమనుకునే ప్రమాదాలు సంభవించేది. వయసు కలిగించే సహజమైన కోరికలతో వాళ్లు పెడతోవపట్టే అవకాశం అప్పుడే వుంటుంది.
యువతీ యువకులు కూడా ఎప్పుడూ ఊహా ప్రపంచంలో విహరిస్తూ గాలిలో మేడలు కట్టే పనికి స్వస్తి చెప్పాలి. అందుకుగాను చక్కగా చదువుకోవాలి. ఒక మంచి లక్ష్యాన్ని ఎంచుకుని ముందుకు పోవాలి. వాళ్ల భవిష్యత్తు సక్రమంగా వుండటానికి ఇవే ఉత్తమ మార్గాలు.
Subscribe to:
Posts (Atom)