నరేశ్ కథానాయకుడిగా ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్న చిత్రానికి 'అహ నా పెళ్లంట' అనే టైటిల్ ఖరారు చేశారు. 'మ్యాచ్ ఫిక్సింగ్' అనేది ఉప శీర్షిక. శ్రీహరి ఓ కీలక పాత్ర చేస్తున్న ఈ చిత్రం ద్వారా నాయికగా రీతూ బర్మేచా, దర్శకునిగా వీరభద్రం పరిచయమవుతున్నారు.
హీరో నరేశ్ మాట్లాడుతూ "ఈ టైటిల్‌తో రాజేంద్రప్రసాద్‌గారు చేసినది సూపర్ డూపర్ హిట్ సినిమా కావడంతో ఆ టైటిల్ పెడుతున్నందుకు చాలా మంది భయపెట్టారు. కానీ ఈ సినిమా మీద పూర్తి నమ్మకం ఉంది. ఇందులో నాతో పాటు శ్రీహరి, బ్రహ్మానందం కూడా హీరోలే. రఘు కుంచే సంగీతం చాలా బాగా వచ్చింది'' అని తెలిపారు. సినిమా ఇప్పటికి ఓ పాట సహా యాభై శాతం పూర్తయిందనీ, నవంబరుతో షూటింగంతా అయిపోతుందనీ దర్శకుడు వీరభద్రం చెప్పారు.
సామ్రాట్, నాగినీడు, సుబ్బరాజు, రజిత, బ్రహ్మానందం, ఆహుతి ప్రసాద్, జయప్రకాశ్‌రెడ్డి, ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, హంసానందిని, అనిత, వెన్నెల కిశోర్, రంగనాథ్, గిరిధర్, పృథ్వీ, కృష్ణ భగవాన్ తారాగణమైన ఈ చిత్రానికి సంభాషణలు: శ్రీధర్, పాటలు: సినారె, రామజోగయ్యశాస్త్రి, భాస్కరభట్ల, సంగీతం: రఘు కుంచె, సినిమాటోగ్రఫీ: లోక్‌నాథ్, కూర్పు: వర్మ, కళ: నాగేంద్ర, ఫైట్స్: ప్రకాశ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: గరికపాటి కిశోర్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వీరభద్రం.
No comments:
Post a Comment