చిత్రం: మంచివాడు (1973)
రచన: ఆత్రేయ
సంగీతం: కె.వి. మహదేవన్
గానం: ఘంటసాల, పి. సుశీల
పల్లవి:
అతడు: ఆకలుండదు - దాహముండదు నిన్ను చూస్తుంటె
ఆమె: వేరే ఆశ వుండదు ధ్యాస వుండదు నువ్వు తోడుంటె
అతడు: మల్లెలుండవు - వెన్నెలుండవు నీ నవ్వే లేకుంటె
ఆమె: మనసు వుండదు - మమత వుండదు నీ మనిషిని కాకుంటె
అతడు: వయసులో ఈ పోరువుండదు నీ వలపే లేకుంటే
ఆమె: వలపు ఇంత వెచ్చగుండదు నీ ఒడిలో కాకుంటే ||ఆకలుండదు||
చరణం 1:
అతడు: పొద్దు గడిచేపోతుంది - నీ నడక చూస్తుంటె
ఆమె: ఆ నడక తడబడిపోతుంది - నీ చూపు పడుతుంటె
అతడు: ఆకు మడుపులు అందిస్తూ నువ్వు వగలుపోతుంటె
ఆమె: ఎంత ఎరుపో అంత వలపని నేనాశపడుతుంటె ||ఆకలుండదు||
చరణం 2:
అతడు: తేనెకన్న తీపికలదని - నీ పెదవే తెలిపింది
ఆమె: దానికన్న తీయనైనది నీ ఎదలో దాగుంది
అతడు: మొదటిరేయికి తుదేలేదని నీ ముద్దే కొసరింది
ఆమె: పొద్దు చాలని ముద్దులన్నీ నీ వద్దే దాచింది
ఆ ముద్దే మిగిలింది ||ఆకలుండదు||
No comments:
Post a Comment