Showing posts with label aarya. Show all posts
Showing posts with label aarya. Show all posts
Saturday, June 27, 2015
Monday, September 26, 2011
న్యూస్: ఆసక్తి రేపుతున్న మహేశ్, సుకుమార్ కాంబినేషన్
మహేశ్, శ్రీను వైట్ల తొలి కాంబినేషన్‌లో వచ్చిన 'దూకుడు' సినిమా రికార్డు కలెక్షన్ల వైపు దూసుకుపోతుండగా, మరో డైరెక్టర్‌తో మహేశ్ తొలి కాంబినేషన్ సినిమా విషయంలో మరింత ఆసక్తి నెలకొంది. ఆ కాంబినేషన్ సుకుమార్‌తో. పూరి జగన్నాథ్‌తో చేస్తున్న 'బిజినెస్‌మేన్' తర్వాత సుకుమార్ డైరెక్షన్‌లో చేయడానికి మహేశ్ నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రచారంలో ఉన్న నిజాన్ని సుకుమార్ ధృవీకరించాడు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్టుని అతను సిద్ధం చేశాడు. 'బిజినెస్‌మేన్' 2012 జనవరిలో విడుదల కాగానే ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశాలున్నాయి. ఈ చిత్రాన్ని కూడా 'దూకుడు' నిర్మాతలే తీయనున్నారనేది సమాచారం. సుకుమార్‌కి అత్యంత ఇష్టమైన సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ఈ సినిమాకి పనిచేసే అవకాశాలున్నాయి. సుకుమార్ విషయానికి వస్తే సూపర్‌స్టార్ ఇమేజ్ ఉన్న ఓ హీరోతో పనిచేయడం అతడికి ఇదే తొలిసారవుతుంది. ఇదివరకు అతను అల్లు అర్జున్, రాం, నాగచైతన్యలను డైరెక్ట్ చేశాడు. ఆ ముగ్గురిలో స్టార్ ఇమేజ్ ఉన్నది అర్జున్‌కే. 'ఆర్య'తో అతడికి ఆ ఇమేజ్ తెచ్చింది సుకుమార్ అనేది గమనార్హం. ఇప్పుడు మహేశ్‌ని అతడు డైరెక్ట్ చేసే సినిమా స్క్రిప్ట్ ఎలా ఉంటుందనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. అతడి స్క్రిప్టుల్లో ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు మేధావితనం కూడా ఉంటుందనేది నిజం. అంటే ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచే తీరులో అతడు హీరో పాత్రని మలుస్తుంటాడు. మరి మహేశ్‌ని అతడు ఎలా చూపిస్తాడు? మహేశ్‌లోని నటుణ్ణి ఎలా ఉపయోగించుకుంటాడు? అనే ఆసక్తి వ్యక్తమవుతోంది.
Tuesday, September 13, 2011
న్యూస్: '1947 ఎ లవ్‌స్టోరీ'ని తెలుగులో ఊహించగలమా?
డబ్బింగ్ సినిమాలు డబ్బు దోచుకు పోతున్నాయనీ, స్ట్రెయిట్ సినిమాలకి థియేటర్లు దొరకడం లేదనీ గగ్గోలు పెడుతున్న వాళ్లంతా ఇవాళ తమిళం నుంచి దిగుమతి అవుతున్న సినిమాల్ని చూసి తెలివి తెచ్చుకోవాలి. నాలుగు రోజులు ఆలస్యంగానైనా '1947 ఎ లవ్‌స్టోరీ' అనే ఓ మంచి, అందమైన సినిమాని చూసే అవకాశం కలిగింది. మన డైరెక్టర్లు ఎప్పటికి ఇలాంటి సినిమా తీయగలుగుతారు? 'శివపుత్రుడు' వచ్చినా తమిళంలోనే రావాలి. 'జెంటిల్‌మన్', 'భారతీయుడు' వచ్చినా తమిళంలోనే రావాలి. ఇప్పుడు '1947 ఎ లవ్‌స్టోరీ' కూడా అదే భాషలో వచ్చింది. తమిళ దర్శకుల సృజనాత్మక శక్తికి ఈ సినిమా మరో మంచి ఉదాహరణ. 1947 స్వాతంత్ర్యం వచ్చే సందర్భంలో అప్పటి మద్రాసు నేపథ్యాన్ని ఎంత చక్కగా దర్శకుడు ఎ.ఎల్. విజయ్ చూపించాడు! చాకలి కుర్రాడు మల్లి (ఆర్య), బ్రిటీష్ గవర్నర్ కూతురు ఎమీ (ఎమీ జాక్సన్) మధ్య చిగురించిన అనురాగాన్ని ఎంత చక్కదనంగా చిత్రించాడు! అదీ సినిమానంతా ఎమీ పాత్ర దృష్టి నుంచి చూపించడం ఎంత బాగుంది! మల్లి, ఎమీ పాత్రలతో మనం కూడా ట్రావెల్ అయ్యామంటే వాటితో మనం ఎంతగా సహానుభూతి చెందిదే సాధ్యపడుతుంది! ఆ పాత్రల్ని ఆర్య, ఎమీ జాక్సన్ పోషించిన తీరు కూడా దానికి దోహదం చేసింది. సినిమాలో కనిపించే ప్రతి వస్తువుకీ, ప్రతి పాత్రకీ ప్రాధాన్యత ఉండటం ఈ సినిమాలో కనిపించిన మరో విశేషం. విజయ్ దర్శకత్వ ప్రతిభ వికసించింది ఈ విషయంలోనే. అందుకే 80 ప్రింట్లతో విడుదలైన ఈ సినిమా రెండో వారానికి 120 ప్రింట్లకు చేరుకుంటోంది. బ్రిటీష్ నేపథ్యంతో మనవాళ్లు సినిమా తీస్తే ఎలా ఉంటుందో వెంకటేశ్ హీరోగా వచ్చిన 'సుభాష్ చంద్రబోస్' మంచి ఉదాహరణ. కె. రాఘవేంద్రరావు వంటి దిగ్దర్శకుడు కూడా అంత ఘోరంగా ఆ సినిమాని అలా మలవడం ఆశ్చర్యమనిపిస్తుంది. అందుకే ఆ సినిమాకి ప్రింట్ ఖర్చులు కూడా రాలేదని దాని నిర్మాత సి. అశ్వనీదత్ వాపోయాడు. '1947 ఎ లవ్‌స్టోరీ' వంటి సినిమాలు చూసైనా మన దర్శకులు కథల విషయంలో, సన్నివేశాల సృష్టి విషయంలో సృజనాత్మకంగా ఆలోచిస్తే డబ్బింగ్ సినిమాల తాకిడి ఎక్కువవుతున్నదని బాధ పడాల్సిన అవసరం రాదు.
Thursday, August 11, 2011
న్యూస్: కాంట్రాక్ట్ సమస్యలో సుకుమార్!
నాగచైతన్య, తమన్నా జంటగా రూపొందించిన '100% లవ్' హిట్టవడం నిజానికి డైరెక్టర్ సుకుమార్‌కి అమితానందం కలిగించాలి. ఎందుకంటే 'జగడం', 'ఆర్య 2' సినిమాలు బాక్సాఫీసు వద్ద ఆశించిన ఫలితాన్నివ్వక పోవడం. ప్రతిభకు కొదవలేని ఈ గణిత శాస్త్ర నిపుణుడు ఇప్పుడు '100% లవ్' విజయాన్ని మనసారా ఆనందించలేని స్థితిలో పడ్డాడు. కారణం 'ఆర్య 2' షూటింగ్‌కు ముందే ఆ సినిమాని ప్రొడ్యూస్ చేసిన ఆదిత్య ఆర్ట్స్ బేనర్‌తో కుదుర్చుకున్న కాంట్రాక్ట్. దాని ప్రకారం అతడు ఆ బేనర్ యజమాని, నటుడు అయిన ఆదిత్యబాబుతో ఓ సినిమా చేయాలి. కానీ సుకుమార్ ఆలోచనలు వేరుగా ఉన్నాయి. మహేశ్‌బాబుతో సినిమా చేయాలని అతడి తపన. అందుకోసం ఓ స్క్రిప్టుని మహేశ్‌కి వినిపించాడు కూడా. ఆ ఇద్దరి మధ్యా దానికి సంబంధించి ప్రస్తుతం చర్చలు నడుస్తున్నాయి. చిత్రమేమంటే '100% లవ్' సక్సెస్‌ని సుకుమార్ బదులు ఆదిత్యబాబు ఎంజాయ్ చేస్తుండటం. ఆ సక్సెస్ వల్ల తనతో సుకుమార్ చేసే సినిమాకి మైలేజ్ వస్తుందని అతను ఆనందపడుతున్నాడు. ఒప్పందం ప్రకారం ఇప్పుడు సుకుమార్ తనతో సినిమా తీయాల్సిందేనని అతను పట్టుబడుతున్నాడు. కానీ సుకుమార్‌కి ఇప్పటి స్థితిలో ఆదిత్యబాబుని డైరెక్ట్ చేయడం ఇష్టంలేదు. 'చలాకీ'తో తెలుగులో హీరోగా పరిచయమైన ఆదిత్యని ప్రేక్షకులు నిరాదరించడమే దానికి కారణం. మరి ఈ పరిస్థితిని సుకుమార్ ఎలా హేండిల్ చేస్తాడో చూడాల్సిందే.
Wednesday, October 20, 2010
సినిమా: డిసెంబర్ నుంచి మహేశ్ '3 ఇడియట్స్'
'ఖలేజా' తర్వాత మహేశ్ చేసే సినిమా ఏది? 'దూకుడు', '3 ఇడియట్స్'లో ముందు ఏ సినిమా చేయబోతున్నాడు? ప్రస్తుతం ఆయన అభిమానుల్ని వేధిస్తున్న ప్రశ్నలివి? నిజానికి శ్రీను వైట్ల దర్శకత్వం వహించే 'దూకుడు' ఈ అక్టోబరులో టర్కీలో మొదలవుతుందనే వార్తలు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం ఆ సినిమా షూటింగ్ ఈ నెలలో లేదు. నవంబరులో మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు '3 ఇడియట్స్' తెలుగు వెర్షన్ డిసెంబర్ 6న ప్రారంభం కానున్నట్లు ఫిలింనగర్ వర్గాల భోగట్టా. 'రోబో' తర్వాత శంకర్ డైరెక్ట్ చేయబోతున్న సినిమా ఇదే. జెమిని ఫిల్మ్ సర్క్యూట్ నిర్మించే ఈ సినిమాకి హారిస్ జయరాజ్ మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పటికే రెండు పాటల్ని రికార్డ్ చేశారు. ఇందులో ప్రధాన హీరోగా మహేశ్ నటించనుండగా, మరో ఇద్దరు హీరో పాత్రల కోసం తమిళ నటులు ఆర్య, జీవాలను సంప్రదిస్తున్నారు.
Subscribe to:
Posts (Atom)





