Showing posts with label krishnudu. Show all posts
Showing posts with label krishnudu. Show all posts
Monday, July 2, 2012
'లింగడు రామలింగడు' గా కృష్ణుడు
కృష్ణుడు హీరోగా నటిస్తున్న చిత్రం 'లింగడు-రామలింగడు'. వేగా ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై. లిమిటెడ్ సమర్పిస్తోంది. పాలాక్షుని ఫిలిమ్స్ పతాకంపై అశోక్‌రావు దర్శకత్వం వహిస్తున్నారు. లక్ష్మీనారాయణ నిర్మాత. షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. నిర్మాత చెబుతూ "ఈ చిత్రం ఇప్పటి వరకు వచ్చిన కృష్ణుడు చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. చక్కని కథ, కథనాలతో ఆద్యంతం వినోదాన్ని పంచుతుంది. ఓ యువకుడు తను ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవడం కోసం అతని మామ పెట్టే కండిషన్లు, టెన్షన్లు ఎలా భరించాడు? అనేదే కథ. కృష్ణుడు ద్విపాత్రాభినయం చేశారు. జూలై రెండో వారంలో పాటల్ని, నెలాఖరున చిత్రాన్ని విడుదల చేస్తాం'' అని అన్నారు.
భానుశ్రీ మెహ్రా, రాజీవ్ కనకాల, కృష్ణభగవాన్, కొండవలస, నరసింహరాజు, కవిత, విజయభాస్కర్, జెన్నీ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి మాటలు: నండూరి వీరేష్, పాటలు-సంగీతం-నృత్యాలు: స్టైల్ మధు, కెమెరా: నర్సింగ్‌రావు, నిర్మాత: లక్ష్మీ నారాయణ, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: అశోక్‌రావు.
Friday, August 12, 2011
న్యూస్: 'రామదండు' పరిస్థితి ఏమిటి?
'వినాయకుడు', 'విలేజ్‌లో వినాయకుడు' సినిమాలతో తనకంటూ స్పెషల్ ఇమెజ్ పొందిన స్థూలకాయ నటుడు కృష్ణుడు హీరోగా తన ప్రస్థానాన్ని ఎంతకాలం కొనసాగించ గలుగుతాడు? స్థూలకాయులు హీరోగా రాణించరనే నమ్మకాన్ని పటాపంచలు చేస్తూ రెండు విజయాలు సాధించిన కృష్ణుడు వాటి తర్వాత వెనకడుగు వేశాడు. అతను హీరోగా నటించిన 'పప్పు', 'కోతిమూక', 'వైకుంఠపాళి', తాజాగా 'అమాయకుడు' సినిమాలు అటకెక్కాయి. ముఖ్యంగా 'కోతిమూక', 'అమాయకుడు' డిజాస్టర్‌గా నిలిచాయి. అందుకు ఆయా దర్శకులే (ఏవీయస్, భారతీ గణేశ్) ముఖ్య కారణమని చెప్పాలి. త్వరలో కృష్ణుడు 'నాకూ ఓ లవరుంది'లో హీరోగా కనిపించబోతున్నాడు. ఇదికాక పోయినేడాదే విడుదల కావలసిన 'రామదండు' అనే సినిమా ఇంతవరకూ అతీ గతీ లేకుండా ఆగిపోయి ఉంది. నరేష్‌తో రూపొందించిన 'దొంగల బండి' ద్వారా డైరెక్టర్‌గా పరిచయమైన వేగేశ్న సతీశ్ ఈ సినిమాకి దర్శకుడు. ఫుట్‌బాల్ నేపథ్యంలో ఈ సినిమాని అతను రూపొందించాడు. పిల్లలు ప్రధాన పాత్రధారులుగా నటించిన ఈ సినిమాలో కృష్ణుడు ఫుట్‌బాల్ కోచ్ పాత్రని చేశాడు. ఈ సినిమా ఎప్పుడు వెలుగు చూస్తుందోనని కృష్ణుడుతో పాటు అతని శ్రేయోభిలాషులంతా వెయిట్ చేస్తున్నారు. 'వినాయకుడు' సీరిస్‌తో తనకి దక్కిన సక్సెస్ గాలివాటం కాదనీ, హీరోగా సినిమాని క్యారే చేసే సత్తా తనకుందనీ అతను నిరూపించుకోవాలంటే వీటిలో ఓ సినిమా అయినా ఆడాలి. అది జరుగుతుందా?
Tuesday, August 2, 2011
న్యూస్: 'హీరో అజయ్' అనిపించుకుంటాడా?
విలన్ పాత్రలతో పాపులరై తర్వాత హీరోలుగా మారి, పేరు తెచ్చుకున్నవాళ్లు టాలీవుడ్‌లో చాలామందే ఉన్నారు. కృష్ణంరాజు, చిరంజీవి, మోహన్‌బాబు, గోపీచంద్ వంటివాళ్లు అందుకు మంచి ఉదాహరణ. ఆ కోవలోనే హీరో కావాలని తపిస్తున్న నటుడు అజయ్. 'హీరో అజయ్' అనే పేరును ఖాయం చేసుకోవాలనేది అతడి చిరకాల వాంఛ. అయితే ఇప్పటివరకు అతడి కల నెరవేరలేదు. విలన్ పాత్రలతో 'విక్రమార్కుడు' నుంచే ప్రేక్షకుల మెప్పు పొందిన అతడు హీరోగా 'ఆ ఒక్కడు', 'సారాయి వీర్రాజు', 'వైకుంఠపాళి' వంటి సినిమాలు రూపొందాయి. కానీ హీరోగా అతడికి బ్రేక్ రాలేదు. ఆ మూడు సినిమాలూ ప్రేక్షకుల్ని మెప్పించలేక పోవడమే దీనికి కారణం. 'ఆ ఒక్కడు'లో అతడికంటే హీరోయిన్ మధురిమ పాత్రకే ఎక్కువ ప్రాధాన్యం. 'సారాయి వీర్రాజు' పూర్తిగా అతడి పాత్రమీదే ఆధారపడిన సినిమా అయినా ఆ కథ మనవాళ్లకి నచ్చలేదు. ఇక 'వైకుంఠపాళి'లో ముగ్గురు హీరోల్లో అతను ఒకడు. మిగతా ఇద్దరు కృష్ణుడు, రణధీర్. ఆ ఇద్దరితో పోల్చితే అజయ్ పాత్రకే ప్రాధాన్యత ఎక్కువైనా ఈ థ్రిల్లర్ ఆడియన్స్‌ని థ్రిల్ చేయలేక పోయింది. అయితే అతడు హీరో కాకపోయినా హీరో కంటే ఎక్కువ ప్రశంసల్ని తెచ్చిన సినిమా 'విరోధి'. నీలకంఠ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో హీరో శ్రీకాంత్ కంటే ఎక్కువగా మావోయిస్ట్ రోల్‌లో గొప్పగా రాణించాదు అజయ్. కానీ ఏం లాభం. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తాకొట్టింది. అతడి సినిమాలు ఇలా ఒక్కొక్కటే ఫ్లాపవతూ రావడంతో అతడితో సినిమాలు తియ్యాలని ప్లాన్ చేసుకున్న డైరెక్టర్లు, నిర్మాతలు ఇప్పుడు వెనుకంజ వేస్తున్నారు. ఇప్పటికిప్పుడు కాకపోయినా కొంత కాలం తర్వాతైనా అజయ్ హీరోగా నిలదొక్కుకుంటాడని అతని శ్రేయోభిలాషులు నమ్ముతున్నారు. వారి నమ్మకం నిజమవుతుందా?
Friday, July 22, 2011
న్యూస్: 'అమాయకుడు' బాక్సాఫీసు వద్ద నిలుస్తాడా?
హీరోగా కృష్ణుడు కెరీర్ పరీక్షకు నిలుస్తున్న తరుణమిది. 'వినాయకుడు', 'విలేజ్‌లో వినాయకుడు' సినిమాలతో స్థూలకాయుడైన తొలి తెలుగు హీరోగా పేరు తెచ్చుకున్న అతను ఆ తర్వాత ఆ మ్యాజిక్‌ని కొనసాగించలేక పోయాడు. అతను హీరోగా నటించిన 'పప్పు', 'కోతిమూక', 'వైకుంఠపాళి' సినిమాలు బాక్సాఫీసు వద్ద ఫెయిలయ్యాయి. ఇప్పుడు మూడు వారాల గ్యాప్‌లో అతని సినిమాలు రెండు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. మొదటగా ఈ నెల (జూలై) 22న 'అమాయకుడు' విడుదల కాగా, ఆగస్టు 11న 'నాకూ ఓ లవరుంది' విడుదలవుతోంది. 'అమాయకుడు' సినిమా రెండేళ్ల క్రితమే మొదలైనా ఇప్పటికి వచ్చింది. తమిళుడైన భారతీగణేశ్ దీని దర్శకుడు. ముగ్గురమ్మాయిల మధ్య చిక్కుకున్న యువకుడిగా ఈ సినిమాలో కృష్ణుడు నటించాడు. ఆ ముగ్గురిలో తాను ప్రేమించిన అమ్మాయిని ఎలా దక్కించుకున్నాడనేది కథాంశం. ఇక 'నాకూ ఓ లవరుంది' విషయానికొస్తే ఇందులో బ్రాహ్మణ పురోహితునిగా నటించాడు. ఈ సినిమా ద్వారా రాం వెంకీ దర్శకునిగా, రితిక హీరోయిన్‌గా పరిచయమవుతున్నారు. ఈ రెండు సినిమాల బాక్సాఫీసు ఫలితం అతని కెరీర్‌ని నిర్దేశించే అవకాశం కనిపిస్తోంది. మునుపటి సినిమాలు ఫ్లాపవడం అతని సినిమాల బిజినెస్‌పై ప్రభావాన్ని చూపుతోంది. ఈ పరిస్థితిలో వీటిలో ఒకటైనా హిట్టవడం కృష్ణుడికి అవసరం.
Friday, November 26, 2010
సినిమా: 'రామదండు'తో కృష్ణుడు సక్సెసవుతాడా?
'వినాయకుడు', 'విలేజ్‌లో వినాయకుడు' సినిమాలతో తనకంటూ స్పెషల్ ఇమెజ్ పొందిన స్థూలకాయ నటుడు కృష్ణుడు హీరోగా తన ప్రస్థానాన్ని ఎంతకాలం కొనసాగించ గలుగుతాడు? స్థూలకాయులు హీరోగా రాణించరనే నమ్మకాన్ని పటాపంచలు చేస్తూ రెండు విజయాలు సాధించిన కృష్ణుడు వాటి తర్వాత వెనకడుగు వేశాడు. అతను హీరోగా నటించిన 'పప్పు', 'కోతిమూక' చిత్రాలు రెండూ ఫ్లాపయ్యాయి. ముఖ్యంగా 'కోతిమూక' డిజాస్టర్‌గా నిలిచింది. అందుకు ఏవీయెస్ డైరెక్షన్ ప్రధాన కారణమని చెప్పాలి. ప్రస్తుతం అతను ప్రధాన పాత్రధారిగా 'రామదండు' అనే సినిమా తయారవుతోంది. నరేష్‌తో రూపొందించిన 'దొంగల బండి' ద్వారా డైరెక్టర్‌గా పరిచయమైన వేగేశ్న సతీశ్ ఈ సినిమాకి దర్శకుడు. ఫుట్‌బాల్ నేపథ్యంలో ఈ సినిమాని అతను రూపొందించాడు. పిల్లలు ప్రధాన పాత్రధారులుగా నటించిన ఈ సినిమాలో కృష్ణుడు ఫుట్‌బాల్ కోచ్ పాత్రని చేశాడు. డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాతో కృష్ణుడు మళ్లీ తన సత్తా చూపుతాడా?
Sunday, June 27, 2010
KOTHIMOOKA: Fourth Trial for AVS


దర్శకుడిగా నిలదొక్కుకోవాలని తపిస్తున్న నటుడు ఏవీయస్, ఆ దిశగా నాలుగో యత్నం చేస్తున్నారు. భారీకాయుడు కృష్ణుడు హీరోగా, బ్యూటీ గర్ల్ శ్రద్ధా ఆర్య హీరోయిన్‌గా ఆయన 'కోతిమూక' డైరెక్ట్ చేశారు. తులసి పూజిత ఫిలిమ్స్ బ్యానర్‌పై వెంకట్ జగదీష్ అనే నూతన నిర్మాత ఈ ఫిలింని నిర్మిస్తున్నారు.
కమెడియన్‌గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ పొందిన ఏవీయస్ 'సూపర్ హీరోస్'తో డైరెక్టర్‌గా తన జర్నీ ప్రారంభించారు. ఆ సినిమాలో బ్రహ్మానందం, ఆయనా టైటిల్ రోల్స్ చేశారు. రామానాయుడు నిర్మించిన ఆ సినిమా కమర్షియల్‌గా సక్సెస్ సాధించలేదు. ఆ తర్వాత తనే సొంతంగా 'ఓరి నీప్రేమ బంగారం గానూ' అనే సినిమాని ఆయన తీశారు. సూపర్ హిట్ ఫిల్మ్ 'నిన్నే పెళ్లాదతా'లో 'ఎటో వెళ్లిపోయింది మనసు' పాటతో పాపులర్ అయిన సింగర్ రాజేశ్‌ని ఈ సినిమాతో ఆయన హీరోగా పరిచయం చేశారు. కానీ ఆ సినిమా కూడా ఆయనకు కమర్షియల్‌గా అసంతృప్తినే మిగిల్చింది. ఈసారి నలుగురు మిత్రుల కథకి కాస్త సందేశాన్ని మేళవించి 'రూంమేట్స్' సినిమాని డైరెక్ట్ చేశారు ఏవీయస్. కొన్ని వర్గాల నుంచి ప్రశంసలు పొందినప్పటికీ ఈసారీ సక్సెస్ రుచి చూడలేకపోయారు. దాంతో తనలోని దర్శకుడికి మూడున్నరేళ్లు విరామం ఇచ్చిన ఆయన ఇప్పుడు 'కోతిమూక'తో మరోసారి పరీక్షకి సిద్ధమయ్యారు.
'వినాయకుడు', 'విలేజ్‌లో వినాయకుడు' సినిమాలతో కొత్త తరహా హీరోగా స్థూలకాయుడైన కృష్ణుడు సక్సెస్ కావడంతో అతణ్ణే హీరోగా పెట్టి 'కోతిమూక' రూపొందించారు ఏవీయస్. "కోతి అంటూ హేళనగా చూస్తారు కానీ, ఆ కోతులే లంకకు వారధి కట్టాయనీ, శ్రీరామునికి ఘనవిజయం చేకూర్చి పెట్టాయనీ రామాయణం చెబుతుంది. అలాగే మా చిత్రంలోని కోతిమూక కూడా ఇతరులకు ఉపయోగపడే పనులు చేస్తుంది" అని తెలిపారు ఏవీయస్. అందుగు తగ్గట్లే టైటిల్‌కి 'నాట్ ఓన్లీ కామెడీ' అనే ట్యాగ్ లైన్‌ని ఉపయోగించారు. ఈ సినిమాతో డైరెక్టర్‌గా ఏవీయస్ విజయాన్ని సాధించడం ఖాయమని స్టార్ కమెడియన్ బ్రహ్మానందం సహా ఆ సినిమాకి పనిచేసిన వాళ్లంతా గట్టి నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. రెట్టించిన బలంతో, గట్టి పట్టుదలతో ఏవీయస్ చేసిన ఈ ప్రయత్నం ఫలించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. జూలై 9న 'కోతిమూక' మనముందుకు వస్తోంది.
Subscribe to:
Posts (Atom)



