Showing posts with label amisha patel. Show all posts
Showing posts with label amisha patel. Show all posts

Monday, September 20, 2010

గేలరీ: అమీషా పటేల్








సినిమా: బాలకృష్ణకి అమీషా హిట్టిస్తుందా?


చాలా కాలం తర్వాత బాలీవుడ్ సుందరి అమీషా పటేల్ తెలుగులో చేస్తోంది. దాసరి నారాయణరావు ప్రతిష్ఠాత్మక 150వ సినిమా 'పరమవీరచక్ర'లో ఆమె బాలకృష్ణ సరసన నటిస్తోంది. ఆమె ఇప్పటివరకు మూడు తెలుగు సినిమాల్లో నటించింది. వాటిలో ఒకటి హిట్టయితే, రెండు ఫ్లాపయ్యాయి. తొలి సినిమా పవన్ కల్యాణ్ సరసన చేసిన 'బద్రి' హిట్టయితే ఆ తర్వాత చేసిన మహేశ్ సినిమా 'నాని', జూనియర్ ఎన్టీఆర్ సినిమా 'నరసింహుడు' ఫ్లాపయ్యాయి. వీటిలో చివరి సినిమా 'నరసింహుడు' వచ్చింది 2005లో. ఇన్నాళ్ల తర్వాత ఆమెకి మళ్లీ తెలుగులో.. అదీ బాలకృష్ణతో చేసే అవకాశం రావడం విడ్డూరమే. బాలీవుడ్ లో ఆమె ఔట్ డేటెడ్ అనే సంగతి మనకి తెలుసు. సాధారణంగా జూనియర్ ఎన్టీఆర్ తో చేసిన తారలు బాలకృష్ణతో పనిచేయడం కొంతకాలంగా చూస్తూనే ఉన్నాం. అంకిత, సదా, ప్రియమణి, నయనతార వంటివాళ్లు ఎన్టీఆర్ సరసన చేశాకే బాలయ్యతో నటించారు. ఇప్పడు అమీషా పటేల్. 'పరమవీరచక్ర'లో బాలకృష్ణ డబుల్ రోల్ చేస్తున్నాడు. అమీషా పెద్ద బాలయ్యకి జోడీగా కనిపిస్తుందని తెలుస్తోంది. చిన్న బాలయ్యకి జతగా షీలా నటిస్తోంది. ఎన్టీఆర్ కి ఫ్లాపిచ్చిన అమీషా బాలకృష్ణకి ఎలాంటి అనుభూతినిస్తుందో వెయిట్ అండ్ సీ. తాజా సంగతి.. ఎన్టీఆర్ తో 'సింహాద్రి'లో నటించిన భూమిక సైతం బాలకృష్ణతో ఓ పాటలో చేయబోతోంది. అయితే అది 'పరమవీరచక్ర' కాదు. పరుచూరి మురళి డైరెక్ట్ చేస్తున్న మరో సినిమా.