Sunday, October 2, 2011
న్యూస్: జమీందార్లు పోయినా 'పిల్ల జమీందార్' వదలట్లేదు!
మొత్తానికి 'పిల్ల జమీందార్' పాటలు విడుదలయ్యాయి. నాని సరసన అంతగా గ్లామర్‌లేని హరిప్రియ, బిందుమాధవి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకి తమిళ సంగీత దర్శకుడు సెల్వగణేశ్ మ్యూజిక్‌నిచ్చాడు. ఈ సినిమా బాగా ఆలస్యం కావడానికి గల కారణాల్ని నిర్మాత డి.ఎస్. రావు ఆవేదనా రూపంలో వ్యక్తం చేశాడు. సమ్మెలతో పాటు పలు ఆటంకాలు కలగడం వల్లే సినిమా మేకింగ్‌లో ఇంత ఆలస్యం జరిగిందనీ, అయితే శ్రమకు తగ్గ ఫలితం దక్కిందనీ ఆయన చెప్పాడు. పదేళ్ల నుంచీ హిట్ కోసం మొహం వాచిపోయాననీ, ఈ సినిమాతో ఆ దాహం తీరుతుందనీ గట్టి నమ్మకాన్ని వ్యక్తం చేశాడు. ఈ సినిమా ద్వారా అశోక్ డైరెక్టర్‌గా పరిచయమవుతున్నాడు. ఎప్పుడో రాష్ట్రంలో జమీందారీలకు కాలం చెల్లిపోయినా మన సినిమా వాళ్లు మాత్రం ఆ జమీందారీలని ఇంకా వదిలిపెట్టలేదనే దానికి ఈ సినిమా మరో ఉదాహరణ. యువకుడైన అశోక్ మరి ఇలాంటి కథని ఎందుకు ఎంచుకున్నాడో తెలీదు. పాటల చిత్రీకరణ, వాటి బాణీలు చూస్తే మాత్రం సెల్వ గణేశ్ బాగానే పనిచేసినట్లు అర్థమవుతుంది. అయితే నాని తప్ప ఈ సినిమాకి జనాన్ని తీసుకువచ్చే మరో ఆకర్షణ ఏదీలేని స్థితిలో పదేళ్లకైనా డి.ఎస్. రావు హిట్ కలని 'పిల్ల జమిందార్' తీరుస్తాడో, లేడో...
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment