Monday, September 20, 2010

నేటి పాట: ఆదిభిక్షువు వాడినేది కోరేది (సిరివెన్నెల)


చిత్రం: సిరివెన్నెల (1987)
రచన: సీతారామశాస్త్రి
సంగీతం: కె.వి. మహదేవన్
గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం

పల్లవి:
ఆదిభిక్షువు వాడినేది కోరేది
బూడిదిచ్చేవాడినేది అడిగేది ||ఆదిభిక్షువు||
ఏది కోరేది వాడినేది అడిగేది
ఏది కోరేది వాడినేది అడిగేది

చరణం 1:
తీపిరాగాల కోకిలమ్మకు
నల్ల రంగునలమిన వీడినేది కోరేది ||తీపిరాగాల||
కరకు గర్జనల మేఘముల మేనికి
మెరుపు హంగు కూర్చిన వాడినేది అడిగేది
ఏది కోరేది వాడినేది అడిగేది
ఏది కోరేది వాడినేది అడిగేది

చరణం 2:
తేనెలొలికే పూల బాలలకు
మూణ్ణాళ్ల ఆయువిచ్చిన వాడినేది కోరేది ||తేనెలొలికే||
బండరాలను చిరాయువుగ జీవించమని
ఆనతిచ్చిన వాడినేది అడిగేది
ఏది కోరేది వాడినేది అడిగేది
ఏది కోరేది వాడినేది అడిగేది

చరణం 3:
గిరిబాలతో తనకు కల్యాణమొనరింప
దరిజేరు మన్మథుని మసిజేసినాడు వాడినేది కోరేది
వరగర్వమున మూడులోకాల పీడింప
తలపోయు దనుజులను కరుణించినాడు వాడినేది అడిగేది
ముఖప్రీతి కోరేటి ఉబ్బు శంకరుడు వాడినేది కోరేది
ముక్కంటి ముక్కోపి
ముక్కంటి ముక్కోపి తిక్క శంకరుడు ||అదిభిక్షువు||

No comments: