
దక్షిణాదిన ప్రముఖ సినీ నటుడు ప్రకాష్‌రాజ్.. బాలీవుడ్‌లో ప్రముఖ కొరియోగ్రాఫర్ పోనీ వర్మను పెళ్లి చేసుకున్నారు. ముంబైలోని విలే పార్లే ప్రాంతంలోని సహారా స్టార్ హోటల్లో మంగళవారం ఉదయం (ఆగస్టు 24) వీరిద్దరి వివాహం అంగరంగవైభవంగా జరిగింది. పంజాబీ సంప్రదాయంలో జరిగిన వీరి వివాహానికి పోనీ వర్మ సోదరుడు రాఖీ, క్రికెటర్ శ్రీశాంత్‌తోపాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.
విలక్షణ నటుడైన ప్రకాష్ రాజ్ దక్షిణాది భాషలన్నిటిలోనూ బిజీ అన్న సంగతి తెలిసిందే. అదే సమయంలో పోనీ వర్మ కూడా బాలీవుడ్‌లో ప్రముఖ డ్యాన్స్ డైరెక్టర్. షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, హృతిక్ రోషన్, ఐశ్వర్యారాయ్ తదితరుల చిత్రాలకు డ్యాన్స్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. త్వరలో వీరిద్దరూ కలిసి చెన్నై, హైదరాబాద్‌ల్లో రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు.
No comments:
Post a Comment