
సీనియర్ హీరో నాగార్జున ఈమధ్య కేవలం హీరో పాత్రలే కాకుండా స్పెషల్ రోల్స్ కూడా చేయాలని డిసైడ్ చేసుకున్నారు. అందుకు తగ్గట్లే ప్రస్తుతం రాధామోహన్ డైరెక్షన్‌లో 'గగనం' సినిమా చేస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో ఆయన కమెండోగా నటిస్తున్నారు. ఇందులో ప్రధాన పాత్ర చేస్తోంది బ్రహ్మానందం. లేటెస్ట్ న్యూస్ ఏమంటే ఎస్.ఎస్. రాజమౌళి తండ్రి వి. విజయేంద్రప్రసాద్ డైరెక్ట్ చేయబోయే సినిమాలో ఒక స్పెషల్ రోల్ చేయడానికి నాగార్జున గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. తెలంగాణ నేపథ్యంలో నడిచే ఓ పీరియడ్ కథతో ఈ సినిమాని ఆయన తీయబోతున్నారు. ఇందులో నాగార్జునకి రెండు ఫైట్లు ఉంటాయి. వాటిని కొరియోగ్రఫీ చేయబోతున్నది ఎవరో తెలుసా? రాజమౌళి!
No comments:
Post a Comment