చిత్రం: కొడుకు కోడలు (1972)
రచన: ఆత్రేయ
సంగీతం: కె.వి. మహదేవన్
గానం: ఘంటసాల, పి. సుశీల
నువ్వూ - నేనూ ఏకమైనామూ -
ఇద్దరము, మనమిద్దరము ఒక లోకమైనాము
లోకమంతా ఏకమైనా - వేరు కాలేము, వేరు కాలేము -
అతడు: కళ్లు నాలుగు కలిపి మనము ఇల్లు కడదాము
ఆమె: అందులో మన చల్లచల్లని వలపు దీపం నిలుపుకుందాము
అతడు: పసిడి మనసుల పట్టెమంచం వేసుకుందాము
ఆమె: అందులో మన పడుచుకోర్కెల మల్లెపూలు పరుచుకుందాము ||నువ్వు||
అతడు: చెలిమితో ఒక చలువ పందిరి వేసుకుందాము
ఆమె: కలల తీగల అల్లిబిల్లిగ అల్లుకుందాము
అతడు: ఆ అల్లికను మన జీవితాలకు పోల్చుకుందాము
ఆమె: ఏ ప్రొద్దుగాని వాడిపోని పువ్వులవుదాము - ||నువ్వు||
అతడు: లేత వెన్నెల చల్లదనము - నువ్వు తెస్తావు
ఆమె: అందులో నీరెండలోని వెచ్చదనము నువ్వు ఇస్తావు
అతడు: సూర్యచంద్రులు లేని జగతిని సృష్టి చేద్దాము
ఆమె: అందులో ఈ సృష్టికెన్నడు లేని సొగసు మనము తెద్దాము ||నువ్వు||
No comments:
Post a Comment