పాట: గూఢచారి 116 (1966)
సంగీతం: చలపతిరావు
రచన: సి. నారాయణరెడ్డి
అతడు: నువ్వు నా ముందుంటె నిన్నలా చూస్తుంటె
జివ్వుమంటుంది మనసు రివ్వుమంటుంది వయసు
ఆమె: నువ్వు నా ముందుంటె నిన్నలా చూస్తుంటె
జివ్వుమంటుంది మనసు రివ్వుమంటుంది వయసు
అతడు: ముద్దబంతిలా ఉన్నావు ముద్దులొలికి పోతున్నావు ||ముద్దబంతిలా||
జింకపిల్లలా చెంగుచెంగుమని చిలిపి సైగలే చేసేవు
ఆమె: ||నువ్వు నా ముందుంటే||
చల్లచల్లగా రగిలించేవు మెల్లమెల్లగ పెనవేసేవు ||చల్లచల్లగ||
బుగ్గపైన కొనగోట మీటి నా సిగ్గు దొంతరలు దోచేవు
అతడు: ||నువ్వు నా ముందుటే||
లేతలేతగా నవ్వేవు లేని కోరికలు రువ్వేవు ||లేతలేతగా||
ఆమె: మాటలల్లి మరుమందు చల్లి నను మత్తులోన పడవేసేవు
ఇద్దరు: నువ్వు నా ముందుంటె నిన్నలా చూస్తుంటె
జివ్వుమంటుంది మనసు రివ్వుమంటుంది వయసు
Showing posts with label c narayana reddy. Show all posts
Showing posts with label c narayana reddy. Show all posts
Saturday, March 15, 2014
Saturday, November 24, 2012
ఆడది గడప దాటితే (1980) - సమీక్ష
మన సమాజంలో పురుషునికి లేకుండా స్త్రీకి మాత్రమే కొన్ని కట్టుబాట్లు నిర్దేశించారు. గడప దాటిన స్త్రీకి అగచాట్లు, నగుబాట్లు తప్పవని చెప్పే కథలు ఎన్నో ప్రచారంలో ఉన్నాయి. గడప దాటిన స్త్రీని సమాజం ఎంతగా హింసిస్తుందో చలం సైతం తన రచనల్లో ఎంతో సహజంగా చిత్రించాడు. ఫలానా అమ్మాయి ఇంట్లోంచి వెళ్లిపోయిందని హేళన చేయడం తేలికే. కానీ అలా వెళ్లిందంటే దాని వెనక ఎంతటి బలీయమైన కారణం ఉండి ఉంటుందని ఆలోచించేవాళ్లు బహు అరుదు. ఇదే పాయింటుతో దర్శకుడు బి.ఎస్. నారాయణ రూపొందించిన సినిమా 'ఆడది గడప దాటితే'.
కోటీశ్వరుడు రఘునందనరావు ఏకైక కుమార్తె కరుణ. రాహుల్ అనే యువకుడు, కరుణ గాఢంగా ప్రేమించుకుంటారు. కరుణ వెనకున్న ఆస్తిని చూసే ఆమెని రాహుల్ ప్రేమిస్తున్నాడనేది రఘునందనరావు నమ్మకం. రాహుల్‌ను ఇంటికి పిలిపించి అవమానిస్తాడు. అయినా కరుణ, రాహుల్ జంకరు. రిజిస్టర్ మ్యారేజ్ కోసం తేదీ నిర్ణయించుకుంటారు. ఇంట్లోంచి వచ్చేసిన కరుణకు చిల్లిగవ్వ ఆస్తి రాదని తెలిసిన రాహుల్ మాయమైపోతాడు. రోడ్డునపడిన కరుణను ఇన్‌స్పెక్టర్ కృష్ణ ఆదుకుంటాడు. ఆమెని నమ్మించి గుళ్లో పెళ్లి చేసుకుంటాడు. కరుణకు నెలలు నిండిన సందర్భంలో కృష్ణకు అదివరకే పెళ్లయిందనే సంగతి తెలుస్తుంది. కరుణను ఆస్పత్రిలో చేర్పించి, ఆ ఊరినుంచి బదిలీ చేయించుకుని వెళ్లిపోతాడు కృష్ణ. మగబిడ్డను కన్న కరుణకు ఆర్టిస్ట్ మధుబాబు ఆశ్రయమిస్తాడు. తన చిత్రాలకు ఆమెను మోడల్‌గా తీసుకుంటాడు. ఆమెపై అతను ప్రేమ పెంచుకుంటున్న సమయంలోనే అతని స్నేహితుడు, కోటీశ్వరుడు ఆయిన ఆనంద్ రావడంతో కథ మరో మలుపు తీసుకుంటుంది. ఆ తర్వాత ఏమైందన్నది పతాక సన్నివేశం.
కరుణగా కన్నడ మంజుల సమర్థవంతంగా నటించింది. రాహుల్‌గా నరసింహరాజు, మధుబాబుగా మురళీమోహన్, ఆనంద్‌గా శ్రీధర్ రాణించారు. జగ్గయ్య, శరత్‌బాబు, రాజేంద్రప్రసాద్ ఇతర ప్రధాన పాత్రధారులు. యండమూరి వీరేంద్రనాథ్ మాటలు రాయగా, దాశరథి, సినారె, కోపల్లె పాటలు రాశారు. ఎం.బి. శ్రీనివాస్ కూర్చిన బాణీలు శ్రవణానందకరం. చక్కటి డ్రామాతో బి.ఎస్. నారాయణ ఆద్యంతం ఆసక్తికరంగా చిత్రాన్ని మలిచారు. శ్రీ శ్రీనివాస పద్మావతి ప్రొడక్షన్స్ పతాకంపై బి. రామచంద్రరావు, ఎం.ఎం. రాజా, సి. సుబ్బారాయుడు ఈ సినిమా నిర్మించారు.
Wednesday, October 20, 2010
నేటి పాట: ఎన్నాళ్లో వేచిన ఉదయం (మంచి మిత్రులు)
చిత్రం: మంచి మిత్రులు (1969)
రచన: సి. నారాయణరెడ్డి
సంగీతం: ఎస్.పి. కోదండపాణి
గానం: ఘంటసాల, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
ఎస్.పి.: ఎన్నాళ్లో వేచిన ఉదయం
ఈనాడే.. ఎదురౌతుంటే ||ఎన్నాళ్లో||
ఘంటసాల: ఇన్నినాళ్లు దాచిన హృదయం
ఎగిసి ఎగిసిపోతుంటే..
ఎస్.పి.: ఇంకా తెలవారదేమి, ఈ చీకటి విడిపోదేమి
ఘంటసాల: ఇంకా తెలవారదేమి, ఈ చీకటి విడిపోదేమి
ఎస్.పి.: మంచిని పెంచిన మనిషిని ఏ వంచన ఏమీ చేయదని
నీతికి నిలబడువానికి ఏనాటికి ఓటమి లేదని ||నీతికి||
నే చదివిన జీవిత పాఠం నీకే నేర్పాలనివస్తే
ఇంకా తెలవారదేమి, ఈ చీకటి విడిపోదేమి ||ఇంకా||
ఘంటసాల: నాగులు తిరిగే కోనలో ఏ న్యాయం పనికిరాదని
కత్తులు విసిరేవానిని, ఆ కత్తితోనె గెలవాలని ||కత్తులు||
నేనెరిగిన చేదునిజం నీతో చెప్పాలని వస్తే
ఇంకా తెలవారదేమి, ఈ చీకటి విడిపోదేమి ||ఇంకా||
ఎస్.పి.: ఎన్నాళ్లో వేచిన ఉదయం
ఈనాడే.. ఎదురౌతుంటే

Friday, October 1, 2010
నేటి పాట: అనగనగా ఒక రాజు (ఆత్మబంధువు)
చిత్రం: ఆత్మబంధువు
రచన: సి. నారాయణరెడ్డి
సంగీతం: కె.వి. మహదేవన్
గానం: ఘంటసాల, పి. సుశీల
ఆమె: అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి
అతడు: ఊహూ
ఆమె: అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి
రాజు గుణము మిన్న రాణి మనసు వెన్న ||రాజు|| ||అనగనగా||
అతడు: ఆ రాజుకు ఏడుగురు కొడుకులున్నారు
వారు చదువు సంధ్యలుండి గూడ చవటలయ్యారు
వట్టి చవటలయ్యారు
ఆమె: ||అనగనగా||
అతడు: పడక మీద తుమ్మముళ్లు పరచెనొక్కడు
అయ్యో ఇంటి దీపమార్పివేయ నెంచెకొక్కడు
తల్లీదండ్రులు విషమని తలచెనొక్కడు ||తల్లీదండ్రులు||
పడుచు పెళ్లామె బెల్లమని భ్రమసెనొక్కడూ... భ్రమసెనొక్కడూ
ఆమె: ||అనగనగా||
అతడు: కొడుకులతో పాటు రాజు కుక్కను పెంచీ
ప్రేమయనే పాలుపోసి పెంపు చేసెను ||కొడుకులతో||
ఆమె: కంటిపాపకంటే ఎంతో గారవించెనూ ||కంటిపాప||
దాని గుండెలోన గూడుకట్టి ఉండసాగెను.. తానుండసాగెను
అతడు: నాది నాది అనుకున్నది నీది కాదురా ||అనగనగా||
నీవు రాయన్నది ఒకనాటికి రత్నమౌనురా ||నాది నాది||
కూరిమి గలవారంతా కొడుకులేనురా ||కూరిమి||
జాలిగుండెలేని కొడుకు కన్న కుక్క మేలురా.. కుక్కమేలురా
అతడు + ఆమె: ||అనగనగా||

Subscribe to:
Posts (Atom)