Showing posts with label khaleja. Show all posts

Saturday, December 14, 2013
Wednesday, December 14, 2011
త్రివిక్రం ఎదుట సవాలు
దర్శకుడిగా హ్యాట్రిక్ హిట్స్ కొట్టి నాలుగో సినిమాతో బోల్తాపడ్డ త్రివిక్రం ఐదో సినిమాతో సవాలును ఎదుర్కొంటున్నాడు. అతను డైరెక్ట్ చేసిన 'నువ్వే నువ్వే', 'అతడు', 'జల్సా' సినిమాలు ఒకదాన్ని మించి మరొకటి హిట్టయిన సంగతి తెలిసిందే. అదివరకు రచయితగా టాప్ రేంజ్ పొందిన త్రివిక్రం ఈ మూడు సినిమాలతో డైరెక్టర్‌గానూ టాలీవుడ్ టాప్‌లీగ్‌లో చేరిపోయాడు. అయితే అతడి నాలుగో సినిమా తొలి ఫ్లాప్‌ని అతడి జాబితాలో చేర్చింది. ఆ సినిమా 'ఖలేజా'. మహేశ్ హీరోగా అతడు డైరెక్ట్ చేసిన రెండో సినిమా ఇది. 'మగధీర' స్ఫూర్తితో తీయడం వల్ల ఈ సినిమాలో ఒరిజినాలిటీ మిస్సయ్యిందనే అపవాదుతో పాటు మహేశ్, అనుష్క మధ్య కెమిస్ట్రీ వర్కవుట్ కాలేదనే విమర్శా వచ్చింది. కథలోనే దమ్ములేదనే మాట ఎలాగూ ఉంది.
ఈ సినిమాతో దెబ్బతిన్న త్రివిక్రం ఇప్పుడు అల్లు అర్జున్‌ని డైరెక్ట్ చేయడంలో నిమగ్నమయ్యాడు. నవంబర్ 2న ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. అర్జున్ సరసన ఇలియానా తొలిసారి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాతో బంపర్‌హిట్ కొట్టి తన సత్తా చాటాలని ఆశిస్తున్నాడు త్రివిక్రం. తొలి మూడు సినిమాలతో దర్శకుడిగా త్రివిక్రంలోని ప్రతిభ ఆవిరైందనీ, అందువల్లే 'ఖలేజా' లాంటి సబ్జెక్ట్ చేశాడనీ వచ్చిన విమర్శల్ని తాజా సినిమాతో తిప్పికొట్టాలని అతను భావిస్తున్నాడు. ఈ సవాలుని అతడు ఎలా అధిగమిస్తాడో చూడాల్సిందే.

Saturday, September 24, 2011
న్యూస్: దున్నేస్తున్న 'దూకుడు'
విడుదలకు ముందే అనేక రికార్డుల్ని సొంతం చేసుకున్న మహేశ్ 'దూకుడు' టైటిల్‌కి పూర్తి న్యాయం చేకూరుస్తూ తొలిరోజు కలెక్షన్ల పరంగా టాలీవుడ్‌లో సరికొత్త రికార్డుని సృష్టించినట్లు ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువ థియేటర్లలో విడుదలైన రికార్డుని సొంతం చేసుకున్న 'దూకుడుకి అన్ని చోట్లా పాజిటివ్ టాక్ రావడమే కాకుండా ప్రేక్షకుల స్పందన కూడా అనూహ్యంగానే ఉంది. తొలిరోజు 'మగధీర' రికార్డుల్ని 'దూకుడు' అధిగమించిందనేది ట్రేడ్ రిపోర్ట్. మహేశ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ అయిన 'పోకిరి' రికార్డుల్ని ఈ సినిమా మూడు నుంచి నాలుగు వారాల్లో అధిగమిస్తుందని అంచనాలు వేస్తున్నారు. జి. అజయ్‌కుమార్ ఐపియస్ పాత్రలో మహేశ్ ప్రదర్శించిన నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. సినిమా నిడివి 2 గంటల 50 నిమిషాలు ఉండటంతో కనీసం 15 నుంచి 20 నిమిషాల నిడివి తగ్గించాలని విమర్శకులు సూచిస్తున్నా ట్రెండ్ చూస్తుంటే లెంగ్త్ అనేది పెద్ద సమస్యగా కనిపించడంలేదు. 'పోకిరి' తర్వాత మహేశ్ సినిమాలు 'సైనికుడు', 'అతిథి', 'ఖలేజా' ఆడకపోవడానికి ప్రధాన కారణం వాటిలో ఎంటర్‌టైన్‌మెంట్ లోపించడమేనని భావించిన శ్రీను వైట్ల, అతని రచయితలు గోపీమోహన్, కోన వెంకట్ 'దూకుడు'ని హిలేరియస్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా మలచడంలో విజయం సాధించారు. స్వతహాగా రచయిత కూడా అయిన శ్రీను వైట్ల ఇందులో అనేక పంచ్ డైలాగుల్ని స్వయంగా రాశాడు. బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ పాత్రలతో పాటు మహేశ్ సైతం కామెడీని పంచడంతో వినోదానికి కొదవ లేకుండా పోయింది. సినిమా ట్యాగ్‌లైన్ 'డేరింగ్ అండ్ డేషింగ్'కు తగ్గట్లు మహేశ్ కేరక్టర్ రూపొందింది. యాక్షన్ సీన్లలో అతని ఎనర్జీ మాస్ ఆడియెన్స్‌ని విపరీతంగా అలరిస్తోంది. ఆ పాత్రలో చెలరేగిన మహేశ్ సినిమానంతా తన భుజాల మీద మోశాడు. అతని డైలాగ్ డిక్షన్, మధ్య మధ్యలో హైదరాబాద్ హిందీలో, తెలంగాణ యాసలో మాట్లాడి బాగా ఆకట్టుకున్నాడు. ప్రకాశ్‌రాజ్, మహేశ్ మధ్య తండ్రీకొడుకుల అనుబంధం ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంటోంది. ఫలితంగా 2011లో తొలి సూపర్ డూపర్ హిట్‌కు మార్గం సుగమమైంది. 'దూకుడు' ఏ స్థాయి రికార్డుల్ని సాధిస్తుందో తెలుసుకోవాలంటే కొద్ది రోజులు ఓపికపట్టాలి.
Wednesday, July 27, 2011
న్యూస్: ఆ ఇద్దరి కసి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా?
తెలుగులో, ఆ మాటకొస్తే దేశంలోనే హీరోలందరిలో నెంబర్‌వన్ డాన్సర్ అతను. సినిమా సినిమాకీ స్టైల్ మార్చే 'స్టైలిష్ స్టార్' అతను. అయినా అతనికి ఇటీవలి కాలంలో ఆశించిన హిట్లు దక్కడం లేదు. అతను అల్లు అర్జున్. రికార్డులు సృష్టిస్తుందనే నమ్మకంతో 40 కోట్ల రూపాయలు పైగా ఖర్చుపెట్టి అతని తండ్రి అల్లు అరవింద్ నిర్మించిన 'బద్రినాథ్' సినిమా ఓపెనింగ్స్‌ని బాగానే రాబట్టినా చివరికి ఫ్లాప్‌గా లెక్కతేలింది. తన పరిచయ చిత్రం 'గంగోత్రి'కి కథనందించిన చిన్నికృష్ణ, 'బన్నీ' వంటి హిట్‌ని డైరెక్ట్ చేసిన వి.వి. వినాయక్ కాంబినేషన్ కూడా అర్జున్‌కి కలిసిరాలేదు. ఆఖరుకి మిల్కీ బ్యూటీ తమన్నా అందచందాల ప్రదర్శనా వర్కవుట్ కాలేదు. తొలిసారిగా టాలీవుడ్‌లో బద్రినాథ్ దేవాలయాన్ని నేపథ్యంగా తీసుకున్నా ప్రయోజనం కలిగించలేదు. సరైన కథా కథనాలు లోపిస్తే ఎన్ని హంగులున్నా నిష్ప్రయోజనమేనని 'బద్రినాథ్' ఉదంతం మరోసారి తేటతెల్లం చేసింది. ఇక బన్నీ ఆశలన్నీ త్రివిక్రం మీదే ఉన్నాయి. ఇప్పుడు బన్నీ నటించబోతోంది అతని దర్శకత్వంలోనే. యూనివర్సల్ మీడియా బేనర్‌పై డీవీవీ దానయ్య ఈ సినిమా తీయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా కోసం 'హనీ' అనే టైటిల్‌ని ఆయన రిజిస్టర్ చేశారు. హీరోయిన్ ఎంపికే సస్పెన్స్‌గా మారింది. ఒకసారి కాజల్ పేరు, ఇంకోసారి ఇలియానా పేరు వినిపించగా, లేటెస్ట్‌గా సమంతా పేరు తెరపైకి వచ్చింది. మొత్తానికి ఇలియానా, సమంతా.. వీరిలో ఒకరు ఖాయమయ్యే అవకాశముంది. సెప్టెంబరులో ఈ సినిమా సెట్స్‌మీదకు వెళ్లబోతోంది. 'మహేశ్ ఖలేజా' వంటి ఫ్లాప్‌తో త్రివిక్రం, 'బద్రినాథ్' వంటి ఫ్లాప్‌తో బన్నీ ఇప్పుడు మంచి కసి మీదున్నారు. ఆ కసి సెన్సేషనల్ మూవీని క్రియేట్ చేస్తుందా?
Saturday, November 13, 2010
సినిమా: 'బృందావనం' హిట్టేనా?
ఎన్.టి.ఆర్. హీరోగా నటించిన 'బృందావనం' హిట్టేనా? హిట్టయ్యిందని అందరూ అనుకునేలా చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయా? పరిశీలనగాచూస్తే రెండోదే నిజమనిపిస్తోంది. విడుదలైనప్పుడు ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. 'కొమరం పులి', 'ఖలేజా' సినిమాలు ఫ్లాప్ కావడంతో 'రోబో' ప్రభంజనాన్ని 'బృందావనం' అడ్డుకుంటుందని విశ్లేషకులు భావించారు. చిత్రంగా ఆశించిన రీతిలో ఓపెనింగ్స్‌ని రాబట్టడంలో 'బృందావనం' విఫలమైంది. దాంతో నిర్మాత దిల్ రాజు సినిమా ప్రమోషన్ మీద ఎక్కువ దృష్టిపెట్టి ఊకదంపుడు ప్రచారం సాగిస్తూ వచ్చారు. ఏ చానల్ చూసినా ఈ సినిమా గురించిన ప్రకటనలూ, ప్రచారమే. ఈ యేడాది 'టాప్ 3' సినిమాల్లో 'బృందావనం' ఉంటుందని తానన్న మాటల్ని నిజం చేయాలనే తాపత్రయమే ఆయనలో కనిపిస్తూ వచ్చింది.
నిన్నటికి నిన్న ఈ సినిమా ఆడియో ట్రిపుల్ ప్లాటినం డిస్క్ ఫంక్షన్లో "ఈ సినిమా ఈ యేడాది టాప్ 3లో నిలిచింది' అని చెప్పడం దీన్నే సూచిస్తోంది. అలాగే నైజాంలో టాప్ 5గా నిలిచిందని కూడా ఆయనన్నారు. పైరసీ లేకుండా ఉన్నట్లయితే టాప్ 1గా నిలిచేదని ఆయన ఆక్రోశించారు.
కానీ అదే పైరసీని తట్టుకొని 'రోబో' సూపర్ కలెక్షన్లని సాధించిన సంగతిని ఆయన కావాలనే విస్మరించారు. ఏదేమైనా నైజాం, వైజాగ్ మినహాయించి మిగతా ఏరియాలకి ఈ సినిమాని కొన్న బయ్యర్లు అంత హ్యాపీగా లేరని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. లాభాల సంగతలా వుంచి నష్టాలు రాకుంటే అంతే చాలని వాళ్లు కోరుకుంటున్నారు.

Friday, October 29, 2010
సినిమా: మూడు క్రేజీ సినిమాలు - ఒక వాస్తవం (చివరి భాగం)
'ఖలేజా' కనిపిస్తున్నదెక్కడ?
మూడేళ్ల విరామంతో మహేశ్ సినిమా వస్తున్నదనేసరికి ఆయన అభిమానుల్లోనే కాక, సాధారణ ప్రేక్షకుల్లోనూ ఎంత ఆసక్తి! బాక్సాఫీసు చరిత్రని 'మహేశ్ ఖలేజా' తిరగరాస్తుందనే చాలామంది ఆశించారు, నమ్మారు. తీరా థియేటర్లలో సినిమా విడుదలయ్యాక చూస్తే.. 'ఈ సినిమా కోసమా మహేశ్ మూడేళ్లు ఆగింది' అనే వ్యాఖ్యలే, విమర్శలే. కథని కాక, కేవలం కాంబినేషన్ ని నమ్ముకుని సినిమా తీస్తే ఫలితం ఎలా ఉంటుందో చెప్పిన సినిమా 'ఖలేజా'. ఈ సినిమా కంటే ముందు వేరే దర్శకులతో వేరే సినిమాలు చేస్తానని మహేశ్ నుంచి ప్రకటనలు వచ్చాయి. కానీ అవన్నీ పక్కకి వెళ్లిపోయి, త్రివిక్రమ్ సినిమా ముందుకొచ్చింది. మహేశ్, త్రివిక్రమ్ కాంబినేషనులో అదివరకు వచ్చిన 'అతడు' హిట్టవడం, అప్పుడే త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన 'జల్సా' విజయం సాధించడం దీనికి కారణం. హీరోయిన్ విషయంలోనూ ఇదే స్థితి. మొదట ఎంపిక చేసిన పార్వతీ మెల్టన్ ని కాదని 'అరుంధతి' సూపర్ హిట్టవడంతో అనుష్కని హీరోయినుగా తీసుకున్నారు. సూపర్ హీరో, సూపర్ హీరోయిన్, సూపర్ డైరెక్టర్ కాంబినేషన్ బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుందని నిర్మాత ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. 'పులి' కథని కానీ, 'ఖలేజా' కథని కానీ ముందుగా ఆయన వినలేదు. కాంబినేషన్స్ ని కుదుర్చుకుని, పెట్టుబడి పెట్టారంతే. ఒకప్పటి నిర్మాతలకీ, ఈ కాంబినేషన్ నిర్మాతలకీ అదే తేడా.
'ఖలేజా'లో ప్రారంభం నుంచి చివరిదాకా రీజనింగ్ కి అందని సన్నివేశాలెన్నో. హీరో ఇంట్రడక్షన్ సీనులో ఎడారిలో మనుషుల్ని మహేశ్ కత్తులతో కుత్తుకలు కోస్తుంటే, వాళ్లు అతనికి ఏం అన్యాయం చేశారో, ఎంతటి దుర్మార్గాలు చేశారో.. అనుకుంటాం. కానీ వాళ్లని అతను చంపింది 'నీళ్ల' కోసం! ఆ ఓపెనింగ్ ఫైట్ తోటే హీరో పాత్ర ఔచిత్యం దెబ్బతినిపోయింది. విషపు నీటివల్ల ఐదొందల పైచిలుకు జనాభా ఉన్న ఓ ఊరు వల్లకాడవుతుంటే, వాళ్లని 'దేవుడు'గా మహేశ్ ఎలా కాపాడాడనేది ఈ సినిమా ప్రధానాంశం. 'స్టఫ్' అంటూ లేని ఈ కథలోని 95 శాతం సన్నివేశాల్లో అంతా తానై కనిపిస్తాడు మహేశ్. అంటే ప్రధాన పాత్ర మీదే ధ్యాసంతా పెట్టిన దర్శకుడు మిగతా పాత్రల పట్ల చిన్నచూపు చూశాడు. తనవరకు విభిన్నమైన డైలాగ్ డిక్షనుతో, నటనతో మహేశ్ ఎంతగా చెలరేగిపోయినా, బిగువైన కథనం లేకపోవడమే 'ఖలేజా'కి ప్రతికూలంగా పరిణమించింది. ప్రపంచవ్యాప్తంగా తొలివారం బాక్సాఫీసు వద్ద భారీగా 21 కోట్ల రూపాయల షేరుని వసూలుచేసిన ఈ సినిమా కలెక్షన్లు రెండో వారం బాగా నెమ్మదించాయి. దాదాపు 40 కోట్ల రూపాయల (అంచనా) వ్యయమైన ఈ సినిమాకి పెట్టుబడి రావడం చాలా కష్టమనేది ట్రేడ్ వర్గాల మాట.
'బృందావనం' అందరిదయ్యేనా?
'బృందావనం' బాగుంది.. ఎక్కడికెళ్లినా ఇదే మాట. ఎన్టీఆర్ కథానాయకుడిగా; కాజల్ అగర్వాల్, సమంతా నాయికలుగా నటించిన ఈ సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో సినిమా విడుదలైన తొలిరోజు నిర్మాత రాజు, దర్శకుడు వంశీ పైడిపల్లి ముఖాలు సంతోషంతో వెలిగిపోయాయి. 'బృందావనం' సూపర్ డూపర్ హిట్టయి, బాక్సాఫీసు వద్ద రారాజుగా వెలిగిపోతున్న 'రోబో'ని నిలువరించడం ఖాయమనే ట్రేడ్ వర్గాలు భావించాయి. అయితే టాక్ కీ, కలెక్షన్లకీ కనిపిస్తున్న దూరం బయ్యర్లని ఆందోళన పరుస్తోంది. పైరసీ కారణంగానే ఈ సినిమాకి ఆశించిన రీతిలో వసూళ్లు రావడం లేదనేది ఓ వాదన. అదే నిజమైతే 'రోబో' కలెక్షన్లు ఇంకా నిలకడగా ఎందుకున్నాయనేది ప్రశ్న. ఇంతవరకు చేయని కొత్త తరహా పాత్రలో ఎన్టీఆర్ నటన అందరి ప్రశంసలూ పొందుతున్నప్పటికీ స్త్రీల హక్కులు, సమానత్వం మీద ఎంతో చైతన్యం కనిపిస్తున్న ఈ రోజుల్లోనూ 'ఒక పురుషుడికి ఇద్దరు స్త్రీలు' పాయింట్ ఎలా మెప్పు పొందుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 30 కోట్ల రూపాయలకు మించి వ్యయమైన ఈ సినిమాకి పెట్టుబడి రావాలంటే మరో రెండు వారాల పాటు కలెక్షన్లు బలంగా ఉండాలి. అయితే 'రోబో' స్థాయిలో ఈ సినిమా పట్ల ప్రేక్షకులు ఆసక్తి కనపర్చడం లేదనేది కనిపిస్తున్న వాస్తవం. మాస్ హీరో అయిన ఎన్టీఆర్ సినిమాకి 'బృందావనం' వంటి సాఫ్ట్ టైటిల్ పెట్టడం వల్లే ఓపెనింగ్స్ లో ఉధృతి కనిపించ లేదనేది ట్రేడ్ విశ్లేషకుల భావన.
డబ్బింగ్ సినిమాల వల్ల తెలుగు సినిమాలకు థియేటర్లు కరువవుతున్నాయని ఇప్పటిదాకా చిన్న సినిమాల నిర్మాతలు ఆవేదన చెందుతూ వచ్చారు. ఇప్పుడు ఆ డబ్బింగ్ సినిమాల వల్ల తమకూ ముప్పు ఏర్పడిందని పెద్ద సినిమాల నిర్మాతలు బాధపడే రోజులొచ్చాయి. కిం కర్తవ్యం? కాంబినేషన్ల మీదకంటే కథాకథనాల మీద శ్రద్ధ ఎక్కువగా పెట్టడమే.

Thursday, October 28, 2010
సినిమా: మూడు క్రేజీ సినిమాలు - ఒక వాస్తవం (1వ భాగం)
ఒక డబ్బింగ్ సినిమా ఒకవైపు.. మూడు భారీ, క్రేజీ తెలుగు సినిమాలు ఇంకోవైపు.. మామూలుగా అయితే డబ్బింగ్ సినిమా మట్టికరచి మాయం కావాలి. చిత్రం.. సీను రివర్స్. తెలుగులో అగ్ర కథానాయకులు నటించిన సినిమాల్నే వెనక్కి నెట్టేస్తూ ఆ డబ్బింగ్ సినిమా అప్రతిహతంగా బాక్సాఫీసును దున్నేస్తోంది. తెలుగు ప్రేక్షకులకి వినోదపు మజాని రుచి చూపిస్తూ నాణ్యమైన సినిమాకే వాళ్లు పట్టం కడతారనే నిజాన్ని చాటి చెబుతోంది. ఆ డబ్బింగ్ సినిమా 'రోబో'. ఆ భారీ, క్రేజీ సినిమాలు 'పులి', 'మహేశ్ ఖలేజా', 'బృందావనం'. తమిళ అగ్ర కథానాయకుడైన రజనీకాంత్ టాలీవుడ్ టాప్ హీరోల్ని పడగొట్టి బాక్సాఫీసు మీద గుత్తాధిపత్యం చలాయిస్తుండటం ఆషామాషీ సంగతి కాదు. టాలీవుడ్ వర్గాలు చాలా చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన సంగతి.
ఎందుకిలా జరిగింది? మొదటే హీరోని దృష్టిలో పెట్టుకుని కథలు వండటం తెలుగు దర్శకులు, రచయితలకి బాగా అలవాటైన పనయితే, స్క్రిప్టు మీదే ఎక్కువ దృష్టిపెట్టి, ఆ స్క్రిప్టుకి పనికొచ్చే నటుణ్ణి వెతుక్కోవడం తమిళ దర్శకుడైన శంకర్ కి తెలిసిన పని. 'రోబో' గురించీ, ఆ సినిమా ఆంధ్రప్రదేశ్ బాక్సాఫీస్ మీద చేస్తున్న సందడి గురించీ ఇదివరకే చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ సినిమా స్థాయిలో మన మూడు తెలుగు స్ట్రెయిట్ సినిమాలు ఎందుకని ప్రేక్షకుల్ని అలరించలేక పోతున్నాయో విశ్లేషించుకోవాల్సిన సందర్భం.
తోకముడిచిన 'పులి'
'రోబో' కంటే మూడు వారాల ముందు విడుదలైన పవన్ కల్యాణ్ సినిమా 'పులి' (కొమరం పులి)ని ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో వెయ్యి ప్రింట్లతో విడుదల చేశారు. అందుకే తొలివారం ఆ సినిమా 25 కోట్ల రూపాయల్ని వసూలు చేసింది. నిజానికి అందులో ముప్పాతిక వంతు తొలి మూడు రోజుల్లోనే రావడం గమనార్హం. ఆ తర్వాత నుంచే ఆ సినిమాకి వచ్చే వాళ్లు కనుచూపు మేరలో కనిపించకుండా పోయారు. ఆ 'ఘనత'ని మొత్తంగా దర్శకుడు ఎస్.జె. సూర్యకే ఆపాదించారు. ప్రేక్షకుల్ని కుర్చీల్లోంచి లేవకుండా కూర్చోపెట్టాలంటే వినోదమన్నా వుండాలి, ఉత్కంఠభరితమైన కథనమన్నా వుండాలి. ఆ రెండూ లేకపోవడమే 'పులి' పరాజయానికి ప్రధాన కారణమనేది విమర్శకుల అభిప్రాయం. పులి పాత్ర చేత పదే పదే 'ప్రసంగాలు' ఇప్పించడం సినిమాకి పెద్ద మైనస్ పాయింట్. జనం సినిమాకి వచ్చేది ప్రధానంగా వినోదం కోసమేననే, సినిమాలోని ప్రధాన పాత్రలతో వాళ్లు సహానుభూతి చేందితేనే సినిమా ఆడుతుందనే ప్రాథమిక సత్యం తెలియకుండా తీసిన సినిమాగా 'పులి'ని చెప్పుకోవాలి. ఆరంభ సన్నివేశాల్లోనే పులి ఆవేశంగా ఐదు నిమిషాల సేపు జనానికి ఉపదేశించే రీతిలో ప్రసంగించడం చూసి బిత్తరపోయిన ప్రేక్షకులు, ఆ తర్వాత మరో మూడు నాలుగు సార్లు అలాంటి సీనులే ఎదురవడంతో కుర్చీల్లో ఎంత ఇబ్బందికరంగా మసిలారో 'పులి'ని చూసిన వాళ్లందరికీ అనుభవమే. నీతిబోధకుడు చెప్పే రీతిలో పవన్ కల్యాణ్ చెప్పిన నీతులు ప్రేక్షకుల్ని కదిలించాయి. ఎలా? కుర్చీల్లో అసహనంగా, చికాకుగా. రాజకీయ వేదికలపై చెప్పే ఆవేశభరిత, ఊకదంపుడు ఉపన్యాసాల్ని వినీ వినీ డంగైపోయిన జనం సినిమాలోనూ అలాంటి సీనే కనిపించడంతో మూకుమ్మడిగా 'పులి'కి వ్యతిరేకంగా ఓటేశారు. ఫలితంగా ఆ సినిమాపై పెట్టుబడి పెట్టిన నిర్మాత, బయ్యర్లు నిలువునా మునిగిపోయారు. తొలివారం భారీ కలెక్షన్లు సాధించిన ఆ సినిమా రెండో వారం సగానికంటే ఎక్కువ సంఖ్య థియేటర్లలో మాయమయ్యింది. మొత్తంగా ఈ ఏడాది ఇప్పటివరకు రిలీజైన సినిమాల్లో నెంబర్ వన్ డిజాస్టర్ అనే ముద్రని సంపాదించుకుంది. (ఇంకావుంది)

Wednesday, October 20, 2010
సినిమా: డిసెంబర్ నుంచి మహేశ్ '3 ఇడియట్స్'
'ఖలేజా' తర్వాత మహేశ్ చేసే సినిమా ఏది? 'దూకుడు', '3 ఇడియట్స్'లో ముందు ఏ సినిమా చేయబోతున్నాడు? ప్రస్తుతం ఆయన అభిమానుల్ని వేధిస్తున్న ప్రశ్నలివి? నిజానికి శ్రీను వైట్ల దర్శకత్వం వహించే 'దూకుడు' ఈ అక్టోబరులో టర్కీలో మొదలవుతుందనే వార్తలు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం ఆ సినిమా షూటింగ్ ఈ నెలలో లేదు. నవంబరులో మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు '3 ఇడియట్స్' తెలుగు వెర్షన్ డిసెంబర్ 6న ప్రారంభం కానున్నట్లు ఫిలింనగర్ వర్గాల భోగట్టా. 'రోబో' తర్వాత శంకర్ డైరెక్ట్ చేయబోతున్న సినిమా ఇదే. జెమిని ఫిల్మ్ సర్క్యూట్ నిర్మించే ఈ సినిమాకి హారిస్ జయరాజ్ మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పటికే రెండు పాటల్ని రికార్డ్ చేశారు. ఇందులో ప్రధాన హీరోగా మహేశ్ నటించనుండగా, మరో ఇద్దరు హీరో పాత్రల కోసం తమిళ నటులు ఆర్య, జీవాలను సంప్రదిస్తున్నారు.
Wednesday, October 6, 2010
సినిమా: 580 థియేటర్లలో 'మహేశ్ ఖలేజా'
మహేశ్ సినిమా 'మహేశ్ ఖలేజా' 580 థియేటర్లలో గురువారం (7న) వస్తోంది. టైటిల్ విషయంలో చెలరేగిన వివాదం 'మహేశ్ ఖలేజా'కు అనుకూలంగా బుధవారం కోర్టు తీర్పునివ్వడంతో సమసింది. దీంతో ఈ సినిమా విడుదలకు అడ్డంకులు తొలగిపోయాయి. మహేశ్ పవర్ ముందు ఏదీ నిలవదని ఈ సందర్భంగా నిర్మాతల్లో ఒకరైన సి. కల్యాణ్ పాత్రికేయుల సమావేశంలో వ్యాఖ్యానించారు. ఒక టాప్ హీరో మూడేళ్ల విరామంతో ప్రేక్షకుల ముందుకు రావడం ఇదే ప్రథమమని చెప్పాలి. మహేశ్ మునుపటి సినిమా 'అతిథి' 2007 అక్టోబరులోనే వచ్చిన సంగతి గమనార్హం.
ఇదివరకు పవన్ కల్యాణ్ కూడా ఇలాగే 'జానీ' సినిమా తర్వాత రెండున్నరేళ్లు పైగా గ్యాప్ తీసుకున్నాడు. కాగా ఒక తెలుగు సినిమా విడుదలకు ముందే 35 కోట్ల రూపాయలకు పైగా బిజినెస్ చేయడం ఇదే మొదటిసారి. అల్లు అరవింద్ కు చెందిన గీత ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ సంస్థ అంత మొత్తం వెచ్చించి హక్కులు సొంతం చేసుకుంది. నైజాం, వైజాగ్ ఏరియాలను తన వద్దే వుంచుకుని మిగతా ఏరియాల హక్కుల్ని లాభానికి అమ్ముకుంది.
ఈ నేపథ్యంలో 'మహేశ్ ఖలేజా'కి ఓపెనింగ్స్ అసాధారణ రీతిలో ఉంటాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. కొద్ది గంటల్లో విడుదల కాబోతోన్న ఈ సినిమా ఎలాంటి రికార్డులు సాధిస్తుందోనని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Tuesday, October 5, 2010
సినిమా: 'రోబో', 'ఖలేజా'లకి 'బృందావనం' పోటీనిస్తుందా?
అక్టోబర్ 1న వచ్చిన రజనీకాంత్ 'రోబో'కీ, 7న వస్తున్న 'మహేశ్ ఖలేజా'కీ గట్టి పోటీ ఇచ్చేందుకు 14న రాబోతున్న మరో సినిమా 'బృందావనం'. జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తే, 'మున్నా' ఫేమ్ వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో నారీ నారీ నడుమ మురారి తరహా పాత్రలో ఎన్టీఆర్ కనిపించబోతున్నాడు. అతని సరసన నేటి అగ్ర నాయికల్లో ఒకరైన కాజల్ అగర్వాల్, 'ఏ మాయ చేసావె'తో యువతరంలో క్రేజ్ పొందిన సమంతా తమ అందచందాలు, అభినయంతో ఆకట్టుకోబోతున్నారు.
'అదుర్స్' తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తోన్న సినిమా కావడమే కాక, దిల్ రాజు సంస్థ నుంచి వస్తుండటంతో 'బృందావనం' మీద అంచనాలు చాలానే ఉన్నాయి. నటనలోనే కాకుండా డాన్సులోనూ నిష్ణాతుడైన ఎన్టీఆర్ ఈ సినిమాలో ఇప్పటివరకు చేయని ఓ కొత్తపాత్రలో అల్లరి యువకుడిగా కనిపించబోతున్నాడు. "టైటిల్ సాఫ్టుగా ఉన్నా ఎన్టీఆర్ అదరగొట్టడం ఖాయం. ఎంతో మాస్ ఇమేజ్ ఉన్న బాలకృష్ణగారు ఇదివరకు 'నారీ నారీ నడుమ మురారి', 'అనసూయమ్మగారి అల్లుడు' వంటి పాత్రలు చేశారు. ఆకట్టుకున్నారు. అలాగే ఎన్టీఆర్ కూడా ఈ సినిమాతో ఒక కుటుంబంలో ఉండే అన్ని వయసుల వాళ్లనీ ఆకట్టుకుంటారు" అని నిర్మాత రాజు చెప్పారు.
అయితే నందమూరి వంశానికి చెందిన హీరోల సినిమాల్ని తెలంగాణలో ఆడనివ్వమని ఇప్పటికే కొన్ని తెలంగాణ సంఘాలు హెచ్చరించిన నేపథ్యంలో నైజాంలో 'బృందావనం' ప్రదర్శనపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్టీఆర్ మునుపటి సినిమా 'అదుర్స్'కి ఆ అనుభవం ఎదురయ్యింది కూడా. కాకపోతే 'బృందావనం' నిర్మాత రాజు స్వయంగా తెలంగాణవాసి కావడం వల్ల అడ్డంకులేమీ ఆ సినిమాకి ఎదురుకావనే నమ్మకం ఎన్టీఆర్ అభిమానుల్లో వ్యక్తమవుతోంది.

Sunday, October 3, 2010
సినిమా: మహేశ్ 'ఖలేజా' చూపిస్తాడా?
'రోబో' తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తున్న పెద్ద సినిమా 'మహేశ్ ఖలేజా'. ఈ సినిమా ఈ నెల 7న విడుదలవుతోంది. 'పులి'ని నిర్మించిన కనకరత్నా మూవీస్ సంస్థే ఈ సినిమానీ నిర్మించింది. 'పులి' డిజాస్టర్ కావడంతో 'ఖలేజా' మీదే నిర్మాతల ఆశలన్నీ వున్నాయి. తెలుగులో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటుడు మహేశ్ నుంచి మూడేళ్ల విరామంతో వస్తుండటంతో ఆయన అభిమానులతో పాటు, సాధారణ ప్రేక్షకులూ ఎంతో ఆసక్తితో ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. తెలుగులో 'పులి' మాదిరిగానే అత్యంత భారీ వ్యయంతో 'ఖలేజా' తయారయ్యింది.
అనధికార సమాచారం ప్రకారం ఆ బడ్జెట్ సుమారు 40 కోట్ల రూపాయలు. నేటి అగ్ర దర్శకుల్లో ఒకడిగా గుర్తింపు పొందిన త్రివిక్రమ్ ఈ సినిమాకి దర్శకుడు. 'అతడు' వంటి స్టైలిష్ మూవీ తర్వాత మహేశ్, త్రివిక్రమ్ కాంబినేషనులో వస్తున్న ఈ సినిమాలో అగ్రనటి అనుష్క నాయిక. ఒక సినిమాకి అమితమైన క్రేజ్ రావడానికి ఇంతకు మించిన కాంబినేషన్ ఇంకేం కావాలి! 2007 సెప్టెంబరులో 'అతిథి' వచ్చిన తర్వాత మహేశ్ ఏడాది పైగా సినిమా షూటింగులకు దూరంగా ఉండి, కమర్షియల్ యాడ్స్ చేస్తూ రావడం విమర్శలకు తావిచ్చింది.
'అతిథి'కి ముందు ఆయన వరుసగా సినిమాలు చేయబోతున్నారంటూ ఆరు సినిమాలకు సంబంధించిన వివరాలను ప్రకటించారు. కానీ 'అతిథి' తర్వాత వాటిలో ఒక్కటీ కార్యరూపం దాల్చలేదు. ఏడాదిన్నర తర్వాతనే త్రివిక్రమ్ సినిమా సెట్స్ మీదకు వచ్చింది. బాక్సాఫీసుని ప్రభావితం చేసే ఒక టాప్ హీరో ఇంతకాలం సినిమా షూటింగులకు దూరం కావడం విచారకరం. ఇప్పటికైనా 'మహేశ్ ఖలేజా'తో ఆయన తమ ముందుకు వస్తున్నందుకు అభిమానులు కొండంత సంబరంతో ఉన్నారు.
ఈ సినిమాలో మహేశ్ ఓ టాక్సీ డ్రైవర్ పాత్రలో తొలిసారి కనిపించనున్నాడు. విగ్రహాల దొంగతనం నేపథ్యంలో ఈ సినిమా కథ నడుస్తుందనేది తెలిసిన సమాచారం. మహేశ్ సినిమా అంటే గుర్తుకు వచ్చే సంగీత దర్శకుడు మణిశర్మ ఈ సినిమాకీ సంగీతాన్ని అందించాడు. ఆరు పాటల్లో కనీసం మూడు పాటలు బ్రహ్మాండంగా పాపులరయ్యాయి. ముఖ్యంగా 'సదాశివా', 'పిలిచే పెదవులపైన' పాటలు హైలైట్ అంటున్నారు. ఇక మహేశ్ సినిమాల్లో యాక్షన్ కి ఉండే ప్రాధాన్యత తెలిసిందే. రామ్-లక్ష్మణ్ సమకూర్చిన ఫైట్లు ఈ సినిమాకి మరో ఎస్సెట్. ఇప్పటికే సూపర్ హిట్ అంటున్న 'రోబో'నీ, 14న రాబోతున్న ఎన్టీఆర్ 'బృందావనం'నీ 'ఖలేజా' ఎలా ఎదుర్కొంటుందన్నది ఆసక్తికరం.

Monday, September 20, 2010
సినిమా: మహేశ్ వర్సెస్ ఎన్టీఆర్

తెలుగులో ఇద్దరు టాప్ హీరోలు దసరాకి ఢీ అంటే ఢీ అంటున్నారు. ఆ ఇద్దరు - మహేశ్, జూనియర్ ఎన్టీఆర్. మహేశ్ హీరోగా నటించిన 'మహేశ్ ఖలేజా' సినిమా అక్టోబర్ 7న రిలీజ్ అవుతుందని నిన్న (సెప్టెంబర్ 19) ఆ సినిమా నిర్మాతలు శింగనమల రమేశ్, సి. కల్యాణ్ అధికారికంగా ప్రకటిస్తే, ఎన్టీఆర్ సినిమా 'బృందావనం' అక్టోబర్ 8న రిలీజవుతుందని ఆ సినిమా నిర్మాత రాజు ఈరోజు (సెప్టెంబర్ 20) ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రకటించారు. నిజానికి ఇంతకుమునుపు 'ఖలేజా' సెప్టెంబర్ 30న, 'బృందావనం' అక్టోబర్ 1న విడుదలవుతాయని వాళ్లు ప్రకటించారు.
కానీ రజనీకాంత్ 'రోబో' సినిమా విడుదల సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 1కి మారడంతో దానికి అనుగుణంగా ఈ సినిమాలని కూడా ఓ వారం వెనక్కి జరిపారు. అయితే ఈ డేట్లు ఫైనల్ అవుతాయా, మళ్లీ పోస్ట్ పోన్ అవుతాయా అనే సంగతి చెప్పలేం. అయితే దసరాకి మాత్రం మహేశ్, ఎన్టీఆర్ 'నువ్వా నేనా' అనక తప్పేట్లు లేదు. వాళ్లిద్దరూ ఇలా ఢీకొనడం ఇదే ప్రథమం. అక్టోబర్ 17 విజయదశమి. 10 నుంచే దసరా సెలవులు మొదలు. వాటిని క్యాష్ చేసుకోవాలంటే 7 లేదా 8 తేదీల్లో సినిమాని విడుదల చేయాలి. అందుకే 'ఖలేజా', 'బృందావనం' సినిమాల్ని ఆ తేదీల్లో విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించారు.
ఇలా ఒక వారం తేడాతో మూడు మెగా మూవీలు వస్తుండటంతో థియేటర్లకు కొరత తప్పడం లేదు. ఇప్పటికీ 'రోబో' నైజాం బిజినెస్ సంగతి తేలకపోవడం వల్ల ఆ సినిమాని ఈ ప్రాంతంలో ఎన్ని థియేటర్లలో విడుదల చేసేదీ ఇంకా ఓ కొలిక్కి రాలేదు. మరోవైపు 'ఖలేజా'ని అల్లు అరవింద్, 'బృందావనం'ని దిల్ రాజు విడుదల చేస్తున్నందువల్ల ప్రధాన థియేటర్లన్నీ ఈ రెండు సినిమాలకే బుక్ అయ్యాయి. అయినప్పటికీ ఒకే టైంలో ఈ మూడింటినీ విడుదల చేస్తున్నందువల్ల మరీ ఎక్కువ ప్రింట్లతో విడుదల సాధ్యం కాదు. ఈ సంగతిని నిర్మాత రాజు ఒప్పుకున్నారు కూడా. 'వంద థియేటర్లలో వేయాల్సింది తొంభై థియేటర్లలో వేస్తాం' అని ఆయన చెప్పారు.
ఏదేమైనా 'ఖలేజా', 'బృందావనం' సినిమాలపై అంచనాలు అంబరాన్ని చుంబిస్తున్నాయి. ల్యాబ్ రిపోర్టులు కూడా ఈ రెండింటికీ పాజిటివ్ గానే ఉండటం వల్ల రిజల్ట్ ఏమవుతుందనే కుతూహలం అందరిలో పెరుగుతోంది. ఇద్దరిలో గెలుపెవరిది? ఒకరు ఓడి, ఒకరు గెలుస్తారా? ఇద్దరూ గెలుస్తారా? లేక ఇద్దరూ చేతులెత్తేస్తారా? దీనిపై ఇద్దరు హీరోల అభిమానులు ఇప్పటికే పందేలు కడుతున్నారు. ఈ పందెంలో గెలుపు పుంజు ఎవరో?
Friday, September 10, 2010
సినిమా: ఇక ఆశలన్నీ 'మహేశ్ ఖలేజా' మీదే!

ఉదయం ఆటతోటే 'కొమరం పులి' భవిష్యత్ తేలిపోయింది. పవన్ కల్యాణ్ డైరెక్టరుగా పరిచయమవుతూ తీసిన 'జానీ'ని మించిపోయిందని అంతటా వినిపిస్తోంది. 'ఈ సినిమాకా ఇన్ని గొడవలు జరుగుతోంది' అన్ని విస్తుపోయేలా పరమ బోరింగుగా ఉన్న ఈ సినిమాని నిర్మించిన శింగనమల రమేశ్ వైపు అందరూ జాలి చూపులు చూస్తున్నారు. 15 నుంచి 17 కోట్ల రూపాయల డెఫిసిట్ తో రిలీజైన ఈ సినిమాకి నష్టాలు పూడ్చుకోవడం కల్ల అని తేలిపోయింది. దాంతో తన మరో ప్రాజెక్ట్ 'మహేశ్ ఖలేజా' వైపు వెంటనే దృష్టి సారించారు రమేశ్. నిన్నటిదాకా ఆ సినిమాని అక్టోబర్ 7న రిలీజ్ చేయాలని ఆయనా, ఆయన భాగస్వామి సి. కల్యాణ్ అనుకున్నారు.
కానీ రాత్రి నుంచే ఈ సినిమా మీద అన్ని ప్రాంతాల నుంచీ బాడ్ టాక్ రావడంతో శుక్రవారం ఉదయమే 'ఖలేజా'ని సెప్టెంబర్ 30న విడుదల చేస్తున్నామని అధికారికంగా ప్రకటించేశారు. 'కొమరం పులి' రిలీజ్ అయిన రోజు సాధారణ పరిస్థితుల్లో అయితే ఫోకస్ అంతా ఆ సినిమా మీదే ఉండాలి. కానీ అలా కాకుండా ఆ సినిమా రిలీజ్ రోజు 'ఖలేజా' గురించి మాట్లాడారంటే వాళ్లే 'కొమరం పులి' బాక్సాఫీసు ఫలితాన్ని గురించి చెప్పినట్లయ్యిందని ఫిలింనగర్ వర్గాలు అంటున్నాయి. బయ్యర్లను దృష్టిలో పెట్టుకునే నిర్మాతలు ఈ ప్రకటన చేశారనేది ఆ వర్గాల వాదన. మొత్తానికి 'పులి' అందర్నీ భయపెడుతోంది. ఆ సినిమాని కొన్న పలు ప్రాంతాల బయ్యర్లు ఇప్పటికే ఆందోళనలో మునిగిపోయారని సమాచారం. ఇప్పటికే వివాదాల్లో ఉన్న ఆ సినిమా రానున్న రోజుల్లో మరిన్ని వివాదాలను సృష్టించేలా కనిపిస్తోంది.
Monday, August 23, 2010
Movies: 'Khaleja' song from Sept 4
మహేశ్ హీరోగా డైరెక్టర్ త్రివిక్రమ్ రూపొందిస్తున్న 'మహేశ్ ఖలేజా' సినిమా ఓ పాట మినహా పూర్తయ్యింది. అనుష్క హీరోయినుగా నటిస్తున్న ఈ సినిమాని కనకరత్న మూవీస్ బానరుపై శింగనమల రమేశ్, సి. కల్యాణ్ సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మిగిలివున్న పాటని సెప్టెంబర్ 4 నుంచి మహేశ్, అనుష్కపై తీయనున్నారు. దీనికోసం అన్నపూర్ణ స్టూడియోలో సెట్స్ నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 10లోగా ఆడియో సీడీలను రిలీజ్ చేసి, సినిమాని నెలాఖరుకల్లా రిలీజ్ చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు 'కొమరం పులి' రీరికార్డింగ్ పెండింగులో పడిపోయింది. దీన్నిబట్టి 'కొమరం పులి' కంటే ముందుగా 'మహేశ్ ఖలేజా' రావడం దాదాపు ఖాయమైనట్లే.
Subscribe to:
Posts (Atom)