Sunday, December 4, 2011
ఆ ఆలోచన వస్తే నాశనమే!
సాధారణంగా ఎవరైనా మంచి సినిమా తీయాలనీ, చేయాలనీ అనుకుంటారు. కానీ ఆ ఆలోచన వస్తే వాళ్ల కెరీర్ నాశనమే అని చెబుతున్నాడు టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకడైన పూరి జగన్నాథ్. "దర్శకుడు అన్నవాడు వరుసగా కమర్షియల్ సినిమాలు తీసుకుంటూ పోవాలి. ఎప్పుడైనా మంచి సినిమా తీయాలన్న ఆలోచన వస్తే అతడి నాశనం అక్కడ మొదలైనట్లే. పదిమందికి మంచి జరిగే సినిమా అని 'నేనింతే' తీశా. ఫ్లాపయింది. నేనే కాదు, ఏ దర్శకుడైనా ఎప్పుడూ ఏదో కొత్త పాయింట్ చెప్పి ఎదుటివాళ్లని ఎక్జయిట్ చేస్తూనే ఉండాలి. లేకుంటే అక్కడ పడిపోతాం. అన్ని సందర్భాల్లోనూ అవతలివాళ్లని ఆశ్చర్యానికి గురిచేయడం కుదరదు. అప్పుడు మనల్ని పట్టించుకునేవాళ్లు ఉండరు. మన ఫోన్లను రిసీవ్ చేసుకునే వాళ్లుండరు. అందుకే వచ్చిన అవకాశాల్ని అందిపుచ్చుకోవాలి" అని ఆయన వివరించాడు. ప్రస్తుతం మహేశ్ హీరోగా ఆయన డైరెక్ట్ చేస్తున్న 'బిజినెస్‌మేన్' జనవరి 11న విడుదలకు సిద్ధమవుతోంది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment