Showing posts with label deva katta. Show all posts

Thursday, September 3, 2015
Wednesday, July 9, 2014
Saturday, October 29, 2011
కీలక దశలో నాగచైతన్య కెరీర్
అక్కినేని నాగచైతన్య కెరీర్ కీలక దశలో ప్రవేశించింది. ఇప్పటివరకు నాలుగు సినిమాలు చేసిన అతను రెండు ఫ్లాపులు, రెండు హిట్లతో బేలన్స్‌గా ఉన్నాడు. తొలి సినిమా 'జోష్', నాలుగో సినిమా 'దడ' ఫ్లాపవగా; రెండు, మూడు సినిమాలైన 'ఏమాయ చేసావె', '100% లవ్' సినిమాలు హిట్టయ్యాయి. అయితే మాస్ హీరోగా ఎస్టాబ్లిష్ అవుదామని అతడు చేసిన 'దడ' సినిమా డిజాస్టర్ కావడం అతడికి కొంత నిరుత్సాహాన్ని కలిగించింది. టాప్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గ్లామర్ కానీ, కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి విదేశాల్లో రిచ్‌గా చిత్రీకరించిన ఫైట్లు గానీ, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ గానీ సినిమాని రక్షించలేకపోయాయి. అంతకు మించి నాగచైతన్య కేరక్టర్ ప్రేక్షకుల్ని మెప్పించలేక పోయింది. ఫలితంగా కామాక్షి మూవీస్ అధినేత డి. శివప్రసాద్‌రెడ్డి ఖాతాలో మరో ఫ్లాప్ జతకూడింది. ఈ నేపథ్యంలో నాగచైతన్య రెండు ఆసక్తికర సినిమాలు చేస్తున్నాడు. వాటిలో ఒకటి రాంగోపాల్‌వర్మ నిర్మిస్తున్న 'బెజవాడ' కాగా మరొకటి దేవా కట్టా డైరెక్ట్ చేస్తున్న 'ఆటోనగర్ సూర్య'. వీటిలో 'బెజవాడ' సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని నవంబర్ ఫస్ట్ వీక్‌లో రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ సినిమా మొదలు పెట్టినప్పట్నించే వార్తల్లో ఉండటం వల్ల అందరి దృష్టీ దీనిపైన ఉంది. ఇక 'ఆటోనగర్ సూర్య' ఇప్పుడే మొదలైంది. ఇందులో చైతన్య, సమంత జంటగా రెండోసారి నటిస్తున్నారు. దేవా కట్టా ప్రతిభావంతుడైన దర్శకునిగా ఇప్పటికే రుజువు చేసుకున్నందున ఈ సినిమా మీద కూడా అంచనాలు బాగానే ఉన్నాయి. ఈ సినిమాల్లో ఒక్కటైనా హిట్టయితేనే స్టార్ హీరోగా నాగచైతన్య రూపుదాల్చే అవకాశాలుంటాయి.
Thursday, October 20, 2011
న్యూస్: ఒకటిన్నర వినోదం 'వెన్నెల 1 1/2'
దేవాకట్టా దర్శకత్వం వెన్నెల చిత్రానికి 'వెన్నెల 1 1/2' పేరుతో సీక్వెల్ రాబోతుంది. లవ్ ప్లస్ లాఫ్ హోల్ క్యూబ్ మైనస్ లాజిక్ అనేది ఈ చిత్రం ఉపశీర్షిక. 'వెన్నెల' చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించి అందరినీ నవ్వించిన ప్రముఖ హాస్యనటుడు వెన్నెల కిషోర్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. జీఆర్8(ఎయిట్) ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై వాసు,వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఇటీవల విదేశాల్లో పూర్తి చేసుకుంది.
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ "వెన్నెల చిత్రానికి సీక్వెల్ నిర్మించడం ఎంతో ఆనందంగా ఉంది. ప్రేక్షకులు ఊహించని ఎన్నో ఆశ్చర్యాలు ఈ చిత్రంలో వుంటాయి. పూర్తి వినోదాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రతి సన్నివేశం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. హైదరాబాద్‌లో ఓ షెడ్యూల్ పూర్తయిన తర్వాత ఇటీవలే విదేశాల్లో మరో షెడ్యూల్‌ని పూర్తి చేసుకున్నాం. త్వరలో హైదరాబాద్‌లో జరగనున్న చివరి షెడ్యూల్తో చిత్రీకరణ పూర్తవుతుంది. నవంబరులో పాటలను, డిసెంబరులో చిత్రాన్ని విడుదల చేస్తాం. తప్పకుండా వెన్నెల తరహాలోనే వెన్నెల1 1/2 కూడా ప్రేక్షకులందరిని అలరిస్తుందనేనమ్మకం ఉంది'' అని అన్నారు. చైతన్య కృష్ణ, మోనాల్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆరు పాటలు, రెండు ఫైట్స్ వున్నాయి.
బ్రహ్మానందం, రఘుబాబు, మాస్టర్ భరత్, శ్రవణ్, గిరిధర్, హరీష్, వెన్నెల మధు, అగ్నేష్, వెన్నెల కిషోర్ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి సంగీతం: సునీల్ కాశ్యప్, కెమెరా: సురేష్ భార్గవ్, ఫైట్స్: నందు, కెమెరా: సురేష్‌భార్గవ్, సాహిత్యం: కృష్ణచైతన్య, శ్రీమణి, సిరాశ్రీ, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: శివశంకర్.

Saturday, September 3, 2011
న్యూస్: మరో సీక్వెల్... డైరెక్టర్‌గా మరో కమెడియన్!
ఏవీఎస్ తర్వాత మరో హాస్యనటుడు డైరెక్టర్ అవతారం ఎత్తాడు. అయితే అతను మరీ జూనియర్. కానీ తన హాస్య నటనతో మంచి పేరే సంపాదించుకున్నాడు. అతను కిశోర్. దేవా కట్టా డైరెక్ట్ చేసిన 'వెన్నెల' సినిమాతో నటుడిగా తెరంగేట్రం చేసి, ఆ సినిమా పేరుతో 'వెన్నెల' కిశోర్‌గా పాపులర్ అయిన అతడు. ఇప్పుడు అదే సినిమా సీక్వెల్‌తో డైరెక్టర్‌గా పరిచయమవుతుండటం విశేషం. తెలుగులో ప్రస్తుతం సీక్వెల్ సీజన్ నడుస్తోంది. 'గాయం 2', 'మనీ మనీ మోర్ మనీ' తర్వాత ఇప్పుడు 'వెన్నెల'కి సీక్వెల్ తయారవుతోంది. చిత్రమేమంటే ఈ సినిమాకి కిశోర్ 'వెన్నెల 2' అని గాక, 'వెన్నెల 1 1/2' (వెన్నెల వన్ అండ్ హాఫ్) అని పేరు పెట్టడం. 'లవ్ ప్లస్ లాఫ్ హోల్ క్యూబ్ మైనస్ లాజిక్' అనేది ట్యాగ్‌లైన్.
"నేను పరిచయమైన 'వెన్నెల'కి సీక్వెల్‌తో డైరెక్టర్ని కావడం సంతోషంగా ఉంది. ప్రేక్షకులు ఊహించని ఎన్నో ఆశ్చర్యాలు ఇందులో ఉంటాయి. కంప్లీట్ ఎంటర్‌టైనర్‌గా దీన్ని తీస్తున్నా. హైదరాబాద్‌తో పాటు అమెరికా, బ్యాంకాక్, స్విట్జర్లాండ్‌లలో షూటింగ్ జరుపుతాం. చిత్రసీమలోని పేరుపొందిన కమెడియన్లందరూ ఇందులో ఉన్నారు. హీరో హీరోయిన్ల పేర్లని తర్వాత తెలియజేస్తాం" అని చెప్పాడు కిశోర్. ఈ సినిమాని జీఆర్ 8 ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బేనర్‌పై వాసు, వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 'గాయం 2', 'మనీ మానీ మోర్ మనీ' సినిమాలు ఫ్లాపైన నేపథ్యంలో ఈ కామెడీ సీక్వెల్ ఎలా ఆడుతుందో చూడాల్సిందే.

Friday, August 5, 2011
న్యూస్: మంచి సినిమాలకే నందులు!
గతంలో రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకే ఎక్కువ అవార్డుల్ని కట్టబెడుతూ వచ్చిన నంది అవార్డుల జ్యూరీ గత యేడాది నుంచీ అర్థవంతమైన, మంచి చిత్రాలకు అవార్డులనిస్తూ 'నంది'కి గౌరవాన్ని కల్పిస్తోంది. 2010 సంవత్సరానికి దర్శకుడు ఎన్. శంకర్ ఆధ్వర్యంలోని జ్యూరీ ప్రకటించిన అవార్డులు ఈ సంగతిని స్పష్టం చేశాయి. ఈసారి ఉత్తమ అవార్డులు మూడూ విమర్శకుల ప్రశంసల్ని పొందిన సినిమాలకే రావడం గమనార్హం. అల్లు అర్జున్, మంచు మనోజ్, అనుష్క ప్రధాన పాత్రలు పోషించగా క్రిష్ డైరెక్ట్ చేసిన 'వేదం' ఉత్తమ చిత్రంగా బంగారు నందిని గెలుగుకోగా, 2009 సంవత్సరంలో ఉత్తమ చిత్రంగా బంగారు నందిని పొందిన 'సొంత ఊరు' దర్శకుడు పి. సునీల్‌కుమార్‌రెడ్డి మత్స్యకారుల దయనీయ జీవితాన్ని ఆవిష్కరించిన 'గంగపుత్రులు' ద్వితీయ ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. సునీల్‌కుమార్‌రెడ్డికే ఉత్తమ దర్శకుడి అవార్డు దక్కడం గమనార్హం. ఇక తృతీయ ఉత్తమ చిత్రంగా సాయికుమార్, శర్వానంద్, సందీప్ నటించగా దేవా కట్టా డైరెక్ట్ చేసిన 'ప్రస్థానం' నిలిచింది. ప్రజాదరణ పొందిన చిత్రంగా నిజంగా ప్రేక్షకుల ఆదరణ పొందిన రాజమౌళి చిత్రం 'మర్యాద రామన్న'ని జ్యూరీ ఎంపిక చేసింది. గతంలో ఈ కేటగిరీలో చాలా చోట్ల అసలు రిలీజే కాని 'పెళ్లాం పిచ్చోడు' అనే రాజేంద్రప్రసాద్ సినిమాని ఎంపిక చేసిన సంగతి జ్ఞాపకం చేసుకుంటే జ్యూరీ ఈసారి ఎంత వాస్తవికంగా పనిచేసిందో అర్థమవుతుంది. అలాగే సకుటుంబంగా చూడదగ్గ ఉత్తమ చిత్రం అవార్డుని చంద్రసిద్ధార్ట్ డైరెక్ట్ చేసిన 'అందరి బంధువయ'కు ప్రకటించారు. సమాజంలో నైతికత, మానవత్వం ముఖ్యమని చెప్పిన ఈ సినిమాని విమర్శకులు ఎంతగానో అభిమానించారు. ఇక జాతీయ సమగ్రతా చిత్రంగా బాలకృష్ణ హీరోగా దాసరి నారాయణరావు రూపొందించిన 'పరమవీరచక్ర'కు ఇచ్చారు.
వ్యక్తిగత అవార్డుల విషయానికొస్తే ఉత్తమ నటుడి అవార్డు బాలకృష్ణకు దక్కింది. 2001 సంవత్సరంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 'నరసింహనాయుడు' పాత్ర పోషణకు గాను ఉత్తమ నటుడి అవార్డును అందుకున్న ఆయన మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో ఆ అవార్డును పొందడం విశేషమే. 'పరమవీరచక్ర'కు కాకుండా, చాలా కాలం తర్వాత ప్రేక్షకాభిమానాన్ని పొందిన 'సింహా'లో చేసిన రెండు పాత్రలకు గాను ఈ అవార్డు ఆయనకు లభించడం గమనార్హం. 2011 సంక్రాంతికి విడుదలైనా, 2010లోనే సెన్సార్ సర్టిఫికెట్ పొందిన 'అలా మొదలైంది'లో అద్భుతంగా అభినయించిన నిత్యమీనన్ ఉత్తమ నటిగా ఎంపికవగా, ఆ చిత్రాన్ని జన రంజకంగా మలిచిన నందినీరెడ్డి ఉత్తమ తొలిచిత్ర దర్శకురాలిగా నిలిచింది. 'సింహా"కి చక్కని సంగీతాన్నిచ్చిన చక్రి ఉత్తమ సంగీత దర్శకుడిగా ఎంపికయ్యారు. తొలి చిత్రమే అయినా 'మర్యాద రామన్న'లో విశేషంగా రాణించిన నాగినీడు ఉత్తమ విలన్‌గా అవార్డును అందుకోనున్నారు. ఇలా అనేక అవార్డులు పారదర్శకంగా ఇచ్చినట్లు స్పష్టమవుతోంది.

Sunday, October 10, 2010
సినిమా: మంచి సినిమాకి మంచి రోజులు? (1వ భాగం)
గ్రామీణ ప్రాంతాల్లో సినిమా థియేటర్లు ఒక్కొక్కటే మూతపడుతూ పట్టణాలు, నగరాల్లో మల్టీప్లెక్సుల సంఖ్య పెరుగుతుండటంతో తెలుగు సినిమా నిర్మాణ ఫార్ములా క్రమేపీ మార్పుకు గురవుతోంది. 'స్టార్ మేనియా' ఇప్పటికీ కొనసాగుతున్నా కొత్త తరహా కథాకథనాలతో వస్తున్న సినిమాలు సైతం కొద్దో గొప్పో ఆదరణ పొందుతున్నాయి, 'మంచి సినిమా'గా పేరు తెచ్చుకుంటున్నాయి. చంద్రసిద్ధార్థ్, శేఖర్ కమ్ముల, రవిబాబు, దేవా కట్టా, సాయికిరణ్ అడివి, క్రిష్, చైతన్య దంతులూరి, మధుర శ్రీధర్ వంటి దర్శకులు మంచి సినిమా పట్ల ఆశలు రేకెత్తిస్తున్నారు.
'ఆ నలుగురు' ఆదర్శం
ఆరు సంవత్సరాల క్రితం వచ్చిన 'ఆ నలుగురు' సినిమా ఈ నవ్య పంథాకు మార్గదర్శకంగా నిలిచిందని చెప్పాలి. చంద్రసిద్ధార్థ్ రూపొందించిన ఆ సినిమా 2004 సంవత్సరానికి ఉత్తమ చిత్రంగా నంది అవార్డు పొందడమే కాక, ఉత్తమ నటునిగా రాజేంద్రప్రసాద్ కీ, ఉత్తమ క్యారెక్టర్ నటునిగా కోట శ్రీనివాసరావుకీ అవార్డులు సంపాదించి పెట్టింది. అన్నింటికీ మించి ఆ సినిమాని చెప్పుకోదగ్గ రీతిలో ప్రేక్షకులు సైతం ఆదరించారు. తన సినీ జీవితంలో 'ఆ నలుగురు' సినిమా ఓ మైలురాయి లాంటిదని రాజేంద్రప్రసాద్ గర్వంగా చెప్పుకోవడమే ఈ సినిమా గొప్పతనాన్ని చాటి చెబుతుంది. తన సంపాదనలో సగాన్ని ప్రజోపయోగ కార్యక్రమాలకు వెచ్చించే ఓ దినపత్రిక సంపాదకుడు రఘురామ్ తన మనసుకు విరుద్ధమైన పని చేయాల్సి వస్తే ఎలాంటి సంఘర్షణకు గురవుతాడు, అతడు చినిపోయాక కూడా అతని ఆత్మ ఎంతగా క్షోభిస్తుందనే అంశాన్ని హృద్యంగా చిత్రించిన విధానం అందరి ప్రశంసల్నీ పొందింది. మంచి సినిమా దర్శకుడిగా చంద్రసిద్ధార్థ్ ఎంతో పేరు తెచ్చుకున్నాడు. అయితే అతను కేవలం మంచి సినిమా దర్శకుడే కాదు, 'స్వతంత్ర సినిమా' దర్శకుడు కూడా. 'స్టార్' విలువ మీద ఆధారపడకుండా, నిర్మాత వత్తిళ్లకు తలొగ్గకుండా, తనేం తీయదలచుకున్నాడో, దాన్ని అందంగా, నాణ్యంగా సెల్యులాయిడ్ మీద చిత్రించేవాడూ, మార్కెట్లు, వర్తమాన ధోరణులు, అభిప్రాయాలు, ప్రేక్షకుల అంచనాలు, అమలులో ఉన్న సినిమా రూపకల్పన విధానాల ప్రభావం లేకుండా తీసేవాడూ స్వతంత్ర సినిమా దర్శకుడు అని సూత్రీకరిస్తాడు బాలీవుడ్ లో 'రఘు రోమియో' చిత్ర రూపకర్త రజత్ కపూర్. ఆ రెండు సినిమాలతో పాటు బాలీవుడ్ లో వచ్చిన 'హైదరాబాద్ బ్లూస్', 'మాన్సూన్ వెడ్డింగ్', 'సత్య', 'ఝంకార్ బీట్స్', 'దేవ్ డి', 'హరిశ్చంద్రాచ్చి ఫ్యాక్టరీ', 'ఖర్గోష్' వంటి సినిమాలు స్వతంత్ర సినిమా జెండాని నిలబెట్టేందుకు ఉపకరించాయి. వాటి తరహాలోనే తెలుగులో 'ఆనంద్', 'హ్యాపీడేస్', 'ఎ ఫిల్మ్ బై అరవింద్', 'వినాయకుడు', 'మంత్ర', 'అనసూయ', 'గమ్యం', 'బాణం', 'విలేజ్ లో వినాయకుడు', 'లీడర్', 'ప్రస్థానం', 'అందరి బంధువయ', 'వేదం' వంటి సినిమాలు మంచి సినిమాలుగా పేరు తెచ్చుకున్నాయి. వీటిలో చాలావాటికి ప్రేక్షకాదరణ కూడా ఉండటం ఇక్కడ గమనించాల్సిన అంశం. (ఇంకావుంది)

Subscribe to:
Posts (Atom)