Wednesday, October 12, 2011
న్యూస్: 'మొగుడు'ని 'రాఖీ' అంత కావాలన్న ఎన్టీఆర్
'మొగుడు' సినిమా తన 'రాఖీ' అంత గొప్ప సినిమా కావాలని ఆకాక్షించాడు ఎన్టీఆర్. దీంతో విన్నవాళ్ల చెవులూ, చూసినవాళ్ల కళ్లూ తరించిపోయాయి. "కృష్ణవంశీ తీసిన 'రాఖీ'లో గొప్ప పాత్ర చేశా. ఇప్పటిదాకా ఎన్ని పాత్రలు చేసినా, ఇకముందు ఎన్ని పాత్రలు చేసినా 'రాఖీ' పాత్రని మర్చిపోలేను. కథచెప్పి నన్ను ఏడిపించిన ఏకైక దర్శకుడు వంశీనే. నాకు 'రాఖీ' మాదిరిగానే నా మిత్రుడైన గోపీకి ఇది బ్రహ్మాండమైన సినిమా అవుతుంది" అని చెప్పాడు ఎన్టీఆర్. వాస్తవమేమంటే 'రాఖీ' సినిమా కమర్షియల్‌గా చెప్పుకోదగ్గ రీతిలో ఆడలేదు. అత్తింటి ఆరళ్లకు బలైపోయిన తన చెల్లెలి మాదిరిగా మరే చెల్లెలూ అన్యాయానికి గురి కాకూడదని ఆడపిల్లల్ని ఆదుకునే అన్నగా ఆ సినిమాలో ఎన్టీఆర్ నటించాడు. ఎప్పటిలాగే ప్రతి పాత్రనీ 'ఓవర్ బోర్డ్'కు తీసుకెళ్లే అలవాటున్న కృష్ణవంశీ 'రాఖీ' పాత్రనీ ఓవర్‌గానే మలిస్తే, తన ఓవరాక్టింగ్‌తో ఆ కేరక్టర్‌కి న్యాయం చేశాడు ఎన్టీఆర్. ఆ సినిమా తెలుగుదేశంలోని ప్రతి చెల్లినీ కదిలిస్తుందని వాళ్లు ఆశించారు. కానీ జరిగింది అందుకు విరుద్ధం. ప్రేక్షకులతో పాటు విమర్శకుల్నీ ఆ సినిమా మెప్పించలేకపోయింది. అలాంటి సినిమాని పట్టుకుని గోపీచంద్‌కి 'మొగుడు' తన 'రాఖీ' అంత సినిమా కావాలని ఎన్టీఆర్ కోరుకోవడం చూసి, "ఆ సినిమాలాగానే 'మొగుడు' కూడా ఫట్టవ్వాలని ఎన్టీఆర్ కోరుకుకుంటున్నాడా?" అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. చివరికి గోపీచంద్‌కి కూడా ఎన్టీఆర్ మాటలు రుచించలేదని అప్పుడు అతని మొహమే చెప్పింది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment