Showing posts with label komaram puli. Show all posts
Showing posts with label komaram puli. Show all posts
Saturday, November 26, 2011
'పంజా' దెబ్బ ఎలా ఉంటుంది?
'తీన్‌మార్' తర్వాత పవన్ కల్యాణ్ 'పంజా' దెబ్బ రుచి చూపించేందుకు సిద్ధమవుతున్నాడు. డిసెంబర్ 9న ఈ సినిమా రావడం ఖాయమైంది. త్రివిక్రం డైరెక్షన్‌లో చేసిన 'జల్సా' వంటి సూపర్‌హిట్ తర్వాత ఎస్.జె. సూర్య దర్శకత్వంలో పవన్ చేసిన 'కొమరం పులి' అట్టర్‌ఫ్లాపవగా, జయంత్ సి. పరాంజీ డైరెక్షన్‌లో చేసిన 'తీన్‌మార్' బిలో యావరేజ్‌గా మాత్రమే నడించింది. దీంతో 'పంజా' మీద ఆయనా, ఆయన అభిమానులూ చాలా ఆశలే పెట్టుకున్నారు. ఈ సినిమాలో డాన్ వేషంలో గడ్డంపెంచి చాలా కొత్తగా కనిపిస్తున్నాడు పవన్. తమిళంలో మంచి డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న విష్ణువర్ధన్ ఈ సినిమాతో తెలుగుకు పరిచయమవుతున్నాడు. 'పంజా'ని అతను చాలా స్టైలిష్‌గా తీస్తున్నాడని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. అజిత్‌ని 'బిల్లా'గా అతను చూపించిన తీరు ఇందుకు నిదర్శనం. ఈ సినిమాలో పవన్ సరసన ఇద్దరు కొత్తమ్మాయిలు మాజీ మిస్ ఇండియా సారా జేన్ డయాస్, ముంబై మోడల్ అంజలీ లావణియా కనిపించబోతున్నారు. యువన్‌శంకర్ రాజా సంగీతం అందించగా చంద్రబోస్, రామజోగయ్యశాస్త్రి రాసిన పాటలు నవంబర్ 19న మార్కెట్‌లోకి రాబోతున్నాయి. ఈ సినిమాతో పాత రికార్డులు బద్దలై, కొత్త రికార్డులు నమోదవుతాయనీ, పవన్ 'పంజా' దెబ్బ ఏమిటో అందరికీ తెలుస్తుందనీ ఆయన ఫాన్స్ గట్టిగా నమ్ముతున్నారు.
Saturday, November 27, 2010
సినిమా: ఒక కాంపౌండు.. మూడు డిజాస్టర్లు!
ఇది నిజంగా బాధాకరమైన సంగతి. ఒకే కాంపౌండుకు చెందిన ముగ్గురు హీరోల సినిమాలు వరుసగా బాక్సాఫీసు వద్ద ఒక దాన్ని మించి ఒకటి బోల్తాపడ్డాయి. ఆ మూడు సినిమాలు.. మొన్నటి అల్లు అర్జున్ సినిమా 'వరుడు', నిన్నటి పవన్ కల్యాణ్ సినిమా 'కొమరం పులి', నేటి రాంచరణ్ సినిమా 'ఆరెంజ్'. అవును.. నిన్ననే (నవంబర్ 26) విడుదలైన 'ఆరెంజ్' అట్టర్‌ఫ్లాప్ అని ట్రేడ్ విశ్లేషకులు తేల్చేశారు. చిరంజీవి మీద ఈగ వాలినా సహించలేని వాళ్లు నడిపే పాపులర్ వెబ్‌సైట్ 'నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు' అన్నట్లు ఆ సినిమాకి 3.25/5 రేటింగ్ ఇవ్వొచ్చుగాక.. బాక్సాఫీసు వద్ద 'ఆరెంజ్' తోక ముడిచిందన్నది తొలిరోజు మార్నింగ్ షోకే తేలిపోయింది. థియేటర్ల వద్ద ఈగలు తోలుకుంటున్న బయ్యర్లే దీనికి సాక్ష్యం. వాళ్ల కాంపౌండుకే చెందిన గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ఈ సినిమాని రిలీజ్ చేయకుండా తమకెందుకు ఇచ్చారో నైజాంకి ఆ సినిమాని తీసుకున్న ఏషియన్ ఫిలింస్ వాళ్లు ఎందుకు ఆలోచించలేదో తెలియదు. మొత్తానికి అల్లు అరవింద్ సేఫ్. ఏషియన్ సునీల్ నారంగ్ బలి.
పాపం. చిరంజీవి సొంత బేనర్ అంజనా ప్రొడక్షన్స్ మరోసారి 'ఆరెంజ్'తో తమ పూర్ పర్ఫార్మెన్స్‌ని ప్రదర్శించింది. ఆ సంస్థ ఇంతవరకు తీసిన సినిమాల్లో కమర్షియల్‌గా ఆడింది ఒక్కటే. అది 'బావగారూ బాగున్నారా'. మరో సినిమా 'రుద్రవీణ' అవార్డులు తెచ్చింది. అంతే. అంతకుమించి ఆ బేనర్‌లో వచ్చిన సినిమాలేవీ జనాన్ని అలరించలేకపోయాయి. 'మగధీర'తో సూపర్‌స్టార్ రేంజిని పొందిన రాంచరణ్ 'ఆరెంజ్'తో టాలీవుడ్ నెంబర్‌వన్ హీరో అయిపోయినట్లేనని కలలు కన్నవాళ్ల ఆశలు ఆవిరయ్యాయి. అయినా స్వయంగా నాగబాబే 'మగధీర' మ్యాజిక్.. 'ఆరెంజ్' ఎక్స్‌పీరియెన్స్ అన్నాక వాళ్లు మాత్రమైనా ఆ సినిమా గురించి ఎందుకు ఆశలు పెట్టుకున్నట్లు! 'మగధీర' వంటి గొప్ప సినిమా తర్వాత ఆ హీరో ఎలాంటి సినిమా చేయాలి? కచ్చితంగా 'ఆరెంజ్' లాంటి సినిమా మాత్రం కాదు.

Saturday, November 13, 2010
సినిమా: 'బృందావనం' హిట్టేనా?
ఎన్.టి.ఆర్. హీరోగా నటించిన 'బృందావనం' హిట్టేనా? హిట్టయ్యిందని అందరూ అనుకునేలా చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయా? పరిశీలనగాచూస్తే రెండోదే నిజమనిపిస్తోంది. విడుదలైనప్పుడు ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. 'కొమరం పులి', 'ఖలేజా' సినిమాలు ఫ్లాప్ కావడంతో 'రోబో' ప్రభంజనాన్ని 'బృందావనం' అడ్డుకుంటుందని విశ్లేషకులు భావించారు. చిత్రంగా ఆశించిన రీతిలో ఓపెనింగ్స్‌ని రాబట్టడంలో 'బృందావనం' విఫలమైంది. దాంతో నిర్మాత దిల్ రాజు సినిమా ప్రమోషన్ మీద ఎక్కువ దృష్టిపెట్టి ఊకదంపుడు ప్రచారం సాగిస్తూ వచ్చారు. ఏ చానల్ చూసినా ఈ సినిమా గురించిన ప్రకటనలూ, ప్రచారమే. ఈ యేడాది 'టాప్ 3' సినిమాల్లో 'బృందావనం' ఉంటుందని తానన్న మాటల్ని నిజం చేయాలనే తాపత్రయమే ఆయనలో కనిపిస్తూ వచ్చింది.
నిన్నటికి నిన్న ఈ సినిమా ఆడియో ట్రిపుల్ ప్లాటినం డిస్క్ ఫంక్షన్లో "ఈ సినిమా ఈ యేడాది టాప్ 3లో నిలిచింది' అని చెప్పడం దీన్నే సూచిస్తోంది. అలాగే నైజాంలో టాప్ 5గా నిలిచిందని కూడా ఆయనన్నారు. పైరసీ లేకుండా ఉన్నట్లయితే టాప్ 1గా నిలిచేదని ఆయన ఆక్రోశించారు.
కానీ అదే పైరసీని తట్టుకొని 'రోబో' సూపర్ కలెక్షన్లని సాధించిన సంగతిని ఆయన కావాలనే విస్మరించారు. ఏదేమైనా నైజాం, వైజాగ్ మినహాయించి మిగతా ఏరియాలకి ఈ సినిమాని కొన్న బయ్యర్లు అంత హ్యాపీగా లేరని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. లాభాల సంగతలా వుంచి నష్టాలు రాకుంటే అంతే చాలని వాళ్లు కోరుకుంటున్నారు.

Friday, October 29, 2010
సినిమా: మూడు క్రేజీ సినిమాలు - ఒక వాస్తవం (చివరి భాగం)
'ఖలేజా' కనిపిస్తున్నదెక్కడ?
మూడేళ్ల విరామంతో మహేశ్ సినిమా వస్తున్నదనేసరికి ఆయన అభిమానుల్లోనే కాక, సాధారణ ప్రేక్షకుల్లోనూ ఎంత ఆసక్తి! బాక్సాఫీసు చరిత్రని 'మహేశ్ ఖలేజా' తిరగరాస్తుందనే చాలామంది ఆశించారు, నమ్మారు. తీరా థియేటర్లలో సినిమా విడుదలయ్యాక చూస్తే.. 'ఈ సినిమా కోసమా మహేశ్ మూడేళ్లు ఆగింది' అనే వ్యాఖ్యలే, విమర్శలే. కథని కాక, కేవలం కాంబినేషన్ ని నమ్ముకుని సినిమా తీస్తే ఫలితం ఎలా ఉంటుందో చెప్పిన సినిమా 'ఖలేజా'. ఈ సినిమా కంటే ముందు వేరే దర్శకులతో వేరే సినిమాలు చేస్తానని మహేశ్ నుంచి ప్రకటనలు వచ్చాయి. కానీ అవన్నీ పక్కకి వెళ్లిపోయి, త్రివిక్రమ్ సినిమా ముందుకొచ్చింది. మహేశ్, త్రివిక్రమ్ కాంబినేషనులో అదివరకు వచ్చిన 'అతడు' హిట్టవడం, అప్పుడే త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన 'జల్సా' విజయం సాధించడం దీనికి కారణం. హీరోయిన్ విషయంలోనూ ఇదే స్థితి. మొదట ఎంపిక చేసిన పార్వతీ మెల్టన్ ని కాదని 'అరుంధతి' సూపర్ హిట్టవడంతో అనుష్కని హీరోయినుగా తీసుకున్నారు. సూపర్ హీరో, సూపర్ హీరోయిన్, సూపర్ డైరెక్టర్ కాంబినేషన్ బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుందని నిర్మాత ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. 'పులి' కథని కానీ, 'ఖలేజా' కథని కానీ ముందుగా ఆయన వినలేదు. కాంబినేషన్స్ ని కుదుర్చుకుని, పెట్టుబడి పెట్టారంతే. ఒకప్పటి నిర్మాతలకీ, ఈ కాంబినేషన్ నిర్మాతలకీ అదే తేడా.
'ఖలేజా'లో ప్రారంభం నుంచి చివరిదాకా రీజనింగ్ కి అందని సన్నివేశాలెన్నో. హీరో ఇంట్రడక్షన్ సీనులో ఎడారిలో మనుషుల్ని మహేశ్ కత్తులతో కుత్తుకలు కోస్తుంటే, వాళ్లు అతనికి ఏం అన్యాయం చేశారో, ఎంతటి దుర్మార్గాలు చేశారో.. అనుకుంటాం. కానీ వాళ్లని అతను చంపింది 'నీళ్ల' కోసం! ఆ ఓపెనింగ్ ఫైట్ తోటే హీరో పాత్ర ఔచిత్యం దెబ్బతినిపోయింది. విషపు నీటివల్ల ఐదొందల పైచిలుకు జనాభా ఉన్న ఓ ఊరు వల్లకాడవుతుంటే, వాళ్లని 'దేవుడు'గా మహేశ్ ఎలా కాపాడాడనేది ఈ సినిమా ప్రధానాంశం. 'స్టఫ్' అంటూ లేని ఈ కథలోని 95 శాతం సన్నివేశాల్లో అంతా తానై కనిపిస్తాడు మహేశ్. అంటే ప్రధాన పాత్ర మీదే ధ్యాసంతా పెట్టిన దర్శకుడు మిగతా పాత్రల పట్ల చిన్నచూపు చూశాడు. తనవరకు విభిన్నమైన డైలాగ్ డిక్షనుతో, నటనతో మహేశ్ ఎంతగా చెలరేగిపోయినా, బిగువైన కథనం లేకపోవడమే 'ఖలేజా'కి ప్రతికూలంగా పరిణమించింది. ప్రపంచవ్యాప్తంగా తొలివారం బాక్సాఫీసు వద్ద భారీగా 21 కోట్ల రూపాయల షేరుని వసూలుచేసిన ఈ సినిమా కలెక్షన్లు రెండో వారం బాగా నెమ్మదించాయి. దాదాపు 40 కోట్ల రూపాయల (అంచనా) వ్యయమైన ఈ సినిమాకి పెట్టుబడి రావడం చాలా కష్టమనేది ట్రేడ్ వర్గాల మాట.
'బృందావనం' అందరిదయ్యేనా?
'బృందావనం' బాగుంది.. ఎక్కడికెళ్లినా ఇదే మాట. ఎన్టీఆర్ కథానాయకుడిగా; కాజల్ అగర్వాల్, సమంతా నాయికలుగా నటించిన ఈ సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో సినిమా విడుదలైన తొలిరోజు నిర్మాత రాజు, దర్శకుడు వంశీ పైడిపల్లి ముఖాలు సంతోషంతో వెలిగిపోయాయి. 'బృందావనం' సూపర్ డూపర్ హిట్టయి, బాక్సాఫీసు వద్ద రారాజుగా వెలిగిపోతున్న 'రోబో'ని నిలువరించడం ఖాయమనే ట్రేడ్ వర్గాలు భావించాయి. అయితే టాక్ కీ, కలెక్షన్లకీ కనిపిస్తున్న దూరం బయ్యర్లని ఆందోళన పరుస్తోంది. పైరసీ కారణంగానే ఈ సినిమాకి ఆశించిన రీతిలో వసూళ్లు రావడం లేదనేది ఓ వాదన. అదే నిజమైతే 'రోబో' కలెక్షన్లు ఇంకా నిలకడగా ఎందుకున్నాయనేది ప్రశ్న. ఇంతవరకు చేయని కొత్త తరహా పాత్రలో ఎన్టీఆర్ నటన అందరి ప్రశంసలూ పొందుతున్నప్పటికీ స్త్రీల హక్కులు, సమానత్వం మీద ఎంతో చైతన్యం కనిపిస్తున్న ఈ రోజుల్లోనూ 'ఒక పురుషుడికి ఇద్దరు స్త్రీలు' పాయింట్ ఎలా మెప్పు పొందుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 30 కోట్ల రూపాయలకు మించి వ్యయమైన ఈ సినిమాకి పెట్టుబడి రావాలంటే మరో రెండు వారాల పాటు కలెక్షన్లు బలంగా ఉండాలి. అయితే 'రోబో' స్థాయిలో ఈ సినిమా పట్ల ప్రేక్షకులు ఆసక్తి కనపర్చడం లేదనేది కనిపిస్తున్న వాస్తవం. మాస్ హీరో అయిన ఎన్టీఆర్ సినిమాకి 'బృందావనం' వంటి సాఫ్ట్ టైటిల్ పెట్టడం వల్లే ఓపెనింగ్స్ లో ఉధృతి కనిపించ లేదనేది ట్రేడ్ విశ్లేషకుల భావన.
డబ్బింగ్ సినిమాల వల్ల తెలుగు సినిమాలకు థియేటర్లు కరువవుతున్నాయని ఇప్పటిదాకా చిన్న సినిమాల నిర్మాతలు ఆవేదన చెందుతూ వచ్చారు. ఇప్పుడు ఆ డబ్బింగ్ సినిమాల వల్ల తమకూ ముప్పు ఏర్పడిందని పెద్ద సినిమాల నిర్మాతలు బాధపడే రోజులొచ్చాయి. కిం కర్తవ్యం? కాంబినేషన్ల మీదకంటే కథాకథనాల మీద శ్రద్ధ ఎక్కువగా పెట్టడమే.

Thursday, October 28, 2010
సినిమా: మూడు క్రేజీ సినిమాలు - ఒక వాస్తవం (1వ భాగం)
ఒక డబ్బింగ్ సినిమా ఒకవైపు.. మూడు భారీ, క్రేజీ తెలుగు సినిమాలు ఇంకోవైపు.. మామూలుగా అయితే డబ్బింగ్ సినిమా మట్టికరచి మాయం కావాలి. చిత్రం.. సీను రివర్స్. తెలుగులో అగ్ర కథానాయకులు నటించిన సినిమాల్నే వెనక్కి నెట్టేస్తూ ఆ డబ్బింగ్ సినిమా అప్రతిహతంగా బాక్సాఫీసును దున్నేస్తోంది. తెలుగు ప్రేక్షకులకి వినోదపు మజాని రుచి చూపిస్తూ నాణ్యమైన సినిమాకే వాళ్లు పట్టం కడతారనే నిజాన్ని చాటి చెబుతోంది. ఆ డబ్బింగ్ సినిమా 'రోబో'. ఆ భారీ, క్రేజీ సినిమాలు 'పులి', 'మహేశ్ ఖలేజా', 'బృందావనం'. తమిళ అగ్ర కథానాయకుడైన రజనీకాంత్ టాలీవుడ్ టాప్ హీరోల్ని పడగొట్టి బాక్సాఫీసు మీద గుత్తాధిపత్యం చలాయిస్తుండటం ఆషామాషీ సంగతి కాదు. టాలీవుడ్ వర్గాలు చాలా చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన సంగతి.
ఎందుకిలా జరిగింది? మొదటే హీరోని దృష్టిలో పెట్టుకుని కథలు వండటం తెలుగు దర్శకులు, రచయితలకి బాగా అలవాటైన పనయితే, స్క్రిప్టు మీదే ఎక్కువ దృష్టిపెట్టి, ఆ స్క్రిప్టుకి పనికొచ్చే నటుణ్ణి వెతుక్కోవడం తమిళ దర్శకుడైన శంకర్ కి తెలిసిన పని. 'రోబో' గురించీ, ఆ సినిమా ఆంధ్రప్రదేశ్ బాక్సాఫీస్ మీద చేస్తున్న సందడి గురించీ ఇదివరకే చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ సినిమా స్థాయిలో మన మూడు తెలుగు స్ట్రెయిట్ సినిమాలు ఎందుకని ప్రేక్షకుల్ని అలరించలేక పోతున్నాయో విశ్లేషించుకోవాల్సిన సందర్భం.
తోకముడిచిన 'పులి'
'రోబో' కంటే మూడు వారాల ముందు విడుదలైన పవన్ కల్యాణ్ సినిమా 'పులి' (కొమరం పులి)ని ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో వెయ్యి ప్రింట్లతో విడుదల చేశారు. అందుకే తొలివారం ఆ సినిమా 25 కోట్ల రూపాయల్ని వసూలు చేసింది. నిజానికి అందులో ముప్పాతిక వంతు తొలి మూడు రోజుల్లోనే రావడం గమనార్హం. ఆ తర్వాత నుంచే ఆ సినిమాకి వచ్చే వాళ్లు కనుచూపు మేరలో కనిపించకుండా పోయారు. ఆ 'ఘనత'ని మొత్తంగా దర్శకుడు ఎస్.జె. సూర్యకే ఆపాదించారు. ప్రేక్షకుల్ని కుర్చీల్లోంచి లేవకుండా కూర్చోపెట్టాలంటే వినోదమన్నా వుండాలి, ఉత్కంఠభరితమైన కథనమన్నా వుండాలి. ఆ రెండూ లేకపోవడమే 'పులి' పరాజయానికి ప్రధాన కారణమనేది విమర్శకుల అభిప్రాయం. పులి పాత్ర చేత పదే పదే 'ప్రసంగాలు' ఇప్పించడం సినిమాకి పెద్ద మైనస్ పాయింట్. జనం సినిమాకి వచ్చేది ప్రధానంగా వినోదం కోసమేననే, సినిమాలోని ప్రధాన పాత్రలతో వాళ్లు సహానుభూతి చేందితేనే సినిమా ఆడుతుందనే ప్రాథమిక సత్యం తెలియకుండా తీసిన సినిమాగా 'పులి'ని చెప్పుకోవాలి. ఆరంభ సన్నివేశాల్లోనే పులి ఆవేశంగా ఐదు నిమిషాల సేపు జనానికి ఉపదేశించే రీతిలో ప్రసంగించడం చూసి బిత్తరపోయిన ప్రేక్షకులు, ఆ తర్వాత మరో మూడు నాలుగు సార్లు అలాంటి సీనులే ఎదురవడంతో కుర్చీల్లో ఎంత ఇబ్బందికరంగా మసిలారో 'పులి'ని చూసిన వాళ్లందరికీ అనుభవమే. నీతిబోధకుడు చెప్పే రీతిలో పవన్ కల్యాణ్ చెప్పిన నీతులు ప్రేక్షకుల్ని కదిలించాయి. ఎలా? కుర్చీల్లో అసహనంగా, చికాకుగా. రాజకీయ వేదికలపై చెప్పే ఆవేశభరిత, ఊకదంపుడు ఉపన్యాసాల్ని వినీ వినీ డంగైపోయిన జనం సినిమాలోనూ అలాంటి సీనే కనిపించడంతో మూకుమ్మడిగా 'పులి'కి వ్యతిరేకంగా ఓటేశారు. ఫలితంగా ఆ సినిమాపై పెట్టుబడి పెట్టిన నిర్మాత, బయ్యర్లు నిలువునా మునిగిపోయారు. తొలివారం భారీ కలెక్షన్లు సాధించిన ఆ సినిమా రెండో వారం సగానికంటే ఎక్కువ సంఖ్య థియేటర్లలో మాయమయ్యింది. మొత్తంగా ఈ ఏడాది ఇప్పటివరకు రిలీజైన సినిమాల్లో నెంబర్ వన్ డిజాస్టర్ అనే ముద్రని సంపాదించుకుంది. (ఇంకావుంది)

Thursday, September 16, 2010
ట్రేడ్ రిపోర్ట్: 'పులి' ఫ్లాప్ షో!
పవన్ కల్యాణ్, ఎస్.జె. సూర్య కాంబినేషనులో వచ్చిన 'పులి' సినిమా బాక్సాఫీసు వద్ద కుదేలయ్యింది. ఆ సినిమా డిజాస్టర్ అని ట్రేడ్ వర్గాలు ముక్తకంఠంతో తేల్చి చెబుతున్నాయి. ఎంతో గ్రాండుగా అత్యధిక థియేటర్లలో ఈనెల 10న విడుదలైన ఆ సినిమాకి వారాంతం వసూళ్లు బాగానే ఉన్నా, సినిమా బాగాలేదనే టాక్ వ్యాపించడంతో సోమవారం నుంచి 30-50 శాతం వసూళ్లు పడిపోయాయి. దాంతో పవన్ కల్యాణ్ సినిమాల్లో ఇదివరకు అట్టర్ ఫ్లాపయిన 'జానీ'తో ఈ సినిమాని పోలుస్తున్నారు. ఫలితంగా రెండో వారం చాలా థియేటర్ల నుంచి ఈ సినిమా మాయమవనున్నది. ఇంకోవారం పోతేగానీ ఈ సినిమా ఏ స్థాయి ఫ్లాపనేదీ స్పష్టం కాదు. మరోవైపు ఈ సినిమాతో భారీగా నష్టపోయిన నిర్మాత శింగనమల రమేశ్ బాబుకి హీరో పవన్ తన రెమ్యూనరేషనులోంచి ఐదు కోట్ల రూపాయల్ని తిరిగిచ్చేశారనేది ఫిలింనగర్ వర్గాల భోగట్టా. అలాగే ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసిన అల్లు అరవింద్ సైతం మూడు కోట్ల రూపాయల్ని రమేశ్ కి ఇచ్చినట్లు చెబుతున్నారు.
'పులి' ఫ్లాపయినా దాన్ని క్యాష్ చేసుకోవడంలో జగపతిబాబు సినిమా 'గాయం-2' ఫెయిలయ్యింది. రెండో వారం ఆ సినిమా వసూళ్లు సాధారణ స్థాయిలోనే ఉన్నాయి. 'మర్యాద రామన్న', 'డాన్ శీను' సినిమాల కలెక్షన్లు ఓ మోస్తరుగా నమోదయ్యాయి. రాజేంద్ర ప్రసాద్, శివాజి సినిమా 'బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం' సినిమా నేటితో (15తో) 50 రోజులు పూర్తి చేసుకుంది. భూమిక, భరత్ ఠాకూర్ల సినిమా 'తకిట తకిట'కి పెట్టిన డబ్బంతా వృథా అయినట్లే. మరోవైపు హాలీవు సినిమా 'రెసిడెంట్ ఈవిల్-4'కి యువ ప్రేక్షకులు బాగా వస్తున్నారు.
Tuesday, September 14, 2010
Saturday, September 11, 2010
సినిమా: 'పులి' మీద వివాదం కరెక్టేనా?
పవన్ కల్యాణ్ సినిమా 'కొమరం పులి' టైటిల్ మీద వివాదం సరైనదేనా? టైటిల్లో 'కొమరం' అని ఉన్నంత మాత్రాన దానికి గిరిజన పోరాట యోధుడు కొమరం భీమ్ ని కించపరిచినట్లుగా భావించవచ్చా? నిజాయితీగా ఆలోచిస్తే ఆ టైటిల్ వల్ల కొమరం భీమ్ పేరుకి వచ్చిన నష్టం ఏమీ లేదని అర్థమవుతుంది. సినిమాలో ఎక్కడా భీమ్ ప్రస్తావన లేదు. కొమరం పులి కూడా ఆకతాయి హీరో కాదు. బాద్యతాయుతమైన, డ్యూటీలో నిక్కచ్చిగా ఉండే నిజాయితీ కలిగిన పోలీసాఫీసర్. హీరోయిన్ తో వచ్చే సన్నివేశాలతో తప్పిస్తే పులి ఒక ఆదర్శవంతమైన వ్యక్తిగానే కనిపిస్తాడు.
మరెందుకు వివాదం? మహా నాయకుల పేర్లతో ఎన్ని సినిమాలు రాలేదు. వాటిమీద గొడవలేమీ జరగలేదే. నిజానికి కొమరం పులి మీద గొడవ భీమ్ కి సంబంధించినది కాదని ఇట్టే తెలిసిపోతుంది. చిరంజీవి కుటుంబం సమైక్యాంధ్రకి మద్దతు పలకుతుండటమే ఈ గొడవకి కీలకమని భావించాలి. ఆయన కుటుంబానికి చెందిన హీరోల సినిమాల్ని తెలంగాణలో ఆడనివ్వమని ఇప్పటికే ఓయు జేఏసి, ఇతర తెలంగాణ సంఘాలు ప్రకటించాయి. దానిలో భాగంగానే టైటిల్ వివాదం తెరమీదకు వచ్చింది.
ఒకవేళ ఉద్దేశపూర్వకంగానే నిర్మాతలు టైటిల్ కి 'కొమరం పులి' అని పెట్టినా వివాదం సహేతుకం కాదు. ఆ సినిమాని తెలంగాణలో ఆడనివ్వమని గొడవ చెయ్యడం సమర్థనీయం కాదు. దాని సంగతి తెలంగాణ ప్రేక్షకులే చూసుకుంటారు. టైటిల్లో 'కొమరం' అని పెట్టడం వాళ్లకి ఇష్టం లేకపోతే ఆ సినిమాని చూసేందుకు తిరస్కరించడం ద్వారా వాళ్లే తీర్పునిస్తారు. ఏ సినిమాకైనా ప్రేక్షకులను మించిన తీర్పరులు ఇంకెవరుంటారు?
అలా కాకుండా ఆ సినిమాని తెలంగాణలో ఆడనివ్వమని గొడవ చేయడం ద్వారా దానిపై ప్రేక్షకుల్లో మరింత క్యూరియాసిటీని వాళ్లే రేకెత్తిస్తున్నారన్న మాట. ఇది ఆ సినిమాకి మేలే చేకూరుస్తుంది కానీ నష్టం కాదు. ఇప్పుడు థియేటర్లలో ఆడకుండా అడ్డుకునే వాళ్లు రేపు ఆ సినిమా చానళ్లలో ప్రసారమైనప్పుడు ఎలా అడ్డుకుంటారు? ఏదేమైనా 'కొమరం పులి' విడుదల రోజే ఆ సినిమాలో ప్రేక్షకుల్ని ఆకట్టుకునే అంశాలు లేవని తేలింది. ఇప్పుడు గొడవ వల్ల కొద్దో గొప్పో దానికి ప్రేక్షకులు పెరుగుతారు. ఆ పుణ్యం కట్టుకుంటోంది గొడవలు చేసేవాళ్లే.
ఈ వివాదం వల్ల టైటిల్లో 'కొమరం'ని తొలగిస్తున్నామనీ, ఇక ఈ సినిమా ఒట్టి 'పులి' మాత్రమేననీ నిర్మాతలు ప్రకటించారు. దీనితో గొడవలు చేసేవాళ్ల వాళ్ల మనోభావాలకు తృప్తి కలిగినట్లేనా?
Friday, September 10, 2010
సినిమా: ఇక ఆశలన్నీ 'మహేశ్ ఖలేజా' మీదే!

ఉదయం ఆటతోటే 'కొమరం పులి' భవిష్యత్ తేలిపోయింది. పవన్ కల్యాణ్ డైరెక్టరుగా పరిచయమవుతూ తీసిన 'జానీ'ని మించిపోయిందని అంతటా వినిపిస్తోంది. 'ఈ సినిమాకా ఇన్ని గొడవలు జరుగుతోంది' అన్ని విస్తుపోయేలా పరమ బోరింగుగా ఉన్న ఈ సినిమాని నిర్మించిన శింగనమల రమేశ్ వైపు అందరూ జాలి చూపులు చూస్తున్నారు. 15 నుంచి 17 కోట్ల రూపాయల డెఫిసిట్ తో రిలీజైన ఈ సినిమాకి నష్టాలు పూడ్చుకోవడం కల్ల అని తేలిపోయింది. దాంతో తన మరో ప్రాజెక్ట్ 'మహేశ్ ఖలేజా' వైపు వెంటనే దృష్టి సారించారు రమేశ్. నిన్నటిదాకా ఆ సినిమాని అక్టోబర్ 7న రిలీజ్ చేయాలని ఆయనా, ఆయన భాగస్వామి సి. కల్యాణ్ అనుకున్నారు.
కానీ రాత్రి నుంచే ఈ సినిమా మీద అన్ని ప్రాంతాల నుంచీ బాడ్ టాక్ రావడంతో శుక్రవారం ఉదయమే 'ఖలేజా'ని సెప్టెంబర్ 30న విడుదల చేస్తున్నామని అధికారికంగా ప్రకటించేశారు. 'కొమరం పులి' రిలీజ్ అయిన రోజు సాధారణ పరిస్థితుల్లో అయితే ఫోకస్ అంతా ఆ సినిమా మీదే ఉండాలి. కానీ అలా కాకుండా ఆ సినిమా రిలీజ్ రోజు 'ఖలేజా' గురించి మాట్లాడారంటే వాళ్లే 'కొమరం పులి' బాక్సాఫీసు ఫలితాన్ని గురించి చెప్పినట్లయ్యిందని ఫిలింనగర్ వర్గాలు అంటున్నాయి. బయ్యర్లను దృష్టిలో పెట్టుకునే నిర్మాతలు ఈ ప్రకటన చేశారనేది ఆ వర్గాల వాదన. మొత్తానికి 'పులి' అందర్నీ భయపెడుతోంది. ఆ సినిమాని కొన్న పలు ప్రాంతాల బయ్యర్లు ఇప్పటికే ఆందోళనలో మునిగిపోయారని సమాచారం. ఇప్పటికే వివాదాల్లో ఉన్న ఆ సినిమా రానున్న రోజుల్లో మరిన్ని వివాదాలను సృష్టించేలా కనిపిస్తోంది.
రివ్యూ: గాండ్రించని 'కొమరం పులి'
సినిమా: కొమరం పులి
రేటింగ్: 2.5/5
తారాగణం: పవన్ కల్యాణ్, నికిషా పటేల్, శరణ్య, మనోజ్ బాజ్ పేయి, నాజర్, చరణ్ రాజ్, అలీ, గిరీష్ కర్నాడ్, శ్రీధర్, కోవై సరళ, శ్రియ
సంగీతం: ఏఆర్ రెహమాన్
సినిమాటోగ్రఫీ: బినోద్ ప్రధాన్
ఎడిటింగ్: ప్రభాకరన్
స్క్రీన్-ప్లే, దర్శకత్వం: ఎస్.జె. సూర్య
విడుదల తేది: సెప్టెంబర్ 10, 2010
ఎన్ని అంచనాలు! ఎంత హైప్! పవన్ కల్యాణ్ సినిమా అంటే మామూలుగానే భారీ అంచనాలు ఉంటాయి. అయితే 'జల్సా' వచ్చిన రెండేళ్ల తర్వాత తెలుగు సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెటుతో రావడం, 'ఖుషి' కాంబినేషన్ అయిన పవన్ కల్యాణ్, ఎస్.జె. సూర్య మళ్లీ కలియడం వల్ల 'కొమరం పులి' కోసం చాలా రోజులనుంచే జనం ఎదురు చూస్తున్నారు. దీనికితోడు గిరిజన పోరాట యోధుడు కొమరం భీమ్ ఇంటిపేరును ఈ సినిమాకి వాడుకోవడాన్ని మేం అనుమతించమని భీమ్ వారసులు గొడవలు చేయడం వివాదాన్ని రేకెత్తించింది. డెఫిసిట్ లో ఈ సినిమా రిలీజవుతున్నదనే వార్తల వల్ల ఈ సినిమా ఎలా ఉండబోతున్నదనే క్యూరియాసిటీ కూడా అమితంగా పెరిగింది.
ఎప్పటికప్పుడు విడుదల వాయిదా పడుతూ ఎట్టకేలకు ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'కొమరం పులి' ఎలా ఉన్నాడు? అభిమానుల్ని ఆనందపరిచాడా? సగటు సినిమా ప్రియుణ్ణి సంతృప్తి పరిచాడా? దీనికి సమాధానం కాదనే చెప్పాలి. అంచనాలకు తగ్గట్లు లేకపోవడాన్ని అటుంచుదాం. అసలు ఎంచుకున్న కథాంశం, పవన్ కల్యాణ్ పోషించిన కొమరం పులి పాత్ర చిత్రణ ఏమాత్రం ఆకట్టుకోలేక పోయాయి.
కథేమిటో తెలుసుకుంటే అందులో నిజమేమిటో అర్థమవుతుంది. ఒక నిజాయితీపరుడైన పోలీస్ ఆఫీసరుని అల్ సలీమ్ (మనోజ్ బాజ్ పేయి) అనే సంఘ వ్యతిరేక శక్తి అంటే భవిష్యత్ చీకటి సామ్రాజ్యాధినేత చంపుతాడు. తన భర్త ఆచూకీ తెలపమని వేడుకున్న అతని భార్య (శరణ్య)ను కడుపు మీద కాలితో కొట్టి ఆమెనీ చంపబోతాడు. గర్భవతి అయిన ఆమె ఎలాగో తప్పించుకుని నీళ్లలోనే ఒక కొడుకును కంటుంది. అతనే మన కొమరం పులి (పవన్ కల్యాణ్). ఈ సంగతి అల్ సలీమ్ కీ, అతని తొత్తు అయిన ఓ పోలీస్ ఆఫీసరు (చరణ్ రాజ్)కీ తెలీదు.
పెరిగి పెద్దయిన పులి సహజంగానే పోలీస్ అఫీసర్ అవుతాడు. మొదట్లోనే థాయిలాండులో పర్యటిస్తున్న మన ప్రధానిపై హత్యాయత్నాన్ని అడ్డుకుని ఆయన్ని రక్షిస్తాడు. పోలీసులపై ప్రజలకున్న వ్యతిరేక భావనని పోగొట్టాలంటే వీధికో టెలిఫోన్ని ఏర్పాటు చేయాలనీ, ఒక రూపాయతో ఫోన్ చేసే బాధితుల్ని అప్పటికప్పుడు ఆదుకోవాలనీ చెప్పి, అందుకు గ్రీన్ సిగ్నల్ ఇప్పించుకుంటాడు. దాంతో 'పులి టీమ్' ఏర్పాటవుతుంది. ఇక అన్యాయానికి గురైన వాళ్లకి సత్వర న్యాయం చేకూరుస్తూ వస్తున్న పులికి అల్ సలీమ్ తారసపడతాడు. హుస్సేన్ అనే పోలీస్ ఆఫీసర్ కనిపించకుండా పోవడంలో సలీమ్ పాత్ర వుందని తెలుసుకున్న పులి ఆ రహస్యాన్ని ఛేదించాలనుకుంటాడు.
అక్కడినుండి ఇద్దరి మధ్య ప్రత్యక్ష యుద్ధం మొదలవుతుంది. ఆ ఇద్దరిలో గెలుపెవరిది, తన తండ్రిని చంపిన హంతకుడు సలీమేననే సంగతి పులికి తెలుస్తుందా? అనే ప్రశ్నలకి సమాధానాలు ఎవరైనా ఇట్టే ఊహించుకోవచ్చు.
కథ ఎత్తుగడలో వచ్చే సన్నివేశాలే ప్రేక్షకుల మతి పోగొడతాయి. మనం చూస్తున్నది సోషల్ సినిమానా లేక ఫాంటసీ సినిమానా అనే సందేహం కలుగుతుంది. పులి తల్లి కడుపులో ఉన్నప్పుడే తల్లి మాటలకు అనుగుణంగా చేతులు కాళ్లు ఆడించడం, తల్లి 'లెఫ్ట్' అంటే ఎడమ కాలిని, 'రైట్' అంటే కుడి కాలిని ఆడించి కడుపులోనే పోలీస్ ఆఫీసర్ మాదిరిగా మార్చింగ్ చేయడం మామాలు ఇమాజినేషనా!
అల్ సలీమ్ పాతికేళ్ల తర్వాత దేశాన్నే ఆడించే కింగ్ పిన్ తరహాలో దర్శనమిస్తాడు. అంటే పాతికేళ్ల వయసుకే పులి పోలీస్ అఫీసరుగా పెద్ద రేంజికి ఎదిగినట్టేగా. ఇది తర్కానికి అందని సంగతి. సలీమ్ ని చంపాలంటే ఒక్క క్షణం పని అనీ, తనకు కావలసింది సలీమ్ ని చంపడం కంటే సమాజంలో అలాంటి చెడు మనుషులు తయారుకాకుండా చూడడమనీ చెప్పిన పులి చివరికి ఆ మాటలు మరిచిపోయి సలీమ్ ఒక్కడినే టార్గెట్ చేసుకుంటాడు. అంటే మళ్లీ ఓ సాధారణ ఫార్ములా స్థాయికి సినిమా కథనం పడిపోయింది.
సినిమాలో వినోదం లోపించడం వల్ల ప్రేక్షకుల్ని రంజింపజేసే సన్నివేశాలు లేకుండాపోయాయి. అలీ ఉన్నా అతన్ని సక్రమంగా ఉపయోగించుకోలేదు. హీరోయిన్ నికిషా పటేల్ పాత్రతో పండించాలనుకున్న వినోదం తేలిపోయిందే కానీ ఆకట్టుకోలేదు.
ఆమె పాత్రకి ఏమాత్రం ప్రాముఖ్యత లేకుండా చేశాడు దర్శకుడు. విచారకరమైన సంగతేమంటే పులి పాత్రలో పవన్ కల్యాణ్ కూడా ఆకట్టుకోలేక పోయాడు. చాలా సందర్భాల్లో అతని చేత ప్రసంగాలు ఇస్తున్న తరహాలో సంభాషణలు చెప్పించడం చికాకు తెప్పించింది. పవన్ కూడా ఆ ప్రసంగాల్ని ఎఫెక్టివ్ గా చెప్పలేకపోయాడు. అతని డిక్షన్ లో లోపాలు కనిపించాయి. ఒక నీతి బోధకుడు చెప్పే రీతిలో అతను నీతులు చెప్పాలని చూశాడు కానీ అవి వర్కవుట్ కాలేదు.
సినిమాలో నటనపరంగా బాగా ఆకట్టుకున్నది పులి తల్లిగా నటించిన శరణ్య, మంచి పోలీసాఫీసరుగా నటించిన నాజర్. విలన్ సలీమ్ పాత్రలో మనోజ్ బాజ్ పేయి బాగా రాణించాడు. హీరోయిన్ నికిషా పటేల్ కి భవిష్యత్తు ఉన్నట్లు అనిపించదు. ఏఆర్ రెహమాన్ సంగీతంలోని రెండు పాటలు మాత్రం బాగున్నాయి. బినోద్ ప్రధాన్ సినిమాటోగ్రఫీ బాగుంది. కథ, కథనం, హీరో పాత్ర చిత్రణ ఎఫెక్టివుగా లేకపోవడమే 'కొమరం పులి'ని అనాసక్తంగా తయారుచేశాయి.
Monday, August 30, 2010
Movies: 'Gayam2' gained

సెప్టెంబర్ 2న పవన్ కల్యాణ్ సినిమా 'కొమరం పులి' విడుదల లేకపోవడం జగపతిబాబు సినిమా 'గాయం2'కు కలిసొచ్చింది. 'కొమరం పులి' 2న (ఆరోజు పవన్ కల్యాణ్ పుట్టినరోజు) వస్తున్నదనే ఉద్దేశంతో చాలామంది చిన్న నిర్మాతలు తమ సినిమాల్ని అక్టోబరుకు వాయిదా వేసుకున్నారు. అయితే 'పులి' సెప్టెంబర్ 10న అయిన వస్తుందో, లేదో గ్యారంటీ లేకపోవడంతో థియేటర్లు ఖాళీగా ఉండే పరిస్థితి తలెత్తింది. ఇదే 'గాయం2'కు అనుకూలంగా మారింది. మొన్నటిదాకా ఈ సినిమాని కొనేందుకు బయ్యర్లెవరూ ముందుకు రాలేదు. అందువల్ల ఈ సినిమాకి డెఫిసిట్ తప్పదని అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా రెండు రోజుల్లో పరిస్థితి మారిపోయింది. ఈ సినిమాని కొనేందుకు బయ్యర్లు ఎగబడ్డారు. ఫలితంగా డెఫిసిట్ తప్పదనుకున్న నిర్మాత లాభాలతో సినిమాని రిలీజ్ చేసే స్థితి ఏర్పడింది. జగపతిబాబు సరసన విమలా రామన్ నటించిన ఈ సినిమాని రాంగోపాల్ వర్మ శిష్యుడు ప్రవీణ్ శ్రీ డైరెక్ట్ చేశాడు. సెప్టెంబర్ 3న ఈ సినిమా విడుదలవుతోంది.
Subscribe to:
Posts (Atom)