తెలుగు సినిమాలపై వివక్ష
నేడు థియేటర్ల లభ్యత విషయంలో పెద్ద సినిమాలు, చిన్న సినిమాల మధ్య ఎలాగైతే వివక్ష కొనసాగుతూ ఉందో, గతంలో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తెలుగు, తమిళ సినిమాల మధ్య అలాంటి వివక్షే కొనసాగేది. ఉదాహరణకు 1948లో కొన్ని తమిళ చిత్రాలు ఒకేసారి 50 కేంద్రాల్లో (అప్పట్లో అది చాలా ఎక్కువ) విడుదలయ్యాయి. కానీ ఒక్క తెలుగు చిత్రం కూడా పట్టుమని పది కంటే ఎక్కువ కేంద్రాల్లో విడుదల కాలేదు. ఆ ఏడాది ఆగస్టులో ఒక తెలుగు సినిమాకి 6 కేంద్రాల్లో ఒకేసారి విడుదల చేయాలంటే ముడి ఫిల్మ్ దొరకలేదు. తమిళ సినిమాలకూ, తెలుగు సినిమాలకూ మధ్య నెలకొన్న ఈ వివక్ష అన్యాయమంటూ అప్పట్లో నిరసనలు వ్యక్తమయ్యాయి. అయినప్పటికీ ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఆ వివక్ష చివరంటా కొనసాగింది.
No comments:
Post a Comment