Showing posts with label priyanka chopra. Show all posts
Showing posts with label priyanka chopra. Show all posts

Saturday, May 26, 2012

బికినీకి రెడీ

ఇటీవలే విడుదలై ఘన విజయం సాధించిన బాలీవుడ్ సినిమా 'ఇష్క్‌జాదే' హీరోయిన్ పరిణీతి చోప్రా బికినీ ధరించేందుకు తాను సిద్ధమంటోంది. టాప్ హీరోయిన్ ప్రియాంక చోప్రాకు కజిన్ అయిన పరిణీతి గత ఏడాదే 'లేడీస్ వర్సెస్ రిక్కీ బెహల్' సినిమా ద్వారా పరిచయమై ఆకట్టుకుంది. నటిగా ఎలాంటి పరిధులూ విధించుకోలేదనీ, స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే ఇంటిమేట్ సీన్లలోనూ నటిస్తాననీ ఆమె తెలిపింది. 'ఇష్క్‌జాదే'లో హీరో అర్జున్‌కపూర్‌తో ఆమె కొన్ని ఇంటిమేట్ సీన్లు చేసింది కూడా. "నన్ను నేను నమ్ముతాను కాబట్టే ఎలాంటి పరిమితులూ పెట్టుకోలేదు. 'ఇష్క్‌జాదే' స్క్రిప్ట్ చదివినప్పుడు అందులోని శృంగార లేదా ముద్దు సీన్ల గురించి నేను ఆలోచించలేదు. అందులో ఉన్నవి సందర్భానుసారం వచ్చేవే. అందుకే ప్రేక్షకులు వాటిని ఆస్వాదిస్తున్నారు. స్క్రిప్టు ప్రకారం తప్పదనుకుంటే శృంగార, ముద్దు సీన్లలో నటించడానికి, బికినీ ధరించడానికీ నేను సిద్ధం. ఏ నటికైనా ఫలానావి మాత్రమే చెయ్యాలనే పరిమితులు ఉండకూడదని నేను నమ్ముతా'' అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది ఈ ముద్దుగుమ్మ.

Friday, May 25, 2012

షాహిద్ ప్రేయసి!

తెలుగులో రాంచరణ్ సరసన 'చిరుత'లోనూ, వరుణ్‌సందేశ్ జోడీగా 'కుర్రాడు'లోనూ కనిపించినప్పటికీ ప్రేక్షకుల్ని అలరించినలేకపోయిన నేహా శర్మ బాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. మొదట ఇమ్రాన్ హష్మి సరసన 'క్రూక్'లో కనిపించిన ఈ అందాల తార ఇప్పుడు 'తేరీ మేరీ కహాని'లో హీరో షాహిద్ కపూర్ ప్రేయసి పాత్రలో దర్శనమివ్వబోతోంది. "కునాల్ కోహ్లి డైరెక్ట్ చేస్తున్న 'తేరీ మేరీ కహాని'లో ఓ అతిథి పాత్ర చేస్తున్నా. ఆ సినిమా మూడు తరాల కథతో తయారవుతోంది. నేను షాహిద్ సరసన 2012 తరానికి చెందిన అమ్మాయిగా నటించా. కథానుసారం ఇద్దరమూ లండన్ యూనివర్శిటీలో చదువుకుంటాం. అక్కడ ఒకరిపట్ల ఒకరం ఆకర్షనలో పడతాం. అయితే ఆ తర్వాత ఎవరికి వాళ్లం వేరేవాళ్లతో ప్రేమలో పడతాం'' అని తెలిపింది నేహ. 2011 సెప్టెంబర్‌లో ఆమె పాల్గొన్న సన్నివేశాల్ని చిత్రీకరించారు. జూన్ 22న విడుదల కానున్న ఈ చిత్రంలో షాహిద్ సరసన ప్రధాన నాయికగా ప్రియాంకా చోప్రా నటించింది.