చిత్రం: బంగారుబాబు (1973)
రచన: ఆత్రేయ
సంగీతం: కె.వి. మహదేవన్
గానం: ఘంటసాల, పి. సుశీల
ఆమె: ఛీ.. ఛీ.. ఛీ..
అతడు: ఛా.. ఛా.. ఛా..
చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది
దాని జిమ్మదియ్య అందమంతా చీరలోనే వున్నది
ఆమె: చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది
దాని జిమ్మదియ్య కొంగు కొంగు కలిపి చూడమన్నది
అతడు: మెరుపల్లె వచ్చింది నా యింటికి - నన్ను
మెల్లంగ దించింది ముగ్గులోనికి
ఆమె: తలదాచుకొమ్మని తావిస్తినీ - పిల్ల
దొరికింది చాలనీ ఇల్లాల్ని చేస్తివి.. ||చెంగావి||
అతడు: ప్రేమంటే నేర్పింది పిచ్చివాడికి - దాంతో
వెర్రెత్తిపోయింది కుర్రవాడికి
ఆమె: పిచ్చివాడనే పేరుచాటున మాటువేసినావు
పిల్లదాని పెదవిమీద కాటు వేసినావు... ||చెంగావి||
అతడు: సరి.. సరి.. సరి..
ఆమె: సరసంలో పడ్డాడు యిన్నాళ్లకి - అబ్బో
సంగీతం వచ్చిందీ బుజ్జిబాబుకి
అతడు: తెరచాటు తొలిగింది పరువానికి - అది
పరవళ్లు తొక్కుతూ పాడింది నేటికి... ||చెంగావి||
No comments:
Post a Comment