చిత్రం: ఆత్మబంధువు
రచన: సి. నారాయణరెడ్డి
సంగీతం: కె.వి. మహదేవన్
గానం: ఘంటసాల, పి. సుశీల
ఆమె: అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి
అతడు: ఊహూ
ఆమె: అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి
రాజు గుణము మిన్న రాణి మనసు వెన్న ||రాజు|| ||అనగనగా||
అతడు: ఆ రాజుకు ఏడుగురు కొడుకులున్నారు
వారు చదువు సంధ్యలుండి గూడ చవటలయ్యారు
వట్టి చవటలయ్యారు
ఆమె: ||అనగనగా||
అతడు: పడక మీద తుమ్మముళ్లు పరచెనొక్కడు
అయ్యో ఇంటి దీపమార్పివేయ నెంచెకొక్కడు
తల్లీదండ్రులు విషమని తలచెనొక్కడు ||తల్లీదండ్రులు||
పడుచు పెళ్లామె బెల్లమని భ్రమసెనొక్కడూ... భ్రమసెనొక్కడూ
ఆమె: ||అనగనగా||
అతడు: కొడుకులతో పాటు రాజు కుక్కను పెంచీ
ప్రేమయనే పాలుపోసి పెంపు చేసెను ||కొడుకులతో||
ఆమె: కంటిపాపకంటే ఎంతో గారవించెనూ ||కంటిపాప||
దాని గుండెలోన గూడుకట్టి ఉండసాగెను.. తానుండసాగెను
అతడు: నాది నాది అనుకున్నది నీది కాదురా ||అనగనగా||
నీవు రాయన్నది ఒకనాటికి రత్నమౌనురా ||నాది నాది||
కూరిమి గలవారంతా కొడుకులేనురా ||కూరిమి||
జాలిగుండెలేని కొడుకు కన్న కుక్క మేలురా.. కుక్కమేలురా
అతడు + ఆమె: ||అనగనగా||
No comments:
Post a Comment