'పండంటి కాపురం' షూటింగ్ సమయంలో అందులో నటిస్తున్న ఓ బాల నటుడుకి జబ్బు చేయడంతో అక్కడే ఉన్న నన్ను నటిస్తావా అనడిగారు. అప్పుడు నాకు ఏడేళ్లు. చేస్తానని డైరెక్టర్‌కి చెప్పాను. అప్పడు అమ్మ (విజయనిర్మల) సెట్స్ మీదకు రాలేదు. వచ్చాక నన్ను చూసి నవ్వింది. నేను బాగా చదువుకోవాలన్నది అమ్మ కోరిక. నా ధ్యాసంతా సినిమాల మీదే. అదే అమ్మకి చెప్పా. అలా ఆ సినిమా సెట్స్ మీద 30 రోజులు గడిపా. ఎస్వీ రంగారావు, కృష్ణ, విజయనిర్మల, గుమ్మడి, ప్రభాకరరెడ్డి, బి. సరోజాదేవి, జయసుధ వంటివాళ్లతో తొలి సినిమాలోనే పనిచేయడం నాకు దక్కిన గొప్ప భాగ్యం. ఆ సినిమా సూపర్‌హిట్.
ఇక హీరోగా నా తొలి సినిమా 'నాలుగు స్తంభాలాట'. అది గొప్పగా ఆడింది. జంధ్యాల కలం, సంగీతం, మంచి కథ, క్లైమాక్స్ సన్నివేశాలు కలిసి ఆ సినిమాని సక్సెస్ చేశాయి. తొలి తెలుగు టీనేజ్ హీరోగా ఆ సినిమా నాకు గుర్తింపు తెచ్చింది. ఈ సినిమాని సంజయ్‌దత్‌తో 'బేకరార్'గా హిందీలో రీమేక్ చేశారు వి.బి. రాజేంద్రప్రసాద్ గారు. కాని ఆ సినిమా ఎందుకనో ఆడలేదు.
No comments:
Post a Comment