హిట్ ఫిల్మ్ 'కందిరీగ' తర్వాత హీరోగా రాం నటిస్తున్న సినిమా 'ఎందుకంటే.. ప్రేమంట!'. రాం సరసన తొలిసారిగా తమన్నా నటిస్తున్న ఈ సినిమాకి ఎ. కరుణాకరన్ డైరెక్టర్. 'ఉల్లాసంగా ఉత్సాహంగా', 'డార్లింగ్' వంటి హిట్ సినిమాల తర్వాత కరుణాకరన్ డైరెక్ట్ చేస్తున్న సినిమా ఇదే. ఈ సినిమాని రాం పెదనాన్న, శ్రీ స్రవంతి మూవీస్ అధినేత రవికిశోర్ నిర్మిస్తున్నారు. కరుణాకరన్ మునుపటి రెండు సినిమాలకూ సంగీతాన్ని అందించిన జి.వి. ప్రకాశ్‌కుమార్ ఈ సినిమాకీ బాణీలు కూరుస్తున్నాడు. "నేను కరుణాకరన్‌కి ఫ్యాన్‌ని. చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే ఫలానా వాళ్లతో సినిమా చేయాలనిపిస్తుంది. అలా ఎవరినైతే అనుకున్నానో వాళ్లంతా ఈ సినిమాలో పనిచేస్తున్నారు. తమన్నా చక్కని నటి. తనతో చేయడం హ్యాపీ" అని చెప్పాడు రాం. ఇక స్రవంతి మూవీస్‌లో ఎప్పటికైనా చేయాలన్న తన కోరిక 'ఎందుకంటే.. ప్రేమంట!'తో తీరుతున్నందుకు సంతోషం వ్యక్తం చేసింది తమన్నా. ఈ సినిమాకి సంబంధించిన విశేషం, 'దూకుడు' డైలాగ్ రైటర్ కోన వెంకట్ విలన్‌గా తొలిసారి కనిపించనుండటం.
సుమన్, రఘుబాబు, రిషి, సాయాజీ షిండే, నాగినీడు, సత్యకృష్ణన్, మేల్కోటే, సుమన్‌శెట్టి, జెమిని విజయ్ తారాగణమైన ఈ సినిమాకి మాటలు: కోన వెంకట్, పాటలు: రామజోగయ్యశాస్త్రి, శ్రీమణి, సంగీతం: జి.వి. ప్రకాశ్‌కుమార్, సినిమాటోగ్రఫీ: ఐ. ఆండ్రూ, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, కళ: ఎ.ఎస్. ప్రకాశ్, స్టంట్స్: పీటర్ హెయిన్స్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎ. కరుణాకరన్.
No comments:
Post a Comment