Friday, October 22, 2010

నేటి పాట: మబ్బులు రెండు భేటీ అయితే (దేశోద్ధారకులు)

చిత్రం: దేశోద్ధారకులు (1973)
రచన: ఆత్రేయ
సంగీతం: కె.వి. మహదేవన్
గానం: ఘంటసాల, పి. సుశీల

ఆమె: మబ్బులు రెండు భేటీ అయితే మెరుపే వస్తుంది
అతడు: మనసులు రెండు పేచీ పడితే వలపే పుడుతుంది
ఆమె: మూడు ముళ్లూ పడతాయంటె సిగ్గే మొగ్గలు వేస్తుంది
అతడు: ఆ మొగ్గలు పూచీ మూడు రాత్రులు తీయని ముద్రలు వేస్తాయి
             కన్నులు నాలుగు కలిశాయంటే పున్నమి వెన్నెల కాస్తుంది
ఆమె: ఆ వెన్నెల నాలుగు వారాలైనా తరగని వెలుగై వుంటుంది
           అయిదోతనమే ఆడజన్మకు అన్ని వరాలను మించింది
అతడు: ఆ వరాన్ని తెచ్చిన మగువే మగనికి ఆరో ప్రాణం అవుతుంది
             అడుగులు ఏడూ నడిచామంటే అనుబంధం పెనవేస్తుంది
ఆమె: ఆ అనుబంధం ఏడేడు జన్మలకు వీడనిబంధం అవుతుంది   ||మబ్బులు||                             

No comments: