Sunday, August 22, 2010

Nostalgia: Arrogant Kanchanamala!


గూడవల్లి రామబ్రహ్మం దర్శకత్వం వహించిన 'ఇల్లాలు' సినిమాలో హీరోయిన్ కాంచనమాలకు తమ్ముడిగా సాలూరి రాజేశ్వరరావు నటించారు. ఆ సినిమాకి ఆయన సంగీత దర్శకుడు కూడా. అది 1940వ సంవత్సరం. అప్పటికింకా ప్లేబాక్ సిస్టమ్ రాలేదు. ఎవరి పాటలు వాళ్లే పాడుకోవాలి. పాటలు నేర్చుకోడానికి కాంచనమాల 'ఇల్లాలు' నిర్మాణ సంస్థ ఆఫీసుకు వచ్చేది. అప్పటికి ఆమె వయసు 25 యేళ్ల లోపయితే రాజేశ్వరరావు వయసు 19 యేళ్లు. "ఈ కుర్రాడు సంగీత దర్శకత్వం వహించడమేమిటి? అతని దగ్గర నేను పాట నేర్చుకోవడమేమిటి?" అని కాంచనమాల చిరాగ్గా అంటే దర్శక నిర్మాత అయిన రామబ్రహ్మం ఆమెకి నచ్చచెప్పారు. ఆ తర్వాత జెమినీ వాళ్ల 'బాలనాగమ్మ' సినిమాకు ఆమె టైటిల్ రోల్ చేయడానికి, రాజేశ్వరరావు సంగీత దర్శకత్వం వహించడానికి ఎంపికయ్యారు. సినిమాలో బాలవర్ధి పాత్ర చేయమని కూడా రాజేశ్వరరావుని అడిగారు. కానీ కాంచనమాల "ఇంత పెద్ద కుర్రాడు నాకు కొడుకేమిటి?" అనడంతో ఆ సినిమాలో రాజేశ్వరరావుకు వేషం లేకుండా పోయింది.

1 comment:

prasadklv said...

andaniki
appatlow maru peru
kanchanamala kadhaa!
demand lo vuunna abhinaethri kadha
aamae yemi anna chelluthundhi mari!!