Showing posts with label b gopal. Show all posts

Thursday, November 10, 2011
ఏడేళ్ల తర్వాత బాలయ్యతో పరుచూరి బ్రదర్స్!
'సమరసింహారెడ్డి', 'నరసింహనాయుడు' వంటి బ్లాక్‌బస్టర్ సినిమాల కాంబినేషన్ బాలకృష్ణ, పరుచూరి బ్రదర్స్ ఏడేళ్ల తర్వాత కలిసి పనిచేస్తున్నారు. చివరిసారిగా వారు 'లక్ష్మీనరసింహా' సినిమాకి పనిచేశారు. ఇప్పుడు ఇన్నాళ్లకి వారు 'హరహర మహాదేవ' సినిమా కోసం కలిశారు. బి. గోపాల్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని బెల్లంకొండ సురేశ్ నిర్మిస్తున్నారు. 'లక్ష్మీ నరసింహా' నిర్మాత కూడా ఆయనే కావడం విశేషం. ఇక బి. గోపాల్ విషయానికొస్తే ఎనిమిదేళ్ల తర్వాత ఆయన బాలకృష్ణని డైరెక్ట్ చేస్తున్నాడు. 2003లో వచ్చి ఘోరంగా ఫెయిలైన 'పలనాటి బ్రహ్మనాయుడు' సినిమాకి చివరగా ఆ ఇద్దరూ కలిసి పనిచేశారు. దీనికి రచన చేసింది కూడా పరుచూరి సోదరులే. ఇప్పుడు ఈ నలుగురి (పరుచూరి బ్రదర్స్ ఇద్దరు కాబట్టి) కలిసి 'పలనాటి బ్రహ్మనాయుడు' చేదు అనుభవాన్ని మర్చిపోవాలనే కసితో పనిచేస్తున్నారు. పవర్‌ఫుల్ డైలాగ్స్‌కి పెట్టింది పేరైన బ్రదర్స్ ఇందులో 'సై అంటే శరభ శరభ.. జై అంటే ఆయుష్మాన్‌భవ.. కాదని ఎదురొస్తే హరహర మహాదేవ' వంటి శక్తివంతమైన డైలాగులు రాశారు. అయితే ఏ సినిమాకైనా కథే ప్రాణాధారం కాబట్టి 'హరహర మహాదేవ' కథ విషయంలో బి. గోపాల్ చాలా శ్రద్ధ తీసుకుంటున్నాడు. మంచి పాటలు, యాక్షన్ పార్ట్, పవర్‌ఫుల్ కేరక్టర్, కావలసినంత సెంటిమెంట్ రంగరించి ఈ సినిమా కథని వండారు. ఈ సినిమాతో పునర్వైభవం పొందాలని ఇటు పరుచూరి బ్రదర్స్, అటు బి. గోపాల్ చేస్తున్న కృషి ఏ మేరకు సఫలమవుతుందో చూడాలి.
Wednesday, July 27, 2011
న్యూస్: తండ్రి లాగే రామునిగా బాలయ్య అలరిస్తాడా?
వరుసగా ఏడు ఫ్లాపుల తర్వాత వచ్చిన సూపర్ హిట్ మూవీ 'సింహా'తో జూలు విదిల్చాడు నందమూరి బాలకృష్ణ. తన పని అయిపోయిందని జరుగుతున్న ప్రచారానికి ఆ సినిమాతో జవాబిచ్చాడు. అయితే ఆ వెంటనే వెటరన్ డైరెక్టర్ దాసరి నారాయణరావు 150వ సినిమా 'పరమవీరచక్ర' చేసి పొరబాటు చేశాడు. ప్రేక్షకులు ఆ సినిమాని నిర్ద్వంద్వంగా తిరస్కరించినా ఇప్పటికీ అది తన దృష్టిలో గొప్ప సినిమానే అని గొప్పలు చెబుతూనే ఉన్నారు దాసరి. దాని సంగతి పక్కన పెడితే ఇప్పుడు బాలకృష్ణ మూడు సినిమాలు చేస్తున్నాడు. వాటిలో బాపు దర్శకత్వంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న పౌరాణిక చిత్రం 'శ్రీరామరాజ్యం' ప్రధానమైంది. ఎన్టీఆర్ ఒకప్పటి చిత్రరాజం 'లవకుశ' ఆధారంగా కొద్దిపాటి మార్పులు చేర్పులతో ఈ సినిమా తీస్తున్నారు. దివంగత ముళ్లపూడి వెంకటరమణ సంభాషణలు రాసిన ఈ చిత్రంలో రామునిగా బాలకృష్ణ నటిస్తుంటే, ఆయన సరసన సీతగా అందాల తార నయనతార నటించడం విశేషం. సూపర్‌హిట్ మూవీ 'సింహా' తర్వాత వారు కలిసి పనిచేసిన సినిమా కావడంతో ఈ జోడీ తప్పకుండా మరోసారి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని అంచనా వేస్తున్నారు. తన చివరి కాల్షీట్ రోజు నయనతార ఈ సినిమా సెట్స్ మీద భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకోవడం చర్చనీయాంశమైంది. ఇందులో వాల్మీకిగా అక్కినేని నాగేశ్వరరావు, లక్ష్మణునిగా శ్రీకాంత్, భరతునిగా సాయికుమార్ నటిస్తుండటంతో సినిమాకి స్టార్ వాల్యూ కూడా ఏర్పడింది. ఇది కాక పరుచూరి మురళి డైరెక్షన్‌లో తయారవుతున్న సినిమాలో త్రిపాత్రాభినయం చేస్తున్నాడు బాలకృష్ణ. ఇటీవలే సీనియర్ డైరెక్టర్ బి. గోపాల్ నిర్దేశకత్వంలో 'హర హర మహదేవ' సినిమా మొదలైంది. ఈ సినిమాలతో, ముఖ్యంగా 'శ్రీరామరాజ్యం'తో బాలయ్య తెలుగు ప్రేక్షకుల్ని సమ్మోహితుల్ని చేస్తాడని ఆయన అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వారి ఆశలు నెరవేరుతాయా?
Saturday, January 29, 2011
హిట్.. హిట్.. హుర్రే...!: నరసింహనాయుడు (రెండో భాగం)
'నరసింహనాయుడు' నిర్మాణ వ్యయం దాదాపు 8 కోట్ల రూపాయలు. పదేళ్ల క్రితం అంత బడ్జెట్ అంటే చాలా ఎక్కువే. ఈ సినిమాలో భారీ సంఖ్యలో టాటా సుమోలు కనిపిస్తాయి. విలన్, హీరో గ్రూపులకు ఇలా అధిక మొత్తంలో సుమోలను ఉపయోగించడం దర్శకుడు గోపాల్ ప్రారంభించిన ధోరణే. భావోద్వేగ సన్నివేశాల సందర్భాల్లో అలా బారులు బారులుగా తెల్లటి సుమోలు కనిపిస్తుంటే ప్రేక్షకుడి రోమాలు నిక్కబొడుచుకునేవి ఆ రోజుల్లో. ఆ తర్వాత రోజుల్లో సందర్భం ఉన్నా, లేకున్నా అధిక సంఖ్యలో సుమోలు వాడటం విపరీత ధోరణిగా మారి, ప్రేక్షకులకి మొహం మొత్తడం వేరే సంగతి. 'నరసింహనాయుడు'లో టాటా సుమోల సన్నివేశాలన్నీ ఉద్వేగభరిత సన్నివేశాల్లో వచ్చేవే. అందుకే అవి కథలో అంతర్భాగంగా ఇమిడిపోయాయి. ఆయా సన్నివేశాల్ని పండించాయి. వాటితో పాటు రైలుబండి వద్ద యాక్షన్ సన్నివేశాలు, హెలికాప్టర్‌ని వినియోగించడం వంటివి ఈ సినిమా వ్యయాన్ని బాగా పెంచాయి. అంత వ్యయమంటే అప్పట్లో చాలా రిస్కే. చిన్నికృష్ణ కథనీ, గోపాల్ దర్శకత్వ సామర్థ్యాన్నీ నమ్మినందునే నిర్మాత మురళీకృష్ణ అంత మొత్తాన్ని వెచ్చించారు. "ఎందుకు, ఏమిటి అనకుండా అడిగిందల్లా సమకూర్చిపెట్టారు నిర్మాత మురళీకృష్ణ గారు. ఎప్పుడూ 'ఇదొద్దు' అనలేదు. సూట్‌కేసులతో డబ్బులు కుమ్మరించారు. ఆయనకి హేట్సాఫ్ చెప్పాలి" అని కృతజ్ఞత వ్యక్తం చేస్తారు దర్శకుడు గోపాల్. బడ్జెట్ విషయంలో తీసుకున్న రిస్కుకి తగ్గట్లుగానే అనూహ్యమైన ఫలితం దక్కింది. ఖర్చుకి రెండు రెట్లకి మించి 21 కోట్ల రూపాయల్ని వసూలు చేసింది ఈ చిత్రం. ఆ విధంగా 20 కోట్ల రూపాయల వసూళ్లు సాధించిన తొలి సినిమాగా ఇది రికార్డులకెక్కింది. ఈ ఫలితాన్ని ఊహించింది ఒకే ఒక్కడు. అతను చిన్నికృష్ణ. తను రాసిన స్క్రిప్టు చివరి పేజీలోనే ఆయన 'ఈ సినిమా 20 కోట్ల రూపాయల్ని వసూలు చేస్తుంది' అనే మాట కూడా రాశాడు. అది నూటికి నూరు శాతమూ నిజమవడం విశేషమే.
మరి ఇంతటి విజయాన్ని సాధించిన 'నరసింహనాయుడు' బలం ఎక్కడుంది? ఏయే అంశాలు ఆ సినిమాకి అంతటి విజయాన్ని చేకూర్చిపెట్టాయి? ఈ సినిమాలో లోపాలే లేవా? ఎందుకు లేవు! నరసింహనాయుడు పెద్దవాడై మనకి కనిపించడమే నాట్యాచార్యునిగా కనిపిస్తాడు. అయితే చిన్నతనంలోనే కర్రసాము, కత్తిసాము నేర్చుకుని తర్వాత ప్రత్యర్థుల పీచమణూస్తూ వచ్చిన నరసింహనాయుడు ఎప్పుడు నాట్యం నేర్చుకున్నాడు? నేర్చుకున్నా అంత తొందరగా నాట్యాచార్యుడు ఎలా అయ్యాడు? అనేవి సమాధానం లభించని ప్రశ్నలు. అలాగే 'సర్వకాల సర్వావస్థల్లోనూ నీ తోడుగా, నీడగా ఉంటాను' అని ప్రమాణం చేసి పెళ్లి చేసుకున్న భార్యను అన్నావదినల్ని తూలనాడిందనే కారణంతో కనీసం ఆమె వాదన కూడా వినకుండా పుట్టింటికి పంపేయడం ధీరోదాత్త నాయకుని లక్షణం కాదు. నరసింహనాయుడు ఆ పని చేశాడు. భార్య పట్ల చాలా కఠినంగా వ్యవహరించి, ఆమెని వ్యధకు గురిచేశాడు. అంటే కథలో శ్రావణి పాత్రకు అన్యాయం జరిగింది.
అయితే మామాలు ప్రేక్షకుడికి ఇవేవీ పట్టలేదు. కారణం, వాటిని గుర్తించని రీతిలో అమరిన స్క్రీన్‌ప్లే. ఆరంభం నుంచి శుభం దాకా కుర్చీల్లో కదలనివ్వని కథాగమనం 'నరసింహనాయుడు'కి పెద్ద బలం. ఆ పాత్రని ప్రేక్షకులు అంతగా ప్రేమించడానికి దోహదం చేసింది అదే. ఇంటర్వెల్ వచ్చినప్పుడు సాధారణంగా ప్రేక్షకుడు రిలీఫ్ పొందడానికి కుర్చీలోంచి లేస్తాడు. కానీ ఎప్పుడు ఇంటర్వెల్ టైం అయిపోతుందా, ఎప్పుడు సెకండాఫ్ మొదలవుతుందా.. అనే క్యూరియాసిటీని కలిగించింది ఈ చిత్రం. అంతదాకా అజ్ఞాతంలో ఉన్న నరసింహనాయుడు ఉనికి తెలిపే ట్రైన్ ఎపిసోడ్ కచ్చితమైన ఇంటర్వెల్ బ్యాంగ్. ప్రత్యర్థులకు మొదట వీపు చూపించి, 'స్లో మోషన్'లో నరసింహనాయుడు మొహాన్ని చూపిస్తుంటే, ఆ రూపాన్ని చూసీ చూడగానే ఠారెత్తి ఆ ప్రత్యర్థులు ఆయుధాలు అక్కడే పడేసి పరుగులు తీస్తుంటే, 'మాస్' ప్రేక్షకుడికి అంతకంటే ఉద్వేగభరిత సన్నివేశం ఇంకేముంటుంది! అంతకుముందు దాకా సాఫ్ట్‌గా కనిపించి, సింహాచలం నాయుడు తమ్ముళ్లని చితగ్గొట్టినా నరసింహనాయుడులోని హీరోయిజాన్ని ఒకేసారి వెయ్యి రెట్లు పెంచేసిన సన్నివేశం అది. నరసింహనాయుడు వంటి బలమైన పాత్రలు అరుదుగా వస్తుంటాయి. అది త్యాగం, పౌరుషం సమపాళ్లలో రంగరించిన పాత్ర. ఆ పాత్ర జనానికి అంతగా ఎందుకు నచ్చింది? "అతను (నరసింహనాయుడు) ఊరికోసం ప్రత్యర్థిని చంపుతాడు. కుటుంబం కోసం చదువుసంధ్యలు వదిలేశాడు. అన్నయ్యలను తూలనాడింది అన్ని కట్టుకున్న భార్యను వదిలేస్తాడు. సోదరుల కోసం ప్రాణాలను త్యాగం చేయడానికి సిద్ధపడతాడు. వాళ్లను రక్షించుకునే సమయంలో భార్యను పోగొట్టుకుంటాడు. కొడుకు వేరే కథానాయికలో అమ్మను వెతుక్కుంటే అంగీకరించడు. కానీ తండ్రి 'ఇంతమందికి ఇన్ని చేశావు, ఆ పసివాడికి అమ్మను తెచ్చిపెట్టలేవురా' అంటే వెళ్లి తీసుకొస్తాడు. విచిత్రం ఏమిటంటే ఏదీ తనకోసం చేయడు. తనవారికోసమే చేస్తాడు. అందుకే అందరికీ నచ్చిందా పాత్ర" అని వివరిస్తారు పరుచూరి కోపాలకృష్ణ.
అలాంటి పాత్రను తనదైన శైలితో రక్తి కట్టించారు బాలకృష్ణ. సెంటిమెంట్ సన్నివేశాల్లో ఎంతటి సాత్త్వికాభినయం చేశారో, భావోద్వేగ సన్నివేశాల్లో అంతటి గాంభీర్యాన్ని ప్రదర్శించారు. పోరాట సన్నివేశాల్లో ఎంతటి పరాక్రమాన్ని చూపించారో, సరదా సన్నివేశాల్లోనూ, పాటల్లోనూ అంతటి హుషారు కనపరిచారు. అలా 'నరసింహనాయుడు'కి ప్రాణ ప్రతిష్ఠ చేశారు బాలకృష్ణ. అందుకే ఆ పాత్రని నెత్తికెత్తుకున్నారు జనం. అందుకే ఆ పాత్రకి 'ఉత్తమ నటుడు'గా నంది అవార్డు అందుకున్నారు బాలకృష్ణ.
ఆయనకు దీటుగా శ్రావణి పాత్రలో సిమ్రాన్ ప్రదర్శించిన అభినయం కూడా ప్రేక్షకుల మనసుల్లో హత్తుకుపోయింది. భర్తను అతని అన్నావదినలు ఇష్టం వచ్చినట్లు తూలనాడుతుంటే తట్టుకోలేక వారిమీద ఆమె తిరగబడే సన్నివేశం 'నరసింహనాయుడు' పాత్రౌచిత్యాన్ని పరిపుష్ఠం చేసింది. ఇక తండ్రి పాత్రలో కాశీనాథుని విశ్వనాథ్ ప్రదర్శించిన హుందాతనం, ప్రతినాయకునిగా ముఖేష్‌రుషి చూపించిన క్రూరత్వం జనాన్ని మెప్పించాయి. మిగతా తారలంతా తమకి అప్పగించిన పాత్రల్ని సమర్థంగా చేసుకుంటూ వెళ్లారు.
బి. గోపాల్ దర్శకత్వ ప్రతిభ ప్రతి ఫ్రేములోనూ కనిపించే ఈ సినిమా విజయానికి దోహదం చేసిన అంశాల్లో ప్రముఖమైంది మణిశర్మ కూర్చిన సంగీతం. బాలకృష్ణ, ఆషా సైనీపై చిత్రీకరించిన 'లక్స్ పాప లక్స్ పాప లంచ్‌కొస్తావా' పాట మాస్‌ని ఓ ఊపు ఊపింది. 'కొక్కో కోమలి కొరుక్కుతిన్నది కోలాటంలో', 'చిలకపచ్చ కోక పెట్టినాది కేక', 'మొన్నా కుట్టేసినాది నిన్నా కుట్టేసినాది' పాటలు జనంలోకి బాగా వెళ్లాయి. ఇక సన్నివేశాలకు బలం చేకూర్చిన నేపథ్య సంగీతాన్నీ విస్మరించలేం. చిన్నికృష్ణ స్క్రీన్‌ప్లేకి మరింత బలాన్నిచ్చినవి పరుచూరి సోదరుల సంభాషణలు. బావోద్వేగ సంభాషణలకు పెట్టింది పేరైన వారు 'కత్తులతో కాదురా కంటిచూపుతో చంపేస్తా' తరహా డైలాగులతో చెడుగుడు ఆడుకున్నారు. తన బావలు, తోడికోడళ్ల వద్ద ఆవేశభరితంగా శ్రావణి నోట పలికే ఇంగ్లీషు డైలాగులకు చప్పట్లు పడ్డాయంటే ఆ క్రెడిట్ వాళ్లదే. సినిమాకి మంచి 'లుక్' రావడంలో కీలకమైంది వి.ఎస్.ఆర్. స్వామి సినిమాటోగ్రఫీ. చేజింగ్ సీన్లలో ఆయన కెమెరా ఎక్కడా షేక్ కాలేదు. భావోద్వేగ సన్నివేశాల్లో ఆయన కెమెరా యాంగిల్స్ అత్యుత్తమ స్థాయిలో ఉన్నాయి. అలాగే పోరాట సన్నివేశాల్ని గొప్పగా రూపొందించి 'నరసింహనాయుడు' విజయంలో తనదీ ప్రముఖ పాత్రేనని చాటిచెప్పారు స్టంట్ మాస్టర్ విక్రం ధర్మా. ఇవన్నీ తెరమీద ఇలా పండాయంటే అందుకు ఎడిటింగ్ నిర్వహించే పాత్ర చాలా ఎక్కువ. ఆ పనిని అత్యంత సమర్థంగా నిర్వహించారు కోటగిరి వెంకటేశ్వరరావు.
ఇలా ఇందరి సమష్టి కృషి వల్లే 'నరసింహనాయుడు' చిత్రం గొప్ప విజయాన్ని సాధించింది. మునుపటి బాక్సాఫీసు వసూళ్ల చరిత్రని తిరగరాసింది. 105 కేంద్రాల్లో శతదినోత్సవం, 17 కేంద్రల్లో రజతోత్సవం జరుపుకుంది. ఏలూరులో 275 రోజులు ఆడింది. 'సమరసింహారెడ్డి' తర్వాత బాలకృష్ణ - బి. గోపాల్ ద్వయానికి మరో సంచలన చిత్రంగా నిలిచింది.
'నన్ను మళ్లీ ట్రాక్‌లో నిలిపిన సినిమా'
-బి. గోపాల్
చిన్నికృష్ణ 'సమరసింహారెడ్డి' టైంలోనే కలిసేవాడు. కథలు చెప్పేవాడు. అప్పుడు ఆ కథలు వర్కవుట్ కాలేదు. తర్వాత నేనే పిలిపించా. ఈ కథ చెప్పాడు. ఇంటర్వెల్ వరకు చెప్పాడు. బాగుంది. నిర్మాతకీ, బాలకృష్ణకీ నచ్చింది. మొదట సెకండాఫ్‌లో హీరో ఐపీఎస్ ఆఫీసర్‌గా కనిపిస్తాడని చెప్పాడు. నాకు ఐపీఎస్ ఆఫీసర్ అనే పాయింట్ నచ్చలేదు. అప్పటికే బాలయ్యతో 'రౌడీ ఇన్‌స్పెక్టర్' చేసివున్నా. నాలుగు రోజుల్లో బాలయ్యకు సెకండాఫ్ చెప్పాలి. పోలీసాఫీసర్ గెటప్ లేకుండా చెప్పమన్నా. చిన్ని కొంత అప్సెట్ అయ్యాడు. దాంతో పరుచూరి బ్రదర్స్‌తో చిన్నికి మీటింగ్ ఏర్పాటు చేయించా. అప్పుడు ఇంటికొక్కడు బలిదానమయ్యే పాయింట్ చెప్పాడు చిన్ని. నేను డౌట్‌పడ్డా. గోపాలకృష్ణ బాగుందన్నారు. ఆ తర్వాత సీనార్డర్ వేసుకొచ్చాడు చిన్ని. అది అందరికీ నచ్చింది. 'నరసింహనాయుడు' పాత్ర చెబుతుంటేనే బాలయ్య ఎగ్జయిట్ అయ్యారు. వెంటనే 'ఈ సబ్జెక్టుతో సినిమా చేస్తున్నాం' అన్నారు. స్క్రీన్‌ప్లే గొప్పగా చేశాడు చిన్ని. షూటింగ్ మొదలైన ఆరు నెలల్లో సినిమాని విడుదల చేశాం. వేస్టేజ్ లేకుండా రీజనబుల్ బడ్జెట్‌లో సినిమా చేశాం. నిర్మాత ధైర్యంగా కొన్ని ఏరియాలు అమ్మకుండా ఉంచుకున్నారు. పెద్ద హిట్టవడంతో బాగా డబ్బు వచ్చింది.
బాలయ్య పర్ఫార్మెన్స్ ఎక్స్‌ట్రార్డినరీ. మొదట సాఫ్ట్‌గా, తర్వాత ఎమోషనల్ మేన్‌గా గొప్పగా నటించాడు. లుక్స్‌తోనే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. స్క్రిప్టుకు తగ్గట్టు వంద శాతం కాదు వెయ్యి శాతం న్యాయం చేశాడు.
'సమరసింహారెడ్డి' తర్వాత నేను చేసిన సినిమాలు సరిగా రాలేదు. ఈ సినిమా నన్ను మళ్లీ ట్రాక్‌లో నిలబెట్టింది. టెక్నీషియన్లకి ఇక సక్సెస్ వస్తే చెప్పలేని ఆనందం. ఆయుష్షు పెంచినంత బలాన్నిస్తుంది. ఇంకా మంచి సినిమా చెయ్యాలన్న ఉత్సాహాన్నిస్తుంది.

'నా అంచనా తప్పలేదు'
-చిన్నికృష్ణ
ఉత్తర భారతంలో దేశభక్తి ఎక్కువ. దక్షిణ భారతంలో వ్యక్తుల్ని పూజిస్తే, పంజాబ్‌లాంటి చోట్ల దేశాన్ని పూజిస్తారు. అందుకే ఆర్మీలో నార్త్‌వాళ్లు ఎక్కువ. అక్కడ కొన్ని గ్రామాల్లో ప్రతి ఇంటికీ ఒక్కో కొడుకు దేశ రక్షణలో ఉన్నాడు. నేను అలాంటి గ్రామాల్ని ప్రత్యక్షంగా చూశా. దానికి ఎంతో ఇన్‌స్పైర్ అయ్యా.
మన ఊరి సమస్యని కాపాడ్డానికి లా అండ్ ఆర్డర్ ఫెయిలయినప్పుడు ఒక్కో ఇంట్లో ఒక్కొక్కణ్ణి బలిదేవుడి (వారియర్)గా ఇస్తే వాళ్లు తమ ఊర్ని కాపాడుకుంటారనే ఐడియా అలా వచ్చింది. అట్లాంటి యోధులకి పెళ్లి సంబంధాలు రావు. ఒకవేళ పెళ్లయితే ఆ భార్యకి ఎన్నో కష్టాలుంటాయి. ఈ అంశాలు నా స్క్రిప్టులో 'బై-ప్రొడక్ట్స్'గా బాగా వర్కవుట్ అయ్యాయి.
నిజానికి నా మైండ్‌లో పోలీస్ కేరక్టర్ లేదు. మొదట సినిమా పోలీస్ అనుకుని మొదలుపెట్టినందునే అలా చెప్పా. తర్వాత గోపాల్ పోలీస్ ఆఫీసర్ కాకుండా చెప్పమన్నారు. నా మైండులో ఉన్న అసలు కథ అప్పుడు చెప్పా. 'లక్ష్మీనరసింహస్వామి' అనే థాట్ క్రియేట్‌చేసి తొలిగా చెప్పింది నేనే. నేను సృష్టించిన నరసింహనాయుడు కేరెక్టర్ ఇప్పటికీ కంటిన్యూ అవుతుండటం సంతోషకరం.
తమ ఇంట్లో ఈ స్క్రిప్టు వినగానే లోపలికి వెళ్లి స్వీట్ పాకెట్, పళ్లు తెచ్చిచ్చి, 'ఈ అబ్బాయి గొప్ప రైటర్ అవుతాడు' అని ఆశీర్వదించారు బాలకృష్ణ. ఆయన మిగతా హీరోలందరికంటే ఎంతో గొప్పవారు. సినిమా సక్సెస్ అవగానే కొన్ని లక్షల రూపాయలు విలువచేసే పురాతన పచ్చల పతకం, పట్టుబట్టలు ఇచ్చి, కారుదాకా మమ్మల్ని తీసుకువచ్చి పంపిన గొప్పవారు. నా 'నరసింహనాయుడు' పాత్రకి వంద శాతం జస్టిఫై చేశారు బాలకృష్ణ. చిన్నపిల్లాడిగా విని, పెద్ద నటునిగా చేశారు. విశ్వరూపాన్ని ప్రదర్శించారు కాబట్టే అంత పెద్ద హిట్టు.
ఈ సినిమా స్క్రిప్టు ఎ టు జడ్ నాదే. నా స్క్రిప్టు ఆఖరి పేజీలో '20 కోట్లు వస్తాయి' అని రాశా. బడ్జెట్ 8 కోట్లయితే, 21 కోట్లు వచ్చాయి. ప్రతి సినిమాకీ అలాగే రాస్తుంటా. అది అహంకారమనుకోండి, ఆత్మవిశ్వాసం అనుకోండి. ఇంతవరకు నా అంచనా తప్పలేదు. ఉత్తమ నటునిగా నంది అవార్డు అందుకుంటూ 'సాక్షాత్తూ లక్ష్మీనరసింహస్వామి చిన్నికృష్ణ రూపంలో మా ఇంటికి వచ్చి ఈ కథ చెప్పాడు' అన్నారు బాలకృష్ణ. అంతకుమించిన కాంప్లిమెంట్ నాకు ఇంకేముంటుంది! మళ్లీ ఆయనా, నేనూ కలుస్తాం. అది చరిత్ర అవుతుంది. అదే 'నందీశ్వరుడు'. తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని సినిమాలన్నీ అదే రోజు రిలీజైనా నేను రెడీ. 'నందీశ్వరుడు' మీద అంత గట్టి నమ్మకం.
(వచ్చే వారం 'ఖుషి' సినిమా కబుర్లు)

Saturday, January 22, 2011
హిట్.. హిట్.. హుర్రే...!: నరసింహనాయుడు (2001)
తారాగణం: బాలకృష్ణ, సిమ్రాన్, ప్రీతి జంగియాని, కె. విశ్వనాథ్, ముఖేష్ రుషి, మోహన్‌రాజ్, ఆశా షైనీ, జయప్రకాశ్‌రెడ్డి, సత్యప్రకాశ్, హేమంత్ రావణ్, రాఖీ, తెలంగాణ శకుంతల, బ్రహ్మానందం, గుండు హనుమంతరావు, చలపతిరావు, తనికెళ్ల భరణి, శివాజీరాజా, ముక్కురాజు, నర్రా వెంకటేశ్వరరావు
కథ, స్క్రీన్-ప్లే: చిన్నికృష్ణ
సంభాషణలు: పరుచూరి బ్రదర్స్
సంగీతం: మణిశర్మ
ఛాయాగ్రహణం: వి.ఎస్.ఆర్. స్వామి
కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు
కళ: రాజు
ఫైట్స్: విక్రం ధర్మా
డాన్స్: రాఘవేంద్ర లారెన్స్, బృంద, శ్రీను
నిర్మాత: మేడికొండ మురళీకృష్ణ
దర్శకత్వం: బి. గోపాల్
బేనర్: శ్రీ వెంకటరమణ ప్రొడక్షన్స్
విడుదల తేది: 11 జనవరి, 2001
'కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా'.. సుమారు పదేళ్ల క్రితం సంచలనం సృష్టించిన ఈ డైలాగ్‌ని జనం నేటికీ మరచిపోలేదు. ఆ తర్వాత దానికి ఎన్నో పేరడీలు వచ్చాయి. అంతగా జనం నోళ్లలో నానిన, నానుతోన్న డైలాగ్ 'నరసింహనాయుడు' చిత్రంలోనిది. అది చెప్పింది కథానాయకుడు నందమూరి బాలకృష్ణ. 2001లో అతిపెద్ద విజయాన్ని సాధించిన ఈ సినిమా అంతకు మునుపటి డెబ్భై ఏళ్ల తెలుగు చలనచిత్ర బాక్సాఫీసు కలెక్షన్ల రికార్డుని తిరగరాసింది. అంతేకాదు. నేటివరకు బాలకృష్ణ కెరీర్‌లోనూ అతిపెద్ద హిట్టు 'నరసింహనాయుడు'. ఆ స్థాయిలో ప్రేక్షకులు ఆ సినిమాకి విజయాన్ని చేకూర్చి పెట్టారంటే, అందులో అప్పటివరకు కనిపించని కొత్తదనమేదన్నా వాళ్లకి కనిపించిందా? లేదు. ఈ సినిమాలో అసాధారణ కథ లేదు. ఫార్ములాకి భిన్నమైన కథ కూడా కాదు. పోనీ కథనంలో ఏమన్నా కొత్తదనం వుందా అంటే - అదీ లేదు. మరెందుకు అంత సంచలనాత్మక విజయాన్ని 'నరసింహనాయుడు' సాధించాడు?
సినిమా అనేది సమష్టి కృషి. సినిమా విజయానికి ఎన్నో అంశాలు దోహదం చేస్తాయి. విజయం సాధించే సినిమాకి అన్ని అంశాలూ కలిసొస్తాయి. 'నరసింహనాయుడు' విషయంలో జరిగింది అదే. అయితే ఈ విజయంలో మొదటగా చెప్పుకోవాలసింది నిస్సందేహంగా 'నరసింహనాయుడు' పాత్రనీ, ఆ పాత్రని బాలకృష్ణ పోషించిన తీరునీ. ఆ చిత్ర సంభాషణల రచయితలు పరుచూరి సోదరుల్లో ఒకరైన గోపాలకృష్ణ తమ 'తెలుగు సినిమా సాహిత్యం' పుస్తకంలో 'నరసింహనాయుడు చిత్రం ఏడు దశాబ్దాల చలనచిత్ర రికార్డులన్నింటినీ బద్దలు కొట్టడానికి కారణం నరసింహనాయుడి పాత్రను తీర్చిదిద్దిన తీరే' అని చెబుతారు. ఆ పాత్రని అలా మలిచిందెవరు? కథా రచయిత చిన్నికృష్ణ. కథతో పాటు సినిమాకి ప్రాణమైన స్క్రీన్‌ప్లేనీ ఆయనే సమకూర్చాడు. తెలుగులో చిన్నికృష్ణకి ఇదే తొలి చిత్రం. అంటే తన మొదటి సినిమాతోటే రికార్డులు సొంతం చేసుకున్నాడు చిన్నికృష్ణ. అదివరకు రజనీకాంత్ సూపర్‌హిట్ తమిళ సినిమా 'పడయప్పా' (తెలుగులో 'నరసింహా') స్క్రిప్టు రచయితల్లో ఒకడిగా ఆయన వెలుగులోకి వచ్చాడు. 'నరసింహనాయుడు' అవకాశాన్ని కల్పించింది అదే. నిజానికి ఆ అవకాశం అనుకోని రీతిలో ఆయనకి వచ్చింది. అప్పటికే పోసాని కృష్ణమురళి కథతో సినిమాని ప్రారంభించారు దర్శకుడు గోపాల్, నిర్మాత మేడికొండ మురళీకృష్ణ. ఆ కథలో బాలకృష్ణ పోలీసాఫీసర్. అదే గెటప్‌తో ఆయన మీద తీసిన తొలి సన్నివేశానికి అక్కినేని నాగేశ్వరరావు క్లాప్‌నిచ్చారు.
అయితే తర్వాత ఎందుకనో గోపాల్‌కి ఆ కథ నచ్చలేదు. కారణం ఆయన అప్పటికే బాలకృష్ణతో 'రౌడీ ఇన్‌స్పెక్టర్' తీసి ఉన్నాడు. అది పెద్ద హిట్టు కూడా. దానికంటే ఆ కథ గొప్పగా లేదనిపించింది. అప్పుడు 'సమరసింహారెడ్డి' కాలంలోనే తనకి పరిచయమైన చిన్నికృష్ణని పిలిపించాడు గోపాల్. హైదరాబాద్‌లోని ఫిలించాంబర్‌లో చర్చలు మొదలయ్యాయి. అప్పుడే చిన్నికృష్ణకు ఓ సంగతి తెలిసింది. "అప్పటికే చాంబర్ బిల్డింగ్‌లోని గెస్ట్‌హౌస్‌లో ప్రసిద్ధ రచయితలు విజయేంద్రప్రసాద్, ఆంజనేయ పుష్పానంద్, ఈరోడ్ సుందర్ ('పెదరాయుడు' కథారచయిత), పోసాని కృష్ణమురళి ఒక్కో గదిలో ఉండి కథలు చెబుతున్నారు. అందరికంటే నేనే చిన్నవాణ్ణి. అప్పుడు నా వయసు 32 యేళ్లు. నేను గోపాల్‌గారికి ఒకే స్క్రిప్టు చెప్పా. ఆయన పరుచూరి గోపాలకృష్ణగార్ని పిలిపించారు. కథ విన్న ఆయనకి ఓపెనింగ్ సీన్ బాగా నచ్చింది. హీరో ఓ నాట్యాశ్రమాన్ని నడుపుతూ కొడుకుతో పాటు అజ్ఞాతంలో ఉంటూ ప్రశాంత జీవితం గడపడమనే పాయింట్ కొత్తగా ఉందని చెప్పి, నా కథని ఓకే చేశారు. ఆ తర్వాత బాలకృష్ణగారికీ వినిపిస్తే, ఆయన వెంటనే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశారు. 'నరసింహనాయుడు'తో నేను తెలుగు పరిశ్రమకి పరిచయమయ్యానంటే సగం ఘనత గోపాల్ గారిదీ, సగం ఘనత గోపాలకృష్ణ గారిదీ" అని చెప్పారు చిన్నికృష్ణ. అలా పోసాని కృష్ణమురళి కథ స్థానంలో చిన్నికృష్ణ కథ వచ్చింది.
కథా సంగ్రహం:
రాయలసీమ కర్నూలు జిల్లాలోని రెండు గ్రామాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఒక గ్రామానికి పెద్ద రఘుపతినాయుడు (కె. విశ్వనాథ్) అయితే ఇంకో గ్రామం అప్పల్నాయుడు (మోహన్‌రాజ్), అతని బావమరిది కుప్పుస్వామినాయుడు (ముఖేష్‌రుషి) అజమాయిషీలో ఉంటుంది. వాళ్లనుంచి తమ గ్రామాన్ని కాపాడుకోడానికి ఒక సైన్యాన్ని తయారుచేయడం కోసం ఊళ్లోవాళ్లందర్నీ ఇంటికొక బిడ్డని బలిదానం చేయమంటాడు రఘుపతినాయుడు. తన వంతుగా నలుగురు కొడుకుల్లో చిన్నవాడైన నరసింహనాయుణ్ణి దానం చేస్తాడు.
సంవత్సరాలు గడుస్తాయి. నాట్యాచార్యుని అవతారమెత్తిన నరసింహ (బాలకృష్ణ) ఓ నాట్యాశ్రమాన్ని నడుపుతుంటాడు. అదే ఊళ్లో కుప్పుస్వామినాయుడు కూతురు అంజలి (ప్రీతి జంగియాని) మేనమామ సింహాచలంనాయుడు (జయప్రకాశ్‌రెడ్డి) ఇంట్లో ఉండి చదువుకుంటూ నరసింహని ప్రేమిస్తుంది.
అంజలిని మేనల్లుడైన దివాకర్ (హేమంత్ రావణ్)కిచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు కుప్పుస్వామి. కట్నంగా నరసింహనాయుడు తల కావాలన్న అక్క నాగమణి (తెలంగాణ శకుంతల)కి అలాగేనని వాగ్ధానం చేస్తాడు. అయితే నరసింహనాయుణ్ణి అంజలి ఇష్టపడ్తున్న సంగతి తెలిసి, ఊరువిడిచి వెళ్లమని నరసింహనాయుణ్ణి హెచ్చరించిన సింహాచలంనాయుడు తమ్ముళ్లు, పసివాడైన అతని కొడుకుని పైకి విసిరేస్తారు. దాంతో కొడుకుని రక్షించుకుని, వాళ్లందర్నీ చితగ్గొడతాడు నరసింహనాయుడు. అక్కణ్ణించి వెళ్లిపోవాలని ఆశ్రమం ఖాళీచేస్తాడు. బావతో పెళ్లి ఇష్టంలేని అంజలి కూడా నరసింహ వెళ్తున్న రైలుబండిలోనే ఎక్కుతుంది. ఇద్దరూ కలిసే వెళ్తున్నారనుకున్న దివాకర్ బృందం రైలుని ఆపేస్తారు. రైలు దిగుతాడు నరసింహనాయుడు. అంతే! అతన్ని చూసీ చూడగానే దివాకర్ బృందం ఆయుధాలు పారేసి, భయంతో పరుగులు తీస్తారు.
అదిచూసి ఆశ్చర్యపోయిన అంజలికి తన గతం చెబుతాడు నరసింహనాయుడు. ఆ గతం.. తండ్రిమీద దౌర్జన్యం చేసిన అప్పల్నాయుణ్ణి హతమారుస్తాడు నరసింహ. అతని కొడుకుల్ని చావగొడతాడు. చేతులూ, కాళ్లూ విరిగిన వాళ్లు తండ్రి చితికి కొరివి పెట్టలేని స్థిలో వుంటే బావమరిది కుప్పుస్వామి వచ్చి కొరివి పెడతాడు. నరసింహ చితి మండేదాకా తాళి, బొట్టు తీయొద్దని అక్క నాగమణితో ఆవేశంతో చెబుతాడు. శ్రావణి (సిమ్రాన్)ని పెళ్లిచేసుకుంటాడు నరసింహ. విదేశాల్లో వున్న అన్నలు పెళ్లికి రాకపోవడంతో వాళ్ల ఫోటోని ఎదురుగా పెట్టుకుని మరీ చేసుకుంటాడు. గుడివద్ద నరసింహ, కుప్పుస్వామి ఒకరికొకరు తారసపడతారు. అంతుచూస్తానన్న కుప్పుస్వామితో "ప్లేస్ నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే/టైం నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే/ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే/కత్తులతో కాదురా కంటిచూపుతో చంపేస్తా" అంటాడు నరసింహ.
'నీ మొగుడు నా మొగుణ్ణి చంపాడు' అని నాగమణి చెప్పడంతో భర్త వాస్తవ జీవితం తెలుస్తుంది శ్రావణికి. విదేశాల నుంచి వచ్చిన నరసింహ అన్నావదినల వల్ల ఎదురైన అవమానాలకు తట్టుకోలేక వారికి ఎదురుతిరిగి మాట్లాడుతుంది శ్రావణి. ఇంటికొచ్చిన నరసింహకి ఆమెమీద పితూరీలు చెబుతారు అన్నావదినలు. దాంతో మనస్తాపం చెందిన నరసింహ వాళ్లకే విలువనిచ్చి శ్రావణిని పుట్టింటికి పంపేస్తాడు. అప్పటికే నిండు చూలాలైన శ్రావణి పుట్టింట్లోనే కొడుకుని కంటుంది. నరసింహ మీద అలిగిన అన్నలు విదేశాలకు వెళ్లేందుకు సిద్ధమవుతారు. కుప్పుస్వామి వల్ల ప్రమాదం వుండటంతో పోలీసుల సాయంతో వెళ్తారు. మరోవైపు మనవణ్ణి చూడాలనుకున్న రఘుపతి తనకు రక్షణగా కొడుకుని రమ్మంటాడు. నరసింహ అన్నలమీద కుప్పుస్వామి మనుషులు దాడిచేస్తారు. విషయం తెలిసి నరసింహ అక్కడికి వచ్చి, తాను గొడ్డలి దెబ్బ తిని కూడా అన్నావదినల్ని కాపాడతాడు. ఈలోగా నరసింహ కొడుకుని చంపాలనుకుని శ్రావణి వద్దకు వెళ్లిన కుప్పుస్వామికి పసివాడు కనిపించడు. కొడుకుని దాచి, తాను కుప్పుస్వామి చేతిలో బలైపోతుంది శ్రావణి. ఆ తర్వాత నరసింహ చేతుల్లో తుదిశ్వాస విడుస్తూ కొడుకుని అతని చేతుల్లో పెట్టి కొట్లాటలకు దూరంగా వుండమని ఒట్టు వేయించుకుంటుంది. తండ్రి కూడా చెప్పడంతో భార్యకిచ్చిన మాటకోసం కొడుకుని తీసుకుని దూరంగా వెళ్లిపోతాడు నరసింహ. ఇదీ గతం.
వర్తమానానికొస్తే విషయం తెలిసి నరసింహని చంపడానికి అతనింటికి వచ్చిన కుప్పుస్వామికి అంజలినిచ్చి పంపిస్తాడు నరసింహ. అంజలిని 'అమ్మా' అని పిలుస్తున్న అతని కొడుకుని చూసి, ఆ పసిబిడ్డకు అమ్మనివ్వమని నరసింహని వేడుకుంటాడు రఘుపతి. సరేనని కుప్పుస్వామి ఇంటికొచ్చి 'రేపు ఉదయం 10 గంటలకి నాకూ, అంజలికీ వివాహం' అని చెబుతాడు. మరుసటి రోజు చెప్పినట్లే అంజలిని తీసుకెళ్లడానికి వస్తాడు. నరసింహకీ, కుప్పుస్వామికీ ముఖాముఖి పోరు జరుగుతుంది. నరసింహ చేతిలో చావుదెబ్బలు తింటాడు కుప్పుస్వామి. అంజలి హాస్పిటల్లో ఉందని తెలిసి అందరూ అక్కడకు వెళతారు. నరసింహ కొడుకు కోసం తనకి పిల్లలు పుట్టకుండా అంజలి ఆపరేషన్ చేయించుకోవడం చూసి కుప్పుస్వామి పశ్చాత్తాపపడతాడు. అందరూ ఒక్కటవుతారు.
(వచ్చేవారం 'నరసింహనాయుడు' విజయానికి దోహదం చేసిన అంశాలు)
-నవ్య వీక్లి, జనవరి 12, 2011

Sunday, November 14, 2010
సినిమా: 'రెడీ' తర్వాత రాం ఎక్కడ?
'రెడీ' తర్వాత రాంకి ఇంతదాకా హిట్టులేదు. ఇప్పటివరకు ఆరు సినిమాలు చేసిన అతడికి దక్కింది రెండు హిట్లే. వాటిలో ఒకటి తొలి సినిమా 'దేవదాసు' అయితే, ఇంకోటి శ్రీను వైట్ల డైరెక్ట్ చేసిన 'రెడీ'. ఈ రెంటి మధ్యలో వచ్చిన 'జగడం'తో పాటు 'రెడీ' తర్వాత వచ్చిన 'మస్కా', 'గణేష్', 'రామరామ కృష్ణకృష్ణ' సినిమాలు ఫ్లాపయ్యాయి. ఈ ఫ్లాపయిన సినిమాలన్నీ పేరుపొందిన వాళ్లు తీసినవే కావడం గమనించాలి.
'జగడం'ని డైరెక్ట్ చేసింది 'ఆర్య' ఫేం సుకుమార్. 'మస్కా'ని నిర్మింది ఎమ్మెస్ రాజు అయితే, డైరెక్త్ చేసింది బి. గోపాల్. 'గణేష్' ప్రొడ్యూసర్ స్రవంతి రవికిశోర్ కాగా, 'రామరామ కృష్ణకృష్ణ' నిర్మాత దిల్ రాజు. ఈ క్రేజీ ప్రాజెక్టులన్నీ బోల్తా కొట్టడంతో 'రెడీ' టైంలో ఆకాశంలోకి చూసిన రాం నేలమీదికి దిగొచ్చాడు. సినీ రంగంలో జయాపజయాలకి ఎవరూ అతీతులు కాదనే సంగతి అనుభవంలోకి వచ్చాక అతని ప్రవర్తనలో కాస్త మార్పు వచ్చింది. 'రెడీ' మత్తులో ఉన్నంత కాలం ఎదుటివాళ్లతో అతడు ఎలా ప్రవర్తించిందీ చాలామందికి అనుభవమే. ఇప్పుడు అతడు కాస్త పరిణతితో వ్యవహరిస్తున్నాడని చెప్పుకుంటున్నారు. సబ్జెక్టుల విషయంలో అలాంటి పరిణతితో వ్యవహరిస్తే మళ్లీ అతడు హిట్ల బాటలోకి వస్తాడనేది చాలామంది అభిప్రాయం.
ప్రస్తుతం అతడు 'కందిరీగ' అనే సినిమా చేస్తున్నాడు. బెల్లంకొండ సురేశ్ నిర్మిస్తోన్న ఈ సినిమా ద్వారా సినిమాటోగ్రాఫర్ సంతోష్ శ్రీనివాస్ డైరెక్టర్‌గా పరిచయమవుతున్నాడు. అతను 'ఖతర్నాక్', 'రెయిన్‌బో', 'నీ నవ్వే చాలు' వంటి ఫ్లాప్ సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశాడు. 'కందిరీగ'ని అతడెలా హ్యాండిల్ చేస్తాడో చూడాలి. ఇందులో హన్సిక హీరోయిన్. 'మస్కా' తర్వాత రాం, హన్సిక కలిసి చేస్తున్న సినిమా ఇది. 'కందిరీగ'తోనైనా రాం కెరీర్ గాడిన పడుతుందా?

Subscribe to:
Posts (Atom)