'వాగ్దానం' (1961) చిత్ర కథాంశం
జమీందారు విశ్వనాథం, దివాన్ రంగనాథం (గుమ్మడి), పరిస్థితుల వల్ల తాగుబోతుగా మారిన జగన్నాథం బాల్య మిత్రులు. జగన్నాథాన్ని విశ్వనాథం ప్రాణంగా చూసుకుంటుంటే, రంగనాథం దురాలోచన, దూరాలోచనతో జగన్నాథాన్ని ద్వేషిస్తుంటాదు. కులంలేని స్త్రీని పెళ్లి చేసుకున్నాడని వెలివేయబడిన జగన్నాథం కొడుకు సూర్యానికి విదేశాల్లో డాక్టర్ కోర్సు చెప్పించడమే కాకుండా తన కూతుర్ని అతనికిచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు విశ్వనాథం. ఆయన ఏకైక పుత్రిక విజయను తన కొడుకు చంద్రం (చలం)కు ఇచ్చి పెళ్లిచేసి జమీందారు ఆస్తిని కాజేయాలని చూస్తుంటాడు రంగనాథం. ఇంతలో జగన్నాథం చనిపోవడంతో, విశ్వనాథం కూడా సానుభూతితో మరణిస్తాడు.చదువు పూర్తిచేసుకొని పల్లెకు వచ్చిన సూర్యం (అక్కినేని నాగేశ్వరరావు) డాక్టరుగా మంచి పేరు తెచ్చుకుంటాడు. సునాయాసంగా విజయ (కృష్ణకుమారి) ప్రేమను పొందుతాడు. కానీ రంగనాథం చెడుబుర్ర కారణాన అనేక అవాంతరాలొస్తాయి. వాటిని తొలగించడంలో సూర్యం సఫలమవడంతో విజయ అతనికే దక్కుతుంది. జగన్నాథానికి విశ్వనాథం ఇచ్చిన వాగ్దానం నిలబడుతుంది.
తారాగణం: అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణకుమారి, గుమ్మడి, రేలంగి, చలం, సూర్యకాంతం, గిరిజ, పద్మనాభం, కె. వెంకటేశ్వరరావు, మల్లాది, మద్దాలి, సురభి కమలాబాయి
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
నిర్మాతలు: కె. సత్యనారాయణ, డి. శ్రీరామమూర్తి
దర్శకత్వం: ఆత్రేయ
బేనర్: కవితా చిత్ర
విడుదల తేదీ: 5 అక్టోబర్ 1961
No comments:
Post a Comment