సతీమణి అన్నపూర్ణ అంటే అక్కినేని నాగేశ్వరరావుకు అమితమైన ప్రేమ. అందుకే హైదరాబాద్‌లో నిర్మించిన స్టూడియోకు ఆమె పేరే పెట్టారు. ఇక తమ నిర్మాణ సంస్థను కూడా 'అన్నపూర్ణ స్టూడియోస్' గానే వ్యవహరించారు. ఆ బేనర్ కింద అనేకమంది నటులు, దర్శకులు పరిచయమయ్యారు. వారిలో కొంతమంది అనంతర కాలంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించారు.
* 1986లో నిర్మించిన 'విక్రమ్' చిత్రం ద్వారా నాగేశ్వరరావు, అన్నపూర్ణల చిన్న కుమారుడు నాగార్జున హీరోగా పరిచయమయ్యారు. హీరోయిన్‌గా శోభన తెలుగు తెరకు పరిచయమయ్యిందీ ఈ చిత్రంతోటే.
* 1989లో నిర్మించిన 'శివ' సినిమాతో తెలుగు సినిమా గతినే మార్చేసిన రాంగోపాల్‌వర్మ పరిచయమయ్యారు. అదే సినిమా హిందీ వెర్షన్‌తో ఇటు నాగార్జుననూ, అటు వర్మనూ బాలీవుడ్‌కూ పరిచయం చేసింది అన్నపూర్ణ సంస్థ.
* 1995లో నాగార్జున చిన్న కుమారుడు మాస్టర్ అఖిల్‌ను వెండితెరకు పరిచయం చేస్తూ 'సిసింద్రీ'ని నిర్మించారు.
* 1998లో సమర్పించిన 'శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండి' చిత్రం ద్వారా దర్శకుడిగా వై.వి.ఎస్. చౌదరినీ, హీరోగా వెంకట్‌నూ పరిచయం చేశారు.
* 1998లోనే తీసిన 'చంద్రలేఖ' చిత్రంతో బాలీవుడ్ సుందరి ఇషా కొప్పికర్ హీరోయిన్‌గా పరిచయమయ్యారు.
* 1999లో తీసిన 'ప్రేమకథ' ద్వారా మనవడు (కూతురి కుమారుడు) సుమంత్‌ను హీరోగా, ఆంత్రమాలిని హీరోయిన్‌గా పరిచయం చేశారు.
* 2000 సంవత్సరంలో నిర్మించిన 'యువకుడు' ద్వారా నాయికగా భూమిక పరిచయమయ్యారు.
* 2003లో సమర్పించిన 'సత్యం' చిత్రంతో నాయికగా జెనీలియా తెలుగు తెరకు పరిచయం చేశారు. దర్శకుడిగా సూర్యకిరణ్‌కూ ఇదే తొలి చిత్రం.
* 2004లో తీసిన 'మాస్' చిత్రంతో కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ దర్శకుడిగా మారారు.
* 2005లో సమర్పించిన 'సూపర్' సినిమాతో అనుష్క తెరంగేట్రం చేశారు. ఇదే సినిమాతో బాలీవుడ్ బ్యూటీ ఆయేషా తకియా తెలుగు తెరకు పరిచయమయ్యారు.
* 2008లో తీసిన 'పౌరుడు' ద్వారా రాజ్ ఆదిత్య దర్శకుడిగా పరిచయమయ్యారు.
-ఆంధ్రజ్యోతి డైలీ, డిసెంబర్ 29, 2011
No comments:
Post a Comment