బంగాళాఖాతం - ఆంధ్రుల అనామకత్వం
ఆంధ్ర రాష్ట్ర సమీపాన ఉన్న తూర్పు సముద్రాన్ని ఇప్పటికీ మనం 'బంగాళాఖాతం' అనే పిలుస్తున్నాం. ఈ సముద్రానికి ఈ పేరును తెలుగువాళ్లెవరూ పెట్టలేదు. పోనీ వంగీయులైనా ఈ పేరును పెట్టారా.. అంటీ అదీ కాదు. ఆ పేరు వాడటానికి వాళ్లెప్పుడూ ఆంధ్ర రాష్ట్రాన్ని కానీ, దాని పరిసర సముద్ర తీరాల్ని కానీ జయించలేదు. ఈ తూర్పు సముద్రం బర్మా (మయన్మార్), బంగ్లాదేశ్, శ్రీలంక దేశాలను, మన దేశంలో పశ్చిమ బెంగాల్, ఒడిషా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలనూ, అండమాన్ నికోబార్ దీవులనూ ఆనుకొని ఉంది. అలాంటి ఈ సముద్రానికి ఈస్ట్ ఇండియా కంపెనీవాళ్లు 'బే ఆఫ్ బెంగాల్' అనే పేరు పెట్టారు. మనం దాన్ని 'బంగాళాఖాతం' అని అనువదించుకొని ఆ పేరుతోనే పిలుస్తున్నాం. దీనివల్ల బెంగాలీలకు ప్రాముఖ్యం పెరిగి, మిగిలిన రాష్ట్రాలవాళ్లు అనామకులయ్యారు. ఈ అనామకత్వాన్ని వదిలించుకోవాలంటే ఆంధ్రులు ఏం చెయ్యాలో ఆలోచించండి.
No comments:
Post a Comment