Showing posts with label salman khan. Show all posts
Showing posts with label salman khan. Show all posts

Friday, September 26, 2014

Wednesday, July 10, 2013

బాలీవుడ్‌లో రీమేకులు, సీక్వెళ్లు

రానున్న రోజుల్లో బాలీవుడ్‌లో రాబోతున్న కొన్ని రీమేక్స్, సీక్వెల్స్ సినీ ప్రేమికుల్లో అమితాసక్తి రేకెత్తిస్తునాయి. వాటిపై ఓ లుక్కేస్తే...
జంజీర్: 1974లో విడుదలైన 'జంజీర్' సినిమాలో ఇన్‌స్పెక్టర్ విజయ్‌గా యాంగ్రీ యంగ్‌మేన్ పాత్ర చేసిన అమితాబ్ బచ్చన్ రాత్రికి రాత్రి స్టార్ హీరోగా అవతరించారు. విజయ్ పాత్రను కొత్తగా రూపొందించిన అపూర్వ లఖియా 'జంజీర్' 2013 సెప్టెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాతో రాంచరణ్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
దిల్ హై కి మాన్తా నహీ: హాలీవుడ్ క్లాసిక్ ఫిల్మ్ 'ఇట్ హ్యాపెండ్ వన్ నైట్' ఆధారంగా రూపొందిన 'దిల్ హై కీ మాన్తా నహీ' సినిమాలో అమీర్‌ఖాన్, పూజాభట్ జంటగా అలరించారు. ఇప్పుడు ఆ సినిమా రీమేక్‌కి పూజాభట్ డైరెక్టర్ కావడం విశేషం. ఆమె చెల్లెలు అలియాభట్, ఇమ్రాన్ హష్మి జంటగా నటించబోతున్నారు.
మాసూం: ఎరిక్ సీగల్ పుస్తకం 'మేన్, వుమన్ అండ్ చైల్డ్' ఆధారంగా నసీరుద్దీన్‌షాతో శేఖర్ కపూర్ రూపొందించిన 'మాసూం' క్లాసిక్ ఫిలింగా పేరుపొందింది. గత ఏడాది 'చిట్టగాంగ్' సినిమాతో జాతీయ అవార్డు పొందిన వేదవ్రత పైన్ ఈ సినిమాకి రీమేక్ చేయాలని ప్లాన్ చేస్టున్నారు. నవాజుద్దీన్ సిద్దిఖి ప్రధాన పాత్ర చేయనున్నాడు.
సాజన్: మాధురీ దీక్షిత్, సంజయ్‌దత్, సల్మాన్‌ఖాన్ నటించిన సూపర్‌హిట్ ముక్కోణ ప్రేమకథ చిత్రం 'సాజన్'ను నేటి తరం తారలతో సీక్వెల్ చేయనున్నట్లు ఆ సినిమా దర్శకుడు లారెన్స్ డి'సౌజా తెలిపాడు.
బోర్డర్: 1997లో వచ్చిన జె.పి. దత్తా సినిమా 'బోర్డర్' ప్రేక్షకుల, విమర్శకుల ఆదరణ పొందింది. ఇప్పుడు వివిధ యుద్ధ వీరుల జీవితాలతో 'బోర్డర్'కు మూడు సీక్వెల్స్ తీస్తానని ఆయన ప్రకటించారు.
ప్యార్ కే సైడ్ ఎఫెక్ట్స్: రాహుల్ బోస్, మల్లికా షెరావత్ వంటి ఆసక్తికర జంటతో రూపొందిన 'ప్యార్ కే సైడ్ ఎఫెక్ట్స్' చెప్పుకోదగ్గ రీతిలో విజయం సాధించింది. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా తయారవుతున్న 'షాదీ కే సైడ్ ఎఫెక్ట్స్'లో విద్యా బాలన్, ఫరాన్ అఖ్తర్ జంటగా నటిస్తున్నారు.
ఇష్కియా: కొత్త దర్శకుడు అభిషేక్ చౌబీ రూపొందించిన 'ఇష్కియా' అంత పెద్ద విజయం సాధిస్తుందని ఎవరూ వూహించలేదు. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా తయారవుతున్న 'దేద్ ఇష్కియా'లో మాధురీ దీక్షిత్, హుమా ఖురేషి, అర్షద్ వార్సి, నసీరుద్దీన్‌షా నటిస్తున్నారు.
ధూం: యష్‌రాజ్ ఫిలిమ్స్ నిర్మించగా ఒకదాన్ని మించి ఒకటి సూపర్‌హిట్టయిన్ 'ధూల్' సీరిస్‌లో మూడోదైన 'ధూల్ 3' కోసం ఈ యేడాది ప్రేక్షకులు అమితాసక్తితో ఎదురు చూస్తున్నారు. అమీర్‌ఖాన్ విలన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో కట్రీనా కైఫ్, అభిషేక్ బచ్చన్, ఉదయ్‌చోప్రా నటిస్తున్నారు.
విశ్వరూప్: కమల్‌హాసన్ రూపొందించగా 2012లో విడుదలైన 'విశ్వరూప్' ఎంతటి వివాదాన్ని సృష్టించిందో మనకు తెలుసు. ఇప్పుడు దేశాంతర ఉగ్రవాదంపై కమల్ రూపొందిస్తున్న 'విశ్వరూప్ 2' వేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది.
క్రిష్: హృతిక్ రోషన్‌ను సూపర్ హీరోగా చూపిస్తూ రాకేశ్ రోషన్ రూపొందిస్తున్న సినిమా 'క్రిష్ 3'. నవంబర్‌లో రానున్న ఈ సినిమాలో వివేక్ ఓబరాయ్, కంగనా రనౌత్ నెగటివ్ రోల్స్ చేస్తున్నారు.

'ఎవడు' సెట్స్‌పై రాంచరణ్‌ను కలిసిన సల్మాన్


Sunday, May 27, 2012

హారర్ సినిమాలు ఇష్టం


బాలీవుడ్‌లో వరుసగా రెండు యాక్షన్ సినిమాలు డైరెక్ట్ చేసిన ప్రభుదేవా ఇప్పుడు జనాన్ని భయపెట్టే హారర్ సినిమా చేయాలని అనుకుంటున్నాడు. సల్మాన్‌ఖాన్, ఆయేషా తకియా జంటగా రూపొందించిన 'వాంటెడ్' ('పోకిరి' రీమేక్)తో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన అతను దాని తర్వాత అక్షయ్‌కుమార్, సోనాక్షి సిన్హా జంటగా 'రౌడీ రాథోర్' ('విక్రమార్కుడు' రీమేక్)ను రూపొందించాడు. కొద్ది రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ రెండూ యాక్షన్ సినిమాలే. "నా కంటే ఎక్కువగా జనం నేను యాక్షన్ సినిమాలు చేయాలని కోరుకుంటున్నారు. కానీ నాకేమో హారర్ సినిమాలు చేయాలంటే ఇష్టం'' అని తెలిపాడు ప్రభుదేవా. దక్షిణాదిలో కానీ బాలీవుడ్‌లో కానీ టీమ్ బాగుండటం ముఖ్యమనీ, టీమ్ బాగుంటే చివరకు ఓ స్పానిష్ సినిమానైనా తీసేయొచ్చనీ అతనంటాడు.
ఒరిజినల్‌లో రవితేజ చేసిన పాత్రకు 'రౌడీ రాథోర్'లో అక్షయ్‌కుమార్ సరిగ్గా సరిపోయాడనేది అతని అభిప్రాయం. "అతనికి టైలర్‌మేడ్ కేరక్టర్ కావడం వల్లే అక్షయ్‌ను ఆ పాత్రకు ఎంచుకున్నా. అతనేవిధంగా చేశాడో తెరపై మీరే చూస్తారు. అతనితో పనిచేయడం గొప్పగా భావిస్తున్నా. అతను దర్శకుడి నటుడు'' అని చెప్పాడు ప్రభుదేవా.

Friday, May 25, 2012

అసిన్ హ్యాట్రిక్ హిట్?

బాలీవుడ్‌లో రెండు వరుస హిట్లు సాధించిన అసిన్ హ్యాట్రిక్ హిట్ మీద కన్నేసింది. ఆమె హీరోయిన్‌గా నటించిన 'రెడీ', 'హౌస్‌ఫుల్ 2' ఒకదాన్ని మించి ఒకటి ఘన విజయం సాధించాయి. రానున్న 'బోల్ బచ్చన్' కూడా హిట్టయితే హ్యాట్రిక్ పూర్తవుతుందనేది ఆమె ఆశ. ఇవన్నీ కామెడీలు కావడం గమనించదగ్గ అంశం. "సల్మాన్‌ఖాన్, అక్షయ్‌కుమార్ వంటి స్టార్లు ఉండటం 'రెడీ', 'హౌస్‌ఫుల్ 2' సినిమాలకు బాగా ఉపయోగపడింది. 'బోల్ బచ్చన్'లో అజయ్ దేవగన్ ఉన్నాడు. అన్నిటికీ మించి ఇది సందర్భానుసారం నడిచే కామెడీ సినిమా. ఇలాంటి సినిమాలకి అసిన్ సరిగ్గా సరిపోతుంది'' అని తెలిపారు ఓ ట్రేడ్ విశ్లేషకుడు. అయితే ఇవి కామెడీ సినిమాలైనా ఒకదానికొకటి భిన్నమైనవి. 'హౌస్‌ఫుల్ 2'లో ఉన్నది స్లాప్‌స్టిక్ కామెడీ అయితే, 'బోల్ బచ్చన్' సిట్చువేషనల్ కామెడీ అనీ, ఈ రెండు సినిమాల్లో భిన్నమైన బాడీ లాంగ్వేజీతో నటించాననీ అసిన్ తెలిపింది. ఈ రెండు కామెడీలు ఒకదానికొకటి భిన్నమైనవైనప్పటికీ, బాక్సాఫీస్ వద్ద ఒకే విధమైన ఫలితాన్ని చూపిస్తాయని ఆమె నమ్ముతోంది. డైరెక్టర్ రోహిత్‌శెట్టితో అజయ్ దేవగన్ కాంబినేషన్ ఇప్పటివరకు సూపర్ సక్సెస్ అవడం కూడా ఈ సినిమాపై అసిన్ నమ్మకానికి ఓ కారణం.