Tuesday, June 12, 2012
'ఎందుకంటే ప్రేమంట!'కు ప్రధాన బలం స్క్రిప్టే
"ఈ సినిమాకు ప్రధాన బలం కరుణాకరన్ సమకూర్చిన స్క్రిప్టే'' అన్నారు రామ్, తమన్నా. ఆ ఇద్దరూ కరుణాకరన్ డైరెక్ట్ చేసిన 'ఎందుకంటే ప్రేమంట!'లో జంటగా నటించారు. శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై రవికిశోర్ నిర్మించిన ఈ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా రామ్, తమన్నా- ఇద్దరూ ఆ సినిమాకు సంబంధించిన తమ అనుభవాల్ని పంచుకున్నారు. ఆ విశేషాలు...
రామ్: ఏడాది విరామంతో వస్తున్న సినిమా ఇది. చాలా ఎగ్జయిటింగ్‌తో ఉన్నా. ఇది నా హృదయానికి సన్నిహితమైన సినిమా. కరుణాకరన్, తమన్నా కాంబినేషన్‌తో ఓ మంచి లవ్ స్టోరీ చేయాలని ఎప్పట్నించో అనుకుంటున్నా. దీంతో ఆ కోరిక తీరింది. ఇందులో తమన్నా, నా కేరక్టర్లు సమానంగా ఉంటాయి. కరుణాకరన్ అంటేనే ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీస్ చేస్తాడనే పేరు. ఇప్పటివరకు చెయ్యని కొత్త తరహాలో ఈ లవ్ స్టోరీని డీల్ చేశాడు. తమిళ వెర్షన్‌కి కొన్ని మార్పులు చేశాం, నేటివిటీని దృష్టిలో ఉంచుకొని.
తమన్నా: 'రెడీ'కి ఒకే రోజు పనిచేశా. అప్పుడు రామ్‌తో సరిగా మాట్లాడటానికి కూడా కుదరలేదు. ఈ సినిమాతో రామ్ ఎంత ఎనర్జిటిక్, స్పాంటేనియస్ యాక్టరో తెలిసింది. ఇక అతని డాన్సులు చూసి, అలా ఎలా చేయగలుగుతున్నాడా అని ఆశ్చర్యం వేసింది. ఇందులో అతని డాన్సులే ఎక్కువ. నా డాన్సులు పెద్దగా ఉండవు. ఇది ఫ్రెష్‌నెస్ ఉన్న సబ్జెక్టు.
రామ్: తమన్నా కూడా మంచి డాన్సర్. ఈ సినిమాలో మా ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులకు బాగా నచ్చుతాయి. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ అయిన ఈ సినిమాకు ప్రధాన బలం కరుణాకరన్ స్క్రిప్టే. పాటల కంటే జీవీ ప్రకాశ్ ఇచ్చిన రీరికార్డింగ్ సినిమాకి ఆరో ప్రాణం. కోన వెంకట్ ఇంపార్టెంట్ అయిన నెగటివ్ రోల్ చేశారు. రైటర్ కాబట్టి తన కేరక్టర్‌ను బాగా రాసుకున్నాడు. ఈ సినిమా చూశాక ఆయన రైటరా లేక యాక్టరా అనే కన్‌ఫ్యూజన్‌లో పడతారు ప్రేక్షకులు. ఇందులో నా కేరక్టర్ పేరు కూడా రామ్. 'నీ చూపులే' అనేది నా కెరీర్‌లోనే బెస్ట్ సాంగ్.
తమన్నా: నేను చేసిన పాత్ర పేరు స్రవంతి. వెరీ ప్రొటెక్టివ్ గర్ల్ రోల్. నా కెరీర్‌లో బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్. 'నీ చూపులే' అనేది బెస్ట్ సాంగ్. నా దృష్టిలో కరుణాకరన్ స్క్రీన్‌ప్లే హైలైట్. నా మునుపటి సినిమా 'రచ్చ' ఫక్తు కమర్షియల్ ఎంటర్‌టైనర్ అయితే 'ఎందుకంటే ప్రేమంట!' అనేది దానికి భిన్నమైన సినిమా. ఇందులో పర్ఫార్మెన్స్‌కి బాగా అవకాశమున్న కేరక్టర్ నాది. ఈ సినిమాలో ఓ భాగమైనందుకు చాలా సంతోషంగా ఉన్నా.
రామ్: హీరోగా మార్కెట్ పడిపోకుండా చూసుకోవాలి కాబట్టి అటు కమర్షియల్ సినిమాలూ, ఇటు పర్ఫార్మెన్స్‌కి స్కోప్ ఉన్న సినిమాలూ.. రెండూ బేలన్స్ చేసుకుంటూ వస్తున్నా. 'కందిరీగ' పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్ అయితే, ఇది దానికి భిన్నమైన లవ్‌స్టోరీ.
తమన్నా: బాలీవుడ్‌లో రీమేక్ అవుతున్న 'హిమ్మత్‌వాలా'లో అజయ్ దేవగన్ సరసన నటించబోతున్నా.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment