బాలీవుడ్‌లో రాణించిన తెలుగు నృత్య దర్శకుడు
బాలీవుడ్‌లో ఐదు, ఆరు దశకాల్లో నృత్య దర్శకుడిగా పనిచేసిన తెలుగువాడు సీవీ రావు గురించి ఎవరైనా పరిశోధన చేస్తే బాగుండును. తొలితరం అగ్ర తారల్లో ఒకరైన బీనారాయ్ వంటి నటీమణులు వెంటితెరపై సమ్మోహనంగా నృత్యం చేయడానికి వెనుక ఉంది సీవీరావే. బీనారాయ్ నాయికగా నటించిన 'మధ్ భరే నయన్' (1955)తో పాటు ఆ కాలంలోనే వచ్చిన 'రుక్సానా', 'జగద్గురు శంకరాచార్య', 'బసంత్ బహార్', 'ఊంచి హవేలీ', 'మస్తానీ' వంటి సినిమాలకు రావు నృత్య దర్శకుడిగా పనిచేశారు. ఆయన చెన్నైలో పుట్టి పెరిగి బాలీవుడ్‌లో డాన్స్ డైరెక్టర్‌గా కెరీర్‌ను కొనసాగించారు. ఆయన గురించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
No comments:
Post a Comment