'ఇంద్ర'ధనుస్సు
వర్షం కురిసే సందర్భంలో ఆకాశంపై అందంగా ఇంద్రధనుస్సు సప్తవర్ణాలతో కనిపిస్తుంది. ఆకాశానికీ, వర్షానికీ ఇంద్రుడు దేవత అనుకునే రోజుల్లో ధనుస్సు ఆకారం కలిగిన ఆ దృశ్యాన్ని ఇంద్రుడికి ఆపాదించి, దాన్ని 'ఇంద్రధనుస్సు' అనేవాళ్లు. ఆ పేరు ఈ రోజుకీ చలామణిలో ఉంది. కానీ వాస్తవ దృష్టితో చూస్తే - ఇంద్రుడు ఉన్నాడనుకోవడం, అది ఇంద్రుని ధనుస్సు అనుకోవడం కల్పిత కథగానూ, కవితా ఊహగానూ తెలుస్తాయి. అయితే ఇంద్రధనుస్సు అనేది మనకు కనిపిస్తున్నది కదా, అదేమిటనే ప్రశ్న వస్తుంది. నిజానికి ఇంద్రధనుస్సు అనేది సూర్యరశ్మికీ, నీటి తుప్పరకూ సంబంధించినది. ఎండా వానా కలిసి ఉంటేనే ఇంద్రధనుస్సు ఏర్పడుతుంది. కారుమబ్బులు కమ్ముకొని, సూర్యకాంతి పైకి రానప్పుడు ఇంద్రధనుస్సు ఉండదు వర్షపు నీటి బిందువుల మీద సూర్యకిరణాలు పడితే, అవి వంగి, వాటిలో రంగులు విడిపోతాయి. ఆ రంగులే ఇంద్రధనుస్సుగా మనకి కనిపిస్తాయి. ఇంకో విషయం ఏమంటే.. ఇంద్రధనుస్సు ఎప్పుడూ సూర్యుడికి ఎదురుగా ఉంటుంది. అంటే ఉదయం పూట ఇంద్రధనుస్సు పడమరవేపు ఉంటే, సాయంత్రం పూట తూర్పువేపు ఉంటుంది. అంతేకానీ ఉత్తర, దక్షిణాల్లో ఇంద్రధనుస్సు ఏర్పడదు. అలాగే ఒకవేపు ఎండలేనిదే ఇంద్రధనుస్సు కనిపించదు.
No comments:
Post a Comment