Showing posts with label nani. Show all posts
Showing posts with label nani. Show all posts
Thursday, October 29, 2015
Tuesday, September 8, 2015
Bhale Bhale Magadivoy (2015) Movie Review
భలే భలే మగాడివోయ్
మతిమరుపు మగాడు మెప్పించాడు
తారాగణం: నాని, లావణ్య, మురళీశర్మ, అజయ్, నరేశ్, సితార, వెన్నెల కిశోర్, ప్రవీణ్, స్వప్నమాధురి, శ్రీనివాసరెడ్డి
సంగీతం: గోపిసుందర్
రచన-దర్శకత్వం: మారుతి
విడుదల తేదీ: 4 సెప్టెంబర్ 2015
పేరుచూసి కథానాయకుడు ఏమేం సాహసాలు చేస్తాడోనని అనుకునేవాళ్లు సినిమాలో అతని మతిమరుపు పనులు చూసి ఆశ్చర్యపోతారు. అయితే ‘భలే భలే మగాడివోయ్’ ఓ ఉత్సాహభరితమైన, కాలక్షేపానికి బాగా పనికొచ్చే సినిమా. ప్రేమకోసం ఎన్ని ఆటలు, ఎన్ని అబద్ధాలు ఆడవచ్చో, ఆఖరుకి కన్న తల్లిదండ్రుల్ని సైతం అన్నాచెల్లెళ్లుగా ఎలా మార్చేయవచ్చో చూపించే సినిమా.
లక్కీ స్టోరీ:
ఈ సినిమాలో లక్కీ (నాని) అందరిలాంటి మగాడు కాదు. అసాధారణంగా లోకంలో ఎవరికీ లేనంత మతిమరుపుతో పుట్టినవాడు. అలాంటివాడికి పెళ్లి చెయ్యడం తల్లిదండ్రులకు బ్రహ్మప్రళయం కాక మరేమిటి! అయితేనేం, అతను నందన (లావణ్య త్రిపాఠి) అనే అందమైన అమ్మాయిని చూసి, మనసిచ్చేసి, ఆమె ప్రేమను పొందడం కోసం తన లోపాన్ని కప్పిపుచ్చుకోడానికి ఎన్ని ఆటలు, ఎన్ని అబద్ధాలు ఆడాలో అన్నీ ఆడతాడు. ఈ క్రమంలో ఎంతోమందిని మోసం చేస్తాడు. నందన తండ్రి (మురళీశర్మ) ఓ వ్యవసాయ శాస్త్రవేత్త. ఏ లోటూ లేకుండా మొక్కల పెంపకాన్ని జాగ్రత్తగా చూసుకునే ఆయన కాబోయే అల్లుడి విషయంలో ఇంకెన్ని జాగ్రత్తలు తీసుకుంటాడు! మొదటే లక్కీ(నాని) సంబంధం ఆయన వద్దకు వస్తుంది. కానీ లక్కీ మతిమరుపు ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యక్షంగా అనుభవించి, జన్మలో అతడి మొహం చూడకూడదనుకుంటాడు. ఆయన ఎంత వద్దనుకున్నా కూతురి జీవితంలోకి వచ్చేస్తాడు లక్కీ. ఒక సందర్భంలో కన్నతల్లిని పక్కింటి ఆంటీగా ఆయనకు పరిచయం చేస్తాడు లక్కీ. తండ్రిని తల్లిచేత ‘అన్నయ్యా’ అనిపిస్తాడు!
నందనను తొలిచూపులోనే కామించి ఆమెను పెళ్లిచేసుకోవాలని ఇన్‌స్పెక్టర్ అజయ్ (అజయ్) అనే అతను కాచుక్కూర్చుంటాడు. అతని తండ్రి, నందన తండ్రి స్నేహితులు. కానీ అజయ్ తనకు నచ్చలేదనీ, తను లక్కీ అనే అతన్ని ప్రేమించాననీ తండ్రికి చెబుతుంది నందన. అవమానంతో రగిలిపోతాడు అజయ్. లక్కీ అనేవాడి అంతు చూడాలనుకుంటాడు. లక్కీని తండ్రికి పరిచయం చేయాలనుకుంటుంది నందన. తనెవరో ఆయనకు తెలుసుకాబట్టి ఆయన వద్దకు తన బదులు తన స్నేహితుణ్ణి (వెన్నెల కిశోర్)ను పంపిస్తాడు లక్కీ. ఇక దాగుడుమూతలాట మొదలు. లక్కీ మరో గేమ్ ఆడి, నందన రికమండేషన్‌తో లక్కీ స్నేహితుడిగా ఆమె తండ్రి వద్దే ఉద్యోగంలో చేరతాడు. చివరకు ఈ ఆటలో అసలు లక్కీ ఎవరో నందన తండ్రికి ఏ పరిస్థితుల్లో తెలిసింది, లక్కీ ఆడిన ఆటలు, అతని భయంకరమైన మతిమరుపు గురించి నిజం తెలిసిన నందన ఏం చేసిందనేది పతాక సన్నివేశం.
నాని సినిమా:
హీరో హీరోయిన్లుగా నాని, లావణ్య మధ్య కెమిస్ట్రీ ‘భలే’ కుదిరింది. మతిమరుపు కుర్రాడిగా ఆహ్లాదాన్ని పంచుతూనే, నందన వదినకు ప్రసవ నొప్పులు వచ్చినప్పుడు ఆమెను ఆస్పత్రికి తీసుకువెళ్లడానికి పడ్డ అవస్థల్లో నాని ప్రదర్శించిన హావభావాలు, చివరలో తను ఆడిన అబద్ధాలు, ఆటల వల్ల నందన దూరమైపోయిందన్న బాధతో అతను చూపించిన అభినయాన్ని ప్రశంసించకుండా ఉండలేం. సినిమా మొత్తాన్నీ తన భుజాల మీద మోసిన అతనికి ఈ సినిమా మంచి బ్రేక్‌నిచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. నందనగా లావణ్యకూ ఈ సినిమా పెద్ద ప్లస్సవుతుంది. అందంగా ఉండటమే కాకుండా అభినయంతోనూ ఆకట్టుకుంది. పాత్ర పరిధిలో విలన్‌గా తనదైన ధోరణిలో నటించాడు అజయ్. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది హీరోయిన్ తండ్రిగా నటించిన మురళీశర్మ గురించి. దాదాపు హీరోతో సమానమైన కీలక పాత్రలో గొప్పగా రాణించాడు. సెకండాఫ్‌లో వచ్చినా తనదైన ‘తత్తరబిత్తర’ కామెడీతో అలరించాడు వెన్నెల కిశోర్. లక్కీ స్థానంలో వెళ్లినప్పట్నించీ అతను పడే అవస్థలు ఆహ్లాదాన్ని పంచాయి. లక్కీ తల్లిదండ్రులుగా నరేశ్, సితార జోడీ ఆకట్టుకుంటుంది. కాకపోతే భర్తను పట్టుకొని సితార ‘అన్నయ్యా’ అని అంటుంటే ఎంత ఎబ్బెట్టుగా ఉందో! ఎంత ప్రతికూల పరిస్థితుల్లో చిక్కుకుంటే మాత్రం భర్తను అన్నయ్యగా ఏ స్త్రీ అయినా పిలుస్తుందా? నందన వదినగా స్వప్నమాధురి కూడా ఓ సన్నివేశానికి కీలకమైన పాత్రను చక్కగా చేసింది. గతంలో ‘కొడుకు’గా హీరో వేషంలో కనిపించిన ఎమ్మెస్ నారాయణ కొడుకు విక్రమ్‌ని ఇందులో పోలీస్‌గా ఏమాత్రం ప్రాధాన్యంలేని ఓ సాదాసీదా పాత్రలో చూసి జాలిపడతాం. నందన బంధువుల బృందంలో శ్రీనివాసరెడ్డి కొద్దిసేపైనా తన మార్కు హాస్యాన్ని పండించాడు.
దర్శకత్వ ప్రతిభ:
చూడ్డానికి సినిమా కథే అయినా అతి సాధారణంగా ఉన్న క్లైమాక్స్ మినహా మిగతా సినిమానంతా ఆహ్లాదభరితంగా, ఉద్వేగభరితంగా చిత్రించాడు దర్శకుడు మారుతి. మతిమరుపును కప్పిపుచ్చుకోడానికి లక్కీ ఆడే అబద్ధాల వల్ల తర్వాత సన్నివేశంలో ఏమవుతుందో, ఒక్కో అబద్ధంతో ఒక్కో సమస్యలో చిక్కుకుని అతను ఎలా బయటపడతాడోననే కుతూహలం, ఒక పనిమీద వచ్చి, దాన్ని మర్చిపోయి ఇంకో పనిచేసే లక్కీ తర్వాత ఎలాంటి చిక్కులో పడతాడోననే ఆదుర్దాని ప్రేక్షకుల్లో కలిగించడంలో దర్శకుడు సఫలమయ్యాడు. టేకింగ్‌తోనూ, మాటలు, స్ర్కీన్‌ప్లేతోనూ మెప్పించాడు మారుతి. కాకపోతే క్లైమాక్స్ రెగ్యులర్ టైప్‌లో ఉండి అసంతృప్తి కలిగిస్తుంది. మతిమరుపును కప్పిపుచ్చుకోడానికి లక్కీ ఆడిన ఆటలు తనకు ముందే తెలుసునంటూ, తర్వాత అతనేం చేస్తాడో చూడాలనే ఉద్దేశంతో అతడికి తెలీకుండా గమనిస్తూ వచ్చానని ప్రీ క్లైమాక్స్‌లో మురళీశర్మ చెప్పడం ఓవర్ డ్రమటైజేషన్. అది కన్విన్సింగ్‌గా లేదు. నందన అన్నయ్య ఎవరో చివరాఖరి దాకా దర్శకుడు చూపించకపోవడం, భార్యకు ప్రసవమై బిడ్డ పుట్టాక కూడా అతను రాకపోవడం సినిమా విచిత్రం! ఐదు పాటల్లో హీరో హీరోయిన్లపై తీసిన టైటిల్‌సాంగ్, నానిపై తీసిన ‘హౌ హౌ’ సాంగ్ మాత్రమే ఆకట్టుకునేలా ఉన్నాయి. పాటల బాణీలకంటే గోపిసుందర్ ఇచ్చిన రీరికార్డింగ్ సన్నివేశాలకు బలాన్ని చేకూర్చింది.
రేటింగ్: 3.25/5
- ఆంధ్రజ్యోతి పోర్టల్, 4 సెప్టెంబర్ 2015
Saturday, June 30, 2012
'ఈగ'ని చూసి ఎగ్జయిటైన నిర్మాతలు
నాని, సమంత, సుదీప్ ప్రధాన పాత్రధారులుగా దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి రూపొందిస్తున్న 'ఈగ' చిత్రం జూలై 6న విడుదలకు సిద్ధమవుతోంది. డి. సురేశ్‌బాబు సమర్పణలో వారాహి చలనచిత్రం పతాకంపై సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లోనూ ఏక కాలంలో ఈ సినిమా విడుదలవుతోంది. దర్శకుడు రాజమౌళి "ఈ సినిమా తొలికాపీని సురేశ్‌బాబు, తమిళ వెర్షన్ 'నాన్ ఈ' నిర్మాత పి.వి. కలిసి చూశారు. సినిమా అయ్యాక నన్ను కౌగలించుకుని ఈ సినిమా నిర్మాణంలో తాము పాలుపంచుకున్నందుకు గర్వంగా భావిస్తున్నామని చెప్పారు. వాళ్ల అభినందనకు చాలా చాలా సంతోషంగా ఉంది'' అని ట్విట్టర్ ద్వారా చెప్పారు. ఇటీవల నానిపై చిత్రీకరించి విడుదల చేసిన ప్రమోషనల్ సాంగ్‌కు అనూహ్యమైన స్పందన వచ్చిందని ఆయన తెలిపారు. హీరో నాని మాట్లాడుతూ "ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అనే ఉత్కంఠతతో ఎదురుచూస్తున్నా. ఇప్పటిదాకా భారతీయ తెరపైనే కాదు, అసలు వెండితెర మీదే ఇలాంటి సినిమా రాలేదనేది నా అభిప్రాయం'' అని తెలిపారు. సమర్పకుడు సురేశ్‌బాబు మాట్లాడుతూ "ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో దాదాపు 1200 ప్రింట్లతో విడుదల చేస్తున్నాం. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తోనూ ప్రింట్లు వేస్తున్నాం'' అని చెప్పారు.
Saturday, June 16, 2012
జూలై 6న వస్తున్న 'ఈగ'
నాని, సమంత, సుదీప్ ప్రధాన పాత్రధారులుగా దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి రూపొందిస్తున్న 'ఈగ' చిత్రం జూలై 6న విడుదలకు సిద్ధమవుతోంది. డి. సురేశ్‌బాబు సమర్పణలో వారాహి చలనచిత్రం పతాకంపై సాయి కొర్రపాటి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి తాజాగా ఓ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. 'నా పేరు నాని, నేను ఈగనైతే గానీ' అనే టైటిల్ సాంగ్‌ను హీరో నాని బృందంపై చిత్రీకరించారు. ఈ పాటను ప్రమోషనల్ సాంగ్‌గా ఉపయోగిస్తున్నామనీ, చిత్రంలో ఈ పాటను 'ఈగ'పై తీశామనీ రాజమౌళి చెప్పారు.
'మగధీర' చేసేప్పుడు గ్రాఫిక్స్ విషయంలో చాలా తెలిసిందని అనుకున్నాననీ, కానీ 'ఈగ' చేస్తుంటే నేను తెలుసుకుంది చాలా తక్కువనీ, తెలుసుకోవాల్సింది చాలా ఎక్కువనీ అర్థమైందన్నారు. సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి మాట్లాడుతూ "ఈ సినిమాలోని ప్రతి ఫ్రేములోనూ దర్శకుని శ్రమ కనిపిస్తుంది. తను అనుకున్నది రాజమౌళి చెయ్యగలిగాడు. రీరికార్డింగ్ అయిపోయి నెలపైనే అయ్యింది. ఇప్పుడు గ్రాఫిక్ వర్క్ కూడా అయిపోవచ్చింది. నేను విలన్ పాత్రలకు సంబంధించి కోట శ్రీనివాసరావుకు వీరాభిమానిని. 'ఈగ' చూసి సుదీప్‌కు వీరాభిమానినైపోయా. అతనిలాంటి నటులు ఇవాళ చాలా తక్కువమంది ఉన్నారు'' అని చెప్పారు.
హీరో నాని మాట్లాడుతూ "ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అనే ఉత్కంఠతతో ఉన్నా. రాజమౌళి ఈజ్ రజనీకాంత్ ఆఫ్ తెలుగు సినిమా. లేట్‌గా వచ్చినా లేటెస్ట్‌గా వస్తారు. ఇప్పటిదాకా భారతీయ తెరపైనే కాదు, అసలు వెండితెర మీదే ఇలాంటి సినిమా రాలేదనేది నా అభిప్రాయం'' అని తెలిపారు. సమర్పకుడు సురేశ్‌బాబు మాట్లాడుతూ "ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో దాదాపు 1200 ప్రింట్లతో విడుదల చేస్తున్నాం. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తోనూ ప్రింట్లు వేస్తున్నాం. ఈ సినిమాకి రాజమౌళి ఎంతో శ్రమించాడు. ఇందులోని యానిమేషన్ గ్రాఫిక్స్ ఎంతో క్లిష్టమైనవి. అవి చాలా బాగా వచ్చాయి'' అన్నారు.
Wednesday, November 16, 2011
ఆ యువ నటుడు ఎవరు?
ఇటీవల 'శ్రీరామరాజ్యం' ఆడియో అభినందన సభలో హీరో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే. ఆయన ఆ మాటల్ని రాంచరణ్‌ని ఉద్దేశించి అన్నాడంటూ ఓ టీవీ చానల్ చేసిన హంగామా వివాదాన్ని సృష్టించింది. దాంతో తాను ఆ మాటల్ని రాంచరణ్‌ని ఉద్దేశించి అనలేదనీ, ఎవర్ని ఉద్దేశించి ఆ మాటలు అన్నానో చిరంజీవి, మోహన్‌బాబుకు తెలుసనీ వివరణ ఇచ్చుకున్నారు బాలకృష్ణ. ఇంతకీ 'శ్రీరామరాజ్యం' సభలో ఆయన ఏమన్నారు? "ఈమధ్య ఓ యువ నటుడు మన తెలుగు సినిమాల గురించీ, దర్శకుల గురించీ అవమానకరంగా మాట్లాడాడు. టాలీవుడ్ దర్శకులు తెలుగు సినిమాల్లో ప్రయోగాలు చేయరని అన్నాడు. చరిత్ర తెలియకుండా మాట్లాడవద్దనీ, బాపు వంటి గొప్ప దర్శకులు మనకు ఉన్నారని నేను అన్నాను. వారు ఎన్నో క్లాసిక్ సినిమాల్ని తీశారనీ, నేను కూడా 'ఆదిత్య 369', 'భైరవద్వీపం' వంటి ప్రయోగాత్మక చిత్రాల్లో నటించాననీ చెప్పాను. ఇంకా ఎక్కువగా మాట్లాడితే పళ్లూడగొడతానని హెచ్చరించా" అని ఆయన చెప్పారు. అంటే ఏమిటి? ఆ యువ నటుడు బాలకృష్ణ సమక్షంలోనే తెలుగు దర్శకుల్ని తూలనాడితే, బాలకృష్ణ అతణ్ణి హెచ్చరించాడని ఇట్టే అర్థమైపోతోంది. కానీ వివాదం సృష్టించిన చానల్ దీన్ని గమనించకుండా కొద్ది రోజుల క్రితం దాసరి నారాయణరావుని ఉద్దేశించి రాంచరణ్ చేసిన వ్యాఖ్యలకి ఇప్పుడు బాలకృష్ణ కౌంటర్ ఇచ్చినట్లుగా ఊహించుకొని స్టోరీ అల్లేసింది. అందుకే బాలకృష్ణ "ఏదో ఫంక్షన్‌లో షాట్స్ చూపించి నేను చరణ్‌ను ఉద్దేశించి అన్నట్లు చిత్రీకరిస్తున్నారు. నేను అన్నది చరణ్‌ని ఉద్దేశించి కాదని సవినయంగా మనవి చేస్తున్నా. నేను ఆ మాటలు ఆ వ్యక్తితో నేరుగానే అన్నాను. కానీ చరణ్‌ను నేను కలిసి నాలుగైదు నెలలు అయింది. చిరంజీవి పిల్లలకు నేనంటే ఎంతో వాత్సల్యం. అలాగే వారన్నా నాకు ఎంతో వాత్సల్యం" అని తేల్చిచెప్పారు. బాలకృష్ణ ఇచ్చిన ఈ వివరణని సైతం సదరు చానల్ మరోరకంగా వాడుకొంది. అదలా ఉంచితే బాలకృష్ణ చేత పళ్లూడగొడతాననని అనిపించుకున్న ఆ యువ నటుడు ఎవరన్న చర్చ మొదలైంది చిత్రసీమలో. కొంతమంది ఈ మధ్య కాలంలో ఇలా మాట్లాడుతున్నది హీరో నాని అనీ, అతడితోటే బాలయ్య ఆ మాటలు అని ఉంటారని ఊహిస్తున్నారు. తను ఎవర్ని ఉద్దేశించి ఆ మాటలన్నదీ చిరంజీవి, మోహన్‌బబుకు తెలుసని బాలకృష్ణ అనడాన్ని బట్టి మరికొంతమందికీ ఈ సంగతి తెలిసే ఉంటుంది. ఎవరో ఆ యువ నటుడు?
Thursday, November 10, 2011
రెండు భాషల్లో హిట్లు కొట్టిన హీరోయిన్
తెలుగులో 'పిల్ల జమీందార్', తమిళంలో 'మురన్' సినిమాలు సక్సెస్ సాధించడంతో తెగ సంబరిపడిపోతోంది కన్నడ భామ హరిప్రియ. భూమిక నిర్మించిన 'తకిట తకిట' సినిమాతో తెరంగేట్రం చేసిన ఆమెకు తొలి సినిమా నిరాశని మిగిల్చింది. అలాంటిది ఆమెకు 'పిల్ల జమీందార్' ఆఫర్ రావడం అదృష్టమే అనుకోవాలి. నాని హీరోగా నూతన దర్శకుడు అశోక్ రూపొందించిన ఆ సినిమా హిట్టవడం కొత్త ఊపిరినిచ్చినట్లయింది. దీనికంటే కొద్ది రోజుల ముందు తమిళంలో రజ్జన్ మాధవ్‌ని డైరెక్టర్‌గా పరిచయం చేస్తూ చేరన్ నిర్మించిన 'మురన్' కూడా హిట్టవడంతో హరిప్రియ ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయి. ఈ సినిమాలో ఆమె చేరన్ ప్రియరాలి పాత్రను బాగా చేసిందనే పేరు కూడా సంపాదించింది. ఇలా రెండు భాషల్లో వెంటవెంటనే రెండు సినిమాలు విజయం సాధించడంతో హరిప్రియ కెరీర్‌కు మేలు జరిగే అవకాశాలున్నాయి. చూద్దాం ఆమెకి ఎలాంటి ఆఫర్లు వస్తాయో...
Saturday, October 15, 2011
రివ్యూ: పిల్ల జమీందార్
'అలా మొదలైంది' తర్వాత హీరోగా నాలుగు మెట్లు పైకెదిగిన నాని ఇప్పుడు 'పిల్ల జమీందార్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చాడు. 'ఎ మిలియనీర్స్ ఫస్ట్ లవ్' అనే కొరియన్ సినిమాని ఆధారం చేసుకుని, దానికి మన నేటివిటీని జోడించి ఈ సినిమాని రూపొందించాడు నూతన దర్శకుడు అశోక్. టైటిల్‌కి తగ్గట్లు కథంతా నాని పోషించిన ప్రవీణ్ జయరామరాజు అనే పాత్ర చుట్టూ నడుస్తుంది ఆ పాత్రని సహసిద్ధమైన శైలిలో సునాయాసంగా చేసుకుపోయాడు నాని. రూ. 5000 కోట్ల ఆస్తికి వారసుడైనప్పటికీ ఆ ఆస్తి దక్కాలంటే తాత పెట్టిన కండిషన్లని ఎదుర్కోడానికి అతడు చేసే ప్రయత్నాలు, చేష్టలు మంచి వినోదాన్నిచ్చాయి. చదువంటే ఆమడ దూరం పరిగెత్తేవాడిగా, ఆవేశపరుడిగా, అహంభావిగా నాని ప్రదర్శించిన నటనని మెచ్చుకోకుండా ఉండలేం.
దర్శకుడు అశోక్ కొత్తవాడైనప్పటికీ నాని నుంచి నటనను ఎలా రాబట్టుకోవాలో తెలిసినవాడి మల్లే అవుపించాడు. ఫస్టాఫ్‌లోని పూర్తిస్థాయి ఎంటర్‌టైన్‌మెంట్ వల్ల ఇంటర్వల్ అప్పుడే వచ్చిందా అనిపించింది. కొన్ని కామెడీ సీన్లు పండకపోయినా ఎక్కువ సీన్లు పొట్టచెక్కలయ్యేలా నవ్వించాయి. సెకండాఫ్‌లోనూ వినోదం ఉన్నా కథ మెలోడ్రామా వైపు మళ్లడంతో కొన్ని సీన్లు బరువుగా తోస్తాయి. కాలేజీ ఎలక్షన్లనేవి కథకి నప్పలేదు. వాటిని కథలో బలవంతంగా చొప్పించినట్లనిపిస్తుంది. మెలోడ్రామా ఎక్కువైనా క్లైమాక్స్ చిత్రీకరణ బాగుంది. చివర్లో ఓ చక్కని సందేశాన్ని కూడా దర్శకుడిచ్చాడు.
అయితే నాని, హరిప్రియ మధ్య కెమిస్ట్రీ సరిగా వర్కవుట్ కాలేదు. వాళ్లమధ్య రొమాంటిక్ యాంగిల్ మిస్సయ్యింది. సెకండాఫ్‌లో మెలోడ్రామా ఎక్కువైన విషయాన్ని దర్శకుడు గుర్తించలేకపోయాడు. అందువల్లే కొన్ని సీన్లు చికాకు కలిగించాయి. ప్రవీణ్ జయరామరాజు పాత్రకి నాని పూర్తి న్యాయం చేశాడు. అతని హావభావాలే అతనెట్లాంటి నటుడో తెలియజేస్తాయి. 'అలా మొదలైంది'లో నాని కంటే నిత్యమీనన్ ఎక్కువగా ఆకట్టుకుంటే 'పిల్ల జమీందర్' మాత్రం పూర్తిగా నాని సినిమానే. హరిప్రియని మెయిన్ హీరోయిన్‌గా ఎలా ఎంచుకున్నారో అర్థంకాదు. ఆమెలో గ్లామర్, ప్రతిభ రెండూ కనిపించలేదు. ఆమె బదులు మరో చక్కని హీరోయిన్ ఆ పాత్ర చేసినట్లయితే సినిమాకి మరింత ఆకర్షణ వచ్చి ఉండేది. బిందుమాధవి బాగున్నా ఆమెని దాదాపు గెస్ట్ ఆర్టిస్ట్‌కింద చూపారు. మిగతా ఆర్టిస్టుల్లో రావు రమేశ్, శివప్రసాద్, అవసరాల శ్రీనివాస్, ఎమ్మెస్ నారాయణ బాగా చేశారు.
సినిమాలో ప్రత్యేకించి చెప్పుకోవాల్సింది చంద్రశేఖర్ రాసిన డైలాగులు. త్రివిక్రం శైలి కట్ డైలాగ్స్‌తో అతను బాగా నవ్వించాడు. మొత్తంగా చూస్తే 'పిల్ల జమీందర్'ని ఓసారి చూడ్డంలో వచ్చే నష్టమేమీ లేదు.

Monday, October 10, 2011
స్పెషల్ స్టోరీ: రాజమౌళి విజయ దరహాసం!
దర్శకత్వం వహించిన ఎనిమిది సినిమాల్లో ఏడు విజయాలు సాధించిన దర్శకుడిగా యస్.యస్. రాజమౌళి తెలుగు చలనచిత్ర చరిత్రలో తనకంటూ ఓ శాశ్వత పేజీని సంపాదించుకున్నారు. ఇదివరలో దాసరి నారాయణరావు తొలి సినిమా 'తాత మనవడు' నుంచి పదకొండో సినిమా 'మనుషులంతా ఒక్కటే' వరకు వరుసగా పదకొండు విజయవంతమైన చిత్రాలకు (ఈ మధ్యలో వచ్చిన 'రాధమ్మ పెళ్లి' బాక్సాఫీసు ఫలితం విషయంలో భిన్నాభిప్రాయాలున్నా) దర్శకత్వం వహించడం ఒక చరిత్ర అయితే, ఉండకూడనన్ని ప్రతికూల పరిస్థితులున్న నేటి కాలంలో ఎనిమిదింటిలో ఒకటి మినహా ఏడు హిట్లను అందించిన రాజమౌళిది ఇంకో చరిత్ర.
'స్టూడెంట్ నెం.1' (2002) నుంచి మొదలైన ఆయన విజయ విహారం మూడో సినిమా 'సై' మినహా 'మర్యాదరామన్న' (2010) దాకా అప్రతిహతంగా కొనసాగుతూ వచ్చింది. 'సై' సైతం ప్రేక్షకుల్ని అలరించినా, పెట్టుబడి ఎక్కువ కావడంతో లాభాలు సాధించలేకపోయింది. ప్రస్తుతం 'ఈగ' పేరుతో ఆయన తన తొమ్మిదో చిత్రాన్ని తెరకెక్కించే పనిలో నిమగ్నమయ్యారు. ఎన్టీఆర్‌ని 'స్టూడెంట్ నెం.1'తో మాస్‌కి చేరువ చేసిన ఆయన 'సింహాద్రి'తో టాప్ స్టార్‌ని చేశారు. ఆ సినిమా ప్రభావం ప్రేక్షకుల మీద ఎంతగా పడిందంటే, తర్వాత వచ్చిన ఎన్టీఆర్ సినిమాల్ని వారు 'సింహాద్రి'తో పోల్చుకుంటూ అసంతృప్తి చెందుతూ వచ్చారు. అలాంటి నేపథ్యంలో మరోసారి 'యమదొంగ'తో ఎన్టీఆర్‌కి విజయానందాన్ని చేకూర్చారు రాజమౌళి. అలా రాజమౌళి-ఎన్టీఆర్ కాంబినేషన్‌కు తిరుగనేదే లేకుండా పోయింది. ఒక్క ఎన్టీఆర్‌తోనే కాకుండా మిగతా హీరోలకూ వాళ్ల కెరీర్‌లో చెప్పుకోదగ్గ చిత్రాల్ని అందించారు రాజమౌళి. ప్రభాస్‌కు 'ఛత్రపతి', రవితేజకు 'విక్రమార్కుడు', రాంచరణ్‌కు 'మగధీర', సునీల్‌కు 'మర్యాదరామన్న' వంటి హిట్లనిచ్చారు. వీటిలో 'మగధీర' చిత్రం మునుపటి తెలుగు చలనచిత్ర వసూళ్ల రికార్డుల్ని తిరగరాసిన సంగతి ప్రస్తావనార్హం. మిగతా హీరోలతో ఆయన తీసిన చిత్రాలన్నీ అప్పటివరకు వాళ్ల కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లని సాధించిన చిత్రాలు కావడం విశేషం.
ఇప్పుడు ఆయన తీస్తున్న 'ఈగ' పట్ల కూడా చిత్రసీమ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఎక్కువగా గ్రాఫిక్స్ మీద ఆధారపడ్డ ఈ చిత్రం టైటిల్‌కు తగ్గట్లే ఓ 'ఈగ' ప్రధాన పాత్రధారిగా రూపొందుతోంది. విలన్ చేతిలో చనిపోయిన హీరో మరుజన్మలో ఈగగా పుట్టి ఆ విలన్ మీద ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడనేది ఇందులోని ప్రధానాంశం. హీరోగా నాని, విలన్‌గా కన్నడ నటుడు సుదీప్ నటిస్తున్న ఈ చిత్రంలో సమంత నాయిక. ఇటీవలే (సెప్టెంబర్ 27తో) పదేళ్ల కెరీర్‌ను పూర్తి చేసుకున్న అగ్ర దర్శకుడు రాజమౌళి మునుముందు తెలుగు సినిమా స్థాయి పెరగడంలో ప్రధాన పాత్ర పోషిస్తారని ఆశించవచ్చు.
(అక్టోబర్ 10 రాజమౌళి పుట్టినరోజు సందర్భంగా)

Sunday, October 2, 2011
న్యూస్: జమీందార్లు పోయినా 'పిల్ల జమీందార్' వదలట్లేదు!
మొత్తానికి 'పిల్ల జమీందార్' పాటలు విడుదలయ్యాయి. నాని సరసన అంతగా గ్లామర్‌లేని హరిప్రియ, బిందుమాధవి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకి తమిళ సంగీత దర్శకుడు సెల్వగణేశ్ మ్యూజిక్‌నిచ్చాడు. ఈ సినిమా బాగా ఆలస్యం కావడానికి గల కారణాల్ని నిర్మాత డి.ఎస్. రావు ఆవేదనా రూపంలో వ్యక్తం చేశాడు. సమ్మెలతో పాటు పలు ఆటంకాలు కలగడం వల్లే సినిమా మేకింగ్‌లో ఇంత ఆలస్యం జరిగిందనీ, అయితే శ్రమకు తగ్గ ఫలితం దక్కిందనీ ఆయన చెప్పాడు. పదేళ్ల నుంచీ హిట్ కోసం మొహం వాచిపోయాననీ, ఈ సినిమాతో ఆ దాహం తీరుతుందనీ గట్టి నమ్మకాన్ని వ్యక్తం చేశాడు. ఈ సినిమా ద్వారా అశోక్ డైరెక్టర్‌గా పరిచయమవుతున్నాడు. ఎప్పుడో రాష్ట్రంలో జమీందారీలకు కాలం చెల్లిపోయినా మన సినిమా వాళ్లు మాత్రం ఆ జమీందారీలని ఇంకా వదిలిపెట్టలేదనే దానికి ఈ సినిమా మరో ఉదాహరణ. యువకుడైన అశోక్ మరి ఇలాంటి కథని ఎందుకు ఎంచుకున్నాడో తెలీదు. పాటల చిత్రీకరణ, వాటి బాణీలు చూస్తే మాత్రం సెల్వ గణేశ్ బాగానే పనిచేసినట్లు అర్థమవుతుంది. అయితే నాని తప్ప ఈ సినిమాకి జనాన్ని తీసుకువచ్చే మరో ఆకర్షణ ఏదీలేని స్థితిలో పదేళ్లకైనా డి.ఎస్. రావు హిట్ కలని 'పిల్ల జమిందార్' తీరుస్తాడో, లేడో...
Monday, September 12, 2011
ఇంటర్వ్యూ: తనీశ్
ప్రస్తుతం ఏయే సినిమాలు చేస్తున్నారు?
- 'సలామత్' షూటింగ్ దాదాపు పూర్తికావచ్చింది. క్లైమాక్స్, పాటలు మిగిలున్నాయి. 'మేం వయసుకు వచ్చాం' రెగ్యులర్ షూటింగ్ 12 నుంచి జరగబోతోంది. బెక్కెం వేణుగోపాల్ నిర్మిస్తున్న ఈ సినిమాతో త్రినాథ్ దర్శకునిగా పరిచయమవుతున్నాడు. నిర్మాత బెక్కెం వేణుగోపాల్ ప్రాణం పెట్టి ఈ సినిమా చేస్తున్నారు.
'మేం వయసుకు వచ్చాం'లో మీ కేరక్టర్ ఎలా ఉంటుంది?
- ఇందులో నేను చేసే పాత్రలో రెండు ఛాయలున్నాయి. ఇంటర్మీడియేట్ పూర్తయి ఇంజనీరింగ్‌లో చేరే పదహారేళ్ల కుర్రాడిగానూ, ఆ తర్వాత పరిణతి చెందిన యువకుడిగానూ కనిపిస్తా. ఇది సిటీ నేపథ్యంలో నడిచే కథ. నేటి విద్యార్థుల ఆలోచనలు, ఆశయాలు ఎలా ఉన్నాయనే దాన్ని ఇందులో చూపించబోతున్నారు. ఎక్కువ సన్నివేశాలు నాటకీయంగా కాక సహజంగా ఉంటాయి. 'నచ్చావులే' తర్వాత నేను చేస్తున్న మంచి ప్రేమకథ. డైరెక్టర్ త్రినాథ్ చెప్పిన కథలోని పాయింట్, స్క్రీన్‌ప్లే విపరీతంగా నచ్చేశాయి. ప్రతి సన్నివేశం కొత్తగా ఉంటుంది. నా కెరీర్‌లోని మంచి సినిమాల్లో కచ్చితంగా నిలబడే సినిమా 'మేం వయసుకు వచ్చాం'.
మీ దృష్టిలో ప్రస్తుతం మీ కెరీర్ ఎలా నడుస్తోంది?
- కెరీర్‌లో ఎవరికైనా ఎత్తు పల్లాలు ఉంటాయి. ప్రతి సినిమాకీ బాగా చేయడానికి శాయశక్తులా కృషి చేస్తా. ప్రస్తుతం నా కెరీర్ గొప్పగా లేదు, అలాగని అసంతృప్తికరంగానూ లేదు. స్మూత్‌గానే నడుస్తోంది.
ఎలాంటి పాత్రల్ని చేయడానికి ఇష్టపడతారు?
- ఏదో ఒక తరహా సినిమాలకి పరిమితమవ్వాలని అనుకోవట్లేదు. నటుడన్నాక అన్ని రకాల పాత్రలూ చెయ్యాలి. ఇప్పుడు నేను చేస్తున్నవి జనం టిక్కెట్ పెట్టి చూడదగ్గ సినిమాలు. 'సలామత్' ఇంటెన్స్ లవ్‌స్టోరీ అయితే, 'మేం వయసుకు వచ్చాం' క్యూట్ లవ్‌స్టోరీ.
తెలుగులో హీరోలు చాలామంది ఉన్నారు కదా. ఆ పోటీని ఎలా ఎదుర్కోబోతున్నారు?
- మిగతా హీరోలతో నాకు పోటీ ఉన్నట్లు అనుకోను. నేను నా కెరీర్ గురించే ఆలోచిస్తా. ఇంతమంది హీరోలు తెలుగులో ఉండటం గొప్ప విషయం. మా అమ్మానాన్నల తర్వాత నేను భయపడేది నాని (హీరో) అన్నయ్యకే. 'రైడ్' చేసినప్పట్నించీ మా మధ్య మంచి అనుబంధం ఉంది. అతని సలహాలు తీసుకుంటూ ఉంటా.
మీమీద ఏ హీరో ప్రభావం ఉంది?
- ప్రత్యేకంగా ఏ ఒక్కరో అని కాకుండా చాలామంది హీరోల ప్రభావం నాపై ఉంది. చిరంజీవి గారి డాన్సులంటే చిన్నప్పట్నించీ ఇష్టం. అలాగే నాగార్జున, మహేశ్, శ్రీకాంత్, బన్నీ వంటి వాళ్ల ప్రభావం నా మీద ఉంది.
ఈ యేడాది మీకు ఎలాంటి అనుభవాన్నిచ్చింది?
- 'కోడి పుంజు' ఏ సెంటర్లలో ఆడకపోయినా బీ, సీ సెంటర్లలో బాగా పేరు తెచ్చుకుంది. నేను యాక్షన్ చేయగలనన్న నమ్మకాన్నిచ్చింది. ఈ ఏడాది నేను నటించిన మరో సినిమా 'మంచివాడు' మంచి సినిమా అవుతుందని గట్టిగా నమ్మాం. అయితే అది సరైన సమయంలో పడలేదు.
చైల్డ్ ఆర్టిస్టు నుంచి హీరోగా ఎదిగారు కదా. ఈ రెండు దశల్లో ఏది బాగుంది?
- బాల నటునిగా ఉన్నప్పటికీ, ఇప్పటికీ తేడా ఏమంటే అప్పుడు నామీద ఎలాంటి బాధ్యతా ఉండేది కాదు. ఇప్పుడు హీరోని కాబట్టి అన్నీ శ్రద్ధగా చూసుకోవాల్సి వస్తుంది. లేదంటే 'వీడు ఇలాంటి సినిమా చేశాడేంట్రా' అంటారు. ఈ బాధ్యతని నిర్వహించడం కొంచెం కష్టమే కానీ ఇష్టమైంది.
మీరు చేసిన వాటిలో మీ ఫేవరేట్ సినిమాలు?
- బాలనటునిగా 'దేవుళ్లు', హీరోగా 'నచ్చావులే' నా ఫేవరేట్ సినిమాలు.

Friday, August 26, 2011
న్యూస్: 'పిల్ల జమీందార్'కి బిజినెస్ లేదు!
తెలుగులో ఇటు 'సెగ', తమిళంలో అటు 'వెప్పం' రెండూ ఫట్టయ్యాక ఇప్పుడు నాని తర్వాతి సినిమాపై అందరి దృష్టి మళ్లింది. ప్రస్తుతం అతను రాజమౌళి డైరెక్షన్‌లో 'ఈగ', కొత్త దర్శకుడు అశోక్ తీస్తున్న 'పిల్ల జమీందార్'లో హీరోగా నటిస్తున్నాడు. వీటిలో ముందుగా రాబోతోంది 'పిల్ల జమీందార్'. ఈ సినిమాలో నాని సరసన హరిప్రియ, బిందుమాధవి హీరోయిన్లు. ఆ ఇద్దరూ సాధారణ తారలే కావడం గమనార్హం. భూమిక నిర్మించిన ఫ్లాప్ సినిమా 'తకిట తకిట' ద్వారా హరిప్రియ పరిచయం కాగా, నాలుగైదు సినిమాలు చేసినా ఒక్కటీ హిట్టులేని తార 'బిందుమాధవి'. ఇలాంటి తారలతో నటిస్తున్నందువల్ల ఈ సినిమా పట్ల బిజినెస్ వర్గాలు పెద్దగా ఆసక్తి కనపరచడం లేదని ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి. శ్రీ శైలేంద్ర సినిమాస్ బేనర్‌పై డి.ఎస్. రావు ఈ సినిమా నిర్మిస్తున్నారు. "జమీందారుగా నటిస్తున్న నాగినీడు ('మర్యాద రామన్న' ఫేం), ఆయన మనవడు 'పిల్ల జమీందార్'గా నటిస్తున్న నాని మధ్య వచ్చే సన్నివేశాలు చాలా సరదాగా ఉంటాయి' అని ఆయన చెప్పారు.
ఈ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికరమైన సంగతేమంటే అవసరాల శ్రీనివాస్ ఓ కీలక పాత్ర చేస్తుండటం. 'అష్టా చెమ్మా' ద్వారానే నాని, శ్రీనివాస్... ఇద్దరూ పరిచయమయ్యారు. తిరిగి వాళ్లు కలిసి చేస్తున్న సినిమా ఇది. ఇప్పటికే నాని వ్యవహార శైలి పట్ల సినీ వర్గాలు పెదవి విరుస్తూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'పిల్ల జమీందార్' హిట్టయితేనే అతనికి విలువ. లేదంటే ఇబ్బందే.

Friday, August 12, 2011
న్యూస్: 'సెగ' ఆరిపోయింది!
నానికి 'సెగ' తగిలింది. ఆ సినిమా గురించి అతను చెప్పిన గొప్పలు ఉత్తవని తేలిపోయాయి. బాక్సాఫీసు వద్ద అది ఫెయిలైంది. తమిళ వెర్షన్ 'వెప్పం' పరిస్థితి కూడా ఇదేనని తెలిసింది. 'సెగ'లో కార్తీక్ పాత్రలో నాని రాణించాడు. డైరెక్టర్ అంజన సినిమాని రియలిస్టిక్‌గా తీసింది. పెద్దల పెంపకం సరిగా లేకపోతే పిల్లలు ఎలా తయారవుతారనే కథాంశంతో ఈ సినిమాని ఆమె రూపొందించింది. అయితే ఈ సినిమాలోని పాత్రలు, సన్నివేశాలు ప్రేక్షకుల్ని మెప్పించలేక పోయాయి. అందుకే బాక్సాఫీసు వద్ద బోల్తాపడింది. ప్రధానంగా క్రైం థ్రిల్లర్‌గా కనిపించిన ఈ సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్ మిస్సయ్యింది. తెలుగు ప్రేక్షకులు ఇటీవలి కాలంలో ఆదరించిన సినిమాలన్నీ ఎంటర్‌టైనర్సే కావడం గమనార్హం. ఈ సినిమా రిలీజ్‌కి ముందు "నందినీరెడ్డి తరహాలోనే అంజన చాలా ప్రతిభావంతురాలు. నాలుగు సినిమాలు చేస్తే ఆమె ఇంటర్నేషనల్ లెవల్లో పేరు తెచ్చుకుంటుంది" అని తెగ పొగిడేశాడు నాని. దాంతో 'సెగ' చాలా గొప్పగా ఉంటుందనీ, నానికి మరో హిట్టు గ్యారంటీ అని అంతా అనుకున్నారు. రిలీజయ్యాక చూస్తే ఫలితం తారమారయ్యింది. ఇటు నాని నటనని గానీ, అటు అంజన డైరెక్షన్ గురించి గానీ గొప్పగా చెప్పినవాళ్లు ఒక్కరూ లేకుండా పోయారు. 'అలా మొదలైంది'లో జంటగా ఆకట్టుకున్న నాని, నిత్యమీనన్ ఈ సినిమాలో ఆ మ్యాజిక్ రిపీట్ చేయలేక పోయారు. ఇకనుంచైనా నాని భూమ్మీద నడిస్తే అతని కెరీరుకి మంచిదని సలహా ఇస్తున్నారు విశ్లేషకులు.
Thursday, July 7, 2011
న్యూస్: నాని కెరీర్‌కి ఊపు 'సెగ'
డైరెక్టర్ కాబోయి యాక్టర్ అయిన నాని కెరీర్ 'అలా మొదలైంది'తో మళ్లీ గాడిలో పడింది. తొలి రెండు సినిమాలు 'అష్టా చమ్మా', 'రైడ్' హిట్టవగా, 'స్నేహితుడా', 'భీమిలి కబడ్డి జట్టు' ఫెయిలయ్యాయి. రెండు హిట్లు, రెండు ఫ్లాపులతో బేలన్స్ అయిన అతడి కెరీర్ మళ్లీ 'అలా మొదలైంది'తో ఇంకో మెట్టు పైకెక్కింది. చేసిన ఐదు సినిమాల్లో మూడు హిట్టవడం చిన్న విషయమేమీ కాదు. ఇప్పుడు అతడి దృష్టి తమిళ, తెలుగు భాషలు రెండింటిలోనూ రానున్న 'సెగ' మీదే ఉంది. ఈ సినిమా ఒరిజినల్ వెర్షన్ తమిళంలో చేసిన 'వెప్పం'. అంజనా అలీ ఖాన్ ఈ సినిమా డైరెక్టర్. 'అలా మొదలింది' డైరెక్టర్ నందినీరెడ్డి తరహాలోనే అంజన కూడా నానికి మంచి దోస్త్. ఆ సినిమాలో నానికి జోడీగా నటించిన నిత్యమీనన్ ఈ సినిమాలోనూ నటించడం ఇంటరెస్టింగ్. ఈ నెల్లోనే ఈ సినిమాలు విడుదల కానున్నాయి. అయితే వీటికంటే అతడికి పెద్ద పేరు తీసుకొచ్చే అవకాశమున్న సినిమా మరోటి ఉంది. అది 'ఈగ'. ఎస్.ఎస్. రాజమౌళి డైరెక్టర్ కావడమే ఈ సినిమాకి పెద్ద ఎస్సెట్ అని వేరే చెప్పాల్సిన పనిలేదు. విలన్ (సుదీప్) చేతిలో చనిపోయిన హీరో (నాని) తర్వాత జన్మలో ఈగగా పుట్టి విలన్‌పై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడనేది ఈ సినిమా కథ. ఇప్పటివరకు తెలుగు తెరపై చూడని కథతో వస్తున్న ఈ సినిమా నాని కెరీర్‌కి బూస్ట్‌నివ్వడం ఖాయం. ఇదే కాక అశోక్ అనే మరో కొత్త డైరెక్టర్ తీస్తున్న 'పిల్ల జమీందారు' అనే ఇంకో సినిమా కూడా చేస్తున్నాడు నాని. మొత్తానికి కుర్ర హీరోల్లో మంచి నటుడిగా ఎక్కువ మార్కులు పొందుతోంది నిస్సందేహంగా అతడే.
Wednesday, December 8, 2010
సినిమా: రాజమౌళి దర్శకత్వంలో 'ఈగ'ప్రారంభం
నాని, సమంత, సుదీప్ కాంబినేషన్‌తో దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి రూపొందిస్తోన్న చిత్రం 'ఈగ' షూటింగ్ మంగళవారం (డిసెంబర్ 7) లాంఛనంగా ప్రారంభమైంది. డి. సురేశ్‌బాబు సమర్పణలో వారాహి చలనచిత్రం పతాకంపై సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రామానాయుడు స్టూడియోస్‌లో జరిగిన కార్యక్రమంలో తొలి సన్నివేశానికి సీనియర్ నిర్మాత డి. రామానాయుడు కెమెరా స్విచ్ఛాన్ చేయగా, దర్శకుడు వి.వి. వినాయక్ క్లాప్‌నిచ్చారు. దీనికి సీనియర్ డైరెక్టర్ కె. రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు. హీరోలు వెంకటేశ్, ఎన్టీఆర్, రాంచరణ్, రవితేజ 'యాక్షన్' చెప్పారు.
ఈ సందర్భంగా జరిగిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ "విలన్ చేతిలో చనిపోయిన హీరో మరుజన్మలో ఈగగా పుట్టి, విలన్ మీద ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడనేది ఇతివృత్తం. ఇందులో ఈగకి ఎలాంటి అదనపు శక్తులూ ఉండవు. మూమూలు ఈగగానే ఉంటుంది కానీ గతజన్మ జ్ఞాపకాలుంటాయి. చాలా చాలా ప్రయోగాత్మక చిత్రం. చాలా కష్టమైన కంప్యూటర్ గ్రాఫిక్స్ ఉన్న చిత్రం. చిన్న సైజులో కనిపించే ఈగనీ, పెద్దగా కనిపించే మనుషుల్నీ అనుసంధానం చేయడానికి జేమ్స్ ఫౌల్డ్స్‌ని సినిమాటోగ్రాఫర్‌గా పెట్టుకున్నాం. హిందీలో 'లమ్హే' చిత్రానికి ఆయన ఫెంటాస్టిక్ ఫ్రేమింగ్ వర్క్ చేశారు. రెండు గంటల్లోపల నిడివి ఉండే ఈ చిత్రంలో మూడు పాటలుంటాయి. తెలుగు, తమిళ భాషల్లో దీన్ని తీస్తున్నాం'' అని చెప్పారు.
సమర్పకుడు సురేశ్‌బాబు మాట్లాడుతూ "ఈ సినిమా ప్రేక్షకులకి కొత్త తరహా అనుభవాన్నిస్తుంది. రాజమౌళి చెప్పిన కథ చాలా సంతృప్తినిచ్చింది. చాలా మ్యాజిక్ ఉండే సినిమా. అయినా సేఫ్ ఫిల్మ్. అన్ని రకాల భావోద్వేగాలూ ఉంటాయి. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వస్తుంది'' అన్నారు.
విలన్ పాత్రధారి సుదీప్ మాట్లాడుతూ "ఈ సినిమాలో భాగమవుతున్నందుకు సంతోషం. అద్భుతమైన విజన్ ఉన్న రాజమౌళి లాంటివాళ్లే ఇలాంటి సినిమా తీయగలరు. తెలుగులో 'రక్తచరిత్ర' తర్వాత చేస్తున్న సినిమా ఇది. నా కెరీర్‌లో ఎప్పుడూ ఇలాంటి స్క్రిప్టు వినలేదు. ఇది వచ్చాక తెలుగు సినిమా చాలా మారిపోతుంది'' అని తెలిపారు.
ఈ సినిమాలో తనది చిన్న పాత్రే కానీ రాజమౌళి తనకి పెద్ద బాధ్యత అప్పగించారని హీరో నాని చెప్పగా, రాజమౌళి డైరెక్షన్‌లో అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని హీరోయిన్ సమంత తెలిపారు. సమావేశంలో నిర్మాత సాయి కొర్రపాటి, సంగీత దర్శకుడు కీరవాణి, సినిమాటోగ్రాఫర్ జేమ్స్ ఫౌల్డ్స్, స్పెషల్ ఎఫెక్ట్స్ నిపుణుడు అడిల్ మాట్లాడారు.
ఈ చిత్రానికి కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, కళ: ఎస్. రవీందర్, స్టైలింగ్: రమా రాజమౌళి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎస్.ఎస్. రాజమౌళి.

Friday, November 19, 2010
సినిమా: నాని కెరీర్ 'అలా మొదలైంది'
తప్పకుండా హిట్టయ్యి తనకు పేరు తెస్తుందనుకున్న 'భీమిలి కబడ్డీ జట్టు' అనుకున్నట్లు ఆడకపోవడంతో నాని కాస్త నిరాశపడ్డాడు. తమిళంలో మాదిరిగానే తెలుగులోనూ సినిమాని విషాదాంతం చేయడంవల్ల ఎలాంటి నష్టం వుండదనీ, తెలుగు ప్రేక్షకులు తప్పకుండా ఈ విషాదాంత సినిమాని ఆదరిస్తారనీ బల్లగుద్ది మరీ చెప్పిన నాని ప్రేక్షకుల తీర్పు చూశాక సైలెంటయ్యాడు. ఇప్పుడు అతని ఆశలన్నీ 'అలా మొదలైంది' చిత్రంమీదే వున్నాయి.
ఈ సినిమాతో నందినిరెడ్డి దర్శకురాలిగా పరిచయమవుతోంది. గతంలో నందిని, నాని ఇద్దరూ అసిస్టెంట్ డైరెక్టర్లుగా కలిసి కొన్ని సినిమాలకు పనిచేశారు. అంటే ఇద్దరూ మంచి దోస్తులన్నమాట. నిత్యమీనన్ హీరోయిన్‌గా పరిచయమవుతోన్న ఈ సినిమాలో స్నేహా ఉల్లాల్, కృతి కర్బందా కీలక పాత్రలు చేస్తున్నారు. రంజిత్ మూవీస్ నిర్మిస్తోన్న ఈ సినిమా నవంబరులోనే రిలీజ్ కాబోతోంది. 'అష్టాచమ్మా', 'రైడ్' సినిమాలతో సక్సెస్ సాధించడమే కాక, కొత్త హీరోల్లో ప్రామిసింగ్ యాక్టర్‌గా కూడా పేరు సంపాదించుకున్న నానికి 'స్నేహితుడా', 'భీమిలి కబడ్డీ జట్టు' సినిమాలు అసంతృప్తిని కలిగించాయి. ఇప్పుడు 'అలా మొదలైంది'తో అతడి కెరీర్ మళ్లీ గాడిన పడుతుందా?

Friday, November 5, 2010
Subscribe to:
Posts (Atom)