Monday, September 13, 2010

సినిమా: అరుదైన కాంబినేషన్ అలరిస్తుందా?

ఒకే కుటుంబానికి చెందిన మూడు తరాల నటులు ప్రధాన పాత్రలు ధరించడం తెలుగు చిత్రసీమలో ఇదే తొలిసారి. ఇప్పటికే ఆ నటులెవరో మీకు తెలుసు. అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య. ఈ అరుదైన కాంబినేషనుతో సినిమా రూపొందించబోతోంది కృష్ణవంశీ అయితే దీన్ని సుసాధ్యం చేస్తున్న వ్యక్తి నిర్మాత సి. కల్యాణ్. ఇదివరకే కృష్ణవంశీతో 'చందమామ' తీసి హిట్ కొట్టారు కల్యాణ్. మరోవైపు కృష్ణవంశీ డైరెక్షనులో నాగార్జున రెండు సినిమాలు తీశారు.
'నిన్నే పెళ్లాడతా' హిట్టయితే 'చంద్రలేఖ' ఫ్లాపయ్యింది. అక్కినేని, నాగచైతన్యకు కృష్ణవంశీతో చేయడం ఇదే తొలిసారి. గతంలో తండ్రీకొడుకులు అక్కినేని, నాగార్జున కలిసి నటించిన 'కలెక్టర్ గారి అబ్బాయి' హిట్టయితే ఆ తర్వాత చేసిన సినిమాలు 'అగ్ని పుత్రుడు', 'ఇద్దరూ ఇద్దరే' ఫ్లాపయ్యాయి. ఆ తర్వాత ఆ ఇద్దరూ కలిసి 'శ్రీరామదాసు'లో నటించారు. ఆ సినిమాకి పేరైతే వచ్చింది కానీ బాక్సాఫీసు వద్ద విజయం దక్కలేదు. ఇప్పుడు మళ్లీ ఆ ఇద్దరూ తమ కుటుంబంలోని మూడో తరానికి చెందిన నాగచైతన్యతో కలిసి నటించబోతున్నారు.

No comments: