Monday, November 14, 2011
ఇక్కడ పవన్, అక్కడ శింబు!
ఒకే హిందీ సినిమా రెండు భాషల్లో ఒకేసారి రీమేక్ అవుతున్న సన్నివేశం ఇది. గతంలో ఎన్టీఆర్, ఏఏన్నార్‌ల కాలంలో హిందీ సినిమాలు ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ అయ్యేవి. తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్నార్ చేస్తుంటే, తమిళంలో శివాజీ గణేశన్ లేదా జెమినీ గణేశన్ ఆ సినిమాలు చేసేవాళ్లు. ఇప్పుడు హిందీలో సల్మాన్‌ఖాన్ సూపర్ హిట్ సినిమా 'దబాంగ్' ఒకేసారి ఇటు తెలుగు, అటు తమిళంలో రీమేక్ అవుతోంది. తెలుగులో పవన్ కల్యాణ్ హీరోగా చేస్తుంటే, తమిళంలో శింబు చేస్తున్నాడు. కాకపోతే తెలుగుకంటే తమళ సినిమా చాలా ముందుగా వచ్చేస్తోంది. అవును. శింబు, రిచా గంగోపాధ్యాయ్ జంటగా నటిస్తున్న ఆ సినిమా 'ఓస్తి' ఈ నవంబర్‌లోనే రిలీజవుతోంది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్స్ బయటకు వచ్చేశాయి. 'దబాంగ్'లో మలైకా అరోరాఖాన్ చేసిన ఐటం సాంగ్‌ని ఇందులో మల్లికా షెరావత్ చేయడం విశేషం. ధరణి డైరెక్ట్ చేసిన ఈ సినిమా పట్ల తమిళ సినీ, ట్రేడ్ వర్గాలు అమితాసక్తి కనపరుస్తున్నాయి. తమిళంతో పోలిస్తే తెలుగు 'గబ్బర్‌సింగ్' షూటింగ్ నెమ్మదిగా నడుస్తోంది. దీని ఫస్ట్‌లుక్ చాలా కాలం క్రితమే వచ్చినా పవన్ కల్యాణ్ 'పంజా' ప్రాజెక్టుతో బిజీ కావడం 'గబ్బర్‌సింగ్'ని ఆలస్యం చేస్తోంది. ఇందులో పవన్ సరసన నాయికగా శ్రుతిహాసన్ నటిస్తుండగా 'మిరపకాయ్' ఫేం హరీశ్ శంకర్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా 2012లో విడుదల కానున్నది. ఈ సినిమాలు ఆడే తీరుని బట్టి తెలుగు, తమిళుల క్రియేటివిటీ ఏమిటో తేలనున్నది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment