Showing posts with label eega. Show all posts
Showing posts with label eega. Show all posts
Thursday, October 29, 2015
Tuesday, October 13, 2015
Rajamouli's Answers With BAAHUBALI
సీక్వెల్ పనిలో..
పోటీ తీవ్రంగా ఉన్న ఈ కాలంలో, సినిమా జూదంగా మారిపోయిన సంధి కాలంలో డైరెక్ట్ చేసిన పది సినిమాల్లో తొమ్మిది సినిమాలు నిర్మాతకు లాభాలు తెచ్చిపెట్టాయంటే, వాటిలో రెండు ఇండస్ట్రీ హిట్లు కూడా ఉన్నాయంటే ఆ దర్శకుణ్ణి ఏమని పిలవాలి? దర్శకుల్లోనే ‘బాహుబలి’ అని. ఆ ‘బాహుబలి’ యస్.యస్. రాజమౌళి కాకపోతే ఇంకెవరవుతారు! ఇవాళ ‘బాహుబలి’ ఓ ఇంటర్నేషనల్ ఫిల్మ్. రాజమౌళి ఓ ఇంటర్నేషనల్ బ్రాండ్. ‘మగధీర’, ‘ఈగ’ సినిమాలతో తెలుగు సినిమాను జాతీయ స్థాయిలో నిలిపిన ఆయన ‘బాహుబలి: ద బిగినింగ్’తో అంతర్జాతీయ స్థాయికి ఎదిగాడు. ఒక్క ‘సై’ మినహా ఆయన రూపొందించిన మిగతా సినిమాలన్నీ హిట్టే. ‘సై’ కూడా కాస్ట్ ఫెయిల్యూర్ మాత్రమే. ‘బాహుబలి’ సినిమా తెలుగులోనే కాకుండా దక్షిణ భారతావనిలోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా చరిత్రకెక్కి, ప్రపంచవ్యాప్త వసూళ్లలో టాప్ 3 ఇండియన్ గ్రాసర్‌గా నిలిచింది. ఇక దేశీయ వసూళ్లలో నెంబర్‌వన్ ప్లేస్ ‘బాహుబలి’దే. ఇంతటి చరిత్రకు కారకుడైన రాజమౌళి ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ అయిన ‘బాహుబలి: ద కంక్లూజన్’ రూపకల్పనలో నిమగ్నమయ్యాడు. విమర్శకుల ప్రకారం మొదటి సినిమాను ‘ఇంటర్వెల్’లో ఆపేసిన ఆయన, పోస్ట్ ఇంటర్వెల్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ భాగాల్ని తీస్తున్నాడన్న మాట. అమరేంద్ర బాహుబలి, దేవసేన మధ్య పరిచయం ఎలా జరిగింది? ఆ పరిచయం ప్రణయంగా ఎలా మారింది? అది పెళ్లిగా ఎలా రూపాంతరం చెందింది? దేవసేనపై మోజుపడ్డ భల్లాలదేవ దీన్నంతా చూస్తూ ఊరుకున్నాడా? బాహుబలిని కట్టప్ప ఎందుకు వెన్నుపోటు పొడిచాడు? అమరేంద్ర బాహుబలి కొడుకు, పసికందు మహేంద్ర బాహుబలిని రాజమాత శివగామి ఎలాంటి పరిస్థితుల్లో కాపాడింది? భర్త హత్యకు కొడుకు మహేంద్ర/శివుడు సాయంతో దేవసేన ఎలా ప్రతీకారం తీర్చుకుంది?... ఇవన్నీ ‘బాహుబలి’ చూశాక మన మనసుల్లో తలెత్తిన ప్రశ్నలు. వాటన్నింటికీ సీక్వెల్‌లో సమాధానాలివ్వబోతున్నాడు రాజమౌళి. దీని కథేమిటో ముందే మనకు తెలిసినా, ఎలా తీసుంటాడనే కుతూహలం అందరిలోనూ ఉంది. సన్నివేశాల కల్పన, భావోద్వేగాల చిత్రణ విషయంలో సామాన్య ప్రేక్షకులఊహల్ని ఎప్పుడూ సంతృప్తిపరుస్తూనే ఉన్నాడు రాజమౌళి. ‘బాహుబలి: ద కంక్లూజన్’తోనూ ఆయన ఆ మ్యాజిక్‌ను మరోసారి చూపిస్తాడనేది ఖాయం. చూడాల్సింది.. అది ‘బాహుబలి’ని మించుతుందా, లేదా?.. అని మాత్రమే.
- ఆంధ్రజ్యోతి డైలీ, 10 అక్టోబర్ 2015
Friday, October 10, 2014
Wednesday, July 2, 2014
Cinema: Interview with Actor Venkat
తెలుగు చిత్రసీమను బాగు చెయ్యాలి: వెంకట్
"ప్రజలకు మంచి చేయడానికి ఎలా రాజకీయాల్లోకి వచ్చారో, అలాగే తెలుగు చిత్రసీమను బాగు చెయ్యడానికి పవన్‌కల్యాణ్ నడుం బిగించాలని కోరుకుంటున్నా. ఆయనొక్కరే ఏమైనా చెయ్యగలరనిపిస్తోంది. ఈ విషయంపై మాట్లాడేందుకు ఆయన్ని కలవాలనుకుంటున్నా'' అని చెప్పారు వెంకట్. 'శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండీ' వంటి హిట్ సినిమాతో హీరోగా కెరీర్ మొదలుపెట్టిన ఆయన చక్కని నటునిగా పేరు తెచ్చుకున్నప్పటికీ, కొంతకాలంగా ఆయనకు సరైన అవకాశాలు లేకుండా పోయాయి. కొంత విరామంతో ఇప్పుడు ప్రేమ్ మూవీస్ పతాకంపై ప్రేమ్‌కుమార్ పట్రా సమర్పిస్తోన్న 'ఆ ఐదుగురు' చిత్రంలో ఐపీఎస్ ఆఫీసర్‌గా శక్తిమంతమైన పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అనిల్ జేసన్ గూడూరు దర్శకత్వం వహించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలవుతున్న సందర్భంగా పత్రికలవారితో వెంకట్ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే...ఒక ఐపీఎస్ ఆఫీసర్ ముఖ్యమంత్రయి, సమాజాన్ని మార్చడానికి ఏం చేశాడనేది 'ఆ ఐదుగురు'లోని ప్రధానాంశం. ముఖ్యమంత్రయ్యాక ఆయన నెక్స్‌ట్ జనరేషన్ ఫోర్స్ (ఎన్.జి.ఎఫ్.) అనే ఓ దళాన్ని ఏర్పాటుచేస్తాడు. నలభైమంది సభ్యుల ఆ బృందానికి శిక్షణనిచ్చే ఐపీఎస్ ఆఫీసర్‌గా నేను నటించాను. సీఎంగా వాసు అనే కొత్త నటుడు చేశారు. నలభై మంది బృందంలోని వాళ్లే 'ఆ ఐదుగురు'. మిగతా 35 మంది పాత్రలను నిజమైన పోలీసులే చేశారు. ఈ సినిమాలో నటించడానికి 'అప్పా' (ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ)లో రెండు నెలలపాటు శిక్షణ పొందాను. కాగా ఇందులోని డాక్టర్ పైపుల అనే పాత్రలో చిత్ర సమర్పకులు ప్రేమ్‌కుమార్ పట్రా కామెడీని పంచబోతున్నారు. ఇది యువతకు మార్గదర్శకం చూపించే సినిమా. మంచి సినిమాలు రావట్లేదని ఎప్పుడూ వాపోతూ ఉంటాం. కానీ మంచి సినిమాలు వచ్చినప్పుడు చూస్తున్నామా? ఇది కచ్చితంగా మంచి సినిమా. కమర్షియల్ అంశాలు మేళవించిన మంచి సినిమా.
ఆశాభావంతో ఉన్నా
పోలీసాఫీసర్‌గా నటించడం నాకిదే మొదటిసారి. ఇప్పటివరకు నేను చేసిన పాత్రలతో పోలిస్తే ఇందులో నా లుక్ డిఫరెంట్. నిజ జీవితంలో ఐపీఎస్ ఆఫీసర్ ఎలా ఉంటారో నా పాత్రను అలా చూపించారు. హైదరాబాద్‌లో జరిగిన ఓ అందాల పోటీకి నేను, అస్మితా సూద్ జడ్జీలుగా వెళ్లాం. అందులో మమ్మల్ని చూసిన ప్రేమ్‌కుమార్ గారు ఈ సినిమాలోని కీలక పాత్రలు మేం సరిపోతామని భావించి, మాకు ఈ కేరక్టర్స్‌ని ఇచ్చారు. నా శాయశక్తులా ఆ పాత్రకు న్యాయం చేయడానికి కృషి చేశా. నా శరీరాకృతిని దృఢంగా మలచుకున్నా. స్టంట్స్‌ని డూప్‌లేకుండా చేసే క్రమంలో పై నుంచి కిందపడ్డాను. వెన్నెముక గాయంతో మూడు నెలలు విశ్రాంతి తీసుకున్నా. ఫలితంగా సినిమా షూటింగ్‌కు అంతరాయం కలిగింది. నా కోసం నిర్మాత ఓపిక వహించారు. 'ఆ ఐదుగురు' విడుదల కోసం ఎదురు చూస్తున్నా. విడుదలయ్యాక నాకు మంచి ఆఫర్లు వస్తాయనే ఆశాభావంతో ఉన్నా. సోలో హీరో కంటే ఇద్దరు, ముగ్గురు హీరోలుంటే సినిమాలు చెయ్యాలనుకుంటున్నా. ఇదివరకు నేను చేసిన అలాంటి సినిమాలు మంచి హిట్టయ్యాయి.ప్రొడక్షన్ అంటేనే భయం
ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో పరిస్థితి బాగా లేదు. నిర్మాతలకు మేలు చేకూర్చే వాతావరణం ఇవాళ ఇండస్ట్రీలో అసలు లేదు. సినిమాలు తీసినా డిస్ట్రిబ్యూషన్ చాలా కష్టమైపోతోంది. గతంలో నేను ఓ సినిమాని ప్రొడ్యూస్ చేశాను. ఇవాళ ప్రొడక్షన్ అంటేనే భయమేస్తోంది. కొత్త నిర్మాతలు వస్తున్నా నిజాయితీగా సినిమాలు తీసే నిర్మాతలు తక్కువ. సినిమా నిర్మాణంలో ప్రొఫెషనలిజం తక్కువగా కనిపిస్తోంది. మోజు కోసమో, గ్లామర్ కోసమో వచ్చేవాళ్లే ఎక్కువ కనిపిస్తున్నారు. అలాగే మన సూపర్‌స్టార్ల సినిమాలను కూడా తమిళనాడులో ఎందుకు చూడరో, వాళ్ల సినిమాలను మనమెందుకు చూస్తున్నామో ఆలోచించాలి.విలన్‌గా చేస్తా
నేను ప్రయోగాలకు సిద్ధంగా ఉన్నా. నెగటివ్ కేరక్టర్లూ చేస్తా. అయితే 'ఈగ'లో సుదీప్ చేసినటువంటి విలన్ కేరక్టర్ అయితేనే. అంటే కథకు ఆ పాత్ర కీలకంగా ఉండాలి.- ఆంధ్రజ్యోతి డైలీ, 2 జూలై 2014
Saturday, December 7, 2013
Saturday, June 30, 2012
'ఈగ'ని చూసి ఎగ్జయిటైన నిర్మాతలు
నాని, సమంత, సుదీప్ ప్రధాన పాత్రధారులుగా దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి రూపొందిస్తున్న 'ఈగ' చిత్రం జూలై 6న విడుదలకు సిద్ధమవుతోంది. డి. సురేశ్‌బాబు సమర్పణలో వారాహి చలనచిత్రం పతాకంపై సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లోనూ ఏక కాలంలో ఈ సినిమా విడుదలవుతోంది. దర్శకుడు రాజమౌళి "ఈ సినిమా తొలికాపీని సురేశ్‌బాబు, తమిళ వెర్షన్ 'నాన్ ఈ' నిర్మాత పి.వి. కలిసి చూశారు. సినిమా అయ్యాక నన్ను కౌగలించుకుని ఈ సినిమా నిర్మాణంలో తాము పాలుపంచుకున్నందుకు గర్వంగా భావిస్తున్నామని చెప్పారు. వాళ్ల అభినందనకు చాలా చాలా సంతోషంగా ఉంది'' అని ట్విట్టర్ ద్వారా చెప్పారు. ఇటీవల నానిపై చిత్రీకరించి విడుదల చేసిన ప్రమోషనల్ సాంగ్‌కు అనూహ్యమైన స్పందన వచ్చిందని ఆయన తెలిపారు. హీరో నాని మాట్లాడుతూ "ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అనే ఉత్కంఠతతో ఎదురుచూస్తున్నా. ఇప్పటిదాకా భారతీయ తెరపైనే కాదు, అసలు వెండితెర మీదే ఇలాంటి సినిమా రాలేదనేది నా అభిప్రాయం'' అని తెలిపారు. సమర్పకుడు సురేశ్‌బాబు మాట్లాడుతూ "ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో దాదాపు 1200 ప్రింట్లతో విడుదల చేస్తున్నాం. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తోనూ ప్రింట్లు వేస్తున్నాం'' అని చెప్పారు.
Saturday, June 16, 2012
జూలై 6న వస్తున్న 'ఈగ'
నాని, సమంత, సుదీప్ ప్రధాన పాత్రధారులుగా దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి రూపొందిస్తున్న 'ఈగ' చిత్రం జూలై 6న విడుదలకు సిద్ధమవుతోంది. డి. సురేశ్‌బాబు సమర్పణలో వారాహి చలనచిత్రం పతాకంపై సాయి కొర్రపాటి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి తాజాగా ఓ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. 'నా పేరు నాని, నేను ఈగనైతే గానీ' అనే టైటిల్ సాంగ్‌ను హీరో నాని బృందంపై చిత్రీకరించారు. ఈ పాటను ప్రమోషనల్ సాంగ్‌గా ఉపయోగిస్తున్నామనీ, చిత్రంలో ఈ పాటను 'ఈగ'పై తీశామనీ రాజమౌళి చెప్పారు.
'మగధీర' చేసేప్పుడు గ్రాఫిక్స్ విషయంలో చాలా తెలిసిందని అనుకున్నాననీ, కానీ 'ఈగ' చేస్తుంటే నేను తెలుసుకుంది చాలా తక్కువనీ, తెలుసుకోవాల్సింది చాలా ఎక్కువనీ అర్థమైందన్నారు. సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి మాట్లాడుతూ "ఈ సినిమాలోని ప్రతి ఫ్రేములోనూ దర్శకుని శ్రమ కనిపిస్తుంది. తను అనుకున్నది రాజమౌళి చెయ్యగలిగాడు. రీరికార్డింగ్ అయిపోయి నెలపైనే అయ్యింది. ఇప్పుడు గ్రాఫిక్ వర్క్ కూడా అయిపోవచ్చింది. నేను విలన్ పాత్రలకు సంబంధించి కోట శ్రీనివాసరావుకు వీరాభిమానిని. 'ఈగ' చూసి సుదీప్‌కు వీరాభిమానినైపోయా. అతనిలాంటి నటులు ఇవాళ చాలా తక్కువమంది ఉన్నారు'' అని చెప్పారు.
హీరో నాని మాట్లాడుతూ "ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అనే ఉత్కంఠతతో ఉన్నా. రాజమౌళి ఈజ్ రజనీకాంత్ ఆఫ్ తెలుగు సినిమా. లేట్‌గా వచ్చినా లేటెస్ట్‌గా వస్తారు. ఇప్పటిదాకా భారతీయ తెరపైనే కాదు, అసలు వెండితెర మీదే ఇలాంటి సినిమా రాలేదనేది నా అభిప్రాయం'' అని తెలిపారు. సమర్పకుడు సురేశ్‌బాబు మాట్లాడుతూ "ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో దాదాపు 1200 ప్రింట్లతో విడుదల చేస్తున్నాం. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తోనూ ప్రింట్లు వేస్తున్నాం. ఈ సినిమాకి రాజమౌళి ఎంతో శ్రమించాడు. ఇందులోని యానిమేషన్ గ్రాఫిక్స్ ఎంతో క్లిష్టమైనవి. అవి చాలా బాగా వచ్చాయి'' అన్నారు.
Subscribe to:
Posts (Atom)





