

అర్జున్, జె.డి. చక్రవర్తి కాంబినేషనులో 'కాంట్రాక్ట్' అనే సినిమా తయారవబోతోంది. జె.డి. వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన ఎస్.ఎస్. సమీర్ ఈ సినిమాని సమీర్ ప్రొడక్షన్స్ బానరుపై స్వీయ దర్శకత్వంలో నిర్మించనున్నాడు. సెప్టెంబరులో షూటింగ్ మొదలవుతుంది. "యాక్షన్ ప్రధానంగా నడిచే లవ్ స్టోరీ ఇది. ఇండియాలోని వివిధ ప్రాంతాలతో పాటు విదేశాల్లో కూడా షూటింగ్ చేస్తాం. జాతీయ స్తాయిలో గుర్తింపు పొందిన ఇద్దరు హీరోయిన్లు నటిస్తారు. బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ జానీలాల్ ఈ సినిమాకి పనిచేస్తున్నారు" అని సమీర్ తెలిపాడు. ఈ సినిమాకి కథ, స్క్రీన్-ప్లేని ఆయనే సమకూరుస్తున్నాడు.
No comments:
Post a Comment